Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Surja: Junus   Ajeti:
لِلَّذِیْنَ اَحْسَنُوا الْحُسْنٰی وَزِیَادَةٌ ؕ— وَلَا یَرْهَقُ وُجُوْهَهُمْ قَتَرٌ وَّلَا ذِلَّةٌ ؕ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَنَّةِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
అల్లాహ్ తమ పై విధిగావించిన వాటిని మంచిగా చేసి,తమపై ఆయన నిషేదించిన అవిధేయ కార్యాలను విడనాడే వారి కొరకు మంచి పుణ్యము కలదు.అది స్వర్గము.మరియు వారి కొరకు దాని కన్నా అధికమే లభించును.అది ఉదారమైన అల్లాహ్ ముఖ దర్శనము.మరియు వారి ముఖములపై దుమ్ము చేరి ఉండదు.మరియు వాటిపై దుఃఖము,అవమానము చేరదు.దాతృత్వం ఉన్న వీరందరూ స్వర్గవాసులు,వారే అందులో నివాసం ఉంటారు.
Tefsiret në gjuhën arabe:
وَالَّذِیْنَ كَسَبُوا السَّیِّاٰتِ جَزَآءُ سَیِّئَةٍ بِمِثْلِهَا ۙ— وَتَرْهَقُهُمْ ذِلَّةٌ ؕ— مَا لَهُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍ ۚ— كَاَنَّمَاۤ اُغْشِیَتْ وُجُوْهُهُمْ قِطَعًا مِّنَ الَّیْلِ مُظْلِمًا ؕ— اُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
మరియు ఎవరైతే అవిశ్వాసము,అవిధేయ కార్యాలైన పాప కార్యాలకు పాల్పడుతారో వారి కొరకు వారు పాల్పడిన దుష్కార్యమునకు ప్రతిఫలము దాని లాంటి అల్లాహ్ శిక్షపరలోకములో ఉండును.మరియు వారి ముఖములపై అవమానము,పరాభవము కప్పబడి ఉంటాయి.అల్లాహ్ వారిపై శిక్షను అవతరింపజేసినప్పుడు వారి కొరకు అల్లాహ్ శిక్షనుండి ఆపేవాడు ఎవడూ ఉండడు.నరకము యొక్క పొగ,దాని నల్లదనం వారి ముఖములపై ఎక్కువగా కప్పుకోవటం వలన వారి ముఖములు చీకటి రాత్రి యొక్క నల్లని తెరను తొడిగినట్లు ఉంటాయి.ఈ గుణాలను కలిగిన వీరందరూ నరక వాసులు.వీరే అందులో శాస్వతంగా ఉంటారు.
Tefsiret në gjuhën arabe:
وَیَوْمَ نَحْشُرُهُمْ جَمِیْعًا ثُمَّ نَقُوْلُ لِلَّذِیْنَ اَشْرَكُوْا مَكَانَكُمْ اَنْتُمْ وَشُرَكَآؤُكُمْ ۚ— فَزَیَّلْنَا بَیْنَهُمْ وَقَالَ شُرَكَآؤُهُمْ مَّا كُنْتُمْ اِیَّانَا تَعْبُدُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ప్రళయదినమును గుర్తు చేసుకోండి అప్పుడు మేము సృష్టిరాసులందరిని సమీకరిస్తాము.ఆ తరువాత ఇహలోకములో అల్లాహ్ తోపాటు సాటి కల్పించిన వారితో ఇలా పలుకుతాము : ఓ ముష్రికులారా మీరూ మరియు మీ ఆ ఆరాధ్య దైవాలు వేటినైతే మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించేవారో వారు మీ స్థానమును అట్టిపెట్టుకుని ఉండండి.అయితే మేము ఆరాధించబడే వారిని,ఆరాధించే వారిని వేరుపరుస్తాము.మరియు ఆరాధించబడేవారు ఇలా పలుకుతూ ఆరాధించేవారితో సంభంధం లేదని చూపుతారు : ఇహలోకములో మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు .
Tefsiret në gjuhën arabe:
فَكَفٰی بِاللّٰهِ شَهِیْدًا بَیْنَنَا وَبَیْنَكُمْ اِنْ كُنَّا عَنْ عِبَادَتِكُمْ لَغٰفِلِیْنَ ۟
అక్కడ వారు పూజించే వారి ఆరాధ్య దైవాలు వారితో సంభందములేదని ఇలా పలుకుతారు : అల్లాహ్ యే సాక్ష్యం .దానికి ఆయన చాలు.నిశ్చయంగా మీరు మా ఆరాధన చేయటమును మేము ఇష్టపడలేదు.దాని గురించి మేము మీకు ఆదేశించనూ లేదు.మరియు మేము మీ ఆరాధనను గ్రహించనూ లేదు.
Tefsiret në gjuhën arabe:
هُنَالِكَ تَبْلُوْا كُلُّ نَفْسٍ مَّاۤ اَسْلَفَتْ وَرُدُّوْۤا اِلَی اللّٰهِ مَوْلٰىهُمُ الْحَقِّ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟۠
ఆ మహోత్తర సంధర్భములో ప్రతి మనిషి తాను ఇహలోకములో చేసుకున్న కర్మలను పరీక్షించుకుంటాడు.మరియు ముష్రికులు తమ సత్య ప్రభువైన అల్లాహ్ ఎవరైతే వారి లెక్క తీసుకుంటాడో ఆయన వైపునకు మరలించబడుతారు.వారు కల్పించుకున్న తమ విగ్రహాల సిఫారసు వారి నుండి వైదొలిగిపోతుంది.
Tefsiret në gjuhën arabe:
قُلْ مَنْ یَّرْزُقُكُمْ مِّنَ السَّمَآءِ وَالْاَرْضِ اَمَّنْ یَّمْلِكُ السَّمْعَ وَالْاَبْصَارَ وَمَنْ یُّخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَیُخْرِجُ الْمَیِّتَ مِنَ الْحَیِّ وَمَنْ یُّدَبِّرُ الْاَمْرَ ؕ— فَسَیَقُوْلُوْنَ اللّٰهُ ۚ— فَقُلْ اَفَلَا تَتَّقُوْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ తోపాటు సాటికల్పిస్తున్న వీరందరితో ఇలా అడగండి : మీపై వర్షమును కురిపించటం ద్వారా ఆకాశము నుండి మీకు ఆహారోపాదిని కల్పిస్తున్నవాడెవడు ?.మరియు భూమి నుండి మొలకెత్తే మొక్కల ద్వారా,అది సమీకరించే ఖనిజాల ద్వారా మీకు భూమి నుండి ఆహారోపాదిని కల్పిస్తున్నవాడెవడు ?.వీర్యపు బిందువు నుండి మనిషిలా,గ్రుడ్డు నుండి పక్షి లా మృత్యువు నుండి జీవమును తీస్తున్నది ఎవడు ?.మరియు జంతువు నుండి వీర్యము లా,పక్షి నుండి గ్రుడ్డు లా జీవము నుండి మృత్యువు ను తీస్తున్నది ఎవడు ?.భూమ్యాకాశాలు,వాటిలో ఉన్న సృష్టి రాసుల విషయంలో పర్యాలోచన చేస్తున్నది ఎవడు ?.అప్పుడు ఇదంతా చేస్తున్న వాడు అతడే అల్లాహ్ అని వారు సమాధానమిస్తారు .అయితే మీరు వారితో ఇలా అనండి : అయితే మీరు అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ కు భయపడటానికి ఇది మీకు తెలియదా ?.
Tefsiret në gjuhën arabe:
فَذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمُ الْحَقُّ ۚ— فَمَاذَا بَعْدَ الْحَقِّ اِلَّا الضَّلٰلُ ۚ— فَاَنّٰی تُصْرَفُوْنَ ۟
ఓ ప్రజలారా ఇదంతా చేస్తున్నవాడు ఆయనే సత్యమైన అల్లాహ్ మీ ప్రభువు,మీ వ్యవహారాల పర్యాలోచన చేసేవాడు.కాబట్టి సత్యం తెలిసిన తరువాత దాని నుండి దూరంగా ఉండకుండా దాన్ని కోల్పోకుండా ఉండటానికి ఏమి చేయాలి ?.ఈ స్పష్టమైన సత్యము నుండి మీ బుద్ధులు ఎటు మరలిపోతున్నాయి ?.
Tefsiret në gjuhën arabe:
كَذٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَی الَّذِیْنَ فَسَقُوْۤا اَنَّهُمْ لَا یُؤْمِنُوْنَ ۟
ఓ ప్రవక్తా నిజమైన దైవత్వము అల్లాహ్ కొరకు నిరూపితమయినట్లు మొండితనముతో సత్యము నుండి వైదొలగిన వారు విశ్వసించరని మీ ప్రభువు యొక్క విధి మాట అనివార్యమైనది.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• أعظم نعيم يُرَغَّب به المؤمن هو النظر إلى وجه الله تعالى.
విశ్వాసపరులకు ఆశకల్పించబడే గొప్ప అనుగ్రల్లోంచి అది మహోన్నతుడైన అల్లాహ్ ముఖము దర్శనము.

• بيان قدرة الله، وأنه على كل شيء قدير.
అల్లాహ్ సామర్ధ్యము ప్రకటన ,మరియు ఆయన ప్రతీ వస్తువుపై సామర్ధ్యము కలవాడు.

• التوحيد في الربوبية والإشراك في الإلهية باطل، فلا بد من توحيدهما معًا.
ఆరాధ్యములో సాటి కల్పిస్తూ దైవత్వంలో ఏకత్వము సరి అవదు.ఆ రెండింటి ఏకత్వము ఉండటం తప్పనిసరి.

• إذا قضى الله بعدم إيمان قوم بسبب معاصيهم فإنهم لا يؤمنون.
ఏదైన జాతి వారి అవిధేయ కార్యాల మూలంగా అల్లాహ్ వారికి విశ్వాసము ఉండదని నిర్ణయించినప్పుడు వారు విశ్వాసమును కనబర్చరు.

 
Përkthimi i kuptimeve Surja: Junus
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll