Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Surja: El Isra   Ajeti:

అల్-ఇస్రా

Qëllimet e sures:
تثبيت الله لرسوله صلى الله عليه وسلم وتأييده بالآيات البينات، وبشارته بالنصر والثبات.
అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను స్థిరపరచటం మరియు స్పష్టమైన ఆయతుల ద్వారా ఆయనను మద్దతివ్వటం మరియు విజయము,స్థిరత్వం ద్వారా ఆయనకు శుభవార్తనివ్వటం.

سُبْحٰنَ الَّذِیْۤ اَسْرٰی بِعَبْدِهٖ لَیْلًا مِّنَ الْمَسْجِدِ الْحَرَامِ اِلَی الْمَسْجِدِ الْاَقْصَا الَّذِیْ بٰرَكْنَا حَوْلَهٗ لِنُرِیَهٗ مِنْ اٰیٰتِنَا ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْبَصِیْرُ ۟
పరిశుద్ధుడైన అల్లాహ్ తాను తప్ప ఇంకెవరూ సామర్ధ్యం కనబరచని వాటిపై తన సామర్ధ్యం ఉండటం వలన ఆయన సర్వ లోపాలకు అతీతుడు,మహోన్నతుడు. ఆయనే తన దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆత్మతో,శరీరంతో సహా మేల్కొన్న స్థితిలో రాత్రి ఒక భాగములో మస్జిదుల్ హరాం నుండి బైతుల్ మఖ్దిస్ మస్జిద్ (పరిశుద్ధ గృహము) దేని పరిసర ప్రాంతాలకైతే మేము ఫలాల ద్వారా,పంటల ద్వారా,దైవ ప్రవక్తలు అలైహిముస్సలాంల గృహముల ద్వారా శుభవంతం చేశామో దాని వరకు పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యమును దృవీకరించే మా సూచనలను ఆయన చూడటానికి నడిపించాడు. నిశ్చయంగా ఆయనే వినేవాడును ఆయనపై ఎటువంటి వినబడేది గోప్యంగా ఉండదు,చూసే వాడును ఆయనపై ఎటువంటి చూడబడేది గోప్యంగా ఉండదు.
Tefsiret në gjuhën arabe:
وَاٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ وَجَعَلْنٰهُ هُدًی لِّبَنِیْۤ اِسْرَآءِیْلَ اَلَّا تَتَّخِذُوْا مِنْ دُوْنِیْ وَكِیْلًا ۟ؕ
మరియు మేము మూసా అలైహిస్సలాంకు తౌరాత్ ను ప్రసాధించి దాన్ని ఇస్రాయీలు సంతతివారికి మార్గదర్శినిగా,సన్మార్గమును చూపించేదానిగా చేశాము. మరియు మేము ఇస్రాయీలు సంతతివారితో ఇలా పలికాము : మీరు నన్ను వదిలి ఎవరినీ మీ వ్యవహారాలన్నింటిని అప్పజెప్పటానికి సంరక్షకునిగా చేసుకోకండి. కాని మీరు నా ఒక్కడిపైనే నమ్మకమును కలిగి ఉండండి.
Tefsiret në gjuhën arabe:
ذُرِّیَّةَ مَنْ حَمَلْنَا مَعَ نُوْحٍ ؕ— اِنَّهٗ كَانَ عَبْدًا شَكُوْرًا ۟
మీరు నూహ్ అలైహిస్సలాం తోపాటు తూఫానులో మునగటం నుండి ముక్తి ద్వారా మేము అనుగ్రహించిన సంతతిలో నుంచి వారు. అయితే మీరు ఈ అనుగ్రహమును గుర్తు చేసుకుంటూ ఉండండి మరియు మహోన్నతుడైన అల్లాహ్ కు ఆయన ఒక్కడి ఆరాధన ద్వారా,విధేయత ద్వారా కృతజ్ఞతలు తెలుపుకోండి. మరియు మీరు ఈ విషయంలో నూహ్ ను అనుసరించండి ఎందుకంటే ఆయన మహోన్నతుడైన అల్లాహ్ కి ఎక్కువగా కృతజ్ఞతలు తెలుపుకునేవాడు.
Tefsiret në gjuhën arabe:
وَقَضَیْنَاۤ اِلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ فِی الْكِتٰبِ لَتُفْسِدُنَّ فِی الْاَرْضِ مَرَّتَیْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِیْرًا ۟
మరియు మేము ఇస్రాయీలు సంతతి వారిని వారి నుండి భువిలో పాపకార్యలకు పాల్పడటం ద్వారా,అహంకారము ద్వారా రెండు సార్లు సంక్షోభం తలెత్తుతుందని సమాచారమిచ్చాము,తెలియపరచాము. మరియు వారు తప్పకుండా ప్రజలపై హింస ద్వారా,దుర్మార్గము ద్వారా వారిపై అహంకారమును ప్రదర్సించటంలో హద్దు మీరుతూ గర్వమును చూపుతారు.
Tefsiret në gjuhën arabe:
فَاِذَا جَآءَ وَعْدُ اُوْلٰىهُمَا بَعَثْنَا عَلَیْكُمْ عِبَادًا لَّنَاۤ اُولِیْ بَاْسٍ شَدِیْدٍ فَجَاسُوْا خِلٰلَ الدِّیَارِ وَكَانَ وَعْدًا مَّفْعُوْلًا ۟
అయితే వారి నుండి మొదటి సంక్షోభం తలెత్తినప్పుడు మేము వారిపై బలవంతులైన,అత్యంత పరాక్రమ వంతులైన మా దాసులకు ఆధిపత్యమును ప్రసాధించాము. వారు వారిని హతమార్చారు,వెలివేశారు. అప్పుడు వారు వారి నివాసముల మధ్యలో ఏ ప్రాంతము నుండి వెళ్ళినా దాన్ని నాశనం చేసేవారు. అల్లాహ్ వాగ్ధానం ఇలాగే ఖచ్చితంగా వాటిల్లుతుంది.
Tefsiret në gjuhën arabe:
ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَیْهِمْ وَاَمْدَدْنٰكُمْ بِاَمْوَالٍ وَّبَنِیْنَ وَجَعَلْنٰكُمْ اَكْثَرَ نَفِیْرًا ۟
ఆ తరువాత ఓ ఇస్రాయీలు సంతతివారా మీరు అల్లాహ్ తో పశ్చాత్తాప్పడినప్పుడల్లా మీపై ఆధిపత్యాన్ని చూపిన వారిపై మేము మీకు అధికారమును,ఆధిక్యతను తయారు చేసి ఉంచాము. మరియు సంపద దోచుకోబడిన తరువాత సంపద ద్వారా,వారు బందీ అయిన తరువాత సంతానము ద్వారా మీకు మేము సహాయం చేశాము. మరియు మేము మీ సంఖ్యా బలమును మీ శతృవులకన్న అధికం చేశాము.
Tefsiret në gjuhën arabe:
اِنْ اَحْسَنْتُمْ اَحْسَنْتُمْ لِاَنْفُسِكُمْ ۫— وَاِنْ اَسَاْتُمْ فَلَهَا ؕ— فَاِذَا جَآءَ وَعْدُ الْاٰخِرَةِ لِیَسُوْٓءٗا وُجُوْهَكُمْ وَلِیَدْخُلُوا الْمَسْجِدَ كَمَا دَخَلُوْهُ اَوَّلَ مَرَّةٍ وَّلِیُتَبِّرُوْا مَا عَلَوْا تَتْبِیْرًا ۟
ఓ ఇస్రాయీలు సంతతివారా ఒక వేళ మీరు మీ కర్మలను మంచిగా చేసి వాటిని కోరిన విధంగా తీసుకుని వస్తే దాని ప్రతిఫలము మీకే చేరుతుంది. అల్లాహ్ కి మీ కర్మల అవసరం లేదు. ఒక వేళ మీరు మీ కర్మలను చెడుగా చేసి ఉంటే దాని శిక్ష మీపైనే పడుతుంది. అయితే మీ కర్మలను మంచిగా చేయటం అల్లాహ్ కి ప్రయోజనం చేకూర్చదు,వాటిని చెడుగా చేయటం ఆయనకు నష్టం కలిగించదు. ఎప్పుడైతే రెండవ సంక్షోభం తలెత్తుతుందో మేము మీ శతృవులకు మీపై ఆధిక్యతను కలిగిస్తాము. వారు మిమ్మల్ని పరాభవమునకు గురి చేయటానికి,వారు రకరకాల పరాభవముల రుచి మీకు చూపించినప్పుడు మీ ముఖములపై ప్రత్యక్షంగా చెడును వారు కలిగించటానికి,మొదటి సారి వారు బైతుల్ మఖ్దిస్ లో ప్రవేశించి దాన్ని ఏవిధంగా శిధిలం చేశారో ఆవిధంగా వారు అందులో ప్రవేశించి శిధిలం చేయటానికి,మీ బస్తీల్లోంచి దేనిపైనైతే వారు జయిస్తారో దాన్ని పూర్తిగా నేలమట్టం చేయటానికి.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• في قوله: ﴿الْمَسْجِدِ الْأَقْصَا﴾: إشارة لدخوله في حكم الإسلام؛ لأن المسجد موطن عبادةِ المسلمين.
అల్ మస్జిదుల్ అఖ్సా (الْمَسْجِدِ الْأَقْصَا) అన్నఅల్లాహ్ వాక్కులో అందులో ప్రవేశించటం ఇస్లాం ఆదేశములోనిది అనటానికి సూచన ఉన్నది. ఎందుకంటే మస్జిద్ ముస్లిముల ఆరాధన స్థలము.

• بيان فضيلة الشكر، والاقتداء بالشاكرين من الأنبياء والمرسلين.
కృతజ్ఞత తెలపటం,కృతజ్ఞతలను తెలుపుకునే వారైన సందేశహరులు,ప్రవక్తలను అనుసరించటం యొక్క ప్రాముఖ్యత ప్రకటన.

• من حكمة الله وسُنَّته أن يبعث على المفسدين من يمنعهم من الفساد؛ لتتحقق حكمة الله في الإصلاح.
సంక్షోభమును లేపే వారిపై వారిని సంక్షోభము నుండి ఆపేవారిని పంపటం అల్లాహ్ విజ్ఞతలోనిది,ఆయన సాంప్రదాయం లోనిది సంస్కరణలో అల్లాహ్ విజ్ఞతను నిరూపించటం కొరకు.

• التحذير لهذه الأمة من العمل بالمعاصي؛ لئلا يصيبهم ما أصاب بني إسرائيل، فسُنَّة الله واحدة لا تتبدل ولا تتحول.
ఈ సమాజమునకు పాప కార్యములకు పాల్పడటం నుండి హెచ్చరిక వారికి ఇస్రాయీలు సంతతి వారికి సంభవించినది వారికి సంభవించకుండా ఉండటానికి. అయితే అల్లాహ్ సంప్రదాయం ఒక్కటే అది మారదు.

 
Përkthimi i kuptimeve Surja: El Isra
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll