Check out the new design

Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran * - Index of Translations


Translation of the Meanings Verse: (143) Surah: Al-Baqarah
وَكَذٰلِكَ جَعَلْنٰكُمْ اُمَّةً وَّسَطًا لِّتَكُوْنُوْا شُهَدَآءَ عَلَی النَّاسِ وَیَكُوْنَ الرَّسُوْلُ عَلَیْكُمْ شَهِیْدًا ؕ— وَمَا جَعَلْنَا الْقِبْلَةَ الَّتِیْ كُنْتَ عَلَیْهَاۤ اِلَّا لِنَعْلَمَ مَنْ یَّتَّبِعُ الرَّسُوْلَ مِمَّنْ یَّنْقَلِبُ عَلٰی عَقِبَیْهِ ؕ— وَاِنْ كَانَتْ لَكَبِیْرَةً اِلَّا عَلَی الَّذِیْنَ هَدَی اللّٰهُ ؕ— وَمَا كَانَ اللّٰهُ لِیُضِیْعَ اِیْمَانَكُمْ ؕ— اِنَّ اللّٰهَ بِالنَّاسِ لَرَءُوْفٌ رَّحِیْمٌ ۟
మీ కొరకు మేము ఇష్టపడిన ఖిబ్లాను చేసినట్లే విశ్వాసాలలో,ఆరాధనలలో,వ్యవహారాలలో సమాజాలందరి మధ్య ఉత్తమమైన,న్యాయశీలమైన,మధ్యస్థ సమాజంగ మిమ్మల్ని చేశాము.ప్రళయదినాన అల్లాహ్ యొక్క ప్రవక్తల కొరకు వారు అల్లాహ్ ఆదేశాలను తమ సమాజాల వారి కొరకు చేరవేశారని మీరు సాక్షులవ్వటం కొరకు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఏ ఆదేశాలను ఇవ్వబడి మీ వద్దకు ప్రవక్తగా పంపించబడ్డారో వాటన్నింటిని ఆయన మీకు చేర వేశారని మీ పై సాక్షిగా అవ్వటం కొరకు.మీరు దేని వైపునైతే అభిముఖమయ్యేవారో ఆ బైతుల్ మఖ్దిస్ను ఖిబ్లా నుంచి మార్చాము దాని పై ఉన్న ప్రతిఫలమును తెలుసుకోవటం కొరకు.ఎవరైతే అల్లాహ్ శాసనాలను అంగీకరిస్తాడో,వాటికి కట్టుబడి ఉంటాడో అతడు ప్రవక్త ను అనుసరిస్తాడు.ఎవరైతే అతని (అల్లాహ్) ధర్మం నుంచి మరలి పోతాడో తన మనోవాంఛనలకు లోనవుతాడో అతడు అల్లాహ్ శాసనాలకు కట్టుబడి ఉండడు.అల్లాహ్ తన పై విశ్వాసము యొక్క,తన దాసుల కొరకు ఏవైతే శాసనాలను శాసించాడో లోతైన జ్ఞానము వలన అన్న నమ్మకము యొక్క సౌభాగ్యము కలిగించాడో వారికి తప్ప ఇతరులకు మొదటి సారి ఖిబ్లా మార్పు విషయం భారంగా అనిపించింది.అల్లాహ్ పై ఉన్న మీ విశ్వాసమును ఆయన (అల్లాహ్) వృధా చేయడు,వాటి లోంచి ఖిబ్లా మార్పు కన్న ముందు మీరు చేసుకున్న నమాజులు కూడాను,నిశ్చయముగా అల్లాహ్ ప్రజల పై వాత్సల్యము,కరుణను కలవాడు,అయితే అతడు ప్రజల పై భారాన్ని వేయడు,వారి ఆచరణల ప్రతి ఫలాన్ని వృదా చేయడు.
Arabic Tafsirs:
Benefits of the Verses on this page:
• أن الاعتراض على أحكام الله وشرعه والتغافل عن مقاصدها دليل على السَّفَه وقلَّة العقل.
అల్లాహ్ ఆదేశాలు,ఆయనశాసనాల పట్ల వ్యతిరేకత వాటి లక్ష్యాల పట్ల నిర్లక్ష్యం బుద్దిలేమి తనము, తెలివి తక్కువ తనమునకు ఆధారము.

• فضلُ هذه الأمة وشرفها، حيث أثنى عليها الله ووصفها بالوسطية بين سائر الأمم.
ఎప్పుడైతే అల్లాహ్ ఈజాతిని (ఉమ్మతే ముహమ్మదియా) పొగడటం,జాతులందరిలో న్యాయపూరిత జాతిగా వర్ణించడం జరిగిందో దానికి గౌరవం,గొప్పతనము లభించింది.

• التحذير من متابعة أهل الكتاب في أهوائهم؛ لأنهم أعرضوا عن الحق بعد معرفته.
గ్రంధవహుల కోరికలను అనుసరించడం గురించి హెచ్చరించడం జరిగింది,ఎందుకంటే వారు వాస్తవమును తెలుసుకున్న తరువాత దాని పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు.

• جواز نَسْخِ الأحكام الشرعية في الإسلام زمن نزول الوحي، حيث نُسِخَ التوجه إلى بيت المقدس، وصار إلى المسجد الحرام.
దైవవాణి అవతరణ కాలంలో ఇస్లాంలో ధర్మ ఆదేశాలను రద్దు పరచడం సరైనదే,అలాగే బైతుల్ మఖ్దిస్ వైపు నుంచి ఖిబ్లా రద్దు పరచబడి మస్జిదే హరాం వైపునకు మారి పోయినది.

 
Translation of the Meanings Verse: (143) Surah: Al-Baqarah
Index of Surahs Page Number
 
Translation of the Meanings of the Noble Quran - Telugu translation of Al-Mukhtsar in interpretation of the Noble Quran - Index of Translations

Issued by Tafsir Center for Quranic Studies

Close