Check out the new design

《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 * - 译解目录


含义的翻译 章: 优努斯   段:
قَالَ قَدْ اُجِیْبَتْ دَّعْوَتُكُمَا فَاسْتَقِیْمَا وَلَا تَتَّبِعٰٓنِّ سَبِیْلَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ ۟
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ఓ మూసా,హారూన్ ఫిర్ఔన్,అతని జాతి పెధ్దల విషయంలో నేను మీ ఉభయుల శాపము ను స్వీకరించాను.అయితే మీరిద్దరు మీ ధర్మము పై స్థిరంగా ఉండండి.మరియు మీరిద్దరు దాని నుండి సత్యమార్గము తెలియని అజ్ఞానుల మార్గమును అనుసరించటం వైపునకు మరలకండి.
阿拉伯语经注:
وَجٰوَزْنَا بِبَنِیْۤ اِسْرَآءِیْلَ الْبَحْرَ فَاَتْبَعَهُمْ فِرْعَوْنُ وَجُنُوْدُهٗ بَغْیًا وَّعَدْوًا ؕ— حَتّٰۤی اِذَاۤ اَدْرَكَهُ الْغَرَقُ قَالَ اٰمَنْتُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا الَّذِیْۤ اٰمَنَتْ بِهٖ بَنُوْۤا اِسْرَآءِیْلَ وَاَنَا مِنَ الْمُسْلِمِیْنَ ۟
మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి కొరకు సముద్రమును చీల్చిన తరువాత సముద్రమును దాటటం సులభతరం చేశాము.చివరికి వారు సురక్షితముగా దాన్ని దాటారు.ఫిర్ఔన్,అతని సైన్యాలు వారిని దుర్మార్గముతో,శతృత్వముతో వెంటాడారు. చివరికి సముద్రము అతన్ని కప్పివేసింది. మరియు అతను మునిగిపోయాడు.మరియు అతడు విముక్తత నుండి ఆశ కోల్పోయాడు. ఇస్రాయీలు సంతతివారు విశ్వసించిన వాస్తవ ఆరాధ్యదైవమును నేను విశ్వసించాను మరియు నేను అల్లాహ్ కొరకు విధేయత చూపే వారిలోంచి అయిపోయాను అని అన్నాడు.
阿拉伯语经注:
آٰلْـٰٔنَ وَقَدْ عَصَیْتَ قَبْلُ وَكُنْتَ مِنَ الْمُفْسِدِیْنَ ۟
జీవితము నుండి నిరాశుడైన తరువాత ఇప్పుడు నీవు విశ్వసిస్తావా .ఓ పిర్ఔన్ నిశ్ఛయంగా నీవు శిక్ష రాక ముందే ఆయనను తిరస్కరించి,ఆయన మార్గము నుండి ఆపి అల్లాహ్ కు అవిధేయత చూపావు.నీవు స్వయంగా మార్గభ్రష్టుడివై,ఇతరులను మార్గభ్రష్టులు చేసి చెడును వ్యాపింపజేసే వారిలో చేరిపోయావు.
阿拉伯语经注:
فَالْیَوْمَ نُنَجِّیْكَ بِبَدَنِكَ لِتَكُوْنَ لِمَنْ خَلْفَكَ اٰیَةً ؕ— وَاِنَّ كَثِیْرًا مِّنَ النَّاسِ عَنْ اٰیٰتِنَا لَغٰفِلُوْنَ ۟۠
అయితే ఓ ఫిర్ఔన్ ఈ రోజు మేము నిన్ను సముద్రము నుండి వెలికి తీస్తాము మరియు నీ తరువాత వచ్చేవారు నీ ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి మేము నిన్ను భూ ఉపరితలంపై ఉండేటట్లుగా చేస్తాము.మరియు నిశ్ఛయంగా చాలా మంది ప్రజలు మా సామర్ధ్యపు వాదనలు,ఋజువుల నుండి నిర్లక్ష్యం వహిస్తున్నారు.వాటి విషయంలో యోచన చేయటం లేదు.
阿拉伯语经注:
وَلَقَدْ بَوَّاْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ مُبَوَّاَ صِدْقٍ وَّرَزَقْنٰهُمْ مِّنَ الطَّیِّبٰتِ ۚ— فَمَا اخْتَلَفُوْا حَتّٰی جَآءَهُمُ الْعِلْمُ ؕ— اِنَّ رَبَّكَ یَقْضِیْ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟
మరియు నిశ్ఛయంగా మేము ఇస్రాయీలు సంతతి వారిని గౌరవప్రధమైన సిరియా దేశంలో ప్రశంసాత్మకమైన స్థలములో,సంతృప్తికరమైన నివాసములో దించాము.మరియు మేము వారికి స్వచ్ఛమైన,ధర్మసమ్మతమైన ఆహారోపాదిని కల్పించాము.ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గుణము గురించి వారు తౌరాతులో చదివిన దాన్ని దృవీకరించే ఖుర్ఆన్ వారి వద్దకు వచ్చెంత వరకు వారు తమ ధర్మ విషయంలో విభేదించుకోలేదు.ఎప్పుడైతే వారు దాన్ని తిరస్కరించారో వారి మాతృభూములు గింజుకోబడ్డాయి.ఓ ప్రవక్తా నిశ్ఛయంగా నీ ప్రభువు వారు విభేదించుకున్న వాటి విషయంలో ప్రళయదినాన వారి మధ్య తీర్పునిస్తాడు.అయితే ఆయన వారిలోంచి సత్యవంతుడికి,అసత్యవంతుడికి వారిద్దరిలోంచి ప్రతిఒక్కరికి వారి అర్హతకు తగిన విధంగా ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
阿拉伯语经注:
فَاِنْ كُنْتَ فِیْ شَكٍّ مِّمَّاۤ اَنْزَلْنَاۤ اِلَیْكَ فَسْـَٔلِ الَّذِیْنَ یَقْرَءُوْنَ الْكِتٰبَ مِنْ قَبْلِكَ ۚ— لَقَدْ جَآءَكَ الْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُوْنَنَّ مِنَ الْمُمْتَرِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మేము మీ వైపు అవతరింపజేసిన ఖుర్ఆన్ వాస్తవికత విషయంలో మీకు సందేహము,సంశయము ఉంటే మీరు యూదుల్లోంచి తౌరాతును చదివే విశ్వాసపరులను,క్రైస్తవుల్లోంచి ఇంజీలను చదివే విశ్వాసపరులను అడగితే వారు తమ ఇద్దరి గ్రంధాల్లో దాని గుణమును పొందటం వలన మీపై అవతరించినది సత్యం అని మీకు సమాధానమిస్తారు.నిశ్ఛయంగా మీ ప్రభువు వద్ద నుండి ఎటువంటి సందేహము లేని సత్యము మీ వద్దకు వచ్చినది.అయితే మీరు సందేహము చూపే వారిలోంచి కాకండి.
阿拉伯语经注:
وَلَا تَكُوْنَنَّ مِنَ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِ اللّٰهِ فَتَكُوْنَ مِنَ الْخٰسِرِیْنَ ۟
మరియు మీరు అల్లాహ్ వాదనలను,ఆయన ఋజువులను తిరస్కరించిన వారిలోంచి కాకండి.దానివలన మీరు తమ అవిశ్వాసం వలన తమ స్వయమును కావాలని వినాశనము కలిగే స్థానాల్లో చేర్చి స్వయానికి నష్టం కలిగించుకున్న వారిలోంచి అయిపోతారు.ఈ హెచ్చరిక అంతా సందేహము,తిరస్కారము యొక్క తివ్రతను స్పష్టపరచటానికి.కాకపోతే ప్రవక్త తన నుండి ఈ చర్య జరగటము నుండి దోషరహితులు.
阿拉伯语经注:
اِنَّ الَّذِیْنَ حَقَّتْ عَلَیْهِمْ كَلِمَتُ رَبِّكَ لَا یُؤْمِنُوْنَ ۟ۙ
నిశ్ఛయంగా ఎవరిపైనైతే అల్లాహ్ నిర్ణయం వారు అవిశ్వాసం పై తమ మొండి వైఖరి వలన అవిశ్వాసము పైనే మరణిస్తారని జరిగినదో వారు ఎన్నటికి విశ్వసించరు.
阿拉伯语经注:
وَلَوْ جَآءَتْهُمْ كُلُّ اٰیَةٍ حَتّٰی یَرَوُا الْعَذَابَ الْاَلِیْمَ ۟
మరియు ఒక వేళ వారి వద్దకు ధర్మం యొక్క,విశ్వము యొక్క సూచనలన్ని వచ్చి చివరికి వారు బాధాకరమైన శిక్షను చూసి అప్పుడు వారు విశ్వసిస్తే ఆ విశ్వాసము వారికి ప్రయోజనం కలిగించదు.
阿拉伯语经注:
这业中每段经文的优越:
• وجوب الثبات على الدين، وعدم اتباع سبيل المجرمين.
ధర్మము పై స్థిరత్వమును కలిగి ఉండటం,అపరాధుల మార్గమును అనుసరించకుండా ఉండటం తప్పనిసరి.

• لا تُقْبل توبة من حَشْرَجَت روحه، أو عاين العذاب.
ఎవరికైతే చావు ఆసన్నమవుతుందో లేదా శిక్షను కళ్ళారా చూస్తాడో అతని పశ్ఛాత్తాపము స్వీకరించబడదు.

• أن اليهود والنصارى كانوا يعلمون صفات النبي صلى الله عليه وسلم، لكن الكبر والعناد هو ما منعهم من الإيمان.
నిశ్ఛయంగా యూదులకు,క్రైస్తవులకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుణగణాల గురించి తెలుసు.కాని వారి దురహంకారము,మొండితనము వారిని విశ్వాసము నుండి ఆపివేసింది.

 
含义的翻译 章: 优努斯
章节目录 页码
 
《古兰经》译解 - 古兰经注释泰卢固语简要翻译 - 译解目录

古兰经注释研究中心发行。

关闭