Check out the new design

Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Index of Translations


Translation of the Meanings Surah: An-Nisā’   Verse:
وَاِذَا كُنْتَ فِیْهِمْ فَاَقَمْتَ لَهُمُ الصَّلٰوةَ فَلْتَقُمْ طَآىِٕفَةٌ مِّنْهُمْ مَّعَكَ وَلْیَاْخُذُوْۤا اَسْلِحَتَهُمْ ۫— فَاِذَا سَجَدُوْا فَلْیَكُوْنُوْا مِنْ وَّرَآىِٕكُمْ ۪— وَلْتَاْتِ طَآىِٕفَةٌ اُخْرٰی لَمْ یُصَلُّوْا فَلْیُصَلُّوْا مَعَكَ وَلْیَاْخُذُوْا حِذْرَهُمْ وَاَسْلِحَتَهُمْ ۚ— وَدَّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ تَغْفُلُوْنَ عَنْ اَسْلِحَتِكُمْ وَاَمْتِعَتِكُمْ فَیَمِیْلُوْنَ عَلَیْكُمْ مَّیْلَةً وَّاحِدَةً ؕ— وَلَا جُنَاحَ عَلَیْكُمْ اِنْ كَانَ بِكُمْ اَذًی مِّنْ مَّطَرٍ اَوْ كُنْتُمْ مَّرْضٰۤی اَنْ تَضَعُوْۤا اَسْلِحَتَكُمْ ۚ— وَخُذُوْا حِذْرَكُمْ ؕ— اِنَّ اللّٰهَ اَعَدَّ لِلْكٰفِرِیْنَ عَذَابًا مُّهِیْنًا ۟
ఓ ప్రవక్త శతృవులతో పోరాడే సమయంలో మీరు సైన్యంలో ఉన్నప్పుడు మీరు వారికి నమాజు చదివించదలిస్తే మీరు సైన్యమును రెండు వర్గములుగా విభజించండి. వారిలో నుండి ఒక వర్గము మీతో పాటు నమాజు చేస్తూ నిలబడుతుంది. వారు తమ నమాజులో తమతో పాటు తమ అస్త్రములను తీసుకుని నిలబడాలి. ఇంకో వర్గము మీకు సంరక్షణగా నిలబడాలి. మొదటి వర్గము ఇమామ్ తో ఒక రకాత్ ను చదివినప్పుడు స్వయంగా నమాజును పూర్తి చేసుకోవాలి. వారు నమాజ్ చదివినప్పుడు వారు మీ వెనుక నుండి శతృవులకు అభిముఖమైపోవాలి. మరియు నమాజ్ చదవకుండా సంరక్షణలో నిలబడిన వర్గము వచ్చి ఇమామ్ తో ఒక రకాత్ ను పూర్తి చేసుకోవాలి. ఇమామ్ సలాం తిరిగినప్పుడు వారు తమ మిగిలిన నమాజును పూర్తి చేసుకోవాలి. మరియు వారు తమ శతృవుల నుండి తమ రక్షణను ఏర్పాటు చేసుకోవాలి. మరియు వారు తమ అస్త్రములను ఎత్తుకుని ఉండాలి. ఎందుకంటే నిశ్చయంగా అవిశ్వాసపరులు మీరు మీ అస్త్రముల నుండి మరియు మీ సామానుల నుండి నిర్లక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు నమాజు చేస్తున్నప్పుడు వారు మీపై ఒకేసారి దాడి చేస్తారు. వారు మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టుకుంటారు. మరియు వర్షం వలన లేదా అనారోగ్యం,వేరే కారణం వలన మీకు బాధ కలిగితే మీరు మీ అస్త్రములను ఎత్తుకోకుండా దించివేయటంలో మీపై ఎటువంటి పాపం లేదు. మరియు మీరు మీ శక్తిని బట్టి మీ శతృవుల నుండి జాగ్రత్త వహించండి. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసపరుల కొరకు వారిని అవమానపరిచే శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.
Arabic Tafsirs:
فَاِذَا قَضَیْتُمُ الصَّلٰوةَ فَاذْكُرُوا اللّٰهَ قِیٰمًا وَّقُعُوْدًا وَّعَلٰی جُنُوْبِكُمْ ۚ— فَاِذَا اطْمَاْنَنْتُمْ فَاَقِیْمُوا الصَّلٰوةَ ۚ— اِنَّ الصَّلٰوةَ كَانَتْ عَلَی الْمُؤْمِنِیْنَ كِتٰبًا مَّوْقُوْتًا ۟
ఓ విశ్వాసపరులారా మీరు నమాజును పూర్తి చేసుకున్నప్పుడు మీరు మీ అన్ని స్థితులలో నిలబడి,కూర్చుని,మీ ప్రక్కలపై వాలి తస్బీహ్ పలికి,స్థుతులను పలికి,లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికి అల్లాహ్ స్మరణ చేయండి. మీ నుండి భయం తొలిగిపోయి మీకు ప్రశాంతత కలిగినప్పుడు మీరు నమాజును పూర్తిగా వాటి భాగములతో,వాటి విధులతో,వాటి ముస్తహబ్ లతో మీకు ఆదేశించబడిన విధంగా నెరవేర్చండి. నిశ్ఛయంగా నమాజు విశ్వాసపరులపై నియమిత వేళల్లో అనివార్యం చేయబడింది. దాన్ని ఎటువంటి కారణం లేకుండా ఆలస్యం చేయటం సమ్మతం కాదు. ఇది ప్రయాణంలో లేకుండా ఉన్నప్పుడు. ఇక ప్రయాణంలో ఉన్నప్పుడు మీ కొరకు సమీకరించటం ఖసర్ చేయటం కలదు.
Arabic Tafsirs:
وَلَا تَهِنُوْا فِی ابْتِغَآءِ الْقَوْمِ ؕ— اِنْ تَكُوْنُوْا تَاْلَمُوْنَ فَاِنَّهُمْ یَاْلَمُوْنَ كَمَا تَاْلَمُوْنَ ۚ— وَتَرْجُوْنَ مِنَ اللّٰهِ مَا لَا یَرْجُوْنَ ؕ— وَكَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۟۠
ఓ విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరుల్లోంచి మీ శతృవులను వెంబడించటంలో బలహీనపడకండి మరియు బద్దకించకండి. ఒక వేళ హతమార్చటం వలన,గాయపర్చటం వలన మీకు ఏదైతే సంభవించినదో దాని వలన మీరు బాధపడితే మీరు బాధపడినట్లే వారు అదే విధంగా బాధపడ్డారు. మీకు సంభవించినదే వారికీ సంభవించినది. కావున వారి సహనం మీ సహనం కన్నా గొప్పది కాకూడదు. ఎందుకంటే మీరు అల్లాహ్ నుండి వారు ఆశించని పుణ్యమును,సహాయమును,మద్దతును ఆశిస్తున్నారు. మరియు అల్లాహ్ తన దాసుల స్థితిగతులను తెలుసుకునేవాడు, తన కార్యనిర్వహణలో,తన ధర్మశాసనంలో వివేకవంతుడు.
Arabic Tafsirs:
اِنَّاۤ اَنْزَلْنَاۤ اِلَیْكَ الْكِتٰبَ بِالْحَقِّ لِتَحْكُمَ بَیْنَ النَّاسِ بِمَاۤ اَرٰىكَ اللّٰهُ ؕ— وَلَا تَكُنْ لِّلْخَآىِٕنِیْنَ خَصِیْمًا ۟ۙ
ఓ ప్రవక్త నిశ్చయంగా మేము సత్యంతో కూడిన ఖుర్ఆన్ ను మీపై అవతరింపజేశాము. మీరు ప్రజల మధ్య వారి వ్యవహారాలన్నింటి విషయంలో మీ మనోవాంఛ గాని మీ అభిప్రాయము గాని కాకుండా మీకు అల్లాహ్ నేర్పించిన దానితో మరియు మీ మనస్సులో వేసిన మాటతో తీర్పు ఇవ్వటానికి. మరియు తమ స్వయం కొరకు మరియు తమ అమానతుల విషయంలో విశ్వాసఘాతకులైన వారి తరపు నుండి సత్యమును వారి కోరటం వలన వారి నుండి తొలగిస్తూ మీరు వాదించేవారు కాకండి.
Arabic Tafsirs:
Benefits of the Verses on this page:
• استحباب صلاة الخوف وبيان أحكامها وصفتها.
భయాందోళనల వేళ నమాజు (సలాతుల్ ఖౌఫ్) యొక్క ధర్మబద్ధత మరియు దాని ఆదేశముల,దాని లక్షణముల ప్రకటన.

• الأمر بالأخذ بالأسباب في كل الأحوال، وأن المؤمن لا يعذر في تركها حتى لو كان في عبادة.
అన్ని సంధర్భముల్లో కారకాలను ఎంచుకునే ఆదేశం. మరియు విశ్వాసపరుడు ఆరాధనలో ఉన్నా కూడా వాటిని వదిలే విషయంలో అనుమతి లేదు.

• مشروعية دوام ذكر الله تعالى على كل حال، فهو حياة القلوب وسبب طمأنينتها.
అన్ని సంధర్భముల్లో అల్లాహ్ స్మరణను శాశ్వతం చేయటం యొక్క ధర్మబద్ధత. ఇది హృదయముల జీవితం మరియు వాటి మనశ్శాంతికి కారణం.

• النهي عن الضعف والكسل في حال قتال العدو، والأمر بالصبر على قتاله.
శతృవులతో పోరాడే సమయంలో బలహీనత నుండి,బద్దకం వహించటం నుండి వారింపు. మరియు వారితో పోరాడే వేళ సహనం చూపే ఆదేశం.

 
Translation of the Meanings Surah: An-Nisā’
Index of Surahs Page Number
 
Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Index of Translations

Issued by Tafsir Center for Quranic Studies

Close