Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تلګوی ژباړه - عبد الرحیم بن محمد * - د ژباړو فهرست (لړلیک)

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

د معناګانو ژباړه سورت: انعام   آیت:
وَمَا عَلَی الَّذِیْنَ یَتَّقُوْنَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَیْءٍ وَّلٰكِنْ ذِكْرٰی لَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
మరియు దైవభీతి గలవారు, వారి (అవిశ్వాసుల) లెక్కకు ఏ మాత్రం బాధ్యులు కారు. కాని వారికి హితోపదేశం చేయటం, (విశ్వాసుల ధర్మం). బహుశా, వారు కూడా దైవభీతి గలవారు కావచ్చు!
عربي تفسیرونه:
وَذَرِ الَّذِیْنَ اتَّخَذُوْا دِیْنَهُمْ لَعِبًا وَّلَهْوًا وَّغَرَّتْهُمُ الْحَیٰوةُ الدُّنْیَا وَذَكِّرْ بِهٖۤ اَنْ تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ ۖۗ— لَیْسَ لَهَا مِنْ دُوْنِ اللّٰهِ وَلِیٌّ وَّلَا شَفِیْعٌ ۚ— وَاِنْ تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا یُؤْخَذْ مِنْهَا ؕ— اُولٰٓىِٕكَ الَّذِیْنَ اُبْسِلُوْا بِمَا كَسَبُوْا ۚ— لَهُمْ شَرَابٌ مِّنْ حَمِیْمٍ وَّعَذَابٌ اَلِیْمٌ بِمَا كَانُوْا یَكْفُرُوْنَ ۟۠
మరియు తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా భావించేవారిని నీవు వదలిపెట్టు. మరియు ఇహలోక జీవితం వారిని మోసపుచ్చింది. ఏ వ్యక్తి గానీ తన కర్మల ఫలితంగా నాశనం చేయ బడకుండా ఉండటానికి దీని (ఈ ఖుర్ఆన్) ద్వారా హితోపదేశం చెయ్యి. అల్లాహ్ తప్ప, అతనికి రక్షించేవాడు గానీ సిఫారసు చేసేవాడు గానీ, ఎవ్వడూ ఉండడు. మరియు అతడు ఎలాంటి పరిహారం ఇవ్వదలచుకున్నా అది అంగీకరించబడదు. ఇలాంటి వారే తమ కర్మల ఫలితంగా నాశనం చేయబడేవారు. వారికి తమ సత్యతిరస్కారానికి ఫలితంగా, త్రాగటానికి సలసల కాగే నీరు మరియు బాధాకరమైన శిక్ష గలవు.
عربي تفسیرونه:
قُلْ اَنَدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُنَا وَلَا یَضُرُّنَا وَنُرَدُّ عَلٰۤی اَعْقَابِنَا بَعْدَ اِذْ هَدٰىنَا اللّٰهُ كَالَّذِی اسْتَهْوَتْهُ الشَّیٰطِیْنُ فِی الْاَرْضِ حَیْرَانَ ۪— لَهٗۤ اَصْحٰبٌ یَّدْعُوْنَهٗۤ اِلَی الْهُدَی ائْتِنَا ؕ— قُلْ اِنَّ هُدَی اللّٰهِ هُوَ الْهُدٰی ؕ— وَاُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
(ఓ ముహమ్మద్!) వారితో అను: "ఏమీ? అల్లాహ్ ను వదలి మాకు లాభం గానీ, నష్టం గానీ కలిగించ లేని వారిని మేము ప్రార్థించాలా? మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం దొరికిన తరువాత కూడా మా మడమలపై వెనుదిరిగి పోవాలా? అతని వలే ఎవడైతే తన సహచరులు సన్మార్గం వైపుకు పిలుస్తూ, 'మా వైపుకురా!' అంటున్నా - షైతాన్ మోసపుచ్చటం వలన - భూమిలో ఏమీ తోచకుండా, తిరుగుతాడో?"[1] వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ మార్గదర్శకత్వమే నిజమైన మార్గదర్శకత్వము[2]. మరియు మేము సర్వలోకాల ప్రభువుకు విధేయులముగా (ముస్లింలముగా) ఉండాలని ఆజ్ఞాపించబడ్డాము;
[1] చూడండి, 2:14, 14:22 మరియు 15:17. [2] చూడండి, 16:37.
عربي تفسیرونه:
وَاَنْ اَقِیْمُوا الصَّلٰوةَ وَاتَّقُوْهُ ؕ— وَهُوَ الَّذِیْۤ اِلَیْهِ تُحْشَرُوْنَ ۟
"మరియు నమాజ్ ను స్థాపించమని మరియి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని కూడా[1]. మరియు మీరంతా ఆయన (అల్లాహ్) సమక్షంలో జమ చేయబడతారు."
[1] చూడండి, 2:45.
عربي تفسیرونه:
وَهُوَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ بِالْحَقِّ ؕ— وَیَوْمَ یَقُوْلُ كُنْ فَیَكُوْنُ ؕ۬— قَوْلُهُ الْحَقُّ ؕ— وَلَهُ الْمُلْكُ یَوْمَ یُنْفَخُ فِی الصُّوْرِ ؕ— عٰلِمُ الْغَیْبِ وَالشَّهَادَةِ ؕ— وَهُوَ الْحَكِیْمُ الْخَبِیْرُ ۟
మరియు ఆకాశాలను మరియు భూమిని నిజానికి[1] సృష్టించింది ఆయనే! మరియు ఆ రోజు ఆయన: "అయిపో!" అని అనగానే, అది అయి పోతుంది. ఆయన మాటే సత్యం! మరియు బాకా (సూర్) ఊదబడే రోజు[2], సార్వభౌమాధికారం ఆయనదే. ఆయనే అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలిసినవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసిన వాడు.
[1] అంటే ఒక ఉద్దేశంతో. [2] 'హదీస్'లో ఇలా ఉంది: ఇస్రాఫీల్ ('అ.స.) కొమ్ము (బాకా)ను తన నోటిలో పెట్టుకొని, తలవంచి, దానిని ఊదటానికి అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ కొరకు పేచి ఉంటారు.(ఇబ్నె-కసీ'ర్, అబూ దావూద్, తిర్మిజీ', 'హదీస్' నం. 4742, 4030, 3244). 'నూరున్: Trumpet, బాకా, కొమ్ము, తుత్తార, శంఖం.
عربي تفسیرونه:
 
د معناګانو ژباړه سورت: انعام
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تلګوی ژباړه - عبد الرحیم بن محمد - د ژباړو فهرست (لړلیک)

د عبدالرحیم بن محمد لخوا ژباړل شوې.

بندول