Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Surja: Hud   Ajeti:
قَالَ یٰنُوْحُ اِنَّهٗ لَیْسَ مِنْ اَهْلِكَ ۚ— اِنَّهٗ عَمَلٌ غَیْرُ صَالِحٍ ۗ— فَلَا تَسْـَٔلْنِ مَا لَیْسَ لَكَ بِهٖ عِلْمٌ ؕ— اِنِّیْۤ اَعِظُكَ اَنْ تَكُوْنَ مِنَ الْجٰهِلِیْنَ ۟
అల్లాహ్ నూహ్ తో ఇలా అన్నాడు : ఓ నూహ్ నీవు నాతో సంరక్షణ కొరకు అడిగిన నీ కుమారుడుని నేను సంరక్షిస్తాను అని నీతో వాగ్దానం చేసిన నీ కుటుంబము లోంచి కాడు.ఎందుకంటే అతడు అవిశ్వాసపరుడు.నిశ్చయంగా ఓ నూహ్ నీ అడగటం నీకు తగని కార్యం. నీ స్థానంలో ఉన్న వారికి అది సరైనది కాదు.నీకు తెలియని విషయాల గురించి నన్ను అడగకు.నీవు అజ్ఞానుల్లో అవటం నుండి జాగ్రత్తగా ఉండమని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను.అప్పుడు నీవు నా జ్ఞానమునకు,నా వివేకమునకు విరుద్ధమైన వాటిని నీవు నన్ను అడుగుతావు.
Tefsiret në gjuhën arabe:
قَالَ رَبِّ اِنِّیْۤ اَعُوْذُ بِكَ اَنْ اَسْـَٔلَكَ مَا لَیْسَ لِیْ بِهٖ عِلْمٌ ؕ— وَاِلَّا تَغْفِرْ لِیْ وَتَرْحَمْنِیْۤ اَكُنْ مِّنَ الْخٰسِرِیْنَ ۟
నూహ్ అలైహిస్సలాం ఇలా వేడుకున్నారు : ఓ నా ప్రభువా నేను నాకు జ్ఞానం లేని వాటి గురించి నీకు అడగటం నుండి నీతో శరణమును,రక్షణను కోరుతున్నాను.ఒక వేళ నీవు నా పాపమును మన్నించకపోతే,నీ కారుణ్యముతో నన్ను కరుణించకపోతే నేను పరలోకములో తమ భాగములను కోల్పోయిన వారిలోంచి అయిపోతాను.
Tefsiret në gjuhën arabe:
قِیْلَ یٰنُوْحُ اهْبِطْ بِسَلٰمٍ مِّنَّا وَبَرَكٰتٍ عَلَیْكَ وَعَلٰۤی اُمَمٍ مِّمَّنْ مَّعَكَ ؕ— وَاُمَمٌ سَنُمَتِّعُهُمْ ثُمَّ یَمَسُّهُمْ مِّنَّا عَذَابٌ اَلِیْمٌ ۟
అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం తో ఇలా పలికాడు : ఓ నూహ్ నీవు ఓడ నుండి సురక్షితముగా,భద్రముగా మరియు మీ పై,మీతో పాటు ఓడలో ఉన్న మీ తరువాత వచ్చే విశ్వాసపరులపై అధికమైన అల్లాహ్ అనుగ్రహాలతో భుమిపై దిగండి.మరియు అక్కడ వారి సంతతికి చెందిన వేరే అవిశ్వాస జాతులవారు ఉంటారు వారికి మేము ఇహలోకములో సుఖసంతోషాలను ప్రసాధిస్తాము,వారు జీవించటానికి కావలసినవి వారికి మేము ప్రసాధిస్తాము.ఆ తరువాత వారు పరలోకములో మా నుండి బాధాకరమైన శిక్షను పొందుతారు.
Tefsiret në gjuhën arabe:
تِلْكَ مِنْ اَنْۢبَآءِ الْغَیْبِ نُوْحِیْهَاۤ اِلَیْكَ ۚ— مَا كُنْتَ تَعْلَمُهَاۤ اَنْتَ وَلَا قَوْمُكَ مِنْ قَبْلِ هٰذَا ۛؕ— فَاصْبِرْ ۛؕ— اِنَّ الْعَاقِبَةَ لِلْمُتَّقِیْنَ ۟۠
నూహ్ అలైహిస్సలాం యొక్క ఈ గాధ అగోచర సమాచారములోనిది.మేము మీ వైపు అవతరింపజేసిన ఈ దైవ వాణి కన్నా మునుపు ఓ ప్రవక్తా దాని గురించి (నూహ్ గాధ గురించి) మీకు తెలియదు మరియు దాని గురించి మీ జాతి వారికీ తెలియదు.అయితే నూహ్ అలైహిస్సలాం సహనం వహించినట్లు మీ జాతి వారు బాధించటం పై,వారి తిరస్కారం పై మీరూ సహనం వహించండి.నిశ్చయంగా అల్లాహ్ ఆదేశాలను ఎవరైతే పాఠిస్తారో,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారో వారికే విజయము,ఆధిపత్యము కలుగును.
Tefsiret në gjuhën arabe:
وَاِلٰی عَادٍ اَخَاهُمْ هُوْدًا ؕ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اِنْ اَنْتُمْ اِلَّا مُفْتَرُوْنَ ۟
మరియు మేము ఆద్ జాతి వారి వైపు వారి సోదరుడు హూద్ అలైహిస్సలాంను ప్రవక్తగా పంపించాము.ఆయన వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా మీరు ఒక్కడైన అల్లాహ్ ను ఆరాధించండి.మరియు ఆయనతోపాటు ఎవరినీ సాటి కల్పించకండి.పరిశుద్ధుడైన ఆయన తప్ప మీ కొరకు వాస్తవ ఆరాధ్య దైవము ఇంకొకరు లేరు.ఆయనకు సాటి ఉన్నారని మీ వాదనలో కేవలం మీరు అబద్దము పలుకుతున్నారు.
Tefsiret në gjuhën arabe:
یٰقَوْمِ لَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ اَجْرًا ؕ— اِنْ اَجْرِیَ اِلَّا عَلَی الَّذِیْ فَطَرَنِیْ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
ఓ నా జాతి వారా నేను నా ప్రభువు సందేశాలను మీకు చేరవేయటం పై,ఆయన వైపునకు మిమ్మల్ని పిలవటం పై మీ నుండి నేను ఎటువంటి ప్రతిఫలాన్ని కోరటం లేదు.నా ప్రతిఫలం నన్ను సృష్టించిన అల్లాహ్ వద్ద ఉన్నది. ఏ నేను దేని వైపున మిమ్మల్ని పిలుస్తున్నానో మీరు దాని జవాబు ఇవ్వటానికి మీరు దాన్ని అర్ధం చేసుకోరా ?.
Tefsiret në gjuhën arabe:
وَیٰقَوْمِ اسْتَغْفِرُوْا رَبَّكُمْ ثُمَّ تُوْبُوْۤا اِلَیْهِ یُرْسِلِ السَّمَآءَ عَلَیْكُمْ مِّدْرَارًا وَّیَزِدْكُمْ قُوَّةً اِلٰی قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِیْنَ ۟
ఓ నా జాతి ప్రజలారా మీరు మీ పాపములనుండి అందులో నుంచి పెద్ద పాపమైన షిర్కు నుండి అల్లాహ్ తో మన్నింపును వేడుకొని ఆయన వైపు పశ్చాత్తాప్పడండి.దానిపై ఆయన ఎక్కువగా వర్షాన్ని కురిపించటం ద్వారా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.మరియు సంతానమును,సంపదను అధికం చేసి మీకు బలంపై బలాన్ని అధికం చేస్తాడు.మరియు నేను దేని వైపునైతే మిమ్మల్ని పిలుస్తున్నానో దాని నుండి మీరు విముఖత చూపకండి.అయితే నా పిలుపు నుండి మీ విముఖత వలన,అల్లాహ్ పట్ల మీ అవిశ్వాసము వలన,నేను తీసుకుని వచ్చిన దాని పట్ల మీ తిరస్కారము వలన మీరు అపరాదుల్లోంచి అయిపోతారు.
Tefsiret në gjuhën arabe:
قَالُوْا یٰهُوْدُ مَا جِئْتَنَا بِبَیِّنَةٍ وَّمَا نَحْنُ بِتَارِكِیْۤ اٰلِهَتِنَا عَنْ قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِیْنَ ۟
ఆయన జాతి వారు ఇలా పలికారు : ఓ హూద్ మేము నిన్ను విశ్వసించేటట్లు చేసే ఎటువంటి స్పష్టమైన వాదనను నీవు మా వద్దకు తీసుకుని రాలేదు. ఎటువంటి ఆధారం లేకుండా ఖాళీగా ఉన్న నీ మాటలతో మేము మా ఆరాధ్య దైవాల ఆరాధనను వదిలిపెట్టే వారము కాము.నీవు ప్రవక్త అని వాదించిన విషయాల్లో మీ కొరకు మేము విశ్వసించేవారము కాము.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• لا يملك الأنبياء الشفاعة لمن كفر بالله حتى لو كانوا أبناءهم.
అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారి కొరకు సిఫారసు చేసే అధికారము దైవ ప్రవక్తలకి లేదు.చివరికి వారు ఒక వేళ వారి కుమారులైనా సరే.

• عفة الداعية وتنزهه عما في أيدي الناس أقرب للقبول منه.
మత ప్రభోదకుని పవిత్రత,ప్రజల చేతుల్లో ఉన్న వాటి నుండి అతని శుద్దత అతని నుండి ఆమోదించటానికి చాలా దగ్గరవుతుంది.

• فضل الاستغفار والتوبة، وأنهما سبب إنزال المطر وزيادة الذرية والأموال.
తౌబా మరియు ఇస్తిగ్ఫార్ ప్రాముఖ్యత.మరియు అవి రెండు వర్షం కురవటానికి,సంతానము మరియు సంపద అధికమవటానికి కారణం.

 
Përkthimi i kuptimeve Surja: Hud
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll