Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تلګوی ژباړه - عبد الرحیم بن محمد * - د ژباړو فهرست (لړلیک)

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

د معناګانو ژباړه سورت: انعام   آیت:
وَهُوَ الَّذِیْ یَتَوَفّٰىكُمْ بِالَّیْلِ وَیَعْلَمُ مَا جَرَحْتُمْ بِالنَّهَارِ ثُمَّ یَبْعَثُكُمْ فِیْهِ لِیُقْضٰۤی اَجَلٌ مُّسَمًّی ۚ— ثُمَّ اِلَیْهِ مَرْجِعُكُمْ ثُمَّ یُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟۠
మరియు ఆయనే రాత్రివేళ (మీరు నిద్రపోయినపుడు) మీ ఆత్మలను తీసుకుంటాడు (స్వాధీనపరచు కుంటాడు)[1] మరియు పగటివేళ మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆ పిదప నిర్ణీత గడువు, పూర్తి అయ్యే వరకు దానిలో (పగటి వేళలో) మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆ తరువాత ఆయన వైపునకే మీ మరలింపు ఉంది. అప్పుడు (పునరుత్థాన దినమున) ఆయన మీరు చేస్తూ ఉన్న కర్మలన్నీ మీకు తెలుపుతాడు[2].
[1] చూడండి, 39:42. చావును గురించి అవతరింపజేయబడిన మొదటి ఆయత్. [2] చూడండి, 78:9-11.
عربي تفسیرونه:
وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهٖ وَیُرْسِلُ عَلَیْكُمْ حَفَظَةً ؕ— حَتّٰۤی اِذَا جَآءَ اَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا یُفَرِّطُوْنَ ۟
ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం)[1] గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు[2].
[1] చూడండి అల్ ఖాహిరు, 6:18. [2] చూడండి, 32:11లో ఒక మరణదైవదూత పేర్కొనబడ్డాడు. కానీ, ఈ ఆయత్ లో దైవదూతలు, అని ఉంది. ఇదే విధంగా 4:97 మరియు 6:93లలో కూడా దైవదూతలు, అని ఉంది. దీన వల్ల స్పష్టమయ్యేదేమిటంటే మరణింపజేసే దైవదూత ఒక్కడే, కాని ఇతరులు అతని సహాయకులు. ఆ మరణింపజేసే దైవదూత పేరు 'ఇ'జ్రాయీ'ల్. (ఇబ్నె-కసీ'ర్).
عربي تفسیرونه:
ثُمَّ رُدُّوْۤا اِلَی اللّٰهِ مَوْلٰىهُمُ الْحَقِّ ؕ— اَلَا لَهُ الْحُكْمُ ۫— وَهُوَ اَسْرَعُ الْحٰسِبِیْنَ ۟
తరువాత వారు, వారి నిజమైన[1] సంరక్షకుడు, అల్లాహ్ సన్నిధిలోకి చేర్చబడతారు. తెలుసుకోండి! సర్వ న్యాయాధికారం ఆయనదే! మరియు లెక్క తీసుకోవటంలో ఆయన అతి శీఘ్రుడు!
[1] అల్ - 'హాఖ్ఖ: The Truth, The Really Existing, whose existance and divinity are proved to be True. పరమ సత్యం, నిజం, యథార్థం, చూడండి, 2:119.
عربي تفسیرونه:
قُلْ مَنْ یُّنَجِّیْكُمْ مِّنْ ظُلُمٰتِ الْبَرِّ وَالْبَحْرِ تَدْعُوْنَهٗ تَضَرُّعًا وَّخُفْیَةً ۚ— لَىِٕنْ اَنْجٰىنَا مِنْ هٰذِهٖ لَنَكُوْنَنَّ مِنَ الشّٰكِرِیْنَ ۟
" 'మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేమెంతో కృతజ్ఞులమవుతాము.' అని మీరు వినమ్రులై రహస్యంగా వేడుకున్నప్పుడు! భూమి మరియు సముద్రాల చీకట్ల నుండి మిమ్మల్ని కాపాడేదెవరు? అని వారిని అడుగు.
عربي تفسیرونه:
قُلِ اللّٰهُ یُنَجِّیْكُمْ مِّنْهَا وَمِنْ كُلِّ كَرْبٍ ثُمَّ اَنْتُمْ تُشْرِكُوْنَ ۟
"అల్లాహ్ మాత్రమే మిమ్మల్ని దాని నుండి మరియు ప్రతి విపత్తు నుండి కాపాడుతున్నాడు. అయినా మీరు ఆయనకు సాటి (భాగస్వాములు) కల్పిస్తున్నారు!" అని వారికి చెప్పు.
عربي تفسیرونه:
قُلْ هُوَ الْقَادِرُ عَلٰۤی اَنْ یَّبْعَثَ عَلَیْكُمْ عَذَابًا مِّنْ فَوْقِكُمْ اَوْ مِنْ تَحْتِ اَرْجُلِكُمْ اَوْ یَلْبِسَكُمْ شِیَعًا وَّیُذِیْقَ بَعْضَكُمْ بَاْسَ بَعْضٍ ؕ— اُنْظُرْ كَیْفَ نُصَرِّفُ الْاٰیٰتِ لَعَلَّهُمْ یَفْقَهُوْنَ ۟
ఇలా అను: "ఆయన మీ పైనుండి గానీ, లేదా మీ పాదాల క్రింది నుండి గానీ, మీపై ఆపద అవతరింప జేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు; మరియు మిమ్మల్ని తెగలు తెగలుగా చేసి, పరస్పర కలహాల రుచి చూప గలిగే (శక్తి కూడా) కలిగి ఉన్నాడు."[1] చూడు! బహుశా వారు (సత్యాన్ని) గ్రహిస్తారోమోనని, మేము ఏ విధంగా మా సూచనలను వివిధ రూపాలలో వివరిస్తున్నామో!
[1] దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'నేను మూడు దువాలు చేశాను: 1) నా ఉమ్మనీటిలో ముంచబడి నాశనం చేయబడగూడదని, 2) కరువుకు గురి అయి నాశనం చేయబడగూడదని, 3) వారు పరస్పరం యుద్ధాలు చేసుకోనగూడదని. అల్లాహ్ (సు.తా.) మొదటి రెండు దుఆలు అంగీకరించాడు, కాని మూడవ దువా నుండి నన్ను ఆపాడు. ('స'హీ'హ్ ముస్లిం. 2216) ఇంకా చూడండి, 35:43.
عربي تفسیرونه:
وَكَذَّبَ بِهٖ قَوْمُكَ وَهُوَ الْحَقُّ ؕ— قُلْ لَّسْتُ عَلَیْكُمْ بِوَكِیْلٍ ۟ؕ
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) సత్యమైనది అయినా నీ జాతి వారు దీనిని అబద్ధమని నిరాకరించారు. వారితో ఇలా అను: "నేను మీ కొరకు బాధ్యుడను (కార్యసాధకుడను) కాను!"[1]
[1] అంటే అల్లాహ్ (సు.తా.) సందేశాన్ని మీకు యావత్తు అందజేయటమే నా పని. కాని మిమ్మల్ని దానిపై అమలు చేసేటట్లు చేయడం నా ('స'అస) పని కాదు. చూడండి, 18:29.
عربي تفسیرونه:
لِكُلِّ نَبَاٍ مُّسْتَقَرٌّ ؗ— وَّسَوْفَ تَعْلَمُوْنَ ۟
ప్రతి వార్తకు (విషయానికి) ఒక గడువు నియమింపబడి ఉంది. మరియు త్వరలోనే మీరిది తెలుసుకోగలరు.
عربي تفسیرونه:
وَاِذَا رَاَیْتَ الَّذِیْنَ یَخُوْضُوْنَ فِیْۤ اٰیٰتِنَا فَاَعْرِضْ عَنْهُمْ حَتّٰی یَخُوْضُوْا فِیْ حَدِیْثٍ غَیْرِهٖ ؕ— وَاِمَّا یُنْسِیَنَّكَ الشَّیْطٰنُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرٰی مَعَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
మరియు మా సూచన (ఆయాత్) లను గురించి వారు వృథా మాటలు (దూషణలు) చేస్తూ ఉండటం నీవు చూస్తే, వారు తమ ప్రసంగం మార్చే వరకు నీవు వారి నుండి దూరంగానే ఉండు. మరియు ఒకవేళ షైతాన్ నిన్ను మరపింపజేస్తే! జ్ఞప్తికి వచ్చిన తరువాత అలాంటి దుర్మార్గులైన వారితో కలసి కూర్చోకు[1].
[1] చూడండి, 4:140.
عربي تفسیرونه:
 
د معناګانو ژباړه سورت: انعام
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تلګوی ژباړه - عبد الرحیم بن محمد - د ژباړو فهرست (لړلیک)

د عبدالرحیم بن محمد لخوا ژباړل شوې.

بندول