Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-በቀራህ   አንቀጽ:
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَالَّذِیْنَ هَادُوْا وَالنَّصٰرٰی وَالصّٰبِـِٕیْنَ مَنْ اٰمَنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۪ۚ— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
నిశ్ఛయంగా ఈ సమాజము నుండి విశ్వసించిన వారు మరియు అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపబడక మునుపటి సమాజములైన యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి,సాబియిల్లోంచి విశ్వసించినవారు - వారు కొంత మంది ప్రవక్తల అనుచరుల వర్గము వారు అల్లాహ్ పై మరియు అంతిమ దినముపై విశ్వాసమును సాధించారు. వారి కొరకు వారి ప్రభువు వద్ద వారి ప్రతిఫలమున్నది. మరియు వారు పరలోకంలో ఎదుర్కొనే వాటి గురించి వారిపై ఎటువంటి భయం ఉండదు. ఇహలోకము నుండి తాము కోల్పోయిన వాటిపై వారు దుఃఖించరు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِذْ اَخَذْنَا مِیْثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّوْرَ ؕ— خُذُوْا مَاۤ اٰتَیْنٰكُمْ بِقُوَّةٍ وَّاذْكُرُوْا مَا فِیْهِ لَعَلَّكُمْ تَتَّقُوْنَ ۟
మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాస విషయంలో మీతో తీసుకున్న దృఢమైన ప్రమాణమును మీరు గుర్తు చేసుకోండి. మరియు మేము పర్వతమును మిమ్మల్ని భయపెట్టటానికి మరియు ప్రమాణముపై అమలు చేయటం నుండి వదిలివేయటం నుండి హెచ్చరించటానికి మీపై తీసుకుని వచ్చాము. మీపై మేము అవతరించిన తౌరాతును జాగ్రత్తగా మరియు శ్రద్ధగా ఎటువంటి నిశ్ఛలత,సోమరితనం లేకుండా పట్టుకోవటం గురించి మీకు ఆదేశిస్తూ. మరియు మీరు అందులో ఉన్నవాటిని కంఠస్తం చేసుకుని దానిలో యోచన చేయండి బహుశా అలా చేసి మీరు మహోన్నతుడైన అల్లాహ్ శిక్ష నుండి భయపడుతారని.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ثُمَّ تَوَلَّیْتُمْ مِّنْ بَعْدِ ذٰلِكَ ۚ— فَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ لَكُنْتُمْ مِّنَ الْخٰسِرِیْنَ ۟
మీతో దృఢ ప్రమాణం తీసుకున్న తరువాత మీరు విముఖత చూపటం మరియు విధేయత చూపటం తప్ప మీతో ఇంకేమి జరగలేదు. మరియు ఒక వేళ మిమ్మల్ని మన్నించి అల్లాహ్ అనుగ్రహం మరియు మీ తౌబా ను స్వీకరించి ఆయన కారుణ్యం మీపై లేకుంటే ఈ విముఖత మరియు అవిధేయత వలన నష్టపోయేవారిలోంచి మీరు అయిపోతారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَقَدْ عَلِمْتُمُ الَّذِیْنَ اعْتَدَوْا مِنْكُمْ فِی السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُوْنُوْا قِرَدَةً خٰسِـِٕیْنَ ۟ۚ
మరియు మీ పూర్వికుల వార్త నిస్సందేహంగా మీకు తెలుసు; వేటాడం వారిపై నిషేధించబడిన రోజైన శనివారం రోజున వేటాడి అతిక్రమించారు. అప్పుడు అది చేయటానికి వారు శనివారం రోజు ముందు వలను పరచి ఆదివారం రోజును దాన్ని తీయటం ద్వారా ఉపాయం పన్నారు. అయితే అల్లాహ్ ఈ ఉపాయం పన్నిన వారందరిని వారి ఉపాయం పన్నటంపై వారికి శిక్షగా బహిష్కరించబడిన కోతులవలే చేసేశాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَجَعَلْنٰهَا نَكَالًا لِّمَا بَیْنَ یَدَیْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِیْنَ ۟
అయితే మేము ఈ అతిక్రమించిన ఊరిని దాని సమీప ఊళ్ళకు గుణపాఠంగా మరియు దాని తరువాత వచ్చే వారికి గుణపాఠంగా చేశాము చివరికి వారి శిక్షకు గురి అవకుండా ఉండటానికి వారి చర్యకు పాల్పడకుండా ఉండటానికి. మరియు అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారికి కలిగే అల్లాహ్ శిక్ష నుండి,ఆయన ప్రతీకారము నుండి భయపడేవారైన దైవ భీతిపరులకు దాన్ని మేము హితబోధనగా చేశాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖۤ اِنَّ اللّٰهَ یَاْمُرُكُمْ اَنْ تَذْبَحُوْا بَقَرَةً ؕ— قَالُوْۤا اَتَتَّخِذُنَا هُزُوًا ؕ— قَالَ اَعُوْذُ بِاللّٰهِ اَنْ اَكُوْنَ مِنَ الْجٰهِلِیْنَ ۟
మరియు మీరు మీ పూర్వికుల వార్తల్లో నుండి వారికి మరియు మూసా అలైహిస్సలాంకు మధ్య ఏమి జరిగినదో గుర్తు చేసుకోండి. అప్పుడు ఆయన వారికి ఆవుల్లోంచి ఒక ఆవును జిబాహ్ చేయమన్న అల్లాహ్ ఆదేశము గురించి తెలియపరచారు. అప్పుడు వారు బదులుగా త్వరపడుతూ మొండిగా ఇలా పలికారు : ఏమీ నీవు మాతో పరిహాసమాడుతున్నావా. అప్పుడు మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : అల్లాహ్ పై అబద్ధము పలికే వారిలో నుండి మరియు ప్రజలతో పరిహాసమాడే వారిలో నుండి నేను కావటం నుండి అల్లాహ్ శరణమును వేడుకుంటున్నాను.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ یُبَیِّنْ لَّنَا مَا هِیَ ؕ— قَالَ اِنَّهٗ یَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَّلَا بِكْرٌ ؕ— عَوَانٌ بَیْنَ ذٰلِكَ ؕ— فَافْعَلُوْا مَا تُؤْمَرُوْنَ ۟
వారు మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఆయన మాకు జిబాహ్ చేయమని ఆదేశించిన ఆవు వర్ణనను మాకు స్పష్టపరచమని మీరు మీ ప్రభువుతో మా కొరకు వేడుకోండి. ఆప్పుడు ఆయన వారితో ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలుకుతున్నాడు : నిశ్చయంగా ఆ ఆవు వయస్సులో పెద్దది గాని చిన్నది గాని కాకూడదు. కాని అది దానికి మధ్యదై ఉండాలి. కావున మీరు మీ ప్రభువు ఆదేశమును పాటించటంలో త్వరపడండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ یُبَیِّنْ لَّنَا مَا لَوْنُهَا ؕ— قَالَ اِنَّهٗ یَقُوْلُ اِنَّهَا بَقَرَةٌ صَفْرَآءُ ۙ— فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النّٰظِرِیْنَ ۟
అప్పుడు వారు మూసా అలైహిస్సలాంతో ఇలా పలుకుతూ తమ వాదనల్లో మరియు తమ మొండితనములో కొనసాగిపోయారు : మీరు మీ ప్రభువుతో ఆయన మాకు దాని రంగు ఎలా ఉంటుందో స్పష్టపరచే వరకు వేడుకోండి. అప్పుడు మూసా వారితో ఇలా పలికారు : నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలుకుతున్నాడు : నిశ్చయంగా ఆ ఆవు మదురు పసుపు రంగుదై ఉండాలి. దాన్ని చూసేవారికి అది నచ్చాలి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الحُكم المذكور في الآية الأولى لِمَا قبل بعثة النبي صلى الله عليه وسلم، وأما بعد بعثته فإن الدين المَرْضِيَّ عند الله هو الإسلام، لا يقبل غيره، كما قال الله تعالى: ﴿ وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْه ﴾ (آل عمران: 85).
మొదటి ఆయతులో ప్రస్తావించబడిన ఆదేశం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడక మునుపటి దాని కొరకు. ఇక ఆయన ప్రవక్తగా పంపించబడిన తరువాత అల్లాహ్ వద్ద నిశ్చయంగా స్వీకరించబడే ధర్మం అది ఇస్లాం. అది తప్ప ఇతర ధర్మాలు స్వీకరించబడవు. ఏ విధంగా అయితే మహోన్నతుడైన అల్లాహ్ పలికాడో : ఎవరైనా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని ఆశిస్తే అతని ధర్మం స్వీకరించబడదు (ఆలె ఇమ్రాన్ - 85)

• قد يُعَجِّلُ الله العقوبة على بعض المعاصي في الدنيا قبل الآخرة؛ لتكون تذكرة يتعظ بها الناس فيحذروا مخالفة أمر الله تعالى.
నిశ్చయంగా అల్లాహ్ పరలోకం కన్న ముందే ఇహలోకంలో కొన్ని పాపములపై త్వరగా శిక్షిస్తాడు; అది హిత బోధన కావటానికి ప్రజలు దాని ద్వారా హితబోధన గ్రహించి మహోన్నతుడైన అల్లాహ్ ఆదేశమును విబేధించటం నుండి వారు జాగ్రత్త పడటానికి.

• أنّ من ضيَّق على نفسه وشدّد عليها فيما ورد موسَّعًا في الشريعة، قد يُعاقَبُ بالتشديد عليه.
నిశ్చయంగా ఎవరైతే ధర్మంలో విస్తృతం చేయబడి వచ్చిన వాటి విషయంలో తన స్వయమును ఇబ్బందికి గురి చేసుకుని తన మనస్సుపై కఠినంగా వ్యవహరిస్తాడో అతడు తనపై కఠినత్వము ద్వారా శిక్షింపబడుతాడు.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት