Check out the new design

Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Translations’ Index


Translation of the meanings Ayah: (61) Surah: An-Noor
لَیْسَ عَلَی الْاَعْمٰی حَرَجٌ وَّلَا عَلَی الْاَعْرَجِ حَرَجٌ وَّلَا عَلَی الْمَرِیْضِ حَرَجٌ وَّلَا عَلٰۤی اَنْفُسِكُمْ اَنْ تَاْكُلُوْا مِنْ بُیُوْتِكُمْ اَوْ بُیُوْتِ اٰبَآىِٕكُمْ اَوْ بُیُوْتِ اُمَّهٰتِكُمْ اَوْ بُیُوْتِ اِخْوَانِكُمْ اَوْ بُیُوْتِ اَخَوٰتِكُمْ اَوْ بُیُوْتِ اَعْمَامِكُمْ اَوْ بُیُوْتِ عَمّٰتِكُمْ اَوْ بُیُوْتِ اَخْوَالِكُمْ اَوْ بُیُوْتِ خٰلٰتِكُمْ اَوْ مَا مَلَكْتُمْ مَّفَاتِحَهٗۤ اَوْ صَدِیْقِكُمْ ؕ— لَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ اَنْ تَاْكُلُوْا جَمِیْعًا اَوْ اَشْتَاتًا ؕ— فَاِذَا دَخَلْتُمْ بُیُوْتًا فَسَلِّمُوْا عَلٰۤی اَنْفُسِكُمْ تَحِیَّةً مِّنْ عِنْدِ اللّٰهِ مُبٰرَكَةً طَیِّبَةً ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ لَعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟۠
తన దృష్టిని కోల్పోయిన అంధునిపై ఎటువంటి పాపం లేదు,కుంటివానిపై ఎటువంటి పాపం లేదు, రోగిపై ఎటువంటి పాపం లేదు ఒక వేళ వారు అల్లాహ్ మార్గంలో పోరాడటం లాంటి బాధ్యతలను నెరవేర్చే శక్తి లేని వాటిని వదిలివేస్తే (వారిపై ఎటువంటి పాపం లేదు). ఓ విశ్వాసపరులారా మీరు మీ ఇండ్ల నుండి తినటంలో,మీ పిల్లల ఇండ్ల నుండి గాని ,మీ తండ్రుల లేదా మీ తల్లుల లేదా మీ సోదరుల లేదా మీ సోదరిల లేదా మీ బాబాయిల లేదా మీ మేనత్తల లేదా మీ మేనమామల లేదా మీ పిన్నుల లేదా తోటమాలి లాంటి మీరు పరిరక్షణ కొరకు బాధ్యత వహిస్తున్న ఇండ్ల నుండిగాని తినటంలో ఎటువంటి పాపం లేదు. మీ స్నేహితుని ఇండ్ల నుండి అతని మంచి మనస్సు వలన దానికి అలవాటు ఉంటే తినటంలో ఎటువంటి పాపం లేదు. మరియు మీరు ఒక వేళ కలిసి తిన్నా లేదా ఒంటరిగా తిన్నా మీపై ఎటువంటి పాపం లేదు. ప్రస్తావించబడిన ఇండ్ల లాంటి ఇండ్లలో,ఇతరవాటిలో మీరు ప్రవేశించినప్పుడు వాటిలో ఉన్నవారిపై మీరు అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక) అని పలుకుతూ సలాం చేయండి. ఒక వేళ వాటిలో ఎవరూ లేకపోతే మీరు అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ (మా పై,అల్లాహ్ పుణ్య దాసులపై శాంతి కలుగు గాక) అని పలుకుతూ సలాం చేయండి. ఇది అల్లాహ్ తరపు నుండి సలాం దాన్ని ఆయన మీ కొరకు శుభదాయకంగా ధర్మబద్దం చేశాడు. మీరు మీ మధ్య ప్రేమను,సాన్నిహిత్యమును వ్యాపింపజేయటానికి. పరిశుద్ధమైనది. దాన్ని వినే వాడి మనస్సు పరిశుద్ధమవుతుంది. సూరాలో ముందల ఈ ప్రస్తావించినట్లే మీరు వాటిని అర్ధం చేసుకుని వాటిలో ఉన్న దాన్ని మీరు చేస్తారని ఆశిస్తూ అల్లాహ్ ఆయతులను స్ఫష్టపరుస్తున్నాడు.
Arabic explanations of the Qur’an:
Benefits of the verses in this page:
• جواز وضع العجائز بعض ثيابهنّ لانتفاء الريبة من ذلك.
వృద్ధ స్తీలు తమ కొన్ని వస్త్రములను దాని గురించి సందేహం లేకపోవటం వలన తీసి వేయటం సమ్మతము.

• الاحتياط في الدين شأن المتقين.
ధర్మ విషయంలో జాగ్రత్తగా ఉండటం దైవభీతి కలవారి లక్షణం.

• الأعذار سبب في تخفيف التكليف.
ప్రతికూలమైన హేతువులు బాధ్యతలను సులభం చేసే విషయంలో ఒక కారణం.

• المجتمع المسلم مجتمع التكافل والتآزر والتآخي.
ముస్లిం సమాజం సంఘీభావం,సహాయం,సౌభ్రాతృత్వం కలిగిన సమాజం.

 
Translation of the meanings Ayah: (61) Surah: An-Noor
Surahs’ Index Page Number
 
Translation of the Meanings of the Noble Qur'an - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Translations’ Index

Issued by Tafsir Center for Quranic Studies

close