Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-በቀራህ   አንቀጽ:
قُلْ اِنْ كَانَتْ لَكُمُ الدَّارُ الْاٰخِرَةُ عِنْدَ اللّٰهِ خَالِصَةً مِّنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ యూదులారా ఒక వేళ పరలోక నివాసములో మీ కొరకు స్వర్గము ప్రత్యేకించి ఉండి ప్రజల్లో మీరు తప్ప ఇంకెవరు అందులో ప్రవేశించకుండా ఉండి ఉంటే మీరు మరణమును ఆశించండి మరియు దాన్ని కోరుకోండి. ఈ స్థానమును మీరు త్వరగా పొందటానికి మరియు ఇహలోక జీవితము యొక్క భారాలు మరియు వాటి చింతల నుండి మీరు విశ్రాంతి తీసుకోవటానికి. ఒక వేళ మీరు మీ ఈ వాదనలో సత్యవంతులే అయితే.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَنْ یَّتَمَنَّوْهُ اَبَدًا بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟
వారు తమ జీవితంలో చేసిన అల్లాహ్ పట్ల అవిశ్వాసము,ఆయన ప్రవక్తలను తిరస్కరించటం మరియు ఆయన గ్రంధముల్లో మార్పు చేర్పులు చేయటం వలన వారు ఎన్నటికి మరణమును ఆశించరు. మరియు అల్లాహ్ కు వారిలో నుంచి ,ఇతరుల్లోంచి దుర్మార్గుల గురించి బాగా తెలుసు. మరియు ఆయన తొందరలోనే ప్రతి ఒక్కరికి వారి కర్మల పరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَتَجِدَنَّهُمْ اَحْرَصَ النَّاسِ عَلٰی حَیٰوةٍ ۛۚ— وَمِنَ الَّذِیْنَ اَشْرَكُوْا ۛۚ— یَوَدُّ اَحَدُهُمْ لَوْ یُعَمَّرُ اَلْفَ سَنَةٍ ۚ— وَمَا هُوَ بِمُزَحْزِحِهٖ مِنَ الْعَذَابِ اَنْ یُّعَمَّرَ ؕ— وَاللّٰهُ بَصِیْرٌ بِمَا یَعْمَلُوْنَ ۟۠
ఓ ప్రవక్త మీరు తప్పకుండా యూదులను జీవితంపై ప్రజల్లోకెల్లా అత్యంత ఆశ కలిగిన వారిగా పొందుతారు అది నీచమైనదైన,అవమానకరమైనదైన సరే. అంతే కాదు వారు మరణాంతరం లేపబడటం మరియు లెక్కతీసుకోవటంపై విశ్వాసం కనబరచని ముష్రికుల కన్న ఎక్కువ ఆశ కలిగిన వారు. వారు గ్రంధవహులై,మరణాంతరం లేపబడటం,లెక్కతీసుకోబడటంపై విశ్వాసం కలిగి కూడాను. వారిలో నుండి ఒక్కడు అతని వయస్సు వెయ్యేళ్ళు చేరాలని కోరుతున్నాడు. అతని వయస్సు పెరిగిన అల్లాహ్ శిక్ష నుండి అతన్ని అది దూరం చేయదు. మరియు అల్లాహ్ వారి కర్మల గురించి తెెలుసుకునే వాడును,వాటిపై దృష్టి పెట్టి ఉన్న వాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి వాటిపరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قُلْ مَنْ كَانَ عَدُوًّا لِّجِبْرِیْلَ فَاِنَّهٗ نَزَّلَهٗ عَلٰی قَلْبِكَ بِاِذْنِ اللّٰهِ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ وَهُدًی وَّبُشْرٰی لِلْمُؤْمِنِیْنَ ۟
ఓ ప్రవక్త నిశ్చయంగా దైవదూతల్లోంచి జిబ్రాయీలు మనకు శతృవు అని యూదుల్లోంచి పలికే వారితో మీరు ఇలా పలకండి : ఎవరైతే జిబ్రాయీల్ ను శతృవుగా భావిస్తాడో ఎందుకంటే ఆయన అల్లాహ్ సూచన మేరకు ఖుర్ఆన్ ను మీ హృదయంపై అవతరింపజేశాడు. అది పూర్వ దివ్యగ్రంధములైన తౌరాత్,ఇంజీలును దృవీకరిస్తుంది. మరియు మంచిని గురించి సూచిస్తుంది. మరియు విశ్వాసపరుల కొరకు అల్లాహ్ సిద్ధం చేసి ఉంచిన అనుగ్రహాల గురించి వారికి శుభవార్తనిస్తుంది. ఎవరైతే ఈ గుణములు,చర్యలు కలిగిన వారిని శతృవుగా భావించాడో అతడు మార్గభ్రష్టతకు లోనయిన వారిలో నుంచివాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
مَنْ كَانَ عَدُوًّا لِّلّٰهِ وَمَلٰٓىِٕكَتِهٖ وَرُسُلِهٖ وَجِبْرِیْلَ وَمِیْكٰىلَ فَاِنَّ اللّٰهَ عَدُوٌّ لِّلْكٰفِرِیْنَ ۟
ఎవరైతే అల్లాహ్ కు,ఆయన దూతలకు,ఆయన ప్రవక్తలకు శతృవుగా ఉంటాడో మరియు దగ్గరి దూతలైన జిబ్రయీల్,మీకాయిల్ కు శతృవుగా ఉంటాడో నిశ్ఛయంగా అల్లాహ్ మీలో నుండి అవిశ్వాసపరులకు మరియు ఇతరుల కొరకు శతృవుగా ఉంటాడు. మరియు అల్లాహ్ ఎవరికైతే శతృవుగా ఉంటాడో అతడు స్పష్టమైన నష్టమును తీసుకుని మరలుతాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَقَدْ اَنْزَلْنَاۤ اِلَیْكَ اٰیٰتٍۢ بَیِّنٰتٍ ۚ— وَمَا یَكْفُرُ بِهَاۤ اِلَّا الْفٰسِقُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు తీసుకుని వచ్చిన దైవదౌత్యము మరియు దైవవాణి విషయంలో మీ నిజాయితీపై స్పష్టమైన సూచనలను మేము మీ వైపునకు అవతరింపజేశాము. అవి స్పష్టమై,బహిర్గతమైన కూడా అల్లాహ్ ధర్మం నుండి వైదొలగిన వారు మాత్రమే నిరాకరిస్తారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَوَكُلَّمَا عٰهَدُوْا عَهْدًا نَّبَذَهٗ فَرِیْقٌ مِّنْهُمْ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یُؤْمِنُوْنَ ۟
యూదుల దుస్థితిలో నుంచి ఒకటి వారితో ఏదైన ప్రమాణం తీసుకుంటే - తౌరాతు సూచించే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యంపై విశ్వాసం చూపటంపై - వారిలో నుండి ఒక వర్గము దాన్ని భంగపరుస్తుంది. అంతేకాదు వాస్తవానికి చాలా మంది ఈ యూదులు మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన వాటిపై విశ్వాసం కనబరచలేదు. ఎందుకంటే విశ్వాసం ప్రమాణమును సంపూర్ణం చేయటంపై పురిగొల్పుతుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَمَّا جَآءَهُمْ رَسُوْلٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِیْقٌ مِّنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ ۙۗ— كِتٰبَ اللّٰهِ وَرَآءَ ظُهُوْرِهِمْ كَاَنَّهُمْ لَا یَعْلَمُوْنَ ۟ؗ
మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తగా వారి వద్దకు వచ్చినప్పుడు మరియు ఆయన తౌరాత్ లో ఉన్న తన గుణమునకు అనుగుణంగా ఉన్నారు. వారిలో నుండి ఒక వర్గము అది సూచించే దాని నుండి విముఖత చూపి దాన్ని పట్టించుకోకుండా తమ వీపుల వెనుక పడవేశారు. అందులో ఉన్న సత్యము నుండి,సన్మార్గము నుండి ప్రయోజనం చెందకుండా,వాటిని పట్టించుకోని అజ్ఞాని స్థితిని పోలియున్నారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• المؤمن الحق يرجو ما عند الله من النعيم المقيم، ولهذا يفرح بلقاء الله ولا يخشى الموت.
వాస్తవ విశ్వాసపరుడు అల్లాహ్ వద్ద ఉన్న శాశ్వత అనుగ్రహాలను ఆశిస్తారు. మరియు ఇందుకనే అతడు అల్లాహ్ కలుసుకోవటం గురించి సంతోషపడుతాడు. మరియు అతడు మరణము నుంచి భయపడడు.

• حِرص اليهود على الحياة الدنيا حتى لو كانت حياة حقيرة مهينة غير كريمة.
ఇహలోక జీవితంపై యూదులు అత్యాశ కలిగి ఉండటం చివరికి ఆ జీవితం నీచమైన,దిగజారినదైన,అగౌరవప్రదమైనా సరే.

• أنّ من عادى أولياء الله المقربين منه فقد عادى الله تعالى.
అల్లాహ్ సన్నిహితులకు ఎవరైతే శతృత్వం కలిగి ఉంటాడో అతడు మహోన్నతుడైన అల్లాహ్ కు శతృత్వం కలిగి ఉంటాడు.

• إعراض اليهود عن نبوة محمد صلى الله عليه وسلم بعدما عرفوا تصديقه لما في أيديهم من التوراة.
యూదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దౌత్యం గురించి వారి చేతుల్లో ఉన్న పుస్తకముల్లో దాని దృవీకరణను తెలిసిన తరువాత కూడా దాని నుండి విముఖత చూపారు.

• أنَّ من لم ينتفع بعلمه صح أن يوصف بالجهل؛ لأنه شابه الجاهل في جهله.
ఎవరైతే తన జ్ఞానంతో ప్రయోజనం చెందడో అతడిని అజ్ఞానంతో వర్ణించడం సరైనది. ఎందుకంటే అతను తన అజ్ఞానంలో అజ్ఞానితో పోలియున్నాడు.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት