Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Yūsuf   Ayah:
وَمَا تَسْـَٔلُهُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ؕ— اِنْ هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِیْنَ ۟۠
ఓ ప్రవక్తా ఒక వేళ వారికి బుద్ధి ఉంటే వారు మిమ్మల్ని విశ్వసించి ఉండేవారు ఎందుకంటే మీరు ఖుర్ఆన్ పై మరియు వారిని మీరు దేని వైపు పిలిస్తున్నారో దానిపై వారి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించటం లేదు.ఖుర్ఆన్ ప్రజలందరికి హితబోధన మాత్రమే.
Arabic explanations of the Qur’an:
وَكَاَیِّنْ مِّنْ اٰیَةٍ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ یَمُرُّوْنَ عَلَیْهَا وَهُمْ عَنْهَا مُعْرِضُوْنَ ۟
మరియు భూమ్యాకాశములలో పరిశుద్ధుడైన ఆయన ఏకత్వమును నిరూపించే ఎన్నో సూచనలు వ్యాపించి ఉన్నాయి.వారు వాటి ముందు నుండి నడుస్తున్నారు.మరియు వారు వాటిలో యోచన చేయటం నుండి,వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవటం నుండి విముఖత చూపుతున్నారు. వాటివైపు శ్రద్ధ చూపటం లేదు.
Arabic explanations of the Qur’an:
وَمَا یُؤْمِنُ اَكْثَرُهُمْ بِاللّٰهِ اِلَّا وَهُمْ مُّشْرِكُوْنَ ۟
మరియు ప్రజల్లో చాలా మంది అల్లాహ్ ను సృష్టికర్త,ఆహారప్రధాత,జీవనాన్ని ప్రసాధించేవాడు,ప్రాణములను తీసేవాడని విశ్వసించటం లేదు కాని వారు ఆయనతోపాటు ఇతరులను విగ్రహాలను,శిల్పాలను ఆరాధిస్తున్నారు.మరియు వారు పరిశుద్ధుడైన ఆయనకు కుమారుడు ఉన్నాడని వాదిస్తున్నారు.
Arabic explanations of the Qur’an:
اَفَاَمِنُوْۤا اَنْ تَاْتِیَهُمْ غَاشِیَةٌ مِّنْ عَذَابِ اللّٰهِ اَوْ تَاْتِیَهُمُ السَّاعَةُ بَغْتَةً وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟
ఏమి ఈ ముష్రికులందరు ఇహలోకములో వారిని కప్పివేసే మరియు క్రమ్ముకునే శిక్షరావటం నుండి నిర్భయులైపోయారా ?.దాన్ని దూరంచేసే శక్తి వారికి లేదు. లేదా వారి వద్దకు ప్రళయం అకస్మాత్తుగా రావటం నుండి నిర్భయులైపోయారా ?. దాని కోసం వారు సిద్ధం అవటానికి దాన్ని గమనించలేకపోయారు. అందుకనే వారు విశ్వసించలేదు.
Arabic explanations of the Qur’an:
قُلْ هٰذِهٖ سَبِیْلِیْۤ اَدْعُوْۤا اِلَی اللّٰهِ ؔ۫— عَلٰی بَصِیْرَةٍ اَنَا وَمَنِ اتَّبَعَنِیْ ؕ— وَسُبْحٰنَ اللّٰهِ وَمَاۤ اَنَا مِنَ الْمُشْرِكِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు పిలుపునిచ్చేవారితో (దైవసందేశం ఇచ్చేవారితో) ఇలా పలకండి : ఇదే నా మార్గము దేని వైపునైతే నేను ప్రజలను పిలుస్తున్నానో. నేను పిలుస్తున్నది మరియు నన్ను అనుసరిస్తున్న వారు మరియు నా మార్గమును పొందినవారు మరియు నా సాంప్రదాయమును అనుసరిస్తున్నవారు పిలుస్తున్న మార్గము స్పష్టమైన ఆధారంతో ఉన్నది. అల్లాహ్ ఔన్నత్యమునకు తగని,ఆయన పరిపూర్ణతకు విరుద్ధమైన వాటిని ఆయనకు అపాదించటం నుండి అల్లాహ్ పరిశుద్ధుడు. నేను అల్లాహ్ తో సాటి కల్పించే వారిలోంచి కాను కాని నేను పరిశుద్ధుడైన ఆయన కొరకు ఏకత్వమును చాటి చెప్పే వారిలోంచి వాడిని.
Arabic explanations of the Qur’an:
وَمَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ اِلَّا رِجَالًا نُّوْحِیْۤ اِلَیْهِمْ مِّنْ اَهْلِ الْقُرٰی ؕ— اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— وَلَدَارُ الْاٰخِرَةِ خَیْرٌ لِّلَّذِیْنَ اتَّقَوْا ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
ఓ ప్రవక్తా మీకన్న ముందు మేము పంపించిన ప్రవక్తలందరు దైవదూతలు కాకుండా మానవుల్లోంచి మగవారు మాత్రమే.మేము నీ వైపున దైవ వాణిని అవతరింపజేసినట్లే వారి వైపు అవతరింపజేశాము. వారు నగరవాసులు పల్లెవాసులు కాదు.అయితే వారిని వారి జాతులు తిరస్కరించాయి మేము వారిని తుదిముట్టించాము.ఏమీ మిమ్మల్ని తిరస్కరించిన వీరందరు వారికన్న మునుపటి తిరస్కారుల పరిణామం ఏమయిందో యోచన చేసి వారి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి భూమిలో సంచరించలేదా ?.పరలోక వాసములో ఉన్న అనుగ్రహాలు ఇహలోకములో అల్లాహ్ భీతి కలిగిన వారి కొరకు మేలైనవి.ఏమీ మీరు అల్లాహ్ భీతి కలిగి ఉండి ఆయన ఆదేశాలను పాటించటం ద్వారా వాటిలో గొప్పదైనది విశ్వాసము మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా వాటిలో పెద్దది అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం ఇవి మేలైనవని మీరు అర్ధం చేసుకోరా ?.
Arabic explanations of the Qur’an:
حَتّٰۤی اِذَا اسْتَیْـَٔسَ الرُّسُلُ وَظَنُّوْۤا اَنَّهُمْ قَدْ كُذِبُوْا جَآءَهُمْ نَصْرُنَا ۙ— فَنُجِّیَ مَنْ نَّشَآءُ ؕ— وَلَا یُرَدُّ بَاْسُنَا عَنِ الْقَوْمِ الْمُجْرِمِیْنَ ۟
ఈ ప్రవక్తలందరు మేము పంపించినవారు వారి శతృవులకు మేము గడువునిచ్చాము.వారిని బిగించటానికి మేము వారిపై శిక్షను తొందర చేయము.చివరికి వారి వినాశనము ఆలస్యమైనప్పుడు మరియు ప్రవక్తలు వారి వినాశనము నుండి నిరాశులైనప్పుడు సత్య తిరస్కారులు తమ ప్రవక్తలు సత్య తిరస్కారుల కొరకు శిక్ష గురించి,విశ్వాసపరులకు విముక్తి గురించి తమకు చేసిన వాగ్దానములో తమకు అబద్దము చెప్పారని భావించారు.మా ప్రవక్తల కొరకు మా సహాయం వచ్చినది.సత్య తిరస్కారులపై వచ్చిపడే వినాశనము నుండి ప్రవక్తలు మరియు విశ్వాసపరులు రక్షించబడ్డారు.అపరాధులైన జాతి వారి నుండి వారిపై అవతరించేటప్పుడు మా శిక్ష మరలించబడదు.
Arabic explanations of the Qur’an:
لَقَدْ كَانَ فِیْ قَصَصِهِمْ عِبْرَةٌ لِّاُولِی الْاَلْبَابِ ؕ— مَا كَانَ حَدِیْثًا یُّفْتَرٰی وَلٰكِنْ تَصْدِیْقَ الَّذِیْ بَیْنَ یَدَیْهِ وَتَفْصِیْلَ كُلِّ شَیْءٍ وَّهُدًی وَّرَحْمَةً لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟۠
నిశ్చయంగా ప్రవక్తల గాధల్లో మరియు వారి జాతుల గాధల్లో మరియు యూసుఫ్,అతని సోదరుల గాధలో వాటి ద్వారా హితబోధన గ్రహించే ఆరోగ్యవంతమైన మనస్సులు కలవారి కొరకు హితబోధన ఉన్నది.ఈ విషయాలపై పొందుపరచబడిన ఖుర్ఆన్ అల్లాహ్ పై కల్పించిన,అపాదించిన అబద్దపు వాక్కు కాదు.కాని అది అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన దివ్య గ్రంధాలను దృవీకరించేది,వివరణ అవసరమైన ఆదేశాలు,ధర్మ శాసనాలన్నింటి కొరకు వివరణ ఇచ్చేది మరియు ప్రతి మంచిని చూపించేది మరియు దానిపై విశ్వాసమును కనబరిచే జాతి వారి కొరకు కారుణ్యము. వారే దానిలో ఉన్నవాటి ద్వారా ప్రయోజనం చెందుతారు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• أن الداعية لا يملك تصريف قلوب العباد وحملها على الطاعات، وأن أكثر الخلق ليسوا من أهل الهداية.
నిశ్చయంగా ధర్మ ప్రచారకులకు దాసుల హృదయాలను మరలించే,వాటిని విధేయత చూపటంపై పురిగొల్పే అధికారము లేదు.మరియు చాలామంది మనుషులు సన్మార్గం పొందేవారిలోంచి కారు.

• ذم المعرضين عن آيات الله الكونية ودلائل توحيده المبثوثة في صفحات الكون.
అల్లాహ్ యొక్క విశ్వ సూచనల నుండి మరియు విశ్వములో వ్యాపించి ఉన్న ఆయన ఏకత్వ (తౌహీద్) ఆధారాల నుండి విముఖత చూపే వారిపై దూషణ.

• شملت هذه الآية ﴿ قُل هَذِهِ سَبِيلِي...﴾ ذكر بعض أركان الدعوة، ومنها: أ- وجود منهج:﴿ أَدعُواْ إِلَى اللهِ ﴾. ب - ويقوم المنهج على العلم: ﴿ عَلَى بَصِيرَةٍ﴾. ج - وجود داعية: ﴿ أَدعُواْ ﴾ ﴿أَنَا﴾. د - وجود مَدْعُوِّين: ﴿ وَمَنِ اتَّبَعَنِي ﴾.
ఈ ఆయతులో ధర్మ ప్రచారము యొక్క కొన్ని మూల స్థంభాలు పొందుపరచబడినవి { -------قُلۡ هَٰذِهِۦ سَبِيلِيٓ మీరు చెప్పండి ఈ నా మార్గము } . మరియు వాటిలో నుండి -: పాఠ్య ప్రణాలిక : { أَدۡعُوٓاْ إِلَى ٱللَّهِۚ నేను అల్లాహ్ వైపు పిలుస్తున్నాను } . పాఠ్య ప్రణాలిక జ్ఞాన పరంగా ఉంటుంది : { عَلَىٰ بَصِيرَةٍ జ్ఞానపరంగా }. ప్రచారం చేసేవారు ఉండటం : {أَدۡعُوٓاْ﴾ ﴿أَنَا۠ నేను పిలుస్తున్నాను } . ధర్మ ప్రచారమును స్వీకరించేవారు ఉండాలి : { وَمَنِ ٱتَّبَعَنِيۖ మరియు నన్ను అనుసరించేవారు } .

 
Translation of the meanings Surah: Yūsuf
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close