Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Surah: Ad-Dukhān   Ayah:
وَّاَنْ لَّا تَعْلُوْا عَلَی اللّٰهِ ؕ— اِنِّیْۤ اٰتِیْكُمْ بِسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۚ
మరియు మీరు అల్లాహ్ ముందు ఆయన ఆరాధన చేయటంను వదిలి మరియు ఆయన దాసులపై ఆధిక్యతను చూపి గర్వపడకండి. నిశ్చయంగా నేను మీ వద్దకు స్పష్టమైన వాదనను తీసుకుని వచ్చాను.
Arabic explanations of the Qur’an:
وَاِنِّیْ عُذْتُ بِرَبِّیْ وَرَبِّكُمْ اَنْ تَرْجُمُوْنِ ۟ۚ
మరియు నిశ్చయంగా మీరు నన్ను రాళ్ళతో కొట్టి చంపటం నుండి నేను నా ప్రభువు,మీ ప్రభువు యొక్క రక్షణను పొందాను.
Arabic explanations of the Qur’an:
وَاِنْ لَّمْ تُؤْمِنُوْا لِیْ فَاعْتَزِلُوْنِ ۟
మరియు ఒక వేళ మీరు నేను తీసుకుని వచ్చిన దాన్ని నమ్మకపోతే మీరు నా నుండి వేరైపోండి. మరియు దుర ఉద్దేశంతో మీరు నాకు దగ్గరవకండి.
Arabic explanations of the Qur’an:
فَدَعَا رَبَّهٗۤ اَنَّ هٰۤؤُلَآءِ قَوْمٌ مُّجْرِمُوْنَ ۟
అప్పుడు మూసా అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా వేడుకున్నారు : ఈ జాతి వారందరు - ఫిర్ఔన్,అతని సభాప్రముఖులు - శీఘ్ర శిక్షకు అర్హులైన అపరాద జనులు.
Arabic explanations of the Qur’an:
فَاَسْرِ بِعِبَادِیْ لَیْلًا اِنَّكُمْ مُّتَّبَعُوْنَ ۟ۙ
అప్పుడు అల్లాహ్ మూసాను తన జాతి వారిని తీసుకుని రాత్రివేళ బయలుదేరమని ఆదేశించాడు. మరియు ఫిర్ఔన్,అతని జాతి వారు వారిని వెంబడిస్తారని ఆయనకు సమాచారమిచ్చాడు.
Arabic explanations of the Qur’an:
وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ؕ— اِنَّهُمْ جُنْدٌ مُّغْرَقُوْنَ ۟
మరియు అతను మరియు బనూ ఇస్రాయీలు సముద్రమును దాటినప్పుడు దాన్ని ఏవిధంగా ఉన్నదో అలాగే వదిలివేయమని ఆయన అతనికి ఆదేశమిచ్చాడు. నిశ్ఛయంగా ఫిర్ఔన్ మరియు అతని సైన్యం సముద్రంలో మునిగి నాశనమవుతారు.
Arabic explanations of the Qur’an:
كَمْ تَرَكُوْا مِنْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۙ
ఫిర్ఔన్ మరియు అతని జాతివారు ఎన్నో తోటలను,ప్రవహించే చెలమలను తమ వెనుక వదిలివేశారు.
Arabic explanations of the Qur’an:
وَّزُرُوْعٍ وَّمَقَامٍ كَرِیْمٍ ۟ۙ
మరియు వారు ఎన్నో పంటపొలాలను,మంచి కూర్చునే ప్రదేశములను తమ వెనుక వదిలివెళ్ళారు.
Arabic explanations of the Qur’an:
وَّنَعْمَةٍ كَانُوْا فِیْهَا فٰكِهِیْنَ ۟ۙ
మరియు వారు తాము అనుభవించిన ఎంతో జీవితము తమ వెనుక వదిలి వెళ్ళారు.
Arabic explanations of the Qur’an:
كَذٰلِكَ ۫— وَاَوْرَثْنٰهَا قَوْمًا اٰخَرِیْنَ ۟
మీకు తెలిపినట్లే వారికి ఇలాగే జరిగింది. మరియు మేము వారి తోటలకు,వారి చెలమలకు,వారి పంటపొలాలకు,వారి నివాసములకు వేరే జాతి వారైన ఇస్రాయీల్ సంతతి వారిని వారసులుగా చేశాము.
Arabic explanations of the Qur’an:
فَمَا بَكَتْ عَلَیْهِمُ السَّمَآءُ وَالْاَرْضُ وَمَا كَانُوْا مُنْظَرِیْنَ ۟۠
అయితే ఫిర్ఔన్ మరియు అతని జాతివారిపై వారు మునిగిపోయినప్పుడు ఆకాశము,భూమి ఏడవలేదు. మరియు వారు పశ్ఛాత్తాప్పడటానికి వారికి గడువు ఇవ్వబడలేదు.
Arabic explanations of the Qur’an:
وَلَقَدْ نَجَّیْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ مِنَ الْعَذَابِ الْمُهِیْنِ ۟ۙ
మరియు నిశ్చయంగా మేము ఇస్రాయీల్ సంతతివారిని అవమానకరమైన శిక్ష నుండి రక్షించాము. ఎందుకంటే ఫిర్ఔన్ మరియు అతని జాతివారు వారి కుమారులను హతమార్చి,వారి ఆడవారిని జీవించి ఉండేట్లుగా వదిలివేసేవారు.
Arabic explanations of the Qur’an:
مِنْ فِرْعَوْنَ ؕ— اِنَّهٗ كَانَ عَالِیًا مِّنَ الْمُسْرِفِیْنَ ۟
మేము వారిని ఫిర్ఔన్ శిక్ష నుండి రక్షించాము. నిశ్చయంగా అతడు అల్లాహ్ ఆదేశములను,ఆయన ధర్మమును అతిక్రమించే వారిలో నుండి అహంకారి అయిపోయాడు.
Arabic explanations of the Qur’an:
وَلَقَدِ اخْتَرْنٰهُمْ عَلٰی عِلْمٍ عَلَی الْعٰلَمِیْنَ ۟ۚ
మరియు నిశ్చయంగా మేము ఇస్రాయీల్ సంతతివారిని మా జ్ఞానముతో వారి ప్రవక్తలు అధికమవటం వలన వారి కాలపు లోకవాసులపై ఎన్నుకున్నాము.
Arabic explanations of the Qur’an:
وَاٰتَیْنٰهُمْ مِّنَ الْاٰیٰتِ مَا فِیْهِ بَلٰٓؤٌا مُّبِیْنٌ ۟
మరియు మేము వారికి మన్న మరియు సల్వా మొదలగు వాటి లాంటి సూచనలను,ఆధారాలను వేటి ద్వారానైతే మేము మూసా అలైహిస్సలాంనకు మద్దతునిచ్చామో,వేటిలోనైతే వారి కొరకు స్పష్టమైన అనుగ్రహం ఉన్నదో ప్రసాదించాము.
Arabic explanations of the Qur’an:
اِنَّ هٰۤؤُلَآءِ لَیَقُوْلُوْنَ ۟ۙ
నిశ్ఛయంగా తిరస్కారులైన ముష్రికులు మరణాంతరం లేపబడటమును తిరస్కరిస్తూ తప్పకుండా ఇలా పలుకుతారు :
Arabic explanations of the Qur’an:
اِنْ هِیَ اِلَّا مَوْتَتُنَا الْاُوْلٰی وَمَا نَحْنُ بِمُنْشَرِیْنَ ۟
మాకు మా ఈ మొదటి మరణం మాత్రమే ఉన్నది. దాని తరువాత ఎటువంటి జీవితం లేదు. మరియు ఈ మరణం తరువాత మేము మరల లేపబడేవారిలోంచి కాము.
Arabic explanations of the Qur’an:
فَاْتُوْا بِاٰبَآىِٕنَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
అయితే ఓ ముహమ్మద్ నీవు మరియు నీతో పాటు ఉండి నిన్ను అనుసరించేవారు మరణించిన మా తాతముత్తాతలను జీవింపజేసి తీసుకుని రండి ఒక వేళ లెక్క తీసుకును ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అల్లాహ్ మృతులను జీవింపజేసి మరల లేపుతాడన్న మీరు వాదించే విషయంలో మీరు సత్యవంతులేనైతే.
Arabic explanations of the Qur’an:
اَهُمْ خَیْرٌ اَمْ قَوْمُ تُبَّعٍ ۙ— وَّالَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— اَهْلَكْنٰهُمْ ؗ— اِنَّهُمْ كَانُوْا مُجْرِمِیْنَ ۟
ఓ ప్రవక్తా బలములో,ప్రతిఘటించటంలో మిమ్మల్ని తిరస్కరించిన ఈ ముష్రికులందరు ఉత్తములా లేదా తుబ్బఅ జాతివారా,ఆద్ సమూద్ లాంటి వారికన్న ముందు ఉన్న వారా. మేము వారందరిని నాశనం చేశాము. నిశ్చయంగా వారు అపరాధులు.
Arabic explanations of the Qur’an:
وَمَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا لٰعِبِیْنَ ۟
మరియు మేము ఆకాశములను,భూమిని మరియు ఆ రెండిటిలో ఉన్న వాటిని ఆటగా సృష్టించలేదు.
Arabic explanations of the Qur’an:
مَا خَلَقْنٰهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
మరియు మేము భూమ్యాకాశములను అత్యంత విజ్ఞతతో సృష్టించాము. కాని చాలామంది ముష్రికులకు ఇది తెలియదు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• وجوب لجوء المؤمن إلى ربه أن يحفظه من كيد عدوّه.
విశ్వాసపరుడు తన ప్రభువు వైపునకు తనను తన శత్రువుడి వ్యూహము నుండి రక్షించమని ఆశ్రయించటం తప్పనిసరి.

• مشروعية الدعاء على الكفار عندما لا يستجيبون للدعوة، وعندما يحاربون أهلها.
అవిశ్వాసపరులు పిలుపును అంగీకరించనప్పుడు మరియు వారు సందేశమును చేరవేసే వారితో పోరాడుతున్నప్పుడు వారిపై శాపనార్ధాలు పెట్టే చట్టబద్ధత.

• الكون لا يحزن لموت الكافر لهوانه على الله.
అల్లాహ్ ను అగౌరవానికి గురి చేసినందుకు విశ్వము అవిశ్వాసి మరణానికి సంతాపం చెందదు.

• خلق السماوات والأرض لحكمة بالغة يجهلها الملحدون.
ఆకాశముల మరియు భూమి సృష్టి అత్యంత విజ్ఞతతో కూడుకుని ఉన్నది. నాస్తికులకు అది తెలియదు.

 
Translation of the meanings Surah: Ad-Dukhān
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close