Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Furqān   Ayah:
وَالَّذِیْنَ لَا یَدْعُوْنَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ وَلَا یَقْتُلُوْنَ النَّفْسَ الَّتِیْ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالْحَقِّ وَلَا یَزْنُوْنَ ۚؕ— وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ یَلْقَ اَثَامًا ۟ۙ
మరియు వారే ఎవరైతే పరిశుద్ధుడైన అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాన్ని ఆరాధించరో, అల్లాహ్ హత్య చేయటమును అనుమతించిన హత్య చేసిన వాడు,ధర్మం నుంచి మరలిపోయిన వాడు,వ్యభిచారం చేసిన వివాహితుడిని తప్ప అల్లాహ్ నిషేధించిన ప్రాణములను హతమార్చరో,వ్యభిచారము చేయరో. మరియు ఎవరైతే ఈ మహా పాపములను చేస్తాడో అతడు ప్రళయదినాన తాను పాల్పడిన పాపమునకు పర్యవసనమును పొందుతాడు.
Arabic explanations of the Qur’an:
یُّضٰعَفْ لَهُ الْعَذَابُ یَوْمَ الْقِیٰمَةِ وَیَخْلُدْ فِیْهٖ مُهَانًا ۟ۗۖ
ప్రళయదినాన అతనికి శిక్ష రెట్టింపు చేయబడుతుంది. మరియు అతడు శిక్షలో అవమానమునకు,పరాభవమునకు లోనై శాస్వతంగా ఉంటాడు.
Arabic explanations of the Qur’an:
اِلَّا مَنْ تَابَ وَاٰمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَاُولٰٓىِٕكَ یُبَدِّلُ اللّٰهُ سَیِّاٰتِهِمْ حَسَنٰتٍ ؕ— وَكَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا ۟
కానీ ఎవరైతే అల్లాహ్ ముందు పశ్చాత్తాప్పడి,విశ్వసించి,తన పశ్చాత్తాపము నిజమవటంపై సూచించే సత్కర్మను చేస్తాడో అల్లాహా్ వారందరు చేసుకున్న పాపములను పుణ్యాలుగా మార్చి వేస్తాడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.
Arabic explanations of the Qur’an:
وَمَنْ تَابَ وَعَمِلَ صَالِحًا فَاِنَّهٗ یَتُوْبُ اِلَی اللّٰهِ مَتَابًا ۟
మరియు ఎవరైతే అల్లాహ్ యందు పశ్ఛాత్తాప్పడి, విధేయ కార్యాలు చేయటం ద్వారా, పాపకార్యములను విడనాడటం ద్వారా తన పశ్ఛాత్తాపము నిజమవటానికి ఆధారం చూపుతాడో నిశ్ఛయంగా అతని పశ్చాత్తాపము స్వీకరించబడిన పశ్ఛాత్తాపము.
Arabic explanations of the Qur’an:
وَالَّذِیْنَ لَا یَشْهَدُوْنَ الزُّوْرَ ۙ— وَاِذَا مَرُّوْا بِاللَّغْوِ مَرُّوْا كِرَامًا ۟
వారే ఎవరైతే పాప కార్యాల ప్రదేశాలు,నిషిద్ధ వినోద ప్రదేశాల్లాంటి అసత్యములుండే చోటు సమావేసమవ్వరో. మరియు వారు దిగజారిన మాటలు,చేష్టలు లాంటి నిష్ప్రయోజనమైన వాటి వద్ద నుండి వేళ్ళినప్పుడు దాటుకుంటూ వెళ్ళి పోతారో. తమ మనస్సులను దానిలో కలవకుండా జాగ్రత్త పడటంతో గౌరవించుకుంటూ ఉంటారు.
Arabic explanations of the Qur’an:
وَالَّذِیْنَ اِذَا ذُكِّرُوْا بِاٰیٰتِ رَبِّهِمْ لَمْ یَخِرُّوْا عَلَیْهَا صُمًّا وَّعُمْیَانًا ۟
వారే ఎవరైతే వినిపించబడిన,చూపించబడిన అల్లాహ్ ఆయతులతో హితబోధన చేయించబడినప్పుడు వారి చెవులు వినిపించబడే ఆయతుల నుండి చెవిటివి కావు మరియు వారు చూపించబడే ఆయతుల నుండి అంధులు కారు.
Arabic explanations of the Qur’an:
وَالَّذِیْنَ یَقُوْلُوْنَ رَبَّنَا هَبْ لَنَا مِنْ اَزْوَاجِنَا وَذُرِّیّٰتِنَا قُرَّةَ اَعْیُنٍ وَّاجْعَلْنَا لِلْمُتَّقِیْنَ اِمَامًا ۟
వారే ఎవరైతే తమ ప్రభువుతో తమ దుఆలలో ఇలా వేడుకుంటారో : ఓ మా ప్రభువా మా భార్యల్లోంచి,మా సంతానములో నుంచి ఎవరైతే తన దైవ భీతి వలన, సత్యముపై తన స్థిరత్వము వలన మాకు కంటి చలువ అవుతాడో వారిని మాకు ప్రసాదించు. మరియు నీవు సత్యం విషయంలో మమ్మల్ని అనుసరించడానికి దైవభీతి కలవారి కొరకు మమ్మల్ని నాయకులుగా చేయి.
Arabic explanations of the Qur’an:
اُولٰٓىِٕكَ یُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوْا وَیُلَقَّوْنَ فِیْهَا تَحِیَّةً وَّسَلٰمًا ۟ۙ
ఈ గుణాలతో వర్ణించబడినవారందరు అల్లాహ్ కు విధేయత చూపటం పై సహనం వహించటం వలన స్వర్గములోని ఉన్నత ఫిరదౌసులో ఉన్నతమైన స్థానాలను ప్రతిఫలంగా ప్రసాదించబడుతారు. మరియు వారికి వాటిలో దైవ దూతల ద్వారా స్వాగతం,శాంతి లభిస్తాయి. మరియు వారు వాటిలో ఆపదల నుండి రక్షించబడుతారు.
Arabic explanations of the Qur’an:
خٰلِدِیْنَ فِیْهَا ؕ— حَسُنَتْ مُسْتَقَرًّا وَّمُقَامًا ۟
వారు వాటిలో శాస్వతంగా నివాసముంటారు. వారు ఆశ్రయం పొందే ఆశ్రయ స్థలము,వారు నివాసముండే నివాస స్థలము ఎంతో రమణీయమైనది.
Arabic explanations of the Qur’an:
قُلْ مَا یَعْبَؤُا بِكُمْ رَبِّیْ لَوْلَا دُعَآؤُكُمْ ۚ— فَقَدْ كَذَّبْتُمْ فَسَوْفَ یَكُوْنُ لِزَامًا ۟۠
ఓ ప్రవక్తా తమ అవిశ్వాసంలో మొండిగా ఉన్న అవిశ్వాసపరులతో ఇలా పలకండి : నా ప్రభువు మీ విధేయత ప్రయోజనం ఆయనకు కలుగుతుందని మిమ్మల్ని పట్టించుకోడు. ఒక వేళ ఆయనను ఆరాధన మొర పెట్టుకునే,అవసరాల మొర పెట్టుకునే ఆయన దాసులే లేకుండా ఉంటే ఆయన మిమ్మల్ని పట్టించుకునే వాడే కాడు. నిశ్ఛయంగా మీరు ప్రవక్తను ఆయన మీ ప్రభువు వద్ద నుండి మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో తిరస్కరించారు. తొందరలోనే తిరస్కరించటం యొక్క ప్రతిఫలము మీకు చుట్టుకుంటుంది.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• من صفات عباد الرحمن: البعد عن الشرك، وتجنُّب قتل الأنفس بغير حق، والبعد عن الزنى، والبعد عن الباطل، والاعتبار بآيات الله، والدعاء.
షిర్కు నుండి దూరంగా ఉండటం, అన్యాయంగా ప్రాణాలను తీయటం నుండి జాగ్రత్తపడటం,వ్యభిచారము నుండి దూరంగా ఉండటం, నిష్ప్రయోజన కార్యాల నుండి దూరంగా ఉండటం,అల్లాహ్ ఆయతులతో గుణపాఠం నేర్చుకోవటం, దుఆ చేయటం కరుణామయుడి దాసుల గుణాలు.

• التوبة النصوح تقتضي ترك المعصية وفعل الطاعة.
సత్యమైన పశ్చాత్తాపము పాప కార్యములను విడనాడటం,విధేయకార్యాలను చేయటమును నిర్ణయిస్తుంది.

• الصبر سبب في دخول الفردوس الأعلى من الجنة.
స్వర్గములోని ఫిరదౌసు ఉన్నత స్థానాల్లో ప్రవేశమునకు సహనము ఒక కారణం.

• غنى الله عن إيمان الكفار.
అల్లాహ్ అవిశ్వాసపరుల విశ్వాసము అవసరము లేనివాడు.

 
Translation of the meanings Surah: Al-Furqān
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close