Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አልን ኑር   አንቀጽ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ— وَمَنْ یَّتَّبِعْ خُطُوٰتِ الشَّیْطٰنِ فَاِنَّهٗ یَاْمُرُ بِالْفَحْشَآءِ وَالْمُنْكَرِ ؕ— وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ مَا زَكٰی مِنْكُمْ مِّنْ اَحَدٍ اَبَدًا ۙ— وَّلٰكِنَّ اللّٰهَ یُزَكِّیْ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ سَمِیْعٌ عَلِیْمٌ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మ ప్రకారం ఆచరించే వారా మీరు అసత్యమును అలంకరించే షైతాను మార్గములను అనుసరించకండి. ఎవరైతే అతని మార్గములను అనుసరిస్తారో వారిని అతడు చెడు కార్యాల గురించి,మాటల గురించి,ధర్మం ఖండించిన వాటి గురించి ఆదేశిస్తాడు. ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీపైన అల్లాహ్ అనుగ్రహమే లేకుంటే మీలో నుండి ఎన్నటికి ఎవరినీ ఆయన తౌబా ద్వారా - ఒక వేళ అతను తౌబా చేసి ఉంటే - పరిశుద్ధుడు చేసే వాడు కాదు. కానీ అల్లాహ్ ఆయన ఎవరిని తలచుకుంటే వారి తౌబా స్వీకరించి పరిశుద్ధుడు చేస్తాడు. మరియు అల్లాహ్ మీ మాటలను వినే వాడును,మీ కర్మలను తెలుసుకునే వాడును. వాటిలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు ఆయన తొందరలోనే వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَا یَاْتَلِ اُولُوا الْفَضْلِ مِنْكُمْ وَالسَّعَةِ اَنْ یُّؤْتُوْۤا اُولِی الْقُرْبٰی وَالْمَسٰكِیْنَ وَالْمُهٰجِرِیْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ ۪ۖ— وَلْیَعْفُوْا وَلْیَصْفَحُوْا ؕ— اَلَا تُحِبُّوْنَ اَنْ یَّغْفِرَ اللّٰهُ لَكُمْ ؕ— وَاللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ధర్మంలో పరపతులు,సంపదలో సమృద్ధత కలవారు పేదరికం వలన అవసరాలు కల తమ దగ్గరి బంధువులకు,అల్లాహ్ మార్గంలో హిజ్రత్ చేసిన వారికి వారు చేసిన పాపము వలన ఇవ్వమని ప్రమాణం చేయకూడదు. వారిని మన్నించాలి. మరియు వారిని క్షమించాలి. మీరు వారిని మన్నించి క్షమించి వేసినప్పుడు అల్లాహ్ మీ పాపములను మీ కొరకు క్షమించటమును మీరు ఇష్టపడరా ?!. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తౌబా చేసే వారిని మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును. ఆయన దాసులు వాటిని నమూనాగా తీసుకోవాలి. ఈ ఆయతులు అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు గారి విషయంలో ఆయన మిస్తహ్ నింద మోపే విషయంలో పాలుపంచుకోవటంవలన అతనిపై ఖర్చు చేయనని ప్రమాణం చేసినప్పుడు అవతరించబడినది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّ الَّذِیْنَ یَرْمُوْنَ الْمُحْصَنٰتِ الْغٰفِلٰتِ الْمُؤْمِنٰتِ لُعِنُوْا فِی الدُّنْیَا وَالْاٰخِرَةِ ۪— وَلَهُمْ عَذَابٌ عَظِیْمٌ ۟ۙ
నిశ్ఛయంగా శీలవతులైన, అశ్లీలతను అర్ధం చేసుకోలేని అమాయక విశ్వాసపరురాలైన స్త్రీల పై నింద మోపే వారు ఇహలోకంలో,పరలోకంలో అల్లాహ్ కారుణ్యం నుండి గెంటివేయబడుతారు. మరియు పరలోకంలో వారి కొరకు ఘోరమైన శిక్ష ఉన్నది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یَّوْمَ تَشْهَدُ عَلَیْهِمْ اَلْسِنَتُهُمْ وَاَیْدِیْهِمْ وَاَرْجُلُهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
ఈ శిక్ష వారికి ప్రళయ దినమున సంభవించును. ఆ రోజు వారు పలికిన అసత్యము గురించి వారికి వ్యతిరేకముగా వారి నాలుకలు సాక్ష్యం పలుకుతాయి. మరియు వారు చేసే కర్మల గురించి వారి కాళ్ళూ,చేతులు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یَوْمَىِٕذٍ یُّوَفِّیْهِمُ اللّٰهُ دِیْنَهُمُ الْحَقَّ وَیَعْلَمُوْنَ اَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ الْمُبِیْنُ ۟
ఆ రోజున వారికి అల్లాహ్ వారి ప్రతిఫలమును న్యాయముతో పూర్తిగా ప్రసాదిస్తాడు. మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ సత్యమని,ఆయన నుండి జరిగే ప్రతీ మంచి గాని లేదా వాగ్దానము గాని లేదా హెచ్చరిక గాని ఎటువంటి సందేహం లేని స్పష్టమైన సత్యమని తెలుసుకుంటారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَلْخَبِیْثٰتُ لِلْخَبِیْثِیْنَ وَالْخَبِیْثُوْنَ لِلْخَبِیْثٰتِ ۚ— وَالطَّیِّبٰتُ لِلطَّیِّبِیْنَ وَالطَّیِّبُوْنَ لِلطَّیِّبٰتِ ۚ— اُولٰٓىِٕكَ مُبَرَّءُوْنَ مِمَّا یَقُوْلُوْنَ ؕ— لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِیْمٌ ۟۠
పురుషుల్లోంచి,స్త్రీలలోంచి,మాటల్లోంచి,కార్యాల్లోంచి అపవిత్రమైనది ప్రతీది అపవిత్రమైన దాని కొరకు సముచితమైనది,తగినది. వాటిలోంచి పవిత్రమైనది ప్రతీది పవిత్రమైన దాని కొరకు సముచితమైనది,తగినది. పవిత్రమైన పురుషులు,స్తీలు వీరందరు వారి గురించి అపవిత్రమైన పురషులు,స్త్రీలు పలికే వాటి నుండి పరిశుద్ధులు. అల్లాహ్ తరపు నుండి వారి కొరకు మన్నింపు ఉన్నది. దాని ద్వారా ఆయన వారి పాపములను మన్నించివేస్తాడు. మరియు వారి కొరకు గౌరవ ప్రధమైన ఆహారము ఉన్నది అది స్వర్గము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَدْخُلُوْا بُیُوْتًا غَیْرَ بُیُوْتِكُمْ حَتّٰی تَسْتَاْنِسُوْا وَتُسَلِّمُوْا عَلٰۤی اَهْلِهَا ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ధర్మ ప్రకారం ఆచరించేవారా మీరు ఇతరుల ఇండ్లలో అందులో ఉండేవారితో ప్రవేశమునకు అనుమతి కోరనంత వరకు లోపల ప్రవేశించకండి. మరియు మీరు వారికి సలాం చేయండి సలాంలో,అనుమతి తీసుకోవటంలో మీరు ఇలా పలకటం ద్వారా : అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కురియుగాక),నేను లోపలికి రానా ?. ఈ అనుమతి తీసుకోవటం అకస్మాత్తుగా ప్రవేశించటం కన్న మీకు మేలైనది. బహుశా మీరు మీకు ఆదేశించబడిన దాన్ని పాటించి హితోపదేశం గ్రహిస్తారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• إغراءات الشيطان ووساوسه داعية إلى ارتكاب المعاصي، فليحذرها المؤمن.
షైతాను యొక్క ప్రలోభాలు,అతని దుష్ప్రేరణలు పాపకార్యములకు పాల్పడటానికి పిలుస్తుంటాయి. విశ్వాసపరుడు వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి.

• التوفيق للتوبة والعمل الصالح من الله لا من العبد.
తౌబా చేసే,సత్కార్యమును చేసే సౌభాగ్యము అల్లాహ్ తరపు నుండి ఉంటుంది దాసుని తరపు నుండి కాదు.

• العفو والصفح عن المسيء سبب لغفران الذنوب.
అపరాధిని మన్నించటం,క్షమించటం పాపముల మన్నింపునకు ఒక కారణం.

• قذف العفائف من كبائر الذنوب.
పవిత్రులపై నింద మోపటం ఘోరమైన పాపము.

• مشروعية الاستئذان لحماية النظر، والحفاظ على حرمة البيوت.
దృష్టి రక్షణకు,గృహాల పవిత్రతను పరిరక్షించడానికి అనుమతి తీసుకోవటం యొక్క చట్టబద్దత.

 
የይዘት ትርጉም ምዕራፍ: አልን ኑር
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት