Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-ማኢዳህ   አንቀጽ:
قَالُوْا یٰمُوْسٰۤی اِنَّا لَنْ نَّدْخُلَهَاۤ اَبَدًا مَّا دَامُوْا فِیْهَا فَاذْهَبْ اَنْتَ وَرَبُّكَ فَقَاتِلَاۤ اِنَّا هٰهُنَا قٰعِدُوْنَ ۟
బనీ ఇస్రాయీల్లోంచి మూసా జాతి వారు తమ ప్రవక్త మూసా అలైహిస్సలాం ఆదేశము విబేధించటంపై మొండితనమును చూపుతూ ఇలా పలికారు : నిశ్చయంగా నగరంలో దుర్మార్గులు ఉన్నంత వరకు మేము అందులో ప్రవేశించము. ఓ మూసా నీవు మరియు నీ ప్రభువు వెళ్ళి దుర్మార్గులతో పోరాడండి. ఇక మేము మీతోపాటు యుద్దంలో ఉండకుండా వెనుక ఉండిపోయి మా ప్రదేశముల్లో ఉండిపోతాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ رَبِّ اِنِّیْ لَاۤ اَمْلِكُ اِلَّا نَفْسِیْ وَاَخِیْ فَافْرُقْ بَیْنَنَا وَبَیْنَ الْقَوْمِ الْفٰسِقِیْنَ ۟
మూసా అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా పలికారు : ఓ నా ప్రభువా నాపై మరియు నా సోదరుడైన హారూనుపై తప్ప ఇంకెవరపై నాకు ఎటువంటి అధికారము లేదు. కావున నీవు మా మధ్య మరియు నీ విధేయత నుండి మరియు నీ ప్రవక్త విధేయత నుండి వైదొలగిన జాతి వారి మధ్య వేరు పరచు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ فَاِنَّهَا مُحَرَّمَةٌ عَلَیْهِمْ اَرْبَعِیْنَ سَنَةً ۚ— یَتِیْهُوْنَ فِی الْاَرْضِ ؕ— فَلَا تَاْسَ عَلَی الْقَوْمِ الْفٰسِقِیْنَ ۟۠
అల్లాహ్ తన ప్రవక్త మూసాఅలైహిస్సలాంతో ఇలా పలికాడు : నిశ్చయంగా అల్లాహ్ బనీ ఇస్రాయీల్ పై నలభై సంవత్సరముల కాలం వరకు పవిత్ర భూమిలో ప్రవేశమును నిషేదించాడు. ఈ కాలములో ఎడారిలో వారు అయోమయంలో పడి మార్గభ్రష్టులుగా తిరుగుతుంటారు. సన్మార్గం పొందరు. ఓ మూసా అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన జాతి వారిపై మీరు విచారించకండి. నిశ్చయంగా వారికి సంభవించిన శిక్ష వారి అవిధేయకార్యాలు మరియు వారి పాపముల కారణం చేత.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاتْلُ عَلَیْهِمْ نَبَاَ ابْنَیْ اٰدَمَ بِالْحَقِّ ۘ— اِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ اَحَدِهِمَا وَلَمْ یُتَقَبَّلْ مِنَ الْاٰخَرِ ؕ— قَالَ لَاَقْتُلَنَّكَ ؕ— قَالَ اِنَّمَا یَتَقَبَّلُ اللّٰهُ مِنَ الْمُتَّقِیْنَ ۟
ఓ ప్రవక్తా యూదుల్లోంచి దుర్మార్గులైన,అసూయాపరులైన వీరందరికి ఎటువంటి సందేహం లేని ఆదమ్ ఇద్దరు కుమారుల గాధను సత్యముతో తెలియపరచండి. వారిద్దరు ఖాబీలు మరియు హాబీలు. వారిద్దరిలో నుంచి ప్రతి ఒక్కరు అల్లాహ్ సాన్నిద్యమును కోరుకుంటూ ఒక ఖుర్బానీను సమర్పించుకున్నారు. కాని అల్లాహ్ హాబీలు సమర్పించుకున్న ఖుర్బానీని స్వీకరించాడు. ఎందుకంటే అతడు దైవభీతిపరుడు. మరియు ఖాబీలు ఖుర్బానీని స్వీకరించలేదు. ఎందుకంటే అతడు దైవభీతిపరుడు కాడు. అప్పుడు ఖాబీలు హాబీలు ఖుర్బానీ స్వీకరించబడటాన్ని అసూయతో ద్వేషించాడు. మరియు ఇలా పలికాడు : ఓ హాబీలు నేను నిన్ను హతమార్చుతాను. అప్పుడు హాబీలు ఇలా పలికాడు : నిశ్చయంగా అల్లాహ్ తన ఆదేశాలను పాటించి తాను వారించిన వాటికి దూరంగా ఉండి తన భీతి కలిగిన వారి ఖుర్బానీని స్వీకరిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَىِٕنْۢ بَسَطْتَّ اِلَیَّ یَدَكَ لِتَقْتُلَنِیْ مَاۤ اَنَا بِبَاسِطٍ یَّدِیَ اِلَیْكَ لِاَقْتُلَكَ ۚ— اِنِّیْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِیْنَ ۟
ఒక వేళ నీవు నన్ను చంపే ఉద్దేశంతో నా వైపు నీ చేయి చాపితే నేను నువ్వు చేసిన కార్యంలా చేసి నీపై అతిక్రమించేవాడిని కాదు. ఇది నా వైపు నుండి పిరికి తనం కాదు. కానీ నేను సర్వ సృష్టితాల ప్రభువు అయిన అల్లాహ్ తో భయపడుతున్నాను.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنِّیْۤ اُرِیْدُ اَنْ تَبُوَْاَ بِاِثْمِیْ وَاِثْمِكَ فَتَكُوْنَ مِنْ اَصْحٰبِ النَّارِ ۚ— وَذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِیْنَ ۟ۚ
అప్పుడు అతడు (హాబీలు) అతనితో (ఖాబీలుతో) భయపెడుతూ ఇలా పలికాడు : నిశ్చయంగా నీవు అన్యాయంగా, దుర్మార్గంగా నన్ను హత్య చేసిన పాపము ద్వారా నీ మునుపటి పాపములకు చేరుకుని ప్రళయదినం నాడు నరకాగ్నిలో ప్రవేశించే వారిలో నీవు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రతిఫలమే అతిక్రమించేవారి యొక్క ప్రతిఫలము. మరియు నేను నీ హత్య చేసి వారిలో నుండి అయ్యి మరలటమును కోరుకోవటం లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَطَوَّعَتْ لَهٗ نَفْسُهٗ قَتْلَ اَخِیْهِ فَقَتَلَهٗ فَاَصْبَحَ مِنَ الْخٰسِرِیْنَ ۟
అప్పుడు ఖాబీలుకు తన సోదరుడు హాబీలును హతమార్చటమును చెడుపై ప్రేరేపించే అతని మనస్సు అలంకరించి చూపించింది అప్పుడు అతడు అతడిని హతమార్చాడు. అప్పుడు అతడు దాని వలన తమ ఇహపరాల్లో తమ మనస్సులకు నష్టం చేసుకునేవారిలో నుంచి అయిపోయాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَبَعَثَ اللّٰهُ غُرَابًا یَّبْحَثُ فِی الْاَرْضِ لِیُرِیَهٗ كَیْفَ یُوَارِیْ سَوْءَةَ اَخِیْهِ ؕ— قَالَ یٰوَیْلَتٰۤی اَعَجَزْتُ اَنْ اَكُوْنَ مِثْلَ هٰذَا الْغُرَابِ فَاُوَارِیَ سَوْءَةَ اَخِیْ ۚ— فَاَصْبَحَ مِنَ النّٰدِمِیْنَ ۟
అప్పుడు అల్లాహ్ తన సోదరుని శరీరమును ఎలా దాచాలో అతనికి నేర్పించటానికి ఒక కాకిని పంపించాడు అది అతని ముందు భూమిని తవ్వుతుంది చనిపోయిన కాకిని అందులో పూడ్చటానికి. హంతకుడు అప్పుడు తన సోదరునితో ఇలా పలికాడు అయ్యో నేను ఈ కాకిలా కాలేకపోయాను ఏదైతే మరణించిన ఇంకో కాకిని దాచినదో అప్పుడు నేనూ నా సోదరుని మృతశరీరమును దాచేవాడిని. అప్పుడు అతను తన సోదరుని శరీరమును దాచి చింతించే వాడైపోయాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• مخالفة الرسل توجب العقاب، كما وقع لبني إسرائيل؛ إذ عاقبهم الله تعالى بالتِّيه.
ప్రవక్తలను విబేధించటం శిక్షను అనివార్యం చేస్తుంది. ఏ విధంగానైతే బనీ ఇస్రాయీల్ వారికి వాటిల్లిందో. అల్లాహ్ వారిని తీహ్ ద్వారా శిక్షించాడు.

• قصة ابني آدم ظاهرها أن أول ذنب وقع في الأرض - في ظاهر القرآن - هو الحسد والبغي، والذي أدى به للظلم وسفك الدم الحرام الموجب للخسران.
ఆదమ్ సంతానమైన ఇద్దరి గాధ నుండి భూమండలంలో వాటిల్లిన మొట్ట మొదటి నేరమని స్పష్టమవుతుంది - ఖుర్ఆన్ లో స్పష్టముగా - అది అసూయ,దుర్మార్గం. మరియు అదే అతన్ని అన్యాయమునకు దారితీసింది. మరియు నష్టాన్ని కలిగించే నిషేధిత రక్తం చిందించేటట్లు చేసింది.

• الندامة عاقبة مرتكبي المعاصي.
పాపములకు పాల్పడే వారి పరిణామము అవమానము.

• أن من سَنَّ سُنَّة قبيحة أو أشاع قبيحًا وشجَّع عليه، فإن له مثل سيئات من اتبعه على ذلك.
ఎవరైతే చెడ్డ సంప్రదాయమును ప్రవేశపెడుతాడో లేదా చెడును వ్యాపింపజేసి దానిపై ప్రేరేపిస్తాడో నిశ్చయంగా అతని కొరకు అతన్ని అనుసరించే వారి పాపముల్లాంటివే ఉంటాయి.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-ማኢዳህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት