Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Alhajj   Aya:
اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ سَخَّرَ لَكُمْ مَّا فِی الْاَرْضِ وَالْفُلْكَ تَجْرِیْ فِی الْبَحْرِ بِاَمْرِهٖ ؕ— وَیُمْسِكُ السَّمَآءَ اَنْ تَقَعَ عَلَی الْاَرْضِ اِلَّا بِاِذْنِهٖ ؕ— اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟
ఓ ప్రవక్తా మీరు చూడ లేదా అల్లాహ్ భూమిలో ఉన్న జంతువులను,స్థిర రాసులను మీ ప్రయోజనాల కొరకు,మీ అవసరాల కొరకు మీకు మరియుప్రజలకు ఆదీనంలో చేశాడు. మరియు ఆయన ఓడలను మీ ఆదీనంలో చేశాడు అవి సముద్రంలో ఆయన ఆదేశంతో,ఆయన వశపరచటంతో ఒక నగరము నుండి ఇంకొక నగరమునకు నడుస్తున్నాయి. మరియు ఆయన ఆకాశమును ఆయన ఆదేశముతో తప్ప భూమి పై పడకుండా ఉండటానికి ఆపి ఉంచాడు. ఒక వేళ ఆయన దానిని దానిపై పడమని ఆదేశిస్తే అది పడిపోతుంది. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రజల పట్ల కనికరించేవాడు,దయ చూపేవాడును. ఎందుకంటే వారిలో నుండి దుర్మార్గులు ఉన్నా కూడా వారి కొరకు ఆయన ఈ వస్తువులను వశపరచాడు.
Tafsiran larabci:
وَهُوَ الَّذِیْۤ اَحْیَاكُمْ ؗ— ثُمَّ یُمِیْتُكُمْ ثُمَّ یُحْیِیْكُمْ ؕ— اِنَّ الْاِنْسَانَ لَكَفُوْرٌ ۟
మరియు అల్లాహ్ ఆయనే మీరు ఉనికిలో లేకపోయినా తరువాత మిమ్మల్ని ఉనికిలోకి తీసుకుని వచ్చి మిమ్మల్ని జీవింపజేశాడు. ఆ తరువాత మీ వయస్సులు పూర్తయినప్పుడు ఆయన మీకు మరణాన్ని కలిగింపజేస్తాడు. ఆ తరువాత ఆయన మీ మరణము తరువాత మీ కర్మలపై మీ లెక్క తీసుకుని వాటిపరంగా ఆయన మీకు ప్రతిఫలమును ప్రసాదించటానికి ఆయన మిమ్మల్ని మరల జీవింపజేస్తాడు. నిశ్ఛయంగా మనిషి అల్లాహ్ అనుగ్రహముల పట్ల - అవి ప్రత్యక్షంగా ఉన్నా కూడా - ఆయనతోపాటు ఇతరలకు తన అరాధన ద్వారాఎక్కువగా కృతఘ్నతా వైఖరి కలవాడు.
Tafsiran larabci:
لِكُلِّ اُمَّةٍ جَعَلْنَا مَنْسَكًا هُمْ نَاسِكُوْهُ فَلَا یُنَازِعُنَّكَ فِی الْاَمْرِ وَادْعُ اِلٰی رَبِّكَ ؕ— اِنَّكَ لَعَلٰی هُدًی مُّسْتَقِیْمٍ ۟
ప్రతీ సమాజము వారికి మేము ఒక ధర్మ శాసనమును తయారు చేశాము. అయితే వారు తమ ధర్మ శాసనం ప్రకారంగా ఆచరిస్తున్నారు. ఓ ప్రవక్తా ముష్రికులు,ఇతర ధర్మాల వారు మీ ధర్మ విషయంలో ఖచ్చితంగా గొడవపడకూడదు. మీరు వారికంటే నీతిమంతులు. ఎందుకంటే వారు అసత్యపరులు. మరియు మీరు ప్రజలను ఏకత్వమును అల్లాహ్ కొరకు ప్రత్యేకించటం వైపునకు పిలవండి. నిశ్ఛయంగా మీరు మాత్రం ఎటువంటి వంకరతనంలేని సన్మార్గంపై ఉన్నారు.
Tafsiran larabci:
وَاِنْ جٰدَلُوْكَ فَقُلِ اللّٰهُ اَعْلَمُ بِمَا تَعْمَلُوْنَ ۟
మరియు వారు ఒక వేళ ఆధారం స్పష్టమైన తరువాత నీతో వాదులాటకు దిగితే నీవు వారిని హెచ్చెరిస్తూ ఇలా పలుకుతూ వారి వ్యవహారమును అల్లాహ్ కు అప్పజెప్పు : మీరు చేసే ఆచరణ గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
Tafsiran larabci:
اَللّٰهُ یَحْكُمُ بَیْنَكُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ ۟
అల్లాహ్ తన దాసుల మధ్య వారిలో నుండి విశ్వాసపరులైన,అవిశ్వాసపరులైన వారు ఇహలోకములో ధర్మ విషయంలో విభేదించుకున్న వాటి గురించి ప్రళయదినాన తీర్పునిస్తాడు.
Tafsiran larabci:
اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا فِی السَّمَآءِ وَالْاَرْضِ ؕ— اِنَّ ذٰلِكَ فِیْ كِتٰبٍ ؕ— اِنَّ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرٌ ۟
ఓ ప్రవక్తా ఆకాశములో ఉన్న వాటి గురించి,భూమిలో ఉన్నవాటి గురించి అల్లాహ్ కు తెలుసని,వాటిలో ఉన్నది ఏదీ ఆయనపై గోప్యంగా లేదని మీకు తెలియదా ?. నిశ్ఛయంగా ఆ జ్ఞానం లౌహె మహ్ఫూజ్ లో నమోదు చేయబడి ఉన్నది. నిశ్ఛయంగా వాటన్నింటి జ్ఞానము అల్లాహ్ పై సులభము.
Tafsiran larabci:
وَیَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَمْ یُنَزِّلْ بِهٖ سُلْطٰنًا وَّمَا لَیْسَ لَهُمْ بِهٖ عِلْمٌ ؕ— وَمَا لِلظّٰلِمِیْنَ مِنْ نَّصِیْرٍ ۟
మరియు ముష్రికులు అల్లాహ్ ను వదిలి కొన్ని విగ్రహాలను ఆరాధిస్తున్నారు. అల్లాహ్ వాటి ఆరాధన గురించి తన గ్రంధముల్లో ఎటువంటి ఆధారమును అవతరింపజేయలేదు. మరియు వారికి వాటిపై జ్ఞానపరంగా ఎటువంటి ఆధారం లేదు. వారి ఆధారం మాత్రం వారి తాత ముత్తాతలను గుడ్డిగా అనుకరించటం. మరియు దుర్మార్గుల కొరకు వారిపై అల్లాహ్ వద్ద నుండి కలిగే శిక్షను వారి నుండి ఆపే ఎటువంటి సహాయకుడూ ఉండడు.
Tafsiran larabci:
وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ تَعْرِفُ فِیْ وُجُوْهِ الَّذِیْنَ كَفَرُوا الْمُنْكَرَ ؕ— یَكَادُوْنَ یَسْطُوْنَ بِالَّذِیْنَ یَتْلُوْنَ عَلَیْهِمْ اٰیٰتِنَا ؕ— قُلْ اَفَاُنَبِّئُكُمْ بِشَرٍّ مِّنْ ذٰلِكُمْ ؕ— اَلنَّارُ ؕ— وَعَدَهَا اللّٰهُ الَّذِیْنَ كَفَرُوْا ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟۠
మరియు ఖుర్ఆన్ లోని స్పష్టమైన మా ఆయతులను వారిపై చదివి వినిపించబడినప్పుడు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారి ముఖముల్లో వాటిని వారు వినేటప్పుడు తమ నుదుట్లను చిట్లించి వాటిని తిరస్కరించటమును నీవు గుర్తిస్తావు. తీవ్ర కోపము వలన వారు మా ఆయతులను వారికి చదివి వినిపించిన వారిపై విరుచుకుపడతారేమో అన్నట్లు కనబడుతారు. ఓ ప్రవక్తా వారితో అనండి : ఏమీ నేను మీ కోపము కన్న,మీ నుదుట్లను చిట్లించటం కన్న చెడ్డదైన దాని గురించి మీకు తెలియపరచనా ?. అది ఆ నరకాగ్ని దేనిలోనైతే అల్లాహ్ అవిశ్వాసపరులకు వారిని అందులో ప్రవేశింపజేస్తానని వాగ్దానం చేశాడో. మరియు వారు చేరుకునే గమ్య స్థానం ఎంతో చెడ్డదైనది.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• من نعم الله على الناس تسخير ما في السماوات وما في الأرض لهم.
ప్రజలపై ఆకాశముల్లో ఉన్నవి,భూమిలో ఉన్నవి వారి ఆదీనంలో ఉండటం అల్లాహ్ అనుగ్రహాల్లోంచివి.

• إثبات صفتي الرأفة والرحمة لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు దయ,కనికరము రెండు లక్షణాల నిరూపణ.

• إحاطة علم الله بما في السماوات والأرض وما بينهما.
ఆకాశముల్లో ఉన్న వాటిని,భూమిలో ఉన్నవాటిని మరియు ఆ రెండింటి మధ్యలో ఉన్నవాటిని అల్లాహ్ జ్ఞానము పరిదిలో తీసుకోవటం.

• التقليد الأعمى هو سبب تمسك المشركين بشركهم بالله.
అంధ అనుకరణ ముష్రికులు అల్లాహ్ తో పాటు తమ సాటికల్పించటమునకు కట్టుబడి ఉండటానికి ఒక కారణం.

 
Fassarar Ma'anoni Sura: Alhajj
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa