Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: At-Tawbah   Ayah:
یَعْتَذِرُوْنَ اِلَیْكُمْ اِذَا رَجَعْتُمْ اِلَیْهِمْ ؕ— قُلْ لَّا تَعْتَذِرُوْا لَنْ نُّؤْمِنَ لَكُمْ قَدْ نَبَّاَنَا اللّٰهُ مِنْ اَخْبَارِكُمْ ؕ— وَسَیَرَی اللّٰهُ عَمَلَكُمْ وَرَسُوْلُهٗ ثُمَّ تُرَدُّوْنَ اِلٰی عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
యుద్ధపోరాటము నుండి వెనుక ఉండిపోయిన కపట విశ్వాసులు, ముస్లిములు యుధ్ధము నుండి మరలినప్పుడు వారి ముందు బలహీన సాకులు చెప్పేవారు.అల్లాహ్ వారిని మీరు అబద్దపు సాకులు చెప్పకండి, మీరు మాకు తెలియపరచిన వాటిని మేము అంగీకరించము,అల్లాహ్ మీ మనసుల్లో ఉన్న ప్రతీ విషయాన్ని మాకు తెలియపరచాడు అని ప్రతిస్పందించమని తన ప్రవక్తకు,విశ్వాసపరులకు ఆదేశించాడు.ఏమీ అల్లాహ్ మీ పశ్చాత్తాపమును అంగీకరించటానికి మీరు పశ్చాత్తాప్పడుతారా లేదా మీరు మీ కపట విశ్వాసముపై కొనసాగుతారా ? అన్న విషయాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త చూస్తారు.ఆ తరువాత మీరు అన్నీ విషయాల జ్ఞానము కల అల్లాహ్ వైపునకు మరలించబడుతారు.ఆయన మీరు చేసిన కర్మల గురించి మీకు తెలియపరుస్తాడు.వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.అయితే మీరు పశ్చాత్తాపము,సత్కార్యము వైపునకు త్వరపడండి.
Arabic explanations of the Qur’an:
سَیَحْلِفُوْنَ بِاللّٰهِ لَكُمْ اِذَا انْقَلَبْتُمْ اِلَیْهِمْ لِتُعْرِضُوْا عَنْهُمْ ؕ— فَاَعْرِضُوْا عَنْهُمْ ؕ— اِنَّهُمْ رِجْسٌ ؗ— وَّمَاْوٰىهُمْ جَهَنَّمُ ۚ— جَزَآءً بِمَا كَانُوْا یَكْسِبُوْنَ ۟
ఓ విశ్వాసుల్లారా మీరు యుద్ధము నుండి వెనుక ఉండిపోయే వారి వైపునకు మరలినప్పుడు వారు తమ అసత్య సాకులకు తాకీదుగా మీరు వారిని నిందించటం నుండి,వారిని తిట్టటం నుండి ఆపివేయాలని అల్లాహ్ పై ప్రమాణాలు వేస్తారు.అయితే మీరు వారిని కోపముతో వదిలి వేయండి,వారిని వారి మానాన విడిచిపెట్టండి.నిశ్చయంగా వారు అశుద్ధులు,అంతఃకరణపు పావులు.వారు చేసుకున్న కపటత్వము,పాపములకు ప్రతిఫలంగా వారు శరణం తీసుకునే వారి నివాస స్థలము నరకము.
Arabic explanations of the Qur’an:
یَحْلِفُوْنَ لَكُمْ لِتَرْضَوْا عَنْهُمْ ۚ— فَاِنْ تَرْضَوْا عَنْهُمْ فَاِنَّ اللّٰهَ لَا یَرْضٰی عَنِ الْقَوْمِ الْفٰسِقِیْنَ ۟
ఓ విశ్వాసపరులారా యుద్ధము నుండి వెనుక ఉండిపోయిన వీరందరు మీరు వారితో రాజీ పడాలని,మీరు వారి సాకులను అంగీకరించాలని మీ ముందట ప్రమాణాలు చేస్తున్నారు.అయితే మీరు వారితో రాజీపడకండి.ఒక వేళ మీరు వారితో రాజీపడితే నిశ్చయంగా మీరు మీ ప్రభువును విభేదించారు.ఎందుకంటే ఆయన అవిశ్వాసము,కపటత్వము ద్వారా తన విధేయత నుండి వైదొలిగే ప్రజలతో రాజీ పడడు.ఓ ముస్లిములారా అల్లాహ్ రాజీ పడని వారితో మీరు రాజీ పడడం నుండి జాగ్రత్తపడండి.
Arabic explanations of the Qur’an:
اَلْاَعْرَابُ اَشَدُّ كُفْرًا وَّنِفَاقًا وَّاَجْدَرُ اَلَّا یَعْلَمُوْا حُدُوْدَ مَاۤ اَنْزَلَ اللّٰهُ عَلٰی رَسُوْلِهٖ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟
పల్లె వాసులు ఒకవేళ అవిశ్వాసమును కనబరచినా లేదా కపట విశ్వాసమును చూపినా వారి అవిశ్వాసము ఇతరులైన పట్టణ వాసుల అవిశ్వాసము కన్న కఠినమైనది.మరియు వారి కపట విశ్వాసము వీరందరి కపట విశ్వాసము కన్నా కఠినమైనది.వారు ధర్మము గురించి అజ్ఞానము కలిగి ఉండటంలో ఎక్కువ యోగ్యులు.మరియు వారిలో కఠినత్వము,మొరటుతనము,పరిచయము లేకపోవటము ఉండటం వలన వారులు విధులను,సున్నతులను,అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన ఆదేశాలను తెలుసుకోకుండా ఉండటంలో ఎక్కువ హక్కుదారులు.మరియు అల్లాహ్ వారి స్థితులను గురించి ఎక్కువ తెలిసిన వాడు.వాటిలోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.ఆయన తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనములో వివేకవంతుడు.
Arabic explanations of the Qur’an:
وَمِنَ الْاَعْرَابِ مَنْ یَّتَّخِذُ مَا یُنْفِقُ مَغْرَمًا وَّیَتَرَبَّصُ بِكُمُ الدَّوَآىِٕرَ ؕ— عَلَیْهِمْ دَآىِٕرَةُ السَّوْءِ ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟
పల్లెవాసుల్లోంచి కపట విశ్వాసుల్లోంచి ఒక వేళ ఖర్చు చేస్తే ప్రతిఫలం లభించదని,ఖర్చు చేయకపోతే అతన్ని అల్లాహ్ శిక్షించడన్న ఆలోచన వలన అల్లాహ్ మార్గంలో అతడు చేసిన ఖర్చును నష్టముగా,జరిమానాగా భావించే వారున్నారు. కానీ అతడు దీనితోపాటు ప్రదర్శించటానికి,రక్షణగా అప్పుడప్పుడు ఖర్చు చేస్తాడు. మరియు ఓ విశ్వాసపరులారా మీపై కీడు కలిగి అతడు మీ నుండి తప్పించుకోవాలని నిరీక్షిస్తున్నాడు. కాని వారు విశ్వాసపరులపై పడాలని ఆశించిన చెడులు,దుష్పరిణామ ఆపదలను విశ్వాసపరులపై కాకుండా అల్లాహ్ వారిపైనే వేసేశాడు. మరియు అల్లాహ్ వారు పలుకుతున్న మాటలను వినేవాడు,వారు దాచిపెడుతున్న వాటిని తెలుసుకునేవాడు.
Arabic explanations of the Qur’an:
وَمِنَ الْاَعْرَابِ مَنْ یُّؤْمِنُ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَیَتَّخِذُ مَا یُنْفِقُ قُرُبٰتٍ عِنْدَ اللّٰهِ وَصَلَوٰتِ الرَّسُوْلِ ؕ— اَلَاۤ اِنَّهَا قُرْبَةٌ لَّهُمْ ؕ— سَیُدْخِلُهُمُ اللّٰهُ فِیْ رَحْمَتِهٖ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
పల్లె వాసుల్లోంచి ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరుస్తారో,ప్రళయ దినముపై విశ్వాసమును కనబరుస్తారో,అల్లాహ్ మార్గములో తాను ఖర్చు చేసిన సంపదను అల్లాహ్ సాన్నిద్యమును పొందటానికి సాన్నిద్యంగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దుఆ ద్వారా,తన కొరకు ఆయన మన్నింపు వేడుకోలు (ఇస్తిగ్ఫార్) ద్వారా సాఫల్యం పొందటానికి కారకంగా చేసుకునే వారు ఉన్నారు.వినండి నిశ్చయంగా అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం,అతని కొరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేయటం అల్లాహ్ వద్ద అతని కొరకు సాన్నిద్యాన్ని చేకూరుస్తాయి.త్వరలోనే అతడు వాటి పుణ్యమును ఆయన వద్ద ఈ విధంగా పొందుతాడు : అల్లాహ్ తన క్షమాపణ,తన స్వర్గంతో ఇమిడి ఉన్న తన విశాలమైన కారుణ్యం లోనికి ప్రవేశింపజేస్తాడు . నిస్సందేహంగా తమ దాసులలో క్షమాపణ వేడుకునే వారి కొరకు అల్లాహ్ చాలా క్షమాశీలి మరియు కరుణామయుడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• ميدان العمل والتكاليف خير شاهد على إظهار كذب المنافقين من صدقهم.
ఆచరణా మైదానము,ధర్మ ఆంక్షలు కపటుల సత్యఅసత్యాల మధ్య వ్యత్యాసం చూపటానికి గొప్ప సాక్ష్యము.

• أهل البادية إن كفروا فهم أشد كفرًا ونفاقًا من أهل الحضر؛ لتأثير البيئة.
పల్లెవాసులు ఒక వేళ అవిశ్వాసమును కనబరిస్తే వారు పట్టన వాసుల కన్నా పర్యావరణ ప్రభావం వలన అవిశ్వాసములో,కపటత్వములో ఎక్కువ కఠినంగా ఉంటారు.

• الحض على النفقة في سبيل الله مع إخلاص النية، وعظم أجر من فعل ذلك.
మంచి ఉద్దేశముతో అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం పై ప్రోత్సహించటం,అలా చేసిన వ్యక్తికి గొప్ప ప్రతిఫలం ఉన్నది.

• فضيلة العلم، وأن فاقده أقرب إلى الخطأ.
జ్ఞానము యొక్క ప్రాముఖ్యత ఉన్నది.దాన్ని కోల్పోయే వాడు తప్పు చేయటానికి ఆస్కారమున్నది.

 
Translation of the meanings Surah: At-Tawbah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close