Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-ማኢዳህ   አንቀጽ:

అల్-మాఇదహ్

ከመዕራፉ ዓላማዎች:
الأمر بالوفاء بالعقود، والتحذير من مشابهة أهل الكتاب في نقضها.
ఒప్పందాలను నెరవేర్చే విషయంలో ఆదేశం మరియు వాటిని త్రెంచే విషయంలో గ్రంథవహుల సారూప్యతను కలగి ఉండటం నుండి హెచ్చరిక.

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَوْفُوْا بِالْعُقُوْدِ ؕ۬— اُحِلَّتْ لَكُمْ بَهِیْمَةُ الْاَنْعَامِ اِلَّا مَا یُتْلٰی عَلَیْكُمْ غَیْرَ مُحِلِّی الصَّیْدِ وَاَنْتُمْ حُرُمٌ ؕ— اِنَّ اللّٰهَ یَحْكُمُ مَا یُرِیْدُ ۟
ఓ విశ్వాసులారా, మీకు మరియు మీ సృష్టికర్తకు మధ్య మరియు మీకు మరియు ఆయన సృష్టికి మధ్య నమోదు చేయబడిన అన్ని ఒప్పందాలను పూర్తి చేయండి. వాస్తవానికి వేటిని నిషేధించినట్లు మీకు చదివి వినిపించబడినదో అవి తప్ప మరియు మీపై నిషేధించిన హజ్,ఉమ్రా ఇహ్రామ్ స్థితిలో అడవి జంతువులను వేటాడటం తప్ప ఆయన మీపై కారుణ్యముగా మీ కొరకు చతుష్పాద పశువులన్ని (ఒంటెలు,ఆవులు,గొర్రెలు) ధర్మసమ్మతం చేశాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన విజ్ఞతకు అనుగుణంగా తాను కోరుకున్నది ధర్మ సమ్మతం చేయటం మరియు నిషేధించటం నిర్ణయిస్తాడు. ఆయనను బలవంతం పెట్టేవాడు ఎవడూ లేడు. తన నిర్ణయమును వ్యతిరేకించేవాడు ఎవడూ లేడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُحِلُّوْا شَعَآىِٕرَ اللّٰهِ وَلَا الشَّهْرَ الْحَرَامَ وَلَا الْهَدْیَ وَلَا الْقَلَآىِٕدَ وَلَاۤ آٰمِّیْنَ الْبَیْتَ الْحَرَامَ یَبْتَغُوْنَ فَضْلًا مِّنْ رَّبِّهِمْ وَرِضْوَانًا ؕ— وَاِذَا حَلَلْتُمْ فَاصْطَادُوْا ؕ— وَلَا یَجْرِمَنَّكُمْ شَنَاٰنُ قَوْمٍ اَنْ صَدُّوْكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ اَنْ تَعْتَدُوْا ۘ— وَتَعَاوَنُوْا عَلَی الْبِرِّ وَالتَّقْوٰی ۪— وَلَا تَعَاوَنُوْا عَلَی الْاِثْمِ وَالْعُدْوَانِ ۪— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟
ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ యొక్క గౌరప్రదమైన విషయాలను వేటినైతే ఆయన గౌరవపరచమని ఆదేశించాడో వాటిని అగౌరవ పరచకండి. మరియు ఇహ్రామ్ నిషేధాజ్ఞలైనటువంటి కుట్టబడిన వస్త్రములను తొడగటం నుండి మరియు హరమ్ ప్రాంతపు నిషేధాజ్ఞలైనటువంటి వేటాడటం లాంటి నుండి మీరు ఆగిపోండి. మరియు మీరు నిషిద్ధ మాసముల్లో యుద్ధమును సమ్మతించకండి, అవి జీ ఖాఅద,జిల్ హిజ్జ,ముహర్రమ్ మరియు రజబ్ మాసములు. మరియు హరమ్ వైపునకు అక్కడ అల్లాహ్ కొరకు జుబాహ్ చేయటానికి తీసుకునిపోబడే జంతువులను బలవంతాన లాక్కోవటం ద్వారా మరియు అలాంటి వాటి ద్వారా లేదా వాటిని అవి వాటి స్థానమునకు చేరటం నుండి ఆపి అగౌరవపరచకండి. మరియు మీరు అవి బలి పశువులని గర్తింపుగా మెడలో పట్టాలను వేలాడదీయబడిన జంతువులను అగౌరవపరచకండి. మరియు అల్లాహ్ పవిత్ర గృహమునకు వ్యాపార లాభమును,అల్లాహ్ మన్నతలను ఆశిస్తూ వెళ్ళేవారిని మీరు అగౌరవపరచకండి. మరియు మీరు హజ్ లేదా ఉమరా ఇహ్రామ్ దీక్ష నుండి విరమించుకుని, హరమ్ ప్రాంతము నుండి బయటకు వచ్చినప్పుడు ఒక వేళ మీరు తలచుకుంటే వేటాడండి. మరియు మిమ్మల్ని మస్జిదుల్ హరాం నుండి నిలవరించటం వలన వారి పట్ల ఉన్న ద్వేషము మిమ్మల్ని హింసపై మరియు వారి విషయంలో న్యాయపూరితంగా వ్యవహరించటంను వదలటంపై పురిగొల్పకూడదు. ఓ విశ్వాసపరులారా మీకు ఆదేశించబడిన వాటిని చేయటంపై మరియు మీకు వారించబడిన వాటిని వదిలి వేయటంపై మీరు పరస్పరం సహాయం చేసుకోండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన పై విధేయతను చూపటమును మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండటమును అంటిపెట్టుకుని భయపడండి. నిశ్ఛయంగా అల్లాహ్ తనపై అవిధేయత చూపే వారిని కఠినంగా శిక్షించేవాడు. అతని శిక్ష నుండి మీరు జాగ్రత్తగా ఉండండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• عناية الله بجميع أحوال الورثة في تقسيم الميراث عليهم.
వారసుల యొక్క అన్ని పరిస్థితుల్లో వారిపై వారసత్వ సంపదను పంచిపెట్టే విషయంలో అల్లాహ్ భాగ్యము.

• الأصل هو حِلُّ الأكل من كل بهيمة الأنعام، سوى ما خصه الدليل بالتحريم، أو ما كان صيدًا يعرض للمحرم في حجه أو عمرته.
వాస్తవమేమిటంటే అది చతుష్పాద పశువులన్నింటిని తినటం సమ్మతము. అవి తప్ప వేటి నిషేధముపై ప్రత్యేక ఆధారము వచ్చి ఉన్నదో లేదా తన హజ్ లో లేదా తన ఉమ్రాలో ఇహ్రామ్ దీక్షలో ఉన్న వ్యక్తికి ఇవ్వబడిన వేటాడబడిన జంతువు తప్ప.

• النهي عن استحلال المحرَّمات، ومنها: محظورات الإحرام، والصيد في الحرم، والقتال في الأشهر الحُرُم، واستحلال الهدي بغصب ونحوه، أو مَنْع وصوله إلى محله.
గౌరవప్రదమైన వాటిని అగౌరవపరచటం నుండి వారింపు. మరియు వాటిలో నుండి : ఇహ్రామ్ దీక్షలో ఉన్నప్పుడు నిషిద్ధతాలు మరియు హరమ్ ప్రాంతంలో వేటాడటం మరియు నిషిద్ధ మాసముల్లో యుద్దం చేయటం మరియు బలి పశువులను బలవంతాన లాక్కొని,అలాగే వేరే విధంగా లేదా వాటిని హలాల్ అయ్యే ప్రదేశమునకు చేరకుండా ఆపి అగౌరవపరచటం.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-ማኢዳህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት