Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Hadīd   Ayah:
لَقَدْ اَرْسَلْنَا رُسُلَنَا بِالْبَیِّنٰتِ وَاَنْزَلْنَا مَعَهُمُ الْكِتٰبَ وَالْمِیْزَانَ لِیَقُوْمَ النَّاسُ بِالْقِسْطِ ۚ— وَاَنْزَلْنَا الْحَدِیْدَ فِیْهِ بَاْسٌ شَدِیْدٌ وَّمَنَافِعُ لِلنَّاسِ وَلِیَعْلَمَ اللّٰهُ مَنْ یَّنْصُرُهٗ وَرُسُلَهٗ بِالْغَیْبِ ؕ— اِنَّ اللّٰهَ قَوِیٌّ عَزِیْزٌ ۟۠
నిశ్ఛయంగా మేము మా ప్రవక్తలను స్పష్టమైన వాదనలను మరియు స్పష్టమైన ఆధారాలను ఇచ్చి పంపించాము. మరియు మేము ధృడమైన శక్తి కల ఇనుమును దింపాము. దాని నుండి ఆయుధాలు తయారు చేయబడుతాయి. మరియు అందులో ప్రజల కొరకు వారి పరిశ్రమల్లో మరియు వారి చేతి వృత్తుల్లో ప్రయోజనములు కలవు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి ఎవరు తనను చూడకుండానే తనకు ఎవరు సహాయపడుతారో దాసులకు బహిర్గతమవటం తెలుసుకోవటానికి. నిశ్ఛయంగా అల్లాహ్ ఏదీ ఆధిక్యత చూపని బలశాలి సర్వాధిక్యుడు. మరియు ఆయన దేని నుండి అశక్తుడు కాడు.
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ اَرْسَلْنَا نُوْحًا وَّاِبْرٰهِیْمَ وَجَعَلْنَا فِیْ ذُرِّیَّتِهِمَا النُّبُوَّةَ وَالْكِتٰبَ فَمِنْهُمْ مُّهْتَدٍ ۚ— وَكَثِیْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ ۟
మరియు నిశ్ఛయంగా మేము నూహ్ మరియు ఇబ్రాహీం అలైహిమస్సలాంలను ప్రవక్తలుగా పంపించాము. మరియు వారిరువురి సంతానములో దైవ దౌత్యమును మరియు అవతరించబడిన గ్రంధములను చేశాము. వారి సంతానములో సన్మార్గమును పొందే భాగ్యం ప్రాసాదించబడినవారున్నారు. మరియు వారిలో చాలామంది అల్లాహ్ విధేయత నుండి వైదొలగినవారున్నారు.
Arabic explanations of the Qur’an:
ثُمَّ قَفَّیْنَا عَلٰۤی اٰثَارِهِمْ بِرُسُلِنَا وَقَفَّیْنَا بِعِیْسَی ابْنِ مَرْیَمَ وَاٰتَیْنٰهُ الْاِنْجِیْلَ ۙ۬— وَجَعَلْنَا فِیْ قُلُوْبِ الَّذِیْنَ اتَّبَعُوْهُ رَاْفَةً وَّرَحْمَةً ؕ— وَرَهْبَانِیَّةَ ١بْتَدَعُوْهَا مَا كَتَبْنٰهَا عَلَیْهِمْ اِلَّا ابْتِغَآءَ رِضْوَانِ اللّٰهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَایَتِهَا ۚ— فَاٰتَیْنَا الَّذِیْنَ اٰمَنُوْا مِنْهُمْ اَجْرَهُمْ ۚ— وَكَثِیْرٌ مِّنْهُمْ فٰسِقُوْنَ ۟
ఆ తరువాత మేము మా ప్రవక్తలను ఒకరి తరువాత ఒకరిని పంపించాము. మేము వారిని వారి సమాజాల వద్దకు క్రమక్రమంగా పంపాము. మరియు మేము వారి వెనుక మర్యమ్ కుమారుడగు ఈసాను పంపాము. మరియు ఆయనకు మేము ఇంజీలును ప్రసాదించాము. మరియు మేము ఆయనను విశ్వసించి ఆయనను అనుసరించిన వారి హృదయములలో దయను,కరుణను కలిగించాము. అయితే వారు పరస్పరం ప్రేమించుకునే వారు మరియు దయ చూపుకునేవారు. మరియు వారు తమ ధర్మ విషయంలో అతిక్రమించటమును ఆరంభించారు. అప్పుడు వారు అల్లాహ్ వారికి ధర్మ సమ్మతం చేసిన నికాహ్,రుచి కరమైన వస్తువులను కొన్నింటిని వదిలివేశారు. మరియు మేము దాన్ని వారి నుండి కోరలేదు. వారు దాన్ని స్వయంగా తమపై తప్పనిసరి చేసుకున్నారు ; ధర్మంలో వారి తరపు నుండి కొత్తపొకడగా. కాని మేము మాత్రం అల్లాహ్ కు ఇష్టమైన వాటిని కోరాము వారు చేయలేదు. మేము వారిలోంచి విశ్వసించిన వారిని వారి ప్రతిఫలమును ప్రసాదించాము. వారిలో నుండి చాలా మంది ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించి అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయినారు.
Arabic explanations of the Qur’an:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَاٰمِنُوْا بِرَسُوْلِهٖ یُؤْتِكُمْ كِفْلَیْنِ مِنْ رَّحْمَتِهٖ وَیَجْعَلْ لَّكُمْ نُوْرًا تَمْشُوْنَ بِهٖ وَیَغْفِرْ لَكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟ۙ
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై మీ విశ్వాసము మరియు పూర్వ ప్రవక్తలపై మీ విశ్వాసము వలన మీకు రెండు భాగములు పుణ్యము,ప్రతిఫలము ప్రసాదిస్తాడు. మరియు మీకు ఒక వెలుగును ప్రసాదిస్తాడు దాని ద్వారా మీరు మీ ఇహలోక జీవితంలో మార్గం పొందుతారు మరియు ప్రళయదినమును సిరాత్ వంతెన పై వెలుగును పొందుతారు. మరియు ఆయన మీ కొరకు మీ పాపములను మన్నించి వాటిపై పరదా కప్పివేస్తాడు. మరియు మిమ్మల్ని వాటి పరంగా శిక్షించడు. పరిశుద్ధుడైన అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిపై అపారంగా కరుణించేవాడును.
Arabic explanations of the Qur’an:
لِّئَلَّا یَعْلَمَ اَهْلُ الْكِتٰبِ اَلَّا یَقْدِرُوْنَ عَلٰی شَیْءٍ مِّنْ فَضْلِ اللّٰهِ وَاَنَّ الْفَضْلَ بِیَدِ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟۠
ఓ విశ్వాసపరులారా మేము మీ కొరకు సిద్ధం చేసి ఉంచిన మా గొప్ప అనుగ్రహమైన రెట్టింపు పుణ్యమును మేము మీకు స్పష్టపరిచాము. యూదులు,క్రైస్తవుల్లోంచి గ్రంధవహులు అల్లాహ్ అనుగ్రహములోంచి వారు తాము కోరుకున్న వారికి ప్రసాదించటానికి మరియు తాము కోరుకున్న వారి నుండి ఆపటానికి దేని సామర్ధ్యము వారికి లేదని తెలుసుకోవటానికి. మరియు అనుగ్రహము అల్లాహ్ చేతిలో ఉన్నదని ఆయన తన దాసుల్లోంచి తలచిన వారికి దాన్ని ప్రసాదిస్తాడని వారు తెలుసుకోవటానికి. అల్లాహ్ గొప్ప అనుగ్రహము కలవాడు దాన్ని తన దాసుల్లోంచి తాను కోరుకున్న వారికి ప్రత్యేకిస్తాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• الحق لا بد له من قوة تحميه وتنشره.
సత్యాన్ని సంరక్షించటానికి మరియు దాన్ని వ్యాపింపజేయటానికి ఒక శక్తి ఉండాలి.

• بيان مكانة العدل في الشرائع السماوية.
దివ్య శాసనముల్లో న్యాయము యొక్క స్థాన ప్రకటన.

• صلة النسب بأهل الإيمان والصلاح لا تُغْنِي شيئًا عن الإنسان ما لم يكن هو مؤمنًا.
విశ్వాసపరులతో,సజ్జనులతో బంధుత్వము కలిగి ఉండటం మనిషికి అతను విశ్వాసపరుడు కానంతవరకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు.

• بيان تحريم الابتداع في الدين.
ధర్మంలో కొత్తపోకడల నిషిద్ధత ప్రకటన.

 
Translation of the meanings Surah: Al-Hadīd
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close