Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: At-Tawbah   Ayah:
فَلَا تُعْجِبْكَ اَمْوَالُهُمْ وَلَاۤ اَوْلَادُهُمْ ؕ— اِنَّمَا یُرِیْدُ اللّٰهُ لِیُعَذِّبَهُمْ بِهَا فِی الْحَیٰوةِ الدُّنْیَا وَتَزْهَقَ اَنْفُسُهُمْ وَهُمْ كٰفِرُوْنَ ۟
ఓ ప్రవక్తా కపటుల సంపదలు,వారి సంతానము మిమ్మల్ని ఆశ్చర్యానికి లోను చేయకూడదు.మరియు మీరు వాటిని మంచిగా భావించకండి.వారి సంపదల,వారి సంతాన పరిణామం చెడ్డది.అయితే వాటిని పొందటం కొరకు శ్రమ,కష్టము ద్వారా,వారి అవిశ్వాస స్థితిలో అల్లాహ్ వారి ఆత్మలను వెలికి తీసే వరకు వాటి విషయంలో కురిసే ఆపదల ద్వారా అల్లాహ్ వాటిని వారిపై శిక్షగా చేస్తాడు.వారు నరకములో అట్టడుగు స్థానములో శాస్వతముగా ఉండటం ద్వారా శిక్షింపబడుతారు.
Arabic explanations of the Qur’an:
وَیَحْلِفُوْنَ بِاللّٰهِ اِنَّهُمْ لَمِنْكُمْ ؕ— وَمَا هُمْ مِّنْكُمْ وَلٰكِنَّهُمْ قَوْمٌ یَّفْرَقُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా కపటులు మీ ముందట వారు మీ అందరిలోంచి వారని అబధ్ధపు ప్రమాణం చేస్తున్నారు.వాస్తవానికి వారు వారి లోపరంగా మీలో నుంచి కారు.ఒక వేళ వారు మీలో నుంచి అని స్పష్టపరచినా.కాని వారు ముష్రికుల పట్ల ఏదైతే హతమార్చటం,బంధీ చేయటం జరిగినదో వారిపట్ల అదే జరుగుతుందని భయపడుతున్నారు.అయితే వారు రక్షణ కొరకు ఇస్లాంను బహిర్గతం చేస్తున్నారు.
Arabic explanations of the Qur’an:
لَوْ یَجِدُوْنَ مَلْجَاً اَوْ مَغٰرٰتٍ اَوْ مُدَّخَلًا لَّوَلَّوْا اِلَیْهِ وَهُمْ یَجْمَحُوْنَ ۟
ఒక వేళ ఈ కపటులందరు వారు తమ స్వయాన్ని రక్షించుకునే కోటను గాని దాక్కోవటానికి కొండల్లో గుహలను గాని లేదా ప్రవేశించటానికి సొరంగమును గాని దేనినైనా శరణాలయంగా పొందితే వారు దాని వైపు శరణం పొందుతారు.మరియు అందులో వారు తొందర చేస్తూ ప్రవేశిస్తారు.
Arabic explanations of the Qur’an:
وَمِنْهُمْ مَّنْ یَّلْمِزُكَ فِی الصَّدَقٰتِ ۚ— فَاِنْ اُعْطُوْا مِنْهَا رَضُوْا وَاِنْ لَّمْ یُعْطَوْا مِنْهَاۤ اِذَا هُمْ یَسْخَطُوْنَ ۟
ఓ ప్రవక్తా కపటులు కొందరు దానాలు పంచే విషయంలో వాటిలోంచి వారు ఆశించినది పొందకపోయినప్పుడు మీ పై అపనిందలు మోపుతున్నారు.ఒక వేళ వాటిలో నుంచి వారు కోరుకున్నది మీరు వారికి ఇస్తే మీ పట్ల సంతుష్టపడేవారు.మరియు ఒక వేళ వాటిలో నుంచి వారు కోరకున్నది మీరు ఇవ్వకపోతే వారు కోపాన్ని ప్రదర్శిస్తారు.
Arabic explanations of the Qur’an:
وَلَوْ اَنَّهُمْ رَضُوْا مَاۤ اٰتٰىهُمُ اللّٰهُ وَرَسُوْلُهٗ ۙ— وَقَالُوْا حَسْبُنَا اللّٰهُ سَیُؤْتِیْنَا اللّٰهُ مِنْ فَضْلِهٖ وَرَسُوْلُهٗۤ ۙ— اِنَّاۤ اِلَی اللّٰهِ رٰغِبُوْنَ ۟۠
ఒక వేళ దానాలు పంచే విషయంలో మిమ్మల్ని అపనింద పాలు చేస్తున్న ఈ కపటులందరు అల్లాహ్ వారి కొరకు అనివార్యము చేసిన దాని పట్ల,అందులో నుంచి ఆయన ప్రవక్త వారికి ప్రసాదించిన దాని పట్ల సంతుష్టపడితే,మరియు ఇలా పలికితే అల్లాహ్ మనకు చాలు,తొందరలోనే అల్లాహ్ తన అనుగ్రహములో నుంచి తాను కోరుకున్నది మనకు ప్రసాధిస్తాడు.మరియు తొందరలోనే ఆయన ప్రవక్త అల్లాహ్ ఆయనకు ప్రసాదించిన దానిలో నుంచి మనకు ఇస్తారు.నిశ్చయంగా మేము అల్లాహ్ ఒక్కడే తన అనుగ్రహములో నుంచి మనకు ప్రసాధిస్తాడని ఆశిస్తున్నాము.ఒక వేళ వారు అలా చేస్తే మీకు అపనిందపాలు చేయటం కన్న అది వారి కొరకు మేలైనది.
Arabic explanations of the Qur’an:
اِنَّمَا الصَّدَقٰتُ لِلْفُقَرَآءِ وَالْمَسٰكِیْنِ وَالْعٰمِلِیْنَ عَلَیْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوْبُهُمْ وَفِی الرِّقَابِ وَالْغٰرِمِیْنَ وَفِیْ سَبِیْلِ اللّٰهِ وَابْنِ السَّبِیْلِ ؕ— فَرِیْضَةً مِّنَ اللّٰهِ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟
విధి గావించబడిన జకాత్ దానాలు నిరుపేదల కొరకు ఖర్చు చేయటం తప్పనిసరి. మరియు వారే అవసరము కలవారు ఎవరి వద్దనైతే ఒక వృత్తి లేదా ఒక ఉద్యోగము ఉండి ధనం ఉన్నది కాని అది వారికి సరిపోదు,వారి స్థితి గురించి తెలియజేయబడదు. ఆ నిరుపేదలు ఎవరైతే ఎటువంటి వస్తువు అధికారము లేని వారు (ఏమీ లేని వారు) . వారి స్థితి,వారి తీరు వలన వారు ప్రజల నుండి గోప్యంగా ఉండరు. మరియు ఆ శ్రమించేవారి కొరకు ఎవరినైతే నాయకుడు (ఇమాము) వాటిని (జకాతును) శేకరించటానికి పంపించాడో వారు.మరియు ఆ అవిశ్వాసపరుల కొరకు ఎవరైతే ఇస్లాం స్వీకరించటానికి వాటి ద్వారా ఆకర్షింపజేయబడినవారు లేదా విశ్వాసము బలహీనంగా ఉండటం వలన వారి విశ్వాసమును బలపరచటానికి,కీడు కలిగిన వారి కీడును వాటి ద్వారా తొలగింపజేయటానికి.వాటిని ఖర్చు చేసి బానిసలను విముక్తి కలిగించటం కొరకు.ఋణగ్రస్తుల కొరకు ఎటువంటి దుబారాలో కాకుండా,ఎటువంటి అవిధేయతలో కాకుండా ఒక వేళ వారు తమపై ఉన్న ఋణమును తీర్చలేకున్న స్థితిలో ఉంటే.అల్లాహ్ మార్గములో ధర్మపోరాటం చేసేవారిని సిద్ధం చేయటం కొరకు ఖర్చు చేయటం.మరియు ఆ ప్రయాణికులు ఎవరిదైతే ఖర్చు చేసే సామగ్రి అంతమైపోయిందో వారు.వీరందరిపై జకాతును ఖర్చు చేయటం పరిమితం చేయటం అల్లాహ్ తరపు నుండి విధి. మరియు అల్లాహ్ తన దాసుల ప్రయోజనాలను తెలిసిన వాడు,తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనములో వివేకవంతుడు.
Arabic explanations of the Qur’an:
وَمِنْهُمُ الَّذِیْنَ یُؤْذُوْنَ النَّبِیَّ وَیَقُوْلُوْنَ هُوَ اُذُنٌ ؕ— قُلْ اُذُنُ خَیْرٍ لَّكُمْ یُؤْمِنُ بِاللّٰهِ وَیُؤْمِنُ لِلْمُؤْمِنِیْنَ وَرَحْمَةٌ لِّلَّذِیْنَ اٰمَنُوْا مِنْكُمْ ؕ— وَالَّذِیْنَ یُؤْذُوْنَ رَسُوْلَ اللّٰهِ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟
కపటుల్లోంచి ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ను మాటల ద్వారా బాధ పెట్టేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఓర్పును చూసినప్పుడు ఇలా పలికేవారు : నిశ్చయంగా ఇతడు ప్రతి ఒక్కడిని విని అతన్ని నమ్ముతున్నాడు. సత్యఅసత్యాల మధ్య తేడా చూపటం లేదు.ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : నిశ్చయంగా ప్రవక్త మేలైన వాటిని మాత్రమే వింటాడు,అల్లాహ్ ను నమ్ముతాడు మరియు సత్య విశ్వాసపరులు ఆయనకు తెలిపే వాటిని నమ్ముతాడు,వారిపై దయ చూపుతాడు. నిశ్చయంగా ఆయన దైవదౌత్యము ఆయన్ను విశ్వసించే వారి కొరకు కారుణ్యము.ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను బాధల్లోంచి ఏ బాధ పెట్టిన వారికి బాధాకరమైన శిక్ష ఉన్నది.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• الأموال والأولاد قد تكون سببًا للعذاب في الدنيا، وقد تكون سببًا للعذاب في الآخرة، فليتعامل العبد معهما بما يرضي مولاه، فتتحقق بهما النجاة.
సంపదలు.సంతానము ఇహలోకములో శిక్షకు కారణం కావచ్చు.పరలోకములో శిక్షకు కారణం కావచ్చు.కావున దాసుడు ఆ రెండింటి విషయంలో తన పరిరక్షకుడికి ఇష్టమైన వాటి ద్వారా వ్యవహరించాలి.అప్పుడు వాటి ద్వారా విముక్తి కలుగుతుంది.

• توزيع الزكاة موكول لاجتهاد ولاة الأمور يضعونها على حسب حاجة الأصناف وسعة الأموال.
జకాత్ దానమును పంచే బాధ్యత అధికారులకు అప్పజెప్పటం జరుగుతుంది వారు ఆయా అవసరాల రకాలను బట్టి,డబ్బు సామర్ధ్యమును బట్టి ఏర్పాటు చేస్తారు.

• إيذاء الرسول صلى الله عليه وسلم فيما يتعلق برسالته كفر، يترتب عليه العقاب الشديد.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన దైవదౌత్యానికి సంభంధించిన విషయాల్లో బాధపెట్టటం అవిశ్వాసమవుతుంది. దానిపై కఠినమైన శిక్ష విధించబడుతుంది.

• ينبغي للعبد أن يكون أُذن خير لا أُذن شر، يستمع ما فيه الصلاح والخير، ويُعرض ترفُّعًا وإباءً عن سماع الشر والفساد.
దాసుడు మంచిని వినే వాడై ఉండాలి,చెడును వినే వాడై ఉండకూడదు.అటువంటప్పుడు అతడు మంచి ఉన్న ప్రయోజకరమైన మాటలనే శ్రద్ధగా వింటాడు.మరియు తన స్థానమును గొప్పగా ఉంచుతూ,చెడును,హానికరమైన వాటిని వినటం నుండి నిరాకరిస్తూ ముఖము తిప్పుకుంటాడు.

 
Translation of the meanings Surah: At-Tawbah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close