Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Baqarah   Ayah:
لَا یُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِیْۤ اَیْمَانِكُمْ وَلٰكِنْ یُّؤَاخِذُكُمْ بِمَا كَسَبَتْ قُلُوْبُكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ حَلِیْمٌ ۟
అనాలోచితంగా మీ నోటి నుండి వెలువడిన ప్రమాణాల కారణంగా అల్లాహ్ మిమ్మల్ని లెక్క తీసుకోడు,ఉదాహరణకు మీలో నుంచి ఎవరైన పలికిన పలుకులు "లేదు అల్లాహ్ సాక్షిగా","ఎందుకు కాదు అల్లాహ్ సాక్షిగా". అయితే దాని గురించి మీపై ఎటువంటి పరిహారం లేదు.ఆ విషయంలో ఎటువంటి శిక్ష లేదు.కాని మీరు ఉద్దేశపూర్వంగా చేసిన ప్రమాణాలకు మీతో లెక్క తీసుకుంటాడు.మరియు అల్లాహ్ తన దాసుల పాపములను మన్నించే వాడును,సహనశీలుడు వారిని శిక్షించడంలో తొందరపడడు.
Arabic explanations of the Qur’an:
لِلَّذِیْنَ یُؤْلُوْنَ مِنْ نِّسَآىِٕهِمْ تَرَبُّصُ اَرْبَعَةِ اَشْهُرٍ ۚ— فَاِنْ فَآءُوْ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఎవరైతే తమ భార్యలతో సంభోగం చేయమని ప్రమాణం చేస్తారో వారి కొరకు నాలుగు మాసాల కన్న ఎక్కువ కాకుండా వేచి చూడాలి.గడువు వారి ప్రమాణం చేసినప్పటి నుండి మొదలవుతుంది.దానినే ఈలా అని పిలుస్తారు.ఒక వేళ వారు దానిని (సంభోగం) వదలటం పై ప్రమాణం చేసిన తరువాత నాలుగు మాసాల గడువు లోపల లేద దాని కన్న తక్కువ వ్యవధిలో తమ భార్యలతో సంభోగించటం వైపునకు మరలితే నిశ్చయంగా అల్లాహ్ వారి ద్వారా జరిగిన దానిని మన్నించే వాడును,ఈ ప్రమాణము నుండి బయటపడే మార్గముగా పరిహారమును విధించి వారి పై కరుణించే వాడును.
Arabic explanations of the Qur’an:
وَاِنْ عَزَمُوا الطَّلَاقَ فَاِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ ۟
విడాకుల ఉద్దేశంతో తమ భార్యలతో సంభోగం చేయకుండా వదిలేయటం కొనసాగిస్తే ,దాని వైపు నుంచి మరలక పోతే నిశ్చయంగా అల్లాహ్ వారి మాటలను వేటి ద్వారా నైతే విడాకులు నిర్ధారితమవుతున్నాయో వినే వాడు,వారి ఉద్దేశాలు,వారి స్థితుల పట్ల జ్ఞానమును కలవాడు.తొందరలోనే వాటి పరంగానే వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Arabic explanations of the Qur’an:
وَالْمُطَلَّقٰتُ یَتَرَبَّصْنَ بِاَنْفُسِهِنَّ ثَلٰثَةَ قُرُوْٓءٍ ؕ— وَلَا یَحِلُّ لَهُنَّ اَنْ یَّكْتُمْنَ مَا خَلَقَ اللّٰهُ فِیْۤ اَرْحَامِهِنَّ اِنْ كُنَّ یُؤْمِنَّ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ؕ— وَبُعُوْلَتُهُنَّ اَحَقُّ بِرَدِّهِنَّ فِیْ ذٰلِكَ اِنْ اَرَادُوْۤا اِصْلَاحًا ؕ— وَلَهُنَّ مِثْلُ الَّذِیْ عَلَیْهِنَّ بِالْمَعْرُوْفِ ۪— وَلِلرِّجَالِ عَلَیْهِنَّ دَرَجَةٌ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ ۟۠
విడాకులు పొందిన స్త్రీలు మూడు ఋతువుల వరకు వేచి ఉండాలి ఆ మధ్య కాలంలో వివాహం చేసుకోరాదు.ఒక వేళ వారు అల్లాహ్ పై,అంతిమ దినం పై విశ్వాసంలో సత్యవంతులైతే వారి గర్భంలో అల్లాహ్ సృష్టించిన పిండమును దాచటం వారి కొరకు సమ్మతం కాదు.ఒక వేళ వారికి విడాకులిచ్చిన భర్తలు ప్రేమతో కలుపుకునే ఉద్దేశంతో,దేని కారణంతో విడాకులివ్వడం జరిగిందో దానిని దూరం చేసే ఉద్దేశంతో తమ భార్యలను తమ వైపునకు మరల్చుకోవాలనుకుంటే విడాకులివ్వబడిన స్త్రీలు ఇద్దత్ గడువులో మరల్చబడడానికి ఎక్కువ హక్కుదారులు.తమ భర్తలకి తమ పై హక్కులు,బాధ్యతలు ఉన్నట్లే భార్యలకి ఉన్నవని ప్రజలకు తెలుసు.కానీ వారి పై భర్తలకు భద్రత,విడాకుల విషయంలో ఒకింత స్థానం ఎక్కువగా ఉంటుంది.అల్లాహ్ సర్వాధిక్యుడు.అతని పై ఏ వస్తువు ఆధిక్యతను చూప లేదు,శాసించడంలో,నిర్వహణలో అతడు వివేచనాపరుడు.
Arabic explanations of the Qur’an:
اَلطَّلَاقُ مَرَّتٰنِ ۪— فَاِمْسَاكٌ بِمَعْرُوْفٍ اَوْ تَسْرِیْحٌ بِاِحْسَانٍ ؕ— وَلَا یَحِلُّ لَكُمْ اَنْ تَاْخُذُوْا مِمَّاۤ اٰتَیْتُمُوْهُنَّ شَیْـًٔا اِلَّاۤ اَنْ یَّخَافَاۤ اَلَّا یُقِیْمَا حُدُوْدَ اللّٰهِ ؕ— فَاِنْ خِفْتُمْ اَلَّا یُقِیْمَا حُدُوْدَ اللّٰهِ ۙ— فَلَا جُنَاحَ عَلَیْهِمَا فِیْمَا افْتَدَتْ بِهٖ ؕ— تِلْكَ حُدُوْدُ اللّٰهِ فَلَا تَعْتَدُوْهَا ۚ— وَمَنْ یَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟
భర్తకు తన నిర్ణయం నుండి మరలి వచ్చే అవకాశం రెండు విడాకుల వరకు ఉంటుంది.అతడు మొదటి విడాకులు ఇస్తాడు.అతరువాత తన నిర్ణయం నుండి మరలుతాడు,మరల విడాకులు ఇస్తాడు,ఆ తరువాత తన నిర్ణయం నుండి మరలుతాడు.రెండు విడాకుల తరువాత తన భార్యను సత్ప్రవర్తనతో తన బంధంలో ఉంచుకుంటే ఉంచుకోవచ్చు,లేదా ఆమెకు మేలు చేస్తు,ఆమె హక్కులను నిర్వర్తిస్తు మూడవ విడాకులివ్వాలి.ఓ భర్తల్లారా మీ భార్యలకు మీరు ఇచ్చిన మహర్లో నుంచి కొంచెం కూడా తీసుకోవటం సమ్మతం కాదు.కాని స్త్రీ తన భర్త నీతి నడవడికలు,అతని రూపు రేకల కారణంగా అయిష్టత చూపితే భర్యాభర్తలిద్దరు ఈ అయిష్టత కారణంగా తమ పై ఉన్న హక్కులను నిర్వర్తించడంలో లోపం కలుగుతుందని సందేహం కలిగితే వారిరువురు తమ సమస్యను తమ దగ్గరి బంధువుల ముందట లేదా ఇతరుల ముందు పెట్టాలి.ఒక వేళ సంరక్షకులు వారిరువురు తమ మధ్య వివాహ హక్కులను నిర్వర్తించటంలో లోపం కనబరుస్తారని భయపడితే భార్య భర్తకు విడాకులకు బదులుగా ధనమును ఇచ్చి ఖులా తీసుకుంటే వారిద్దరి పై ఎటువంటి దోషం లేదు.ధార్మిక ఈ ఆదేశాలు హలాల్ ,హరామ్ మధ్య వేరు చేస్తున్నవి.అయితే మీరు వాటిని అతిక్రమించకండి.హలాల్,హరామ్ మధ్య అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారందరు తమ కొరకు వినాశనమునకు కారకాలను కొని తెచ్చుకుని అల్లహ్ ఆగ్రహానికి,ఆయన శిక్షకు గురి అయ్యే దుర్మార్గులు.
Arabic explanations of the Qur’an:
فَاِنْ طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهٗ مِنْ بَعْدُ حَتّٰی تَنْكِحَ زَوْجًا غَیْرَهٗ ؕ— فَاِنْ طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَیْهِمَاۤ اَنْ یَّتَرَاجَعَاۤ اِنْ ظَنَّاۤ اَنْ یُّقِیْمَا حُدُوْدَ اللّٰهِ ؕ— وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ یُبَیِّنُهَا لِقَوْمٍ یَّعْلَمُوْنَ ۟
ఒక వేళ భర్త తన భార్యకు మూడవ విడాకులు ఇస్తే వేరే వ్యక్తితో హలాలా ఉద్దేశంతో కాకుండా ఇష్టతతో నిజమైన వివాహం చేసుకుని ఆ నికాహ్ బంధంలో అతను (రెండొవ భర్త) ఆమెతో సంభోగించనంత వరకు ఆమెతో అతను (మొదటి భర్త) సరి కొత్త వివాహం చేసుకొనటం సమ్మతం కాదు.ఒక వేళ రెండోవ భర్త ఆమెను విడాకులిస్తే లేదా చనిపోతే భార్య,మొదటి భర్త వారిద్దరు తమపై ఉన్న ధర్మ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పూర్తి నమ్మకం ఉంటే సరి కొత్త నికాహ్,మహర్ ద్వారా మరలటంలో వారిరువురిపై ఎటువంటి పాపం లేదు.ధర్మం యొక్క ఈ ఆదేశాలను ప్రజల కొరకు వారు అతని ఆదేశాలను,హద్దులను తెలుసుకోవటానికి అల్లాహ్ వివరించి తెలుపుతున్నాడు.ఎందుకంటే వాటి ద్వారా లబ్ది పొందేవారు వారే.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• بيَّن الله تعالى أحكام النكاح والطلاق بيانًا شاملًا حتى يعرف الناس حدود الحلال والحرام فلا يتجاوزونها.
ప్రజలు హలాల్,హరామ్ ని తెలుసుకుని వాటిని జవదాట కుండా ఉండేంతవరకు అల్లాహ్ నికాహ్,తలాఖ్ ఆదేశాలను సమగ్రంగా ప్రకటించాడు.

• عظَّم الله شأن النكاح وحرم التلاعب فيه بالألفاظ فجعلها ملزمة، وألغى التلاعب بكثرة الطلاق والرجعة فجعل لها حدًّا بطلقتين رجعيتين ثم تحرم عليه إلا أن تنكح زوجا غيره ثم يطلقها، أو يموت عنها.
అల్లాహ్ నికాహ్ విషయమునకు గొప్ప వైభవాన్ని ప్రసాదించాడు. పదాలను తప్పనిసరి చేసి వాటితో ఆట్లాడటంను నిషేదించాడు. పదే పదే విడాకులు,వాటి నుంచి మరలింపును ఎక్కువ చేసి ఆట్లాడటం సరైనది కాదని తెలియపరచాడు. అందుకనే రెండు సార్లు మరలింపు కల విడాకుల ద్వారా హద్దును నియమించాడు. ఆ తరువాత భార్యను వేరే వ్యక్తి వివాహం చేసుకుని విడాకులిస్తే లేదా మరణిస్తే తప్ప భర్త పై నిషేధించాడు.

• المعاشرة الزوجية تكون بالمعروف، فإن تعذر ذلك فلا بأس من الطلاق، ولا حرج على أحد الزوجين أن يطلبه.
వైవాహిక జీవితం మంచి తనము తో కొనసాగుతుంది,ఒక వేళ అది సాధ్యం కానప్పుడు విడాకులు తీసుకోవటంలో అభ్యంతరం లేదు,దాన్ని కోరటంలో భార్యభర్తల్లోంచి ఎవరి పై దోషం లేదు.

 
Translation of the meanings Surah: Al-Baqarah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close