Check out the new design

Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Index of Translations


Translation of the Meanings Surah: An-Nisā’   Verse:
یٰۤاَهْلَ الْكِتٰبِ لَا تَغْلُوْا فِیْ دِیْنِكُمْ وَلَا تَقُوْلُوْا عَلَی اللّٰهِ اِلَّا الْحَقَّ ؕ— اِنَّمَا الْمَسِیْحُ عِیْسَی ابْنُ مَرْیَمَ رَسُوْلُ اللّٰهِ وَكَلِمَتُهٗ ۚ— اَلْقٰىهَاۤ اِلٰی مَرْیَمَ وَرُوْحٌ مِّنْهُ ؗ— فَاٰمِنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ ۫— وَلَا تَقُوْلُوْا ثَلٰثَةٌ ؕ— اِنْتَهُوْا خَیْرًا لَّكُمْ ؕ— اِنَّمَا اللّٰهُ اِلٰهٌ وَّاحِدٌ ؕ— سُبْحٰنَهٗۤ اَنْ یَّكُوْنَ لَهٗ وَلَدٌ ۘ— لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَكَفٰی بِاللّٰهِ وَكِیْلًا ۟۠
ఓ ప్రవక్తా ఇంజీలు వారైన క్రైస్తవులతో మీరు ఇలా పలకండి : మీరు మీ ధర్మ విషయంలో హద్దు మీరకండి. మరియు మీరు ఈసా అలైహిస్సలాం విషయంలో అల్లాహ్ పై సత్యం మాత్రమే పలకండి. మర్యమ్ కుమారుడగు ఈసా మసీహ్ అల్లాహ్ ప్రవక్త మాత్రమే. ఆయన అతన్ని సత్యముతో పంపించాడు. ఆయన అతన్ని జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా మర్యమ్ కు చేరవేసిన తన వాక్కు ద్వారా సృష్టించాడు. మరియు అది ఆయన మాట అయిన "కున్" అని అంటే అది అయిపోయింది. మరియు అది అల్లాహ్ వద్ద నుండి ఒక ఊదటం దాన్ని జిబ్రయీల్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఊదారు. అయితే మీరు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తలందరిపై వారి మధ్య ఎటువంటి బేధభావం లేకుండా విశ్వాసమును కనబరచండి. ఆరాధ్య దైవాలు ముగ్గురు అని మీరు పలకకండి. మీరు ఈ అసత్యపు మరియు తప్పుడు మాటను పలకటం నుండి జాగ్రత్త వహించండి దాని నుండి మీరు జాగ్రత్త వహించటం మీకు ఇహపరాల్లో మేలు కలుగును. నిశ్చయంగా అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం ఆయన సాటికల్పించబడటం నుండి మరియు సంతానం కలిగి ఉండటం నుండి పరిశుద్ధుడు. మరియు ఆయన అక్కరలేనివాడు. భూమ్యాకాశముల మరియు ఆ రెండిటి మధ్య ఉన్నవాటి సామ్రాజ్యాధికారం ఆయనకే చెందుతుంది. ఆకాశముల్లో మరియు భూమిలో ఉన్న వాటికి స్థాపకుడిగా మరియు వారికి కార్యనిర్వాహకుడిగా అల్లాహ్ చాలు.
Arabic Tafsirs:
لَنْ یَّسْتَنْكِفَ الْمَسِیْحُ اَنْ یَّكُوْنَ عَبْدًا لِّلّٰهِ وَلَا الْمَلٰٓىِٕكَةُ الْمُقَرَّبُوْنَ ؕ— وَمَنْ یَّسْتَنْكِفْ عَنْ عِبَادَتِهٖ وَیَسْتَكْبِرْ فَسَیَحْشُرُهُمْ اِلَیْهِ جَمِیْعًا ۟
మర్యమ్ కుమారుడగు ఈసా అల్లాహ్ దాసుడు కావటం నుండి నిరాకరించరు మరియు ఆగరు. మరియు అల్లాహ్ తనకు దగ్గరగా చేసుకుని వారి స్థానమును పెంచిన దూతలు అల్లాహ్ కు దాసులు కాకుండా ఉండరు. అటువంటప్పుడు మీరు ఈసాను ఎలా ఆరాధ్య దైవంగా చేసుకుంటారు ?! మరియు ముష్రికులు దైవదూతలను ఎలా ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నారు ?! మరియు ఎవరైతే అల్లాహ్ ఆరాధనను చేయకుండా దాని నుండి దూరంగా ఉంటాడో నిశ్చయంగా అల్లాహ్ ప్రళయదినమున అందరిని తన వద్ద సమీకరిస్తాడు. మరియు ప్రతి ఒక్కడికి దేనికి అర్హుడో అది ప్రసాదిస్తాడు.
Arabic Tafsirs:
فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَیُوَفِّیْهِمْ اُجُوْرَهُمْ وَیَزِیْدُهُمْ مِّنْ فَضْلِهٖ ۚ— وَاَمَّا الَّذِیْنَ اسْتَنْكَفُوْا وَاسْتَكْبَرُوْا فَیُعَذِّبُهُمْ عَذَابًا اَلِیْمًا ۙ۬— وَّلَا یَجِدُوْنَ لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ وَلِیًّا وَّلَا نَصِیْرًا ۟
ఇక ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి మరియు ఆయన ప్రవక్తలను దృవీకరించి సత్కర్మలను అల్లాహ్ కొరకు ప్రత్యేకిస్తూ ఆయన ధర్మబద్ధం చేసిన విధంగా ఆచరిస్తూ చేసేవారు. ఆయన వారికి వారి కర్మల ప్రతిఫలమును తగ్గించకుండా ప్రసాదిస్తాడు. మరియు ఆయన తన అనుగ్రహముతో మరియు తన ఉపకారముతో వారికి దాని కన్నా అధికంగా ఇస్తాడు. ఇక ఎవరైతే అల్లాహ్ ఆరాధనను మరియు ఆయన విధేయతను ఉపేక్షించి అహంకారములో పెరిగిపోతారో వారికి ఆయన బాధాకరమైన శిక్షను విధిస్తాడు. మరియు వారు అల్లాహ్ ను వదిలి తమను రక్షించి తమ కొరకు లాభమును తీసుకుని వచ్చేవాడిని పొందరు. మరియు తమకు సహాయపడి తమ నుండి నష్టమును తొలగించేవాడిని పొందరు.
Arabic Tafsirs:
یٰۤاَیُّهَا النَّاسُ قَدْ جَآءَكُمْ بُرْهَانٌ مِّنْ رَّبِّكُمْ وَاَنْزَلْنَاۤ اِلَیْكُمْ نُوْرًا مُّبِیْنًا ۟
ఓ ప్రజలారా వంకలను అంతం చేసే మరియు సందేహమును దూరం చేసే స్పష్టమైన వాదన మీ ప్రభువు వద్ద నుండి మీ వద్దకు వచ్చినది. ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరియు మేము మీపై స్పష్టమైన వెలుగును అవతరింపజేశాము మరియు అది ఈ ఖుర్ఆన్.
Arabic Tafsirs:
فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَاعْتَصَمُوْا بِهٖ فَسَیُدْخِلُهُمْ فِیْ رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ ۙ— وَّیَهْدِیْهِمْ اِلَیْهِ صِرَاطًا مُّسْتَقِیْمًا ۟ؕ
ఇక ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి తమ ప్రవక్తపై అవతరింపబడిన ఖుర్ఆన్ ను అదిమి పట్టుకుంటారో వారిపై అల్లాహ్ స్వర్గములో ప్రవేశింపజేసి కరుణిస్తాడు. మరియు వారికి అధికంగా ప్రతిఫలమును ప్రసాదించి వారి స్థానములను పెంచుతాడు. మరియు వారికి ఎటువంటి వంకరతనం లేని సన్మార్గముపై నడిచే భాగ్యమును కలిగిస్తాడు. మరియు అది శాశ్వత స్వర్గవనాలకు చేరవేసే మార్గము.
Arabic Tafsirs:
Benefits of the Verses on this page:
• بيان أن المسيح بشر، وأن أمه كذلك، وأن الضالين من النصارى غلوا فيهما حتى أخرجوهما من حد البشرية.
మసీహ్ అలైహిస్సలాం ఒక మనిషి అని అలాగే ఆమె తల్లి కూడా అని మరియు అపమార్గమునకు లోనయిన క్రైస్తవులు వారి విషయంలో మితిమీరి చివరకు వారిద్దరిని మానవుని హద్దుల్లోంచి తీసి వేశారని ప్రకటన.

• بيان بطلان شرك النصارى القائلين بالتثليث، وتنزيه الله تعالى عن أن يكون له شريك أو شبيه أو مقارب، وبيان انفراده - سبحانه - بالوحدانية في الذات والأسماء والصفات.
త్రిత్వ సిద్ధాంతమును ప్రకటించే క్రైస్తవుల షిర్కు యొక్క నిర్వీర్యమవటం గురించి మరియు మహోన్నతుడైన అల్లాహ్ తన కొరకు సాటి ఉండటం నుండి లేదా పోలినవాడు ఉండటం నుండి లేదా బంధువు ఉండటం నుండి పరిశుద్ధుడని ప్రకటన. మరియు పరిశుద్ధుడైన ఆయన అస్తిత్వంలో మరియు నామములలో మరియు గుణములలో ఒక్కడే అని ప్రకటన.

• إثبات أن عيسى عليه السلام والملائكة جميعهم عباد مخلوقون لا يستكبرون عن الاعتراف بعبوديتهم لله تعالى والانقياد لأوامره، فكيف يسوغ اتخاذهم آلهة مع كونهم عبيدًا لله تعالى؟!
ఈసా అలైహిస్సలాం మరియు దైవదూతలు అందరు సృష్టించబడిన దాసులు. వారు మహోన్నతుడైన అల్లాహ్ కొరకు తము ఆరాధించటము నుండి మరియు ఆయన ఆదేశములకు కట్టుబడి ఉండటం నుండి అహంకారమును చూపరు. మహోన్నతుడైన అల్లాహ్ కి వారు దాసులైన తరువాత కూడా వారిని ఆరాధ్య దైవాలుగా చేసుకోవటం ఎలా సమ్మతమవుతుంది ?!.

• في الدين حجج وبراهين عقلية تدفع الشبهات، ونور وهداية تدفع الحيرة والشهوات.
ధర్మంలో వాదనలు మరియు బౌద్దిక ఆధారాలు కలవు అవి సందేహాలను తొలగిస్తాయి మరియు కాంతి మరియు మార్గదర్శకము ఉన్నవి అవి గందరగోళమును మరియు కోరికలను తొలగిస్తాయి.

 
Translation of the Meanings Surah: An-Nisā’
Index of Surahs Page Number
 
Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Index of Translations

Issued by Tafsir Center for Quranic Studies

Close