Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Qamar   Ayah:
وَمَاۤ اَمْرُنَاۤ اِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ ۟
మేము ఏదైన తలచుకుంటే ఈ ఒక మాట పలకటం మాత్రమే మా ఆదేశము : కున్ (నీవు అయిపో) అంతే మేము తలచుకున్నది కను రెప్ప వాల్చే విధంగా త్వరగా అయిపోతుంది.
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ اَهْلَكْنَاۤ اَشْیَاعَكُمْ فَهَلْ مِنْ مُّدَّكِرٍ ۟
మరియు నిశ్చయంగా మేము పూర్వ సమాజముల్లోంచి అవిశ్వాసములో మీ లాంటి వారిని నాశనం చేశాము. ఏమీ దీని ద్వారా గుణపాఠం నేర్చుకుని తన అవిశ్వాసమును విడనాడే గుణపాఠం నేర్చుకునేవాడు ఎవడైన ఉన్నాడా ?!
Arabic explanations of the Qur’an:
وَكُلُّ شَیْءٍ فَعَلُوْهُ فِی الزُّبُرِ ۟
దాసులు చేసిన ప్రతీది పరిరక్షింపబడిన పుస్తకములలో వ్రాయబడి ఉంది. అందులో నుంచి ఏదీ వారి నుండి తప్పిపోదు.
Arabic explanations of the Qur’an:
وَكُلُّ صَغِیْرٍ وَّكَبِیْرٍ مُّسْتَطَرٌ ۟
కర్మల్లోంచి మరియు మాటల్లోంచి ప్రతీ చిన్నది మరియు వాటిలో నుండి పెద్దది కర్మల పుస్తకముల్లో మరియు లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడి ఉంది. మరియు వారు తొందరలోనే దాని పరంగా ప్రతిఫలం ప్రసాదించబడుతారు.
Arabic explanations of the Qur’an:
اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّنَهَرٍ ۟ۙ
నిశ్చయంగా తమ ప్రభువుకు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడే వారు స్వర్గ వనముల్లో మరియు ప్రవహించే సెలయేరుల్లో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు.
Arabic explanations of the Qur’an:
فِیْ مَقْعَدِ صِدْقٍ عِنْدَ مَلِیْكٍ مُّقْتَدِرٍ ۟۠
అబద్ధం లేదా పాపం లేని సత్యం యొక్క మండలిలో.ప్రతీది అధికారం కలిగి ఉన్న ఒక రాజు వద్ద, దేని నుండి అశక్తుడు కాని సర్వాధిక్యుడి వద్ద, కాబట్టి శాశ్వత అనుగ్రహాల్లో నుండి వారు అతని నుండి ఏమి పొందారో అడగవద్దు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• كتابة الأعمال صغيرها وكبيرها في صحائف الأعمال.
కర్మలు అవి చిన్నవైన,పెద్దవైన కర్మల పుస్తకములలో వ్రాయబడి ఉండటం.

• ابتداء الرحمن بذكر نعمه بالقرآن دلالة على شرف القرآن وعظم منته على الخلق به.
అనంత కరుణామయుడు తన అనుగ్రహాలను ప్రస్తావిస్తూ ఖుర్ఆన్ ను ఆరంభించటం ఖుర్ఆన్ గోప్పతనంపై మరియు దాని ద్వారా సృష్టిపై అయన ఉపకార గొప్పతనం పై సూచన ఉన్నది.

• مكانة العدل في الإسلام.
ఇస్లాంలో న్యాయమునకు స్థానం ఏమిటో తెలిసింది.

• نعم الله تقتضي منا العرفان بها وشكرها، لا التكذيب بها وكفرها.
అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మన నుండి వాటిని గుర్తించటమును మరియు వాటి విషయంలో కృతజ్ఞత తెలుపుకోవటమును ఆశిస్తున్నవి. వాటి పట్ల తిరస్కారమును,కృతఘ్నతను కాదు.

 
Translation of the meanings Surah: Al-Qamar
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close