Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Furqān   Ayah:
اَمْ تَحْسَبُ اَنَّ اَكْثَرَهُمْ یَسْمَعُوْنَ اَوْ یَعْقِلُوْنَ ؕ— اِنْ هُمْ اِلَّا كَالْاَنْعَامِ بَلْ هُمْ اَضَلُّ سَبِیْلًا ۟۠
లేక ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ఏకత్వము వైపునకు,ఆయనపై విధేయత చూపటం వైపునకు మీరు పిలుస్తున్న వారు చాలామంది స్వీకరించే ఉద్దేశంతో వింటున్నారని లేదా వారు వాదనలను,ఆధారాలను అర్ధం చేసుకుంటారని మీరు భావిస్తున్నారా ?!. వారు వినటంలో,అర్ధం చేసుకోవటంలో,గ్రహించటంలో జంతువుల్లాంటి వారు మాత్రమే. అంతేకాదు వారు జంతువుల కంటే ఎక్కువగా మార్గం తప్పినవారు.
Arabic explanations of the Qur’an:
اَلَمْ تَرَ اِلٰی رَبِّكَ كَیْفَ مَدَّ الظِّلَّ ۚ— وَلَوْ شَآءَ لَجَعَلَهٗ سَاكِنًا ۚ— ثُمَّ جَعَلْنَا الشَّمْسَ عَلَیْهِ دَلِیْلًا ۟ۙ
ఓ ప్రవక్తా అల్లాహ్ సృష్టి సూచనల వైపు ఆయన భూ ఉపరితలంపై నీడను విస్తరింపజేసిన వేళ మీరు చూడలేదా. మరియు ఒక వేళ ఆయన దాన్ని కదలకుండ స్థిరంగా ఉండేటట్లు చేయదలచుకుంటే అలాగే ఆయన దాన్ని చేస్తాడు. ఆ తరువాత మేము సూర్యుడిని దానిపై సూచనగా చేశాము. అది దానితోపాటు పొడుగు అవుతుంది,చిన్నది అవుతుంది.
Arabic explanations of the Qur’an:
ثُمَّ قَبَضْنٰهُ اِلَیْنَا قَبْضًا یَّسِیْرًا ۟
ఆ తరువాత మేము నీడను తగ్గించి లాక్కున్నాము అది క్రమక్రమంగా కొద్దికొద్దిగా సూర్యుడు పైకి లేసే లెక్కను బట్టి కొద్దిగా లాక్కున్నాము.
Arabic explanations of the Qur’an:
وَهُوَ الَّذِیْ جَعَلَ لَكُمُ الَّیْلَ لِبَاسًا وَّالنَّوْمَ سُبَاتًا وَّجَعَلَ النَّهَارَ نُشُوْرًا ۟
మరియు అల్లాహ్ ఆయనే మీ కొరకు రాత్రిని మిమ్మల్ని కప్పే,వస్తువులను కప్పే వస్త్రం స్థానంలో చేశాడు. మరియు ఆయనే మీ కొరకు నిద్రను మీ తీరికలేమి నుండి మీరు విశ్రాంతి తీసుకునే విశ్రాంతిగా చేశాడు. మరియు ఆయనే మీ కొరకు పగటిని మీ కర్మల వైపు మీరు నడిచి వెళ్ళే సమయంగా చేశాడు.
Arabic explanations of the Qur’an:
وَهُوَ الَّذِیْۤ اَرْسَلَ الرِّیٰحَ بُشْرًاۢ بَیْنَ یَدَیْ رَحْمَتِهٖ ۚ— وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً طَهُوْرًا ۟ۙ
మరియు ఆయనే గాలులను తన దాసులపై తన కారుణ్యములో నుంచి అయిన వర్షము కురవటం గురించి శుభవార్తనిచ్చేవానిగా పంపించాడు. మరియు మేము ఆకాశము నుండి వర్షపు నీటిని శుద్ధ పరిచే వానిగా కురిపించాము వారు దానితో శుద్ధతను పొందుతారు.
Arabic explanations of the Qur’an:
لِّنُحْیِ بِهٖ بَلْدَةً مَّیْتًا وَّنُسْقِیَهٗ مِمَّا خَلَقْنَاۤ اَنْعَامًا وَّاَنَاسِیَّ كَثِیْرًا ۟
ఆ కురిసే నీటి ద్వారా మేము ఎటువంటి మొక్కలు లేని ఒక బంజరు భూమిని రకరకాల మొక్కలను అందులో మొలకెత్తించటం ద్వారా,అందులో పచ్చికను వ్యాపింపజేయటం ద్వారా జీవింపజేయటానికి, ఆ నీటిని మేము సృష్టించిన చాలా పశువులను మానవులను త్రాపించటానికి.
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ صَرَّفْنٰهُ بَیْنَهُمْ لِیَذَّكَّرُوْا ۖؗ— فَاَبٰۤی اَكْثَرُ النَّاسِ اِلَّا كُفُوْرًا ۟
మరియు నిశ్ఛయంగా మేము రకరకాల వాదనలను,ఆధారాలను వారు వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి స్పష్టపరచాము. కాని చాలా మంది ప్రజలు సత్యాన్ని తిరస్కరించారు. దాన్ని నిరాకరించారు.
Arabic explanations of the Qur’an:
وَلَوْ شِئْنَا لَبَعَثْنَا فِیْ كُلِّ قَرْیَةٍ نَّذِیْرًا ۟ؗۖ
మరియు ఒక వేళ మేము తలచుకుంటే ప్రతీ ఊరిలో వారిని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించటానికి,భయపెట్టటానికి ఒక ప్రవక్తను పంపించే వారము. కానీ మేము అలా తలచుకోలేదు. మరియు మేము మాత్రం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సమస్త మానవాళి వైపునకు ప్రవక్తగా పంపించాము.
Arabic explanations of the Qur’an:
فَلَا تُطِعِ الْكٰفِرِیْنَ وَجَاهِدْهُمْ بِهٖ جِهَادًا كَبِیْرًا ۟
మరియు మీరు అవిశ్వాసపరులు తమ ముఖస్థుతితో మీతో కోరిన వాటి విషయంలో,వారు ప్రవేశపెట్టే ప్రతిపాదనల విషయంలో వారి మాట వినకండి. మరియు మీరు మీపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ద్వారా వారు కలిగిస్తున్న బాధలపై సహనంతో, అల్లాహ్ వైపునకు వారిని పిలవటంలో బాధలను భరించటంతొ గొప్ప పోరాటమును చేయండి.
Arabic explanations of the Qur’an:
وَهُوَ الَّذِیْ مَرَجَ الْبَحْرَیْنِ هٰذَا عَذْبٌ فُرَاتٌ وَّهٰذَا مِلْحٌ اُجَاجٌ ۚ— وَجَعَلَ بَیْنَهُمَا بَرْزَخًا وَّحِجْرًا مَّحْجُوْرًا ۟
మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ యే రెండు సముద్రముల నీటిని కలిపాడు. వాటిలో నుండి తీపి దాన్ని ఉప్పగా ఉన్న దానితో ఆయన కలిపాడు. మరియు ఆయన వాటిని కలవకుండా ఆపటానికి ఒక అడ్డును,ఒక అడ్డు తెరను తయారు చేశాడు.
Arabic explanations of the Qur’an:
وَهُوَ الَّذِیْ خَلَقَ مِنَ الْمَآءِ بَشَرًا فَجَعَلَهٗ نَسَبًا وَّصِهْرًا ؕ— وَكَانَ رَبُّكَ قَدِیْرًا ۟
మరియు ఆయనే పురుషుని,స్త్రీ వీర్యపు బిందువుతో మనిషిని సృష్టించాడు. మరియు ఎవరైతే మనిషిని సృష్టించాడో ఆయనే వంశ బంధుత్వాన్ని, వివాహ బంధుత్వాన్ని సృష్టించాడు. ఓ ప్రవక్తా మీ ప్రభువుని ఎవరూ అశక్తుడిని చేయని సమర్ధుడు. మానవుడిని పురుషుని,స్త్రీ వీర్యపు బిందువుతో సృష్టించటం ఆయన సామర్ధ్యంలో నుండే.
Arabic explanations of the Qur’an:
وَیَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُهُمْ وَلَا یَضُرُّهُمْ ؕ— وَكَانَ الْكَافِرُ عَلٰی رَبِّهٖ ظَهِیْرًا ۟
మరియు అవిశ్వాసపరులు అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఒక వేళ వారు వాటికి విధేయత చూపితే అవి వారికి లాభం చేకూర్చలేవు,ఒక వేళ వారు వాటికి అవిధేయత చూపితే అవి వారికి నష్టం చేకూర్చలేవు. మరియు అవిశ్వాసపరుడు పరిశుద్ధుడైన అల్లాహ్ ను ఆగ్రహపరిచే వాటిలో షైతానును అనుసరించేవాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• انحطاط الكافر إلى مستوى دون مستوى الحيوان بسبب كفره بالله.
అల్లాహ్ పట్ల తన అవిశ్వాసము వలన అవిశ్వాసపరుడు జంతువు యొక్క స్థాయికంటే తక్కువ స్థాయికి దిగజారిపోవటం.

• ظاهرة الظل آية من آيات الله الدالة على قدرته.
నీడ యొక్క దృగ్విషయం అల్లాహ్ సామర్ధ్యము పై సూచించే సూచనల్లోంచి ఒక సూచన.

• تنويع الحجج والبراهين أسلوب تربوي ناجح.
వాదనలను,ఆధారాలను వైవిధ్యపరచటం ఒక సాఫల్యమైన శిక్షణా పధ్దతి.

• الدعوة بالقرآن من صور الجهاد في سبيل الله.
ఖుర్ఆన్ ద్వారా పిలవటం (దావత్ చేయటం) అల్లాహ్ మార్గంలో పోరాటం యొక్క రూపముల్లోంచిది.

 
Translation of the meanings Surah: Al-Furqān
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close