Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Jumu‘ah   Ayah:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا نُوْدِیَ لِلصَّلٰوةِ مِنْ یَّوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا اِلٰی ذِكْرِ اللّٰهِ وَذَرُوا الْبَیْعَ ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా జుమా రోజున ప్రసంగం చేసే వారు మెంబరుపై ఎక్కిన తరువాత అజాన్ ఇచ్చే వారు పిలుపు ఇచ్చినప్పుడు మీరు ఖుత్బాకి,నమాజుకు హాజరు కావటం కొరకు త్వరపడండి. మరియు మీరు విధేయత చూపటం నుండి అశ్రద్ధవహించకుండా ఉండటానికి వ్యాపారమును వదిలివేయండి. జుమా నమాజు కొరకు అజాన్ ఇవ్వబడిన తరువాత పరుగెత్తి రావటం, వ్యాపారమును వదిలివేయటం లాంటి ఆదేశించబడినవి ఇవి మీకు ఎంతో మేలైనది - ఓ విశ్వాసపరులారా - ఒక వేళ మీకు అది తెలిసి ఉంటే మీరు అల్లాహ్ మీకు ఆదేశించిన వాటిని చేసి చూపించండి.
Arabic explanations of the Qur’an:
فَاِذَا قُضِیَتِ الصَّلٰوةُ فَانْتَشِرُوْا فِی الْاَرْضِ وَابْتَغُوْا مِنْ فَضْلِ اللّٰهِ وَاذْكُرُوا اللّٰهَ كَثِیْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
మీరు జుమా నమాజును పూర్తి చేసినప్పుడు హలాల్ సంపాదనను,మీ అవసరాలను పూర్తి చేసుకోవటమును అన్వేషిస్తూ భూమిలో విస్తరించిపోండి. మరియు హలాల్ సంపాదన మార్గము నుండి మరియు హలాల్ ప్రయోజనం నుండి అల్లాహ్ అనుగ్రహమును ఆశించండి. మరియు మీరు ఆహారోపాధిని మీరు అన్వేషిస్తున్న సమయంలో అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి. ఆహారోపాధిని మీ అన్వేషించటం మిమ్మల్ని అల్లాహ్ స్మరణను మరపింపజేయకూడదు. మీరు ఇష్టపడే వాటి ద్వారా విజయమును ఆశిస్తూ మరియు మీరు భయపడే వాటి నుండి విముక్తి పొందుతూ.
Arabic explanations of the Qur’an:
وَاِذَا رَاَوْا تِجَارَةً اَوْ لَهْوَا ١نْفَضُّوْۤا اِلَیْهَا وَتَرَكُوْكَ قَآىِٕمًا ؕ— قُلْ مَا عِنْدَ اللّٰهِ خَیْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ ؕ— وَاللّٰهُ خَیْرُ الرّٰزِقِیْنَ ۟۠
మరియు కొంత మంది ముస్లిములు ఏదైన వ్యాపారమును లేదా వినోదమును చూసినప్పుడు దాని వైపునకు బయలుదేరి వేరైపోయేవారు. మరియు ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని మెంబరుపై నిలబడి ఉండగా వదిలేసేవారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా తెలపండి : సత్కార్యము చేయటంపై అల్లాహ్ వద్ద ఉన్న ప్రతిఫలము మీరు బయలుదేరి వెళ్ళిన వ్యాపారము,వినోదము కన్న ఎంతో మేలైనది. మరియు అల్లాహ్ జీవనోపాధి ప్రసాదించటంలో అత్యుత్తముడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• وجوب السعي إلى الجمعة بعد النداء وحرمة ما سواه من الدنيا إلا لعذر.
అజాన్ ప్రకటన తరువాత జుమా వైపునకు త్వరపడటం తప్పనిసరి మరియు ఎటువంటి కారణం లేకుండా అది కాకుండా వేరేవి నిషిద్ధము.

• تخصيص سورة للمنافقين فيه تنبيه على خطورتهم وخفاء أمرهم.
కపటుల కొరకు ఒక సూరాను ప్రత్యేకించటం అందులో వారి ప్రమాదము,వారి వ్యవహారము దాగి ఉండటంపై అప్రమత్తం చేయటం.

• العبرة بصلاح الباطن لا بجمال الظاهر ولا حسن المنطق.
గుణపాఠం అన్నది అంతర్గతము యొక్క సంస్కరణలో ఉంటుంది బాహ్య అందములో గాని మంచిగా మాట్లాడటంలో గాని ఉండదు.

 
Translation of the meanings Surah: Al-Jumu‘ah
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close