Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Al-Ahqāf   Ayah:

అల్-అహ్ఖాఫ్

Purposes of the Surah:
بيان حاجة البشريّة للرسالة وإنذار المعرضين عنها.
సందేశం కోసం మానవాళి యొక్క అవసరాన్ని తెలియజేయడం మరియు దాని నుండి విముఖత చూపినవారిని హెచ్చరించడం.

حٰمٓ ۟ۚ
హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
Arabic explanations of the Qur’an:
تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْحَكِیْمِ ۟
ఖుర్ఆన్ అవతరణ ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడైన,తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడైన అల్లాహ్ వద్ద నుండి జరిగింది.
Arabic explanations of the Qur’an:
مَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَاَجَلٍ مُّسَمًّی ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا عَمَّاۤ اُنْذِرُوْا مُعْرِضُوْنَ ۟
ఆకాశములను,భూమిని మరియు ఆ రెండింటిలో ఉన్న వాటన్నింటిని మేము వృధాగా సృష్టించలేదు. అంతే కాదు మేము వాటన్నింటిని సత్యముతో సంపూర్ణ విజ్ఞతలతో సృష్టించాము. దాసులు వాటి ద్వారా ఆయనను (అల్లాహ్ ను) గుర్తించి ఆయన ఒక్కడి ఆరాధన చేయటం మరియు ఆయనతో పాటు దేనిని సాటి కల్పించకపోవటం వాటిలో నుండే. మరియు వారు అల్లాహ్ ఒక్కడికి తెలిసిన ఒక నిర్ణీత కాలం వరకు భూమిలో వారికి ప్రాతినిధ్యమును చేకూర్చేవాటిని వారు నెలకొల్పాలి. మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారు అల్లాహ్ గ్రంధములో వారికి హెచ్చరించబడిన వాటి నుండి విముఖత చూపుతున్నారు. వాటిని లెక్కచేయటం లేదు.
Arabic explanations of the Qur’an:
قُلْ اَرَءَیْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اَرُوْنِیْ مَاذَا خَلَقُوْا مِنَ الْاَرْضِ اَمْ لَهُمْ شِرْكٌ فِی السَّمٰوٰتِ ؕ— اِیْتُوْنِیْ بِكِتٰبٍ مِّنْ قَبْلِ هٰذَاۤ اَوْ اَثٰرَةٍ مِّنْ عِلْمٍ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు సత్యము నుండి విముఖత చూపే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ విగ్రహాల గురించి నాకు తెలపండి వారు భూమి యొక్క భాగములలో నుండి ఏమి సృష్టించారు ?. వారు ఏదైన పర్వతమును సృష్టించారా ?. ఏదైన కాలువను సృష్టించారా ?. లేదా ఆకాశములను సృష్టించటంలో అల్లాహ్ తో పాటు వారికి ఏదైన భాగము,వాటా ఉన్నదా ?. ఖుర్ఆన్ కన్న ముందు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఏదైన గ్రంధమును లేదా మీ పూర్వికులు వదిలి వెళ్ళిన దానిలో నుండి మిగిలిన ఏదైన జ్ఞానమును నా వద్దకు తీసుకుని రండి ఒక వేళ మీ విగ్రహాలు ఆరాధనకు అర్హులని మీరు చేస్తున్న వాదనలో మీరు సత్యవంతులేనైతే.
Arabic explanations of the Qur’an:
وَمَنْ اَضَلُّ مِمَّنْ یَّدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَنْ لَّا یَسْتَجِیْبُ لَهٗۤ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ وَهُمْ عَنْ دُعَآىِٕهِمْ غٰفِلُوْنَ ۟
మరియు అల్లాహ్ ను వదిలి ప్రళయదినం వరకు తన దుఆని స్వీకరించని ఒక విగ్రహమును ఆరాధించే వాడి కన్న పెద్ద మార్గభ్రష్టుడెవడూ ఉండడు. మరియు వారు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఈ విగ్రహాలు తమను ఆరాధించే దాసుల దుఆ నుండి నిర్లక్ష్యంలో పడి ఉన్నారు. వారు వారికి ప్రయోజనం కలిగించటం లేదు నష్టం కలిగించటం దూర విషయం.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• الاستهزاء بآيات الله كفر.
అల్లాహ్ ఆయతులపట్ల హేళన చేయటం అవిశ్వాసమవుతుంది.

• خطر الاغترار بلذات الدنيا وشهواتها.
ప్రాపంచిక రుచులతో మరియు దాని కోరికలతో మోసపోవటం యొక్క ప్రమాదం

• ثبوت صفة الكبرياء لله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు పెద్దరికం (అల్ కిబ్రియాఉ) గుణము నిరూపణ.

• إجابة الدعاء من أظهر أدلة وجود الله سبحانه وتعالى واستحقاقه العبادة.
దుఆ స్వీకరించబడటం పరిశుద్ధుడైన అల్లాహ్ ఉనికికి,ఆరాధనకు ఆయన యోగ్యుడవటానికి ప్రత్యక్ష ఆధారాల్లోంచిది.

 
Translation of the meanings Surah: Al-Ahqāf
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close