Check out the new design

Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Index of Translations


Translation of the Meanings Surah: At-Teen   Verse:

అత్-తీన్

Objectives of the Surah:
امتنان الله على الإنسان باستقامة فطرته وخلقته، وكمال الرسالة الخاتمة.
మానవునిపై అతని స్వభావము,అతని సృష్టి సమగ్రత ద్వారా మరియు అంతిమ దైవదౌత్య పరిపూర్ణత ద్వారా అల్లాహ్ ఉపకారము

وَالتِّیْنِ وَالزَّیْتُوْنِ ۟ۙ
అల్లాహ్ అంజూరం పై మరియు అది మొలచే ప్రదేశము పై మరియు జైతూన్ (ఆలివ్) పై మరియు ఈసా అలైహిస్సలాం ప్రవక్తగా పంపించబడ్డ ఫలస్తీన్ లోని భూమిలో అది మొలచే ప్రదేశంపై ప్రమాణం చేశాడు.
Arabic Tafsirs:
وَطُوْرِ سِیْنِیْنَ ۟ۙ
మరియు ఆయన తన ప్రవక్త మూసా అలైహిస్సలాంతో సంభాషించిన ప్రాంతమైన సీనాయ్ పర్వతంపై ప్రమాణం చేశాడు.
Arabic Tafsirs:
وَهٰذَا الْبَلَدِ الْاَمِیْنِ ۟ۙ
మరియు పవిత్ర పట్టణం మక్కాపై ప్రమాణం చేశాడు. అందులో ప్రవేశించే వారికి శాంతి కలుగును మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా అందులో పంపించబడ్డారు.
Arabic Tafsirs:
لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ فِیْۤ اَحْسَنِ تَقْوِیْمٍ ۟ؗ
నిశ్చయంగా మేము మానవుడిని ఉత్తమ సృష్టిలో మరియు ఉత్తమ రూపంలో ఉనికిలోకి తెచ్చాము.
Arabic Tafsirs:
ثُمَّ رَدَدْنٰهُ اَسْفَلَ سٰفِلِیْنَ ۟ۙ
ఆ పిదప మేము అతనిని ఇహలోకంలో వృద్దాప్యము వైపునకు మరియు ముసలి తనం వైపునకు మరల్చాము కావున అతను తన శరీరముతో ప్రయోజనం చెందడు ఏ విధంగానైతే అతడు తన స్వభావమును పాడు చేసుకుని నరకాగ్నిలోకి పోతే దానితో ప్రయోజనం చెందడో.
Arabic Tafsirs:
اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَلَهُمْ اَجْرٌ غَیْرُ مَمْنُوْنٍ ۟ؕ
కాని అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేసిన వారు ఒక వేళ వారు వృద్దాప్యమునకు చేరుకున్నా వారి కొరకు అంతం కాని శాశ్వత ప్రతిఫలం కలదు. అది స్వర్గము. ఎందుకంటే వారు తమ స్వభావమును శుద్ధపరుచుకున్నారు.
Arabic Tafsirs:
فَمَا یُكَذِّبُكَ بَعْدُ بِالدِّیْنِ ۟ؕ
ఓ మానవుడా ఆయన అధిక సామర్ధ్య సూచనలను కళ్ళారా చూసిన తరువాత కూడా నిన్ను ఏ విషయం ప్రతిఫల దినమును తిరస్కరించటం పై పురిగొల్పుతుంది ?!
Arabic Tafsirs:
اَلَیْسَ اللّٰهُ بِاَحْكَمِ الْحٰكِمِیْنَ ۟۠
ఏమీ అల్లాహ్ ప్రళయదినమును ప్రతిఫలదినంగా చేసి తీర్పునిచ్చేవారిలో నుంచి ఉత్తమ తీర్పునిచ్చేవాడు మరియు వారిలో నుండి ఉత్తమంగా న్యాయపూరితంగా వ్యవహరించేవాడు కాడా ?! ఏమీ అల్లాహ్ ఉపకారము చేసినవాడికి అతని ఉపకారము యోక్క ప్రతిఫలం,మరియు దుష్కర్మకు పాల్పడినవాడికి అతని దుష్కర్మ ప్రతిఫలం ప్రసాదించడానికి తన దాసుల మధ్య తీర్పునివ్వకుండా వారిని వృధాగా వదిలేస్తాడని అతడు అనుకుంటున్నాడా ?!
Arabic Tafsirs:
Benefits of the Verses on this page:
• رضا الله هو المقصد الأسمى.
తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కీర్తిని ఉన్నతం చేసి అల్లాహ్ యొక్క సత్కారము

• أهمية القراءة والكتابة في الإسلام.
అల్లాహ్ మన్నతే అంతిమ ఉద్దేశం

• خطر الغنى إذا جرّ إلى الكبر والبُعد عن الحق.
ఇస్లాంలో చదవటమునకు మరియు వ్రాయటమునకు ఉన్న ప్రాముఖ్యత

• النهي عن المعروف صفة من صفات الكفر.
నిరపేక్షత అహంకారము వైపునకు మరియు సత్యం నుండి దూరం అవటం వైపునకు లాగినప్పుడు దాని ప్రమాదం

• إكرام الله تعالى نبيه صلى الله عليه وسلم بأن رفع له ذكره.
మంచి నుండి నిరోధించటం అవిశ్వాస లక్షణాల్లోంచి ఒక లక్షణం.

 
Translation of the Meanings Surah: At-Teen
Index of Surahs Page Number
 
Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Index of Translations

Issued by Tafsir Center for Quranic Studies

Close