Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. * - Sadržaj prijevodā


Prijevod značenja Sura: El-Maida   Ajet:
حُرِّمَتْ عَلَیْكُمُ الْمَیْتَةُ وَالدَّمُ وَلَحْمُ الْخِنْزِیْرِ وَمَاۤ اُهِلَّ لِغَیْرِ اللّٰهِ بِهٖ وَالْمُنْخَنِقَةُ وَالْمَوْقُوْذَةُ وَالْمُتَرَدِّیَةُ وَالنَّطِیْحَةُ وَمَاۤ اَكَلَ السَّبُعُ اِلَّا مَا ذَكَّیْتُمْ ۫— وَمَا ذُبِحَ عَلَی النُّصُبِ وَاَنْ تَسْتَقْسِمُوْا بِالْاَزْلَامِ ؕ— ذٰلِكُمْ فِسْقٌ ؕ— اَلْیَوْمَ یَىِٕسَ الَّذِیْنَ كَفَرُوْا مِنْ دِیْنِكُمْ فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِ ؕ— اَلْیَوْمَ اَكْمَلْتُ لَكُمْ دِیْنَكُمْ وَاَتْمَمْتُ عَلَیْكُمْ نِعْمَتِیْ وَرَضِیْتُ لَكُمُ الْاِسْلَامَ دِیْنًا ؕ— فَمَنِ اضْطُرَّ فِیْ مَخْمَصَةٍ غَیْرَ مُتَجَانِفٍ لِّاِثْمٍ ۙ— فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
జుబాహ్ (హలాల్) చేయకుండానే మరణించిన జంతువును అల్లాహ్ మీపై నిషేధించాడు. మరియు ప్రవహించే రక్తమును,పంది మాంసమును,జుబాహ్ చేసే సమయమున అల్లాహ్ నామము కాకుండా ఇతరుల నామం తీసుకోబడిన దాన్ని, పీక పిసికటం వలన చనిపోయిన జంతువును,దెబ్బ తగలటం వలన మరియు పై నుండి పడిపోవటం వలన చనిపోయిన జంతువును మరియు వేరే జంతువు కొమ్ము పొడవటంతో చనిపోయిన జంతువును మరియు పులి,చిరుత,తోడేలు లాంటి మృగాలు చీల్చేసిన జంతువును అల్లాహ్ మీపై నిషేధించాడు. కాని ప్రస్తావించబడిన వాటిలో నుండి మీరు జీవించి ఉన్నప్పుడు పొంది వాటిని జుబాహ్ (హలాల్) చేస్తే అది మీ కొరకు ధర్మ సమ్మతము. విగ్రహాల కొరకు జుబాహ్ చేయబడిన దాన్ని ఆయన మీపై నిషేధించాడు. బాణాల ద్వారా మీరు అగోచరమైన మీ అదృష్టాన్ని కోరటమును ఆయన మీపై నిషేధించాడు. అవి రాళ్ళు లేదా బాణాలు ఉండి వాటిపై నీవు చేయి, నీవు చేయకు అని వ్రాయబడి ఉంటుంది. వాటిలో నుండి తన కొరకు ఏది వస్తే అది చేసేవారు. ఈ ప్రస్తావించబడిన నిషిద్ధితాలకు పాల్పడటం అల్లాహ్ విధేయత నుండి వైదొలగటమే. ఈ రోజు అవిశ్వాసపరులు మీరు ఇస్లాం ధర్మము నుండి - ఎప్పుడైతే వారు దాని బలాన్ని చూశారో - నిరాశ్యులైపోయారు. కావున మీరు వారితో భయపడకండి. నా ఒక్కడితోనే భయపడండి. ఈ రోజు నేను మీ కొరకు మీ ధర్మము అయిన ఇస్లాంను పరిపూర్ణం చేశాను. మరియు నేను మీపై బాహ్యగతమైన మరియు అంతర్గతమైన నా అనుగ్రహమును పూర్తి చేశాను. మరియు మీ కొరకు ధర్మముగా నేను ఇస్లాంను ఎంచుకున్నాను. కావున నేను అది కాకుండా వేరేవాటిని స్వీకరించను. కాని ఎవరైన కరువు వలన గత్యంతరం లేక పాపము వైపునకు వాలకుండామృత జంతువు నుండి తింటే అటువంటప్పుడు అతనిపై ఏ పాపము లేదు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడును,కరుణించేవాడును.
Tefsiri na arapskom jeziku:
یَسْـَٔلُوْنَكَ مَاذَاۤ اُحِلَّ لَهُمْ ؕ— قُلْ اُحِلَّ لَكُمُ الطَّیِّبٰتُ ۙ— وَمَا عَلَّمْتُمْ مِّنَ الْجَوَارِحِ مُكَلِّبِیْنَ تُعَلِّمُوْنَهُنَّ مِمَّا عَلَّمَكُمُ اللّٰهُ ؗ— فَكُلُوْا مِمَّاۤ اَمْسَكْنَ عَلَیْكُمْ وَاذْكُرُوا اسْمَ اللّٰهِ عَلَیْهِ ۪— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ سَرِیْعُ الْحِسَابِ ۟
ఓ ప్రవక్తా మీ అనుచరులు వారి కొరకు అల్లాహ్ ఏది తినటమును సమ్మతించాడు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియపరచండి : అల్లాహ్ తినేవాటిలో నుంచి పరిశుద్ధమైన వాటిని మీ కొరకు ధర్మసమ్మతం చేశాడు. మరియు శిక్షణ ఇవ్వబడిన కొర పళ్ళు కల కుక్కలు,చిరుతల్లాంటివి మరియు వంకర గోళ్ళు కల డేగల్లాంటివి వేటాడిన వాటిని తినటం. మీరు వాటికి అల్లాహ్ మీకు అనుగ్రహించిన వాటి శిక్షణ పద్దతుల ద్వారా వాటికి వేటాడే శిక్షణను ఇస్తారు. చివరికి అవి తమకు ఇవ్వబడిన ఆదేశమునకు కట్టుబడి ఉంటాయి మరియు వాటిని వారించినప్పుడు అవి ఆగి పోతాయి. అవి పట్టుకొచ్చిన వేటాడిన వాటిని మీరు తినండి ఒక వేళ అవి వాటిని చంపి వేసినా సరే. వాటిని (వేటకు) వదిలేటప్పుడు అల్లాహ్ పేరు ఉచ్చరించండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ కర్మల లెక్కను త్వరగా తీసుకుంటాడు.
Tefsiri na arapskom jeziku:
اَلْیَوْمَ اُحِلَّ لَكُمُ الطَّیِّبٰتُ ؕ— وَطَعَامُ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ حِلٌّ لَّكُمْ ۪— وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ ؗ— وَالْمُحْصَنٰتُ مِنَ الْمُؤْمِنٰتِ وَالْمُحْصَنٰتُ مِنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ اِذَاۤ اٰتَیْتُمُوْهُنَّ اُجُوْرَهُنَّ مُحْصِنِیْنَ غَیْرَ مُسٰفِحِیْنَ وَلَا مُتَّخِذِیْۤ اَخْدَانٍ ؕ— وَمَنْ یَّكْفُرْ بِالْاِیْمَانِ فَقَدْ حَبِطَ عَمَلُهٗ ؗ— وَهُوَ فِی الْاٰخِرَةِ مِنَ الْخٰسِرِیْنَ ۟۠
ఈ రోజు అల్లాహ్ పరిశుద్ధమైన వాటిని తినటమును మరియు గ్రంధవహులైన యూదులు మరియు క్రైస్తవులు జుబాహ్ చేసిన వాటిని తినటమును మీ కొరకు సమ్మతం చేశాడు. మరియు ఆయన విశ్వాసపర స్త్రీలలోంచి స్వతంత్రులైన సౌశీలురైన స్త్రీలతో మరియు మీకన్నపూర్వం గ్రంధం ఇవ్వబడిన యూదుల,క్రైస్తవుల స్వతంత్రులైన సౌశీలురైన స్త్రీలతో మీరు వారికి వారి మహర్ ఇచ్చినప్పుడు నికాహ్ చేసుకోవటమును సమ్మతించాడు. మరియు మీరు వారితో వ్యభిచారమునకు పాల్పడునట్లు చేసే ప్రేమకలాపాలకు పాల్పడకుండా అశ్లీల కార్యములకు పాల్పడటం నుండి దూరంగా ఉండేవారై ఉండాలి. మరియు ఎవరైతే అల్లాహ్ తన దాసుల కొరకు ధర్మబద్ధం చేసిన ఆదేశములను తిరస్కరిస్తాడో అతడి కర్మ దాని షరతు అయిన విశ్వాసం లేకపోవటం వలన నిర్వార్యమైపోతుంది. మరియు అతడు ప్రళయదినమున నరకములో శాశ్వతంగా ఉండేటట్లుగా ప్రవేశించటం వలన నష్టం చవిచూసే వారిలో నుంచి అయిపోతాడు.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• تحريم ما مات دون ذكاة، والدم المسفوح، ولحم الخنزير، وما ذُكِرَ عليه اسْمٌ غير اسم الله عند الذبح، وكل ميت خنقًا، أو ضربًا، أو بسقوط من علو، أو نطحًا، أو افتراسًا من وحش، ويُستثنى من ذلك ما أُدرِكَ حيًّا وذُكّيَ بذبح شرعي.
జిబాహ్ చేయకుండానే సహజ మరణం పొందిన జంతువు మరియు పంది మాంసము మరియు జిబాహ్ చేసేటప్పుడు అల్లాహేతరుల పేరు ప్రస్తావించబడిన జంతువు మరియు పీక పిసికటం వలన లేదా దెబ్బ తగలటం వలన లేదా పై నుండి పడిపోవటం వలన లేదా పొడుచుకోవటం వలన కృూర మృగములచే చీల్చబడిన జంతువులన్నీ నిషిద్ధము. మరియు జీవించి ఉండి ధర్మ పద్దతిలో జిబాహ్ చేసి హలాల్ చేయబడిన జంతువు దీని నుండి మినహాయించబడినది.

• حِلُّ ما صاد كل مدرَّبٍ ذي ناب أو ذي مخلب.
కొర పళ్ళు గల లేదా వంకర గోళ్ళు గల ప్రతీ శిక్షణ ఇవ్వబడిన జంతువు వేటాడిన జంతువు సమ్మతము.

• إباحة ذبائح أهل الكتاب، وإباحة نكاح حرائرهم من العفيفات.
గ్రంధవహులచే జిబాహ్ చేయబడినవి సమ్మతం కావటం మరియు వారి స్వేచ్ఛాపరులైన సౌశీల్య స్త్రీలతో నికాహ్ సమ్మతం కావటం.

 
Prijevod značenja Sura: El-Maida
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. - Sadržaj prijevodā

Izdavač: centar za kur'anske studije "Tefsir".

Zatvaranje