Check out the new design

আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ * - অনুবাদসমূহৰ সূচীপত্ৰ


অৰ্থানুবাদ ছুৰা: ফাতিৰ   আয়াত:
وَمَا یَسْتَوِی الْبَحْرٰنِ ۖۗ— هٰذَا عَذْبٌ فُرَاتٌ سَآىِٕغٌ شَرَابُهٗ وَهٰذَا مِلْحٌ اُجَاجٌ ؕ— وَمِنْ كُلٍّ تَاْكُلُوْنَ لَحْمًا طَرِیًّا وَّتَسْتَخْرِجُوْنَ حِلْیَةً تَلْبَسُوْنَهَا ۚ— وَتَرَی الْفُلْكَ فِیْهِ مَوَاخِرَ لِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَلَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
మరియు రెండు సముద్రాలు సమానం కాజాలవు : అందులో ఒకటి చాలా తియ్యదైనది. దాని తియ్యదనం వలన దాన్ని త్రాగటం సులభమైనది. మరియు రెండవది ఉప్పగా,చేదుగా ఉన్నదైనది దాని అధిక ఉప్పదనం వలన దాన్ని త్రాగటం సాధ్యం కాదు. ప్రస్తావించబడిన రెండు సముద్రముల్లోంచి ప్రతీ ఒక్కటి నుండి మీరు తాజా మాంసమును తింటున్నారు అది చేపలు. ఆ రెండింటి నుండి మీరు ముత్యములను,పగడములను వెలికితీస్తున్నారు. వాటిని మీరు అలంకరణగా తొడుగుతున్నారు. ఓ వీక్షించేవాడా నీవు ఓడలను చూస్తావు అవి తమ పయనముతో మీరు వ్యాపారము ద్వారా అల్లాహ్ అనుగ్రహమును అన్వేషించటానికి వస్తూ,పోతుండగా సముద్రమును చీల్చుతున్నాయి. మరియు బహుశా మీరు అల్లాహ్ కి ఆయన మీకు ప్రసాదించిన తన చాలా అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకుంటారని.
আৰবী তাফছীৰসমূহ:
یُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَیُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ ۙ— وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ۖؗ— كُلٌّ یَّجْرِیْ لِاَجَلٍ مُّسَمًّی ؕ— ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ؕ— وَالَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِهٖ مَا یَمْلِكُوْنَ مِنْ قِطْمِیْرٍ ۟ؕ
అల్లాహ్ రాత్రిని పగలులో ప్రవేశింపజేసి దాన్ని పొడుగుగా అధికం చేస్తున్నాడు. మరియు పగలును రాత్రిలో ప్రవేశింపజేసి పొడుగుగా అధికం చేస్తున్నాడు. మరియు పరిశుద్ధుడైన ఆయన సూర్యుడిని నిబద్ధుడిగా చేశాడు మరియు చంద్రుడిని నిబద్ధుడిగా చేశాడు. వాటిలో నుండి ప్రతి ఒక్కటి అల్లాహ్ కు తెలిసిన ఒక నిర్ణీత సమయంలో పయనిస్తున్నాయి. అది ప్రళయదినము. వాటిలో ప్రతీ ఒక్కటిని నిర్ణయించి దాన్ని నడిపిస్తున్నవాడు ఆయనే మీ ప్రభువైన అల్లాహ్,అధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. ఆయనను వదిలి మీరు ఆరాధిస్తున్న విగ్రహాలకు ఖర్జూరపు టెంకపై ఉన్న పొర అంత దాని అధికారము కూడా లేదు. అటువంటప్పుడు మీరు ఎలా నన్ను కాదని వారిని పూజిస్తున్నారు ?!.
আৰবী তাফছীৰসমূহ:
اِنْ تَدْعُوْهُمْ لَا یَسْمَعُوْا دُعَآءَكُمْ ۚ— وَلَوْ سَمِعُوْا مَا اسْتَجَابُوْا لَكُمْ ؕ— وَیَوْمَ الْقِیٰمَةِ یَكْفُرُوْنَ بِشِرْكِكُمْ ؕ— وَلَا یُنَبِّئُكَ مِثْلُ خَبِیْرٍ ۟۠
ఒక వేళ మీరు మీ ఆరాధ్య దైవాలను వేడుకుంటే అవి మీ వేడుకలను వినలేవు. అవి తమలో ఎటువంటి ప్రాణము లేని,తమకు ఎటువంటి వినికిడి శక్తి లేని స్థిర రాసులు. ఒక వేళ అవి తఖ్దీర్ ప్రకారం విన్నా మీ కొరకు వారు స్వీకరించజాలవు. ప్రళయదినాన మీ సాటి కల్పించటం నుండి , మీరు వారి ఆరాధన చేయటం నుండి విసుగును చూపిస్తారు. ఓ ప్రవక్తా మీకు పరిశుద్ధుడైన అల్లాహ్ కన్నా ఎక్కువ నిజంగా తెలిపేవారు ఎవరూ ఉండరు.
আৰবী তাফছীৰসমূহ:
یٰۤاَیُّهَا النَّاسُ اَنْتُمُ الْفُقَرَآءُ اِلَی اللّٰهِ ۚ— وَاللّٰهُ هُوَ الْغَنِیُّ الْحَمِیْدُ ۟
ఓ ప్రజలారా మీరు మీ వ్యవహారాలన్నింటిలో,మీ పరిస్థితులన్నింటిలో అల్లాహ్ అవసరం కలవారు. మరియు అల్లాహ్ యే స్వయం సమృద్ధుడు ఏ విషయంలోను ఆయనకు మీ అవసరం లేదు. తన దాసుల కొరకు ఆయన నిర్ణయించే వాటిపై ఇహపరాల్లో స్థుతింపబడేవాడు.
আৰবী তাফছীৰসমূহ:
اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ وَیَاْتِ بِخَلْقٍ جَدِیْدٍ ۟ۚ
ఒక వేళ పరిశుద్ధుడైన ఆయన ఏదైన వినాశనం ద్వారా మిమ్మల్ని తొలగించదలచుకుంటే దాని ద్వారా మిమ్మల్ని తుదిముట్టించి తొలగిస్తాడు. మరియు మీకు బదులుగా ఆయనను ఆరాధించి,ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించని ఒక క్రొత్త సృష్టిని తీసుకునివస్తాడు.
আৰবী তাফছীৰসমূহ:
وَمَا ذٰلِكَ عَلَی اللّٰهِ بِعَزِیْزٍ ۟
మిమ్మల్ని తుదిముట్టించటం ద్వారా తొలగించటం,మీకు బదులుగా ఒక క్రొత్త సృష్టిని తీసుకొని రావటం పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ నుండి జరగడం సాధ్యం కాని పని కాదు.
আৰবী তাফছীৰসমূহ:
وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ؕ— وَاِنْ تَدْعُ مُثْقَلَةٌ اِلٰی حِمْلِهَا لَا یُحْمَلْ مِنْهُ شَیْءٌ وَّلَوْ كَانَ ذَا قُرْبٰی ؕ— اِنَّمَا تُنْذِرُ الَّذِیْنَ یَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَیْبِ وَاَقَامُوا الصَّلٰوةَ ؕ— وَمَنْ تَزَكّٰی فَاِنَّمَا یَتَزَكّٰی لِنَفْسِهٖ ؕ— وَاِلَی اللّٰهِ الْمَصِیْرُ ۟
మరియు ఒక పాపాత్ముడైన ప్రాణము వేరొక పాపాత్ముడైన ప్రాణము యొక్క పాపమును మోయదు. అంతే కాదు ప్రతీ పాపాత్ముడైన ప్రాణము తన పాపమునే మోస్తుంది. ఒక వేళ తన పాపముల బరువేయబడిన ఏ ప్రాణమైన తన పాపముల్లోంచి కొంచెమైన మోయటానికి వాటిని మోసే వాడిని పిలిచినా తన పాపముల్లోంచి కొంచెము కూడా మోయబడదు. ఒక వేళ పిలవబడిన వాడు అతనికి దగ్గర బందువైనా సరే. ఓ ప్రవక్తా మీరు కేవలం తమ ప్రభువును చూడకుండానే భయపడే వారిని, నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో పూర్తి చేసేవారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెడుతారు. వారే మీ భయపెట్టటం ద్వారా ప్రయోజనం చెందుతారు. మరియు ఎవరైతే పాపముల నుండి మరియు వాటిలో నుండి పెద్దది షిర్కు నుండి పరిశుద్ధుడవుతాడో అతడు తన స్వయం కొరకు పరిశుద్ధుడయ్యాడు. ఎందుకంటే దాని ప్రయోజనం అతని వైపునకే మరలుతుంది. అల్లాహ్ తన విధేయత నుండి అక్కరలేనివాడు. మరియు ప్రళయదినమున లెక్క తీసుకొనటం,ప్రతిఫలం కొరకు అల్లాహ్ వైపునకే మరలిపోవలసినది.
আৰবী তাফছীৰসমূহ:
এই পৃষ্ঠাৰ আয়াতসমূহৰ পৰা সংগৃহীত কিছুমান উপকাৰী তথ্য:
• تسخير البحر، وتعاقب الليل والنهار، وتسخير الشمس والقمر: من نعم الله على الناس، لكن الناس تعتاد هذه النعم فتغفل عنها.
సముద్రమును ఉపయుక్తంగా చేయటం,రేయింబవళ్ళను ఒక దాని వెనుక ఒకటిని తీసుకుని రావటం,సూర్యుడిని,చంద్రుడిని ఉపయుక్తంగా చేయటం ప్రజలపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలు. కాని ప్రజలు ఈ అనుగ్రహాలకి అలవాటై వాటి నుండి పరధ్యానంలో పడిపోయారు.

• سفه عقول المشركين حين يدعون أصنامًا لا تسمع ولا تعقل.
ముష్రికుల బుద్ధులు వారు వినలేని,గ్రహించలేని విగ్రహాలను పూజించినప్పుడు మూర్ఖులైపోయాయి.

• الافتقار إلى الله صفة لازمة للبشر، والغنى صفة كمال لله.
అల్లాహ్ వైపు అవసరం కలిగి ఉండటం మానవులకు ఒక ఆవశ్యక లక్షణం మరియు స్వయం సమృద్ధత అల్లాహ్ యొక్క పరిపూర్న లక్షణం.

• تزكية النفس عائدة إلى العبد؛ فهو يحفظها إن شاء أو يضيعها.
మనస్సు పరిశుద్ధత దాసుని వైపే మరలుతుంది. అతను తలచుకుంటే దాన్ని పరిరక్షించుకుంటాడు లేదా దాన్ని వృధా చేసుకుంటాడు.

 
অৰ্থানুবাদ ছুৰা: ফাতিৰ
ছুৰাৰ তালিকা পৃষ্ঠা নং
 
আল-কোৰআনুল কাৰীমৰ অৰ্থানুবাদ - আল-মুখতাচাৰ ফী তাফছীৰিল কোৰআনিল কাৰীমৰ তেলেগু অনুবাদ - অনুবাদসমূহৰ সূচীপত্ৰ

তাফছীৰ চেণ্টাৰ ফৰ কোৰানিক ষ্টাডিজৰ ফালৰ পৰা প্ৰচাৰিত।

বন্ধ