Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 章: 呼德   段:
وَیَصْنَعُ الْفُلْكَ ۫— وَكُلَّمَا مَرَّ عَلَیْهِ مَلَاٌ مِّنْ قَوْمِهٖ سَخِرُوْا مِنْهُ ؕ— قَالَ اِنْ تَسْخَرُوْا مِنَّا فَاِنَّا نَسْخَرُ مِنْكُمْ كَمَا تَسْخَرُوْنَ ۟ؕ
అయితే నూహ్ తన ప్రభువు ఆదేశమును చేసి చూపించారు.ఆయన ఓడను తయారు చేయటం ప్రారంభించారు.ఎప్పుడెప్పుడైతే అతని జాతి పెద్దలు,వారి నాయకులు ఆయన ముందు నుంచి వెళ్లేవారో ఆయన ప్రాంతంలో నీరు కాని కాలువలు కాని లేకపోయినా ఆయన ఓడ తయారు చేయటాన్ని పూనుకోవటం వలన ఆయన పట్ల పరిహాసమాడేవారు.ఎప్పుడైతే ఆయన పట్ల వారి పరిహాసము ఎక్కువైపోయినదో ఆయన ఇలా పలికారు : ఓ పెద్దలారా ఒక వేళ ఈ రోజు మేము ఓడను నిర్మించటంపై మీరు పరిహాసమాడితే నిశ్చయంగా మేమూ మీ అజ్ఞానం వలన మీ వ్యవహారము మునగటం అవుతుందో దానితో మీ పట్ల పరిహాసమాడుతాము.
阿拉伯语经注:
فَسَوْفَ تَعْلَمُوْنَ ۙ— مَنْ یَّاْتِیْهِ عَذَابٌ یُّخْزِیْهِ وَیَحِلُّ عَلَیْهِ عَذَابٌ مُّقِیْمٌ ۟
అయితే ఇహలోకములో ఎవరిపై వారిని పరాభవము కలిగించే,అవమానము కలిగించే శిక్ష వస్తుందో,ప్రళయ దినాన ఎవరిపై అంతము కాని శాస్వత శిక్ష వస్తుందో వారు తొందరలోనే తెలుసుకుంటారు.
阿拉伯语经注:
حَتّٰۤی اِذَا جَآءَ اَمْرُنَا وَفَارَ التَّنُّوْرُ ۙ— قُلْنَا احْمِلْ فِیْهَا مِنْ كُلٍّ زَوْجَیْنِ اثْنَیْنِ وَاَهْلَكَ اِلَّا مَنْ سَبَقَ عَلَیْهِ الْقَوْلُ وَمَنْ اٰمَنَ ؕ— وَمَاۤ اٰمَنَ مَعَهٗۤ اِلَّا قَلِیْلٌ ۟
మరియు అల్లాహ్ తనకు ఆజ్ఞాపించినట్టే ఓడను తయారు చేయటాన్ని నూహ్ అలైహిస్సలాం పూర్తి చేశారు.చివరికి వారిని వినాశనం చేస్తూ మా ఆదేశం వచ్చి,మరియు తుఫాను ఆరంభం గురించి సూచిస్తూ వారు రొట్టెలను వండే పొయ్యి నుండి నీరు పొంగినప్పుడు మేము నూహ్ అలైహిస్సలాంను ఇలా ఆదేశించాము మీరు భూమిపై ఉండే జంతవుల రకముల్లోంచి రెండింటిని అంటే ఒక ఆడ,ఒక మగను ఓడలో ఎక్కించుకోండి.మరియు మీ కుటుంబము వారిలో ఎవరి గురించైతే అతను విశ్వసించకపోవటం వలన ముందు నుండి అతను ముంచబడుతాడు అని నిర్ణయం అయిపోయినదో వారు తప్ప ఇతరులను ఎక్కించుకోండి.మరియు మీ జాతి వారిలోంచి మీతోపాటు విశ్వసించిన వారిని ఎక్కించుకోండి.ఆయన జాతిలో ఆయన వారిని అల్లాహ్ విశ్వాసము వైపునకు పిలుస్తూ వారిలో సుధీర్గ కాలం ఉండిన తరువాత వారిలోంచి ఆయన తోపాటు చాలా తక్కువ మంది విశ్వసించారు.
阿拉伯语经注:
وَقَالَ ارْكَبُوْا فِیْهَا بِسْمِ اللّٰهِ مَجْرٖىهَا وَمُرْسٰىهَا ؕ— اِنَّ رَبِّیْ لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟
మరియు నూహ్ అలైహిస్సలాం తన కుటుంబం వారిలోంచి,తన జాతి వారిలోంచి విశ్వసించిన వారితో ఇలా పలికారు మీరు ఓడలోనికి ఎక్కండి.అల్లాహ్ నామముతో దాని పయనము,ఆయన నామముతో దాని ఆగటం అవుతుంది.నిశ్చయంగా నా ప్రభువు తన దాసుల్లోంచి పాపములకు మన్నింపు వేడుకొనే వారిని మన్నించేవాడు,వారిపై కనికరించేవాడు.విశ్వాసపరులని ఆయన వినాశనం నుండి రక్షించటం వారిపై ఆయన కారుణ్యం.
阿拉伯语经注:
وَهِیَ تَجْرِیْ بِهِمْ فِیْ مَوْجٍ كَالْجِبَالِ ۫— وَنَادٰی نُوْحُ ١بْنَهٗ وَكَانَ فِیْ مَعْزِلٍ یّٰبُنَیَّ ارْكَبْ مَّعَنَا وَلَا تَكُنْ مَّعَ الْكٰفِرِیْنَ ۟
మరియు ఓడ తనలో ఉన్న ప్రజలను,ఇతరులను తీసుకుని పర్వతాల్లాంటి పెద్ద పెద్ద అలల్లో పయనించింది.ఒక దయ గల తండ్రిలా నూహ్ అలైహిస్సలాం అవిశ్వాసపరుడైన తన కుమారుడిన పిలిచారు.మరియు అతడు తన తండ్రి నుండి,తన జాతివారి నుండి ఒంటరిగా ఒక ప్రదేశములో ఉన్నాడు. ఓ నా ప్రియ కుమారా నీవు మునగటం నుండి బ్రతికి బయటపడటానికి మాతో పాటు ఓడలో ఎక్కు.మరయు నీవు సత్య తిరస్కారుల్లోంచి కాకు.అలాంటప్పుడు నీకూ వారికి మునగటం ద్వారా సంభవించిన వినాశనము సంభవిస్తుంది.
阿拉伯语经注:
قَالَ سَاٰوِیْۤ اِلٰی جَبَلٍ یَّعْصِمُنِیْ مِنَ الْمَآءِ ؕ— قَالَ لَا عَاصِمَ الْیَوْمَ مِنْ اَمْرِ اللّٰهِ اِلَّا مَنْ رَّحِمَ ۚ— وَحَالَ بَیْنَهُمَا الْمَوْجُ فَكَانَ مِنَ الْمُغْرَقِیْنَ ۟
నూహ్ కుమారుడు నూహ్ తో ఇలా పలికాడు : నా వద్దకు నీరు చేరటం నుండి ఆపటానికి నేను ఎత్తైన పర్వతంపై శరణం తీసుకుంటాను.నూహ్ తన కుమారునికి ఇలా సమాధానమిచ్చారు : పరిశుద్ధుడైన తాను తలచుకున్న వారిని తన కరుణతో కరుణించే కరుణామయుడైన అల్లాహ్ తప్ప ఇంకెవరూ తూఫానులో మునిగే అల్లాహ్ శిక్ష నుండి ఈ రోజు ఆపేవాడు ఉండడు.నిశ్చయంగా ఆయనే అతడిని మునగటం నుండి ఆపుతాడు.అప్పుడే ఒక కెరటము నూహ్ ను ఆయన అవిశ్వాస కుమారుడిను వేరు చేసింది.ఆయన కుమారుడు తన అవిశ్వాసం వలన తూఫానులో మునిగేవారిలోంచి అయిపోయాడు.
阿拉伯语经注:
وَقِیْلَ یٰۤاَرْضُ ابْلَعِیْ مَآءَكِ وَیٰسَمَآءُ اَقْلِعِیْ وَغِیْضَ الْمَآءُ وَقُضِیَ الْاَمْرُ وَاسْتَوَتْ عَلَی الْجُوْدِیِّ وَقِیْلَ بُعْدًا لِّلْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
మరియు అల్లాహ్ తూఫాను ఆగిపోయిన తరువాత భూమిని ఓ భూమి నీపై ఉన్న తూఫాను నీటిని త్రాగేయి అని ఆదేశించాడు.ఆకాశముని ఓ ఆకాశమా నీవు వర్షాన్ని కురిపించకు,ఆపివేయి అని ఆదేశించాడు.మరియు నీరు తగ్గుముఖం పట్టి చివరికి నేల పొడి అయిపోయినది.మరియు అల్లాహ్ అవిశ్వాసపరులను తుదిముట్టించాడు.మరియు ఓడ జూదీ కొండపై వెళ్ళి ఆగినది.అవిశ్వాసం వలన అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారి కొరకు దూరము,వినాశనము అవుగాక అని అనబడింది.
阿拉伯语经注:
وَنَادٰی نُوْحٌ رَّبَّهٗ فَقَالَ رَبِّ اِنَّ ابْنِیْ مِنْ اَهْلِیْ وَاِنَّ وَعْدَكَ الْحَقُّ وَاَنْتَ اَحْكَمُ الْحٰكِمِیْنَ ۟
మరియు నూహ్ అలైహిస్సలాం తన ప్రభువును సహాయం కోసం పిలిచారు.అయితే ఆయన ఇలా పలికారు : ఓ నా ప్రభువా నిశ్చయంగా నా కుమారుడు నీవు రక్షిస్తానని వాగ్దానం చేసిన నా కుటుంబములోని వాడు.నీ వాగ్దానము సత్యమైనది అందులో ఎటువంటి విభేదము లేదు.మరియు నీవే అందరికన్నా న్యాయపూరితముగా తీర్పునిచ్చేవాడివి,వారిలో ఎక్కువ జ్ఞానము కలవాడివి.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• بيان عادة المشركين في الاستهزاء والسخرية بالأنبياء وأتباعهم.
దైవ ప్రవక్తల పట్ల,వారిని అనుసరించే వారి పట్ల హేళన చేయటం,పరిహాసమాడటం ముష్రికుల అలవాటు ప్రకటన.

• بيان سُنَّة الله في الناس وهي أن أكثرهم لا يؤمنون.
ప్రజల్లో చాలా మంది విశ్వసించకపోవటం అల్లాహ్ సాంప్రదాయం అని ప్రకటన.

• لا ملجأ من الله إلا إليه، ولا عاصم من أمره إلا هو سبحانه.
అల్లాహ్ నుండి శరణాలయం ఆయనవైపే,ఆయన ఆదేశము నుండి కాపాడేవాడూ పరిశుద్ధుడైన ఆయనే.

 
含义的翻译 章: 呼德
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭