Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Yūsuf   Ayah:
فَلَمَّاۤ اَنْ جَآءَ الْبَشِیْرُ اَلْقٰىهُ عَلٰی وَجْهِهٖ فَارْتَدَّ بَصِیْرًا ۚؕ— قَالَ اَلَمْ اَقُلْ لَّكُمْ ۚ— اِنِّیْۤ اَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
యాఖూబ్ ను సంతోషమును కలిగించే వార్తను తీసుకుని వచ్చిన వాడు వచ్చి యూసుఫ్ చొక్కాను ఆయన ముఖముపై వేశాడు. అప్పుడు ఆయన చూడసాగారు. ఆ సమయంలో ఆయన తన కుమారులతో ఇలా పలికారు : అల్లాహ్ దయ,ఆయన మంచి గురించి మీకు తెలియనిది నాకు తెలుసు అని మీకు నేను చెప్పలేదా ?.
Arabic explanations of the Qur’an:
قَالُوْا یٰۤاَبَانَا اسْتَغْفِرْ لَنَا ذُنُوْبَنَاۤ اِنَّا كُنَّا خٰطِـِٕیْنَ ۟
అతని కుమారులు తాము యూసుఫ్ మరియు అతని సోదరునికి చేసిన దాని గురించి తమ తండ్రి యాఖూబ్ అలైహిస్సలాం తో క్షమాపణ కోరుతూ ఇలా పలికారు : ఓ మా తండ్రి మీరు మా క్రితం పాపముల నుండి అల్లాహ్ తో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా మేము యూసుఫ్ మరియు అతని సొంత సోదరునికి ఏదైతే చేశామో ఆ విషయంలో మేము పాపాత్ములము,అపరాధులము.
Arabic explanations of the Qur’an:
قَالَ سَوْفَ اَسْتَغْفِرُ لَكُمْ رَبِّیْ ؕ— اِنَّهٗ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟
వారితో వారి తండ్రి ఇలా పలికారు : నేను నా ప్రభువుతో మీ కొరకు క్షమాపణను కోరుతాను.నిశ్చయంగా ఆయనే తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును.
Arabic explanations of the Qur’an:
فَلَمَّا دَخَلُوْا عَلٰی یُوْسُفَ اٰوٰۤی اِلَیْهِ اَبَوَیْهِ وَقَالَ ادْخُلُوْا مِصْرَ اِنْ شَآءَ اللّٰهُ اٰمِنِیْنَ ۟ؕ
మరియు యాఖూబ్ మరియు అతని ఇంటి వారు తమ దేశము నుండి మిసర్ లో ఉన్న యూసుఫ్ ను ఉద్దేశించుకుని బయలుదేరారు.అయితే వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన తన తండ్రిని,తన తల్లిని తనతో హత్తుకున్నారు మరియు తన సోదరులతో,తన ఇంటి వారితో ఇలా పలికారు : మీరు అల్లాహ్ ఇష్టపూర్వకంగా నిర్భయంగా మిసర్ లో ప్రవేశించండి అందులో మీకు ఎటువంటి కీడు కలగదు.
Arabic explanations of the Qur’an:
وَرَفَعَ اَبَوَیْهِ عَلَی الْعَرْشِ وَخَرُّوْا لَهٗ سُجَّدًا ۚ— وَقَالَ یٰۤاَبَتِ هٰذَا تَاْوِیْلُ رُءْیَایَ مِنْ قَبْلُ ؗ— قَدْ جَعَلَهَا رَبِّیْ حَقًّا ؕ— وَقَدْ اَحْسَنَ بِیْۤ اِذْ اَخْرَجَنِیْ مِنَ السِّجْنِ وَجَآءَ بِكُمْ مِّنَ الْبَدْوِ مِنْ بَعْدِ اَنْ نَّزَغَ الشَّیْطٰنُ بَیْنِیْ وَبَیْنَ اِخْوَتِیْ ؕ— اِنَّ رَبِّیْ لَطِیْفٌ لِّمَا یَشَآءُ ؕ— اِنَّهٗ هُوَ الْعَلِیْمُ الْحَكِیْمُ ۟
మరియు ఆయన తన తల్లిదండ్రులను తాను కూర్చునే సింహాసనం మీద కూర్చోబెట్టారు. మరియు అతని తల్లిదండ్రులు,అతని పదకుండు మంది సోదరులు సాష్టాంగపడుతూ అతనికి సలాం చేశారు. మరియు సాష్టాంగపడటం గౌరవించటం కొరకే కాని ఆరాధన కొరకు కాదు. కలలో ఉన్న విధంగా అల్లాహ్ ఆదేశమును నిరూపించటానికి. అందుకనే యూసుఫ్ అలైహిస్సలాం తన తండ్రితో ఇలా పలికారు : ఇది మీ తరపు నుండి నాకు సాష్టాంగపడటం ద్వారా సలాం చేయటం ఇది ఇంతకు ముందు నేను చూసి మీకు తెలియపరచిన నా కల తాత్పర్యం. నిశ్చయంగా నా ప్రభువు దాన్ని జరిపించి నిజం చేశాడు. మరియు నిశ్చయంగా నా ప్రభువు నన్ను చెరసాల నుండి బయటకు తీసినప్పుడు మరియు షైతాను నా మధ్య మరియు నా సోదరుల మధ్య ఉపద్రవాలను సృష్టించిన తరువాత మిమ్మల్ని పల్లె నుండి తీసుకుని వచ్చినప్పుడు నాపై ఉపకారం చేశాడు. నిశ్చయంగా నా ప్రభువు తాను కోరుకున్న దాని కొరకు తన పర్యాలోచనలో సూక్ష్మగ్రాహి. నిశ్చయంగా ఆయన తన దాసుల స్థితులను గురించి బాగా తెలిసిన వాడు,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
Arabic explanations of the Qur’an:
رَبِّ قَدْ اٰتَیْتَنِیْ مِنَ الْمُلْكِ وَعَلَّمْتَنِیْ مِنْ تَاْوِیْلِ الْاَحَادِیْثِ ۚ— فَاطِرَ السَّمٰوٰتِ وَالْاَرْضِ ۫— اَنْتَ وَلِیّٖ فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۚ— تَوَفَّنِیْ مُسْلِمًا وَّاَلْحِقْنِیْ بِالصّٰلِحِیْنَ ۟
ఆ తరువాత యూసుఫ్ తన ప్రభువుతో ఇలా వేడుకున్నారు : ఓ నా ప్రభువా నిశ్చయంగా నీవు నాకు మిసర్ రాజ్యాధికారాన్ని ప్రసాధించావు మరియు నాకు కలల తాత్పర్యమును నేర్పించావు.ఓ భూమ్యాకాశములను పూర్వ నమూనా లేకుండా సృష్టించిన వాడా ఇహలోక జీవితంలో నా వ్యవహారాలన్నింటి సంరక్షకుడివి మరియు పరలోకంలో వాటన్నింటి సంరక్షకుడివి నీవే. నీవు నా ఆయుషు పూర్తయినప్పుడు నాకు ముస్లిమ్ స్థితిలో మరణాన్ని ప్రసాధించు. మరియు నన్ను స్వర్గములో ఉన్నతమైన ఫిరదౌస్ లో నా తాతముత్తాతలు మరియు ఇతరుల్లోంచి పుణ్యాత్ములైన దైవప్రవక్తలతో కలుపు.
Arabic explanations of the Qur’an:
ذٰلِكَ مِنْ اَنْۢبَآءِ الْغَیْبِ نُوْحِیْهِ اِلَیْكَ ۚ— وَمَا كُنْتَ لَدَیْهِمْ اِذْ اَجْمَعُوْۤا اَمْرَهُمْ وَهُمْ یَمْكُرُوْنَ ۟
ఈ ప్రస్తావించబడిన యూసుఫ్ మరియు అతని సోదరుల గాధ ఓ ప్రవక్తా మేము దాన్ని మీకు దైవ వాణి ద్వారా తెలియపరచాము.వారు అతన్ని బావి లోతులో పడవేయటానికి దృడ సంకల్పం చేసుకున్నప్పుడు మరియు వారు కుట్రలేవైతే పన్నినప్పుడు మీరు యూసుఫ్ సోదరుల మధ్య లేనందు వలన మీకు దాని గురించి జ్ఞానం లేదు.కాని మేము దాన్ని మీకు దైవ వాణి ద్వారా తెలియపరచాము.
Arabic explanations of the Qur’an:
وَمَاۤ اَكْثَرُ النَّاسِ وَلَوْ حَرَصْتَ بِمُؤْمِنِیْنَ ۟
ఓ ప్రవక్తా ఒక వేళ మీరు వారు విశ్వసించాలని అన్ని రకాల శ్రమను ఖర్చు చేసినా ప్రజల్లోంచి చాలామంది విశ్వసించరు. వారిపై దుఃఖముతో మీ ప్రాణము పోకూడదు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• بر الوالدين وتبجيلهما وتكريمهما واجب، ومن ذلك المسارعة بالبشارة لهما فيما يدخل السرور عليهما.
తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగటం మరియు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించటం మరియు వారిని గౌరవించటం తప్పనిసరి.మరియు వారికి సంతోషమును కలిగించే విషయముల గురించి తొందరగా శుభవార్తనివ్వటం అందులోనిదే.

• التحذير من نزغ الشيطان، ومن الذي يسعى بالوقيعة بين الأحباب؛ ليفرق بينهم.
షైతాను దుష్ప్రేరణ నుండి మరియు స్నేహితుల మధ్య దూరి వారిని వేరు చేయటానికి ప్రయత్నించే వారి నుండి హెచ్చరిక.

• مهما ارتفع العبد في دينه أو دنياه فإنَّ ذلك كله مرجعه إلى تفضّل الله تعالى وإنعامه عليه.
దాసుడు తన ధర్మ విషయంలో లేదా తన ప్రాపంచిక విషయంలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఇవన్నీ అతనిపై అల్లాహ్ అనుగ్రహాల్లోంచి మరియు సౌభాగ్యములోంచి.

• سؤال الله حسن الخاتمة والسلامة والفوز يوم القيامة والالتحاق برفقة الصالحين في الجنان.
ప్రళయదినాన మంచి ముగింపు,భద్రత మరియు విజయము కలగాలని మరియు స్వర్గంలో నీతిమంతుల సహవాసంలో చేరడం గురించి అల్లాహ్ ను అర్ధించడం.

• من فضل الله تعالى أنه يُطْلع أنبياءه على بعض من أمور الغيب لغايات وحكم.
అల్లాహ్ అనుగ్రహాల్లోంచి ఆయన తన ప్రవక్తలకు ప్రయోజనాల కొరకు, నిర్ణయాల కొరకు కొన్ని అగోచర విషయాల గురించి తెలియపరుస్తాడు.

 
Translation of the meanings Surah: Yūsuf
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close