Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Sura: Ibrahim   Aya:
وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهِ اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ اَنْجٰىكُمْ مِّنْ اٰلِ فِرْعَوْنَ یَسُوْمُوْنَكُمْ سُوْٓءَ الْعَذَابِ وَیُذَبِّحُوْنَ اَبْنَآءَكُمْ وَیَسْتَحْیُوْنَ نِسَآءَكُمْ ؕ— وَفِیْ ذٰلِكُمْ بَلَآءٌ مِّنْ رَّبِّكُمْ عَظِیْمٌ ۟۠
ఓ ప్రవక్తా మీరు మూసా తన ప్రభువు ఆదేశమును చేసి చూపించిన సమయమును గుర్తు చేసుకోండి. అప్పుడు ఆయన తన జాతి వారైన ఇస్రాయీలు సంతతి వారిని వారిపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేస్తూ ఇలా పలికారు : ఓ నా జాతివారా ఫిర్ఔన్ వంశీయుల నుండి మిమ్మల్ని అల్లాహ్ రక్షించినప్పటి మరియు ఫిర్ఔన్ రాజ్యమును ఏలే వారు మీలో ఎవరు జన్మించకూడదని మీ కుమారులను కోసివేసి మరియు మీ ఆడవాళ్ళను అవమానపరచటానికి,పరాభవమునకు లోను చేయటానికి జీవిత బంధీలుగా చేసి మీకు చెడ్డ శిక్ష రుచి చూపించినప్పుడు మిమ్మల్ని ఆయన వారి బాధల నుండి రక్షించినప్పటి మీపై కల అల్లాహ్ అనుగ్రహాలను మీరు గుర్తు చేసుకోండి. మరియు వారి ఈ చేష్టలలో మీ సహనమునకు పెద్ద పరీక్ష ఉన్నది. అప్పుడు అల్లాహ్ ఈ ఆపదపై మీ సహనమునకు మిమ్మల్ని ఫిర్ఔన్ వంశీయుల యొక్క బాధల నుండి విముక్తి కలిగించి మీకు ప్రతిఫలాన్ని ప్రసాధించాడు.
Tafsiran larabci:
وَاِذْ تَاَذَّنَ رَبُّكُمْ لَىِٕنْ شَكَرْتُمْ لَاَزِیْدَنَّكُمْ وَلَىِٕنْ كَفَرْتُمْ اِنَّ عَذَابِیْ لَشَدِیْدٌ ۟
మరియు మూసా వారితో ఇలా పలికారు : మీరు ఒకసారి మీ ప్రభువు మీకు అనర్గళంగా తెలియపరచినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : "ఒక వేళ మీరు మీకు అల్లాహ్ ప్రసాధించిన ఈ ప్రస్తావించబడిన ఈ అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటే ఆయన తప్పకుండా తన అనుగ్రహము నుండి మీకు దానికన్నా ఎక్కువగా ప్రసాధిస్తాడు. మరియు ఒక వేళ మీరు మీపై ఉన్న ఆయన అనుగ్రహాలను తిరస్కరించి,వాటిపై మీరు కృతజ్ఞతలు తెలపకపోతే నిశ్చయంగా ఆయన శిక్ష ఆయన అనుగ్రహాలను తిరస్కరించి,ఆయనకు కృతజ్ఞతలు తెలపని వారి కొరకు ఎంతో కఠినమైనది".
Tafsiran larabci:
وَقَالَ مُوْسٰۤی اِنْ تَكْفُرُوْۤا اَنْتُمْ وَمَنْ فِی الْاَرْضِ جَمِیْعًا ۙ— فَاِنَّ اللّٰهَ لَغَنِیٌّ حَمِیْدٌ ۟
మరియు మూసా తన జాతి వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా ఓక వేళ మీరు అవిశ్వాసమునకు పాల్పడి,మీతోపాటు భూమిపై ఉన్న వారందరు అవిశ్వాసమునకు పాల్పడితే అప్పుడు మీ అవిశ్వాసము యొక్క నష్టము మీపై మరలుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు,సర్వస్తోత్రాలకు ఆయన స్వయంగా అర్హుడు. విశ్వాసపరుల విశ్వాసము ఆయనకు ప్రయోజనం చేయదు మరియు అవిశ్వాసపరుల అవిశ్వాసము ఆయనకు నష్టం కలిగించదు.
Tafsiran larabci:
اَلَمْ یَاْتِكُمْ نَبَؤُا الَّذِیْنَ مِنْ قَبْلِكُمْ قَوْمِ نُوْحٍ وَّعَادٍ وَّثَمُوْدَ ۛؕ۬— وَالَّذِیْنَ مِنْ بَعْدِهِمْ ۛؕ— لَا یَعْلَمُهُمْ اِلَّا اللّٰهُ ؕ— جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ فَرَدُّوْۤا اَیْدِیَهُمْ فِیْۤ اَفْوَاهِهِمْ وَقَالُوْۤا اِنَّا كَفَرْنَا بِمَاۤ اُرْسِلْتُمْ بِهٖ وَاِنَّا لَفِیْ شَكٍّ مِّمَّا تَدْعُوْنَنَاۤ اِلَیْهِ مُرِیْبٍ ۟
ఓ అవిశ్వాసపరులారా ఏమి మీ పూర్వ జాతులైన నూహ్ జాతి,హూద్ జాతి అయిన ఆద్,సాలిహ్ జాతి అయిన సమూద్,మరియు వారి తరువాత వచ్చిన జాతుల వారు మరియు వారు ఎక్కువగా ఉన్నారు వారి లెక్క అల్లాహ్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు వారి వినాశనము సమాచారము మీకు చేరలేదా ?. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ఆధారాలను తీసుకుని వచ్చారు. వారు ప్రవక్తలపై కోపముతో తమ వేళ్ళను కొరుకుతూ తమ చేతులను తమ నోళ్ళపై పెట్టుకున్నారు. మరియు వారు తమ ప్రవక్తలతో ఇలా పలికారు : నిశ్చయంగా మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్కరించాము. మరియు నిశ్చయంగా మేము మీరు దేనివైపునైతే మమ్మల్ని పిలుస్తున్నారో దాని గురించి సందేహమును కలిగి ఉన్నాము.
Tafsiran larabci:
قَالَتْ رُسُلُهُمْ اَفِی اللّٰهِ شَكٌّ فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— یَدْعُوْكُمْ لِیَغْفِرَ لَكُمْ مِّنْ ذُنُوْبِكُمْ وَیُؤَخِّرَكُمْ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی ؕ— قَالُوْۤا اِنْ اَنْتُمْ اِلَّا بَشَرٌ مِّثْلُنَا ؕ— تُرِیْدُوْنَ اَنْ تَصُدُّوْنَا عَمَّا كَانَ یَعْبُدُ اٰبَآؤُنَا فَاْتُوْنَا بِسُلْطٰنٍ مُّبِیْنٍ ۟
వారి ప్రవక్తలు వారిని ఖండిస్తు వారితో ఇలా అన్నారు : ఏమి అల్లాహ్ ఏకత్వము విషయంలో ఆయన ఒక్కడికే ఆరాధనను చేయటము విషయంలో సందేహమా ?. వాస్తవానికి ఆకాశములను సృష్టించినవాడు,భూమిని సృష్టించినవాడు,ఆ రెండింటిని పూర్వ నమూనా లేకుండా ఏర్పరచినవాడు ఆయనే. ఆయన మీ పూర్వపు పాపములను మీ నుండి తుడిచివేయటానికి,మీ ఇహలోక జీవితములో మీ నిర్ణీత గడువులను మీరు పూర్తి చేసుకునే వరకు మీకు గడువు ఇవ్వటానికి, తనను విశ్వసించటానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు. వారి జాతులవారు వారితో ఇలా పలికారు : మీరు మాలాంటి మానవులు మాత్రమే. మాపై మీకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. మీరు మా తాతముత్తాతలు ఆరాధించే వాటి ఆరాధన చేయటం నుండి మమ్మల్ని మరల్చాలనుకుంటున్నారు. అయితే మీరు అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తలు అని మీరు చేస్తున్న వాదనలో మీ నిజాయితీని దృవీకరించే ఏదైన స్పష్టమైన ఆధారమును మీరు మా వద్దకు తీసుకుని రండి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• من وسائل الدعوة تذكير المدعوين بنعم الله تعالى عليهم، خاصة إن كان ذلك مرتبطًا بنعمة كبيرة، مثل نصر على عدوه أو نجاة منه.
సందేశమునకు అర్హులైన వారికి (మద్ఊ లకి) వారిపై ఉన్న మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేయటం సందేశ ప్రచార కారకాల్లో ఒకటి.ప్రత్యేకించి ఒక వేళ అది ఒక పెద్ద అనుగ్రహముతో ముడి ఉన్నా కూడా.ఉదాహరణకి అతని శతృవుకి విరుద్ధంగా సహాయం లేదా అతని నుండి విముక్తి.

• من فضل الله تعالى أنه وعد عباده مقابلة شكرهم بمزيد الإنعام، وفي المقابل فإن وعيده شديد لمن يكفر به.
మహోన్నతుడైన అల్లాహ్ తన దాసులకు వారి కృతజ్ఞతలకు బదులుగా ఎక్కువ అనుగ్రహిస్తాడన్న వాగ్ధానము చేయటం అల్లాహ్ అనుగ్రహములోంచిది. దానికి విరుధ్ధంగా దాన్ని కృతఝ్నులయ్యే వారికి ఆయన హెచ్చరిక తీవ్రమైనది.

• كفر العباد لا يضر اللهَ البتة، كما أن إيمانهم لا يضيف له شيئًا، فهو غني حميد بذاته.
దాసుల అవిశ్వాసము ఖచ్చితంగా అల్లాహ్ కు నష్టం చేయదు. అలాగే వారి విశ్వాసము ఆయనకు ఏమి అధికం చేయదు. ఆయన స్వయం సమృద్ధుడు,సర్వస్తోత్రాలకు అర్హుడు.

 
Fassarar Ma'anoni Sura: Ibrahim
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa