Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 章: 尼萨仪   段:
وَاللّٰهُ یُرِیْدُ اَنْ یَّتُوْبَ عَلَیْكُمْ ۫— وَیُرِیْدُ الَّذِیْنَ یَتَّبِعُوْنَ الشَّهَوٰتِ اَنْ تَمِیْلُوْا مَیْلًا عَظِیْمًا ۟
మరియు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించి మీ పాపములను మన్నించ గోరుతున్నాడు. మరియు తమ మనోవాంఛల వెను నడిచేవారు సన్మార్గము నుండి తీవ్రంగా దూరమవటమును కోరుతున్నారు.
阿拉伯语经注:
یُرِیْدُ اللّٰهُ اَنْ یُّخَفِّفَ عَنْكُمْ ۚ— وَخُلِقَ الْاِنْسَانُ ضَعِیْفًا ۟
అల్లాహ్ తాను ధర్మనిర్దేశం చేసిన వాటి విషయంలో మీ భారమును తగ్గించగోరుతున్నాడు. మీకు శక్తి లేని బాధ్యతను ఆయన మీపై వేయడు. ఎందుకంటే ఆయనకు మానవుడు అతని సృష్టిలో మరియు అతని గుణములో బలహీనుడని తెలుసు.
阿拉伯语经注:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَاْكُلُوْۤا اَمْوَالَكُمْ بَیْنَكُمْ بِالْبَاطِلِ اِلَّاۤ اَنْ تَكُوْنَ تِجَارَةً عَنْ تَرَاضٍ مِّنْكُمْ ۫— وَلَا تَقْتُلُوْۤا اَنْفُسَكُمْ ؕ— اِنَّ اللّٰهَ كَانَ بِكُمْ رَحِیْمًا ۟
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించేవారా మీలోని ఒకరు మరొకరి సొమ్మును అన్యాయంగా తీసుకోకండి. ఉదాహరణకి బలవంతాన లాక్కొని,దొంగతనం చేసి,లంచము తీసుకుని,తదితర విధంగా. కాని వ్యాపార ఒప్పందము చేసుకునేవారి పరస్పర అంగీకారముతో వెలువడిన వ్యాపార సంపద అయితే వేరే విషయం. అప్పుడు దాన్ని తినటం,దానిలో వ్యవహరించటం మీకు సమ్మతమగును. మరియు మీరు ఒకరినొకరు హతమార్చుకోకండి. మరియు మీలో నుండి ఎవరూ స్వయాన్ని హతమార్చుకోకండి. స్వయాన్ని వినాశనంలో పడవేయకూడదు. నిశ్చయంగా అల్లాహ్ మీపై దయ కలవాడు. మరియు ఆయన కారుణ్యములో నుంచి ఆయన మీ రక్తములను మరియు మీ సంపదలను మరియు మీ మానములను నిషేధించాడు.
阿拉伯语经注:
وَمَنْ یَّفْعَلْ ذٰلِكَ عُدْوَانًا وَّظُلْمًا فَسَوْفَ نُصْلِیْهِ نَارًا ؕ— وَكَانَ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرًا ۟
మరియు ఎవరైతే తాను వారించబడిన వాటికి పాల్పడి ఇతరుల సొమ్మును తింటాడో లేదా అతనిపై హత్య ద్వారా లేదా ఇతర వాటి ద్వారా అతిక్రమిస్తాడో అజ్ఞానంగా లేదా మరచిపోయి కాకుండా తెలిసి దుర్మార్గంగా (చేస్తాడో) అల్లాహ్ అతన్ని ప్రళయదినాన పెద్ద అగ్నిలో ప్రవేశింపజేస్తాడు. అతడు దాని వేడిని అనుభవిస్తాడు. మరియు దాని శిక్షను అనుభవిస్తాడు. మరియు ఇది అల్లాహ్ పై సులభము. ఎందుకంటే ఆయన సామర్ధ్యం కలవాడు ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
阿拉伯语经注:
اِنْ تَجْتَنِبُوْا كَبَآىِٕرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَیِّاٰتِكُمْ وَنُدْخِلْكُمْ مُّدْخَلًا كَرِیْمًا ۟
ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీరు అల్లాహ్ తో సాటి కల్పించటం,తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం,ప్రాణాలు తీయటం,వడ్డీ తినటం లాంటి పెద్ద పాపములకు పాల్పడటం నుండి దూరంగా ఉంటే మేము మీరు పాల్పడే చిన్న పాపములను వాటిని ప్రక్షాళన చేసి మరియు వాటిని తుడిచివేసి మన్నించి వేస్తాము. మరియు మేము అల్లాహ్ వద్ద మిమ్మల్ని గౌరవోన్నత ప్రదేశంలో ప్రవేశింపజేస్తాము. అది స్వర్గము.
阿拉伯语经注:
وَلَا تَتَمَنَّوْا مَا فَضَّلَ اللّٰهُ بِهٖ بَعْضَكُمْ عَلٰی بَعْضٍ ؕ— لِلرِّجَالِ نَصِیْبٌ مِّمَّا اكْتَسَبُوْا ؕ— وَلِلنِّسَآءِ نَصِیْبٌ مِّمَّا اكْتَسَبْنَ ؕ— وَسْـَٔلُوا اللّٰهَ مِنْ فَضْلِهٖ ؕ— اِنَّ اللّٰهَ كَانَ بِكُلِّ شَیْءٍ عَلِیْمًا ۟
ఓ విశ్వాసులారా అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై దేని మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో దానికోసం మీరు ఆశపడకండి. అది క్రోధానికి మరియు అసూయకు దారి తీయకుండా ఉండటానికి. కావున అల్లాహ్ దేని మూలంగానైతే పురుషులకు ప్రత్యేకించాడో దాన్ని ఆశించటం స్త్రీల కొరకు తగదు. ఎందుకంటే ప్రతీ వర్గం వారికి వారికి తగ్గట్టుగా ప్రతిఫలములో నుంచి భాగము ఉన్నది. మరియు అల్లాహ్ తన ప్రసాదములో నుండి మీకు అధికంగా ఇవ్వాలని ఆయనతో కోరుకోండి. నిశ్చయంగా ప్రతి విషయం గురించి అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన ప్రతి రకం వారికి దానికి తగిన విధంగా ప్రసాదిస్తాడు.
阿拉伯语经注:
وَلِكُلٍّ جَعَلْنَا مَوَالِیَ مِمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ ؕ— وَالَّذِیْنَ عَقَدَتْ اَیْمَانُكُمْ فَاٰتُوْهُمْ نَصِیْبَهُمْ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدًا ۟۠
మరియు మేము మీలో నుండి ప్రతి ఒక్కరి కొరకు అసబహ్ ను చేశాము వారు తల్లిదండ్రులు మరియు దగ్గరి బందువులు వదిలి వెళ్ళిన అస్తిలో వారసులవుతారు. మరియు మీరు ఎవరితోనైతే ఒప్పందముపై,సహాయముపై దృఢమైన ప్రమాణము చేసి ఉంటే మీరు వారికి వారసత్వ సొమ్ములో వారి భాగమును ఇవ్వండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువుపై సాక్షిగా ఉన్నాడు. మీ ఈ ప్రమాణములపై మరియు మీ ఒప్పందములపై ఆయన సాక్ష్యం అందులో నుంచే. ఒప్పందము ద్వారా వారసులవ్వటం ఇస్లాం ఆరంభంలో ఉండేది. ఆ తరువాత అది రద్దుపరచబడినది.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• سعة رحمة الله بعباده؛ فهو سبحانه يحب التوبة منهم، والتخفيف عنهم، وأما أهل الشهوات فإنما يريدون بهم ضلالًا عن الهدى.
అల్లాహ్ కారుణ్యము తన దాసుల పట్ల విశాలమైనది. పరిశుద్ధుడైన ఆయన వారి నుండి పశ్ఛాత్తాపమును మరియు వారికి తేలిక చేయటమును ఇష్టపడుతున్నాడు. ఇక మనోవాంఛలకు లోనైనవారు తమ విషయంలో సన్మార్గమును వదిలి అపమార్గమును కోరుకుంటున్నారు.

• حفظت الشريعة حقوق الناس؛ فحرمت الاعتداء على الأنفس والأموال والأعراض، ورتبت أعظم العقوبة على ذلك.
ధర్మము ప్రజల హక్కులను పరిరక్షించింది. కావున అది ప్రాణములపై మరియు సంపదలపై మరియు మానముల పై దాడిని నిషేధించినది. మరియు దానిపై పెద్ద శిక్షను ఏర్పాటు చేసింది.

• الابتعاد عن كبائر الذنوب سبب لدخول الجنة ومغفرة للصغائر.
పెద్ద పాపముల నుండి దూరంగా ఉండటం స్వర్గములో ప్రవేశమునకు మరియు చిన్న పాపముల మన్నింపునకు ఒక కారణం.

• الرضا بما قسم الله، وترك التطلع لما في يد الناس؛ يُجنِّب المرء الحسد والسخط على قدر الله تعالى.
అల్లాహ్ నిర్దేశించిన వాటితో సంతృప్తి చెందటం మరియు ప్రజల చేతుల్లో ఉన్న దాన్ని వెతకటం మానేయటం మనిషిని అసూయ నుండి మరియు మహోన్నతుడైన అల్లాహ్ విధి వ్రాతపై ఆగ్రహం చెందటం నుండి కాపాడుతుంది.

 
含义的翻译 章: 尼萨仪
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭