Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: مائىدە   ئايەت:
وَمَا لَنَا لَا نُؤْمِنُ بِاللّٰهِ وَمَا جَآءَنَا مِنَ الْحَقِّ ۙ— وَنَطْمَعُ اَنْ یُّدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصّٰلِحِیْنَ ۟
మరియు మా మధ్య అల్లాహ్ పై,ఆయన అవతరింపజేసి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన సత్యం పై విశ్వాసం మధ్య ఏ కారణం చేరుతుంది.వాస్తవానికి మేము దైవ ప్రవక్తలతో పాటు,అల్లాహ్ శిక్షకు భయపడుతూ,ఆయనకు విధేయత చూపుతూ దైవ ప్రవక్తలను అనుసరించే వారితో పాటు స్వర్గంలో ప్రవేశించాలని ఆశిస్తున్నాము.
ئەرەپچە تەپسىرلەر:
فَاَثَابَهُمُ اللّٰهُ بِمَا قَالُوْا جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَذٰلِكَ جَزَآءُ الْمُحْسِنِیْنَ ۟
సత్యాన్ని స్వీకరించి,దానిపై వారు విశ్వాసమును కనబరచటానికి ప్రతి ఫలంగా వారికి అల్లాహ్ భవనాల,వృక్షాల క్రింది నుంచి కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదించాడు. వాటిలో వారు ఎల్లప్పుడు ఉంటారు.సత్యాన్ని అనుసరించి ఎటువంటి పరిమితి లేదా షరతు లేకుండా దానికి కట్టుబడి ఉండటం వలన సజ్జనులకు ఈ ప్రతిఫలము ప్రసాదించటం జరిగింది.
ئەرەپچە تەپسىرلەر:
وَالَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَحِیْمِ ۟۠
అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరిచేవారు,అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన ఆయతులను తిరస్కరించే వారందరు రగులుతున్న నరకాగ్నిలో పడి ఉంటారు.వారు ఎన్నటికీ దాని నుండి బయటకు రాలేరు.
ئەرەپچە تەپسىرلەر:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُحَرِّمُوْا طَیِّبٰتِ مَاۤ اَحَلَّ اللّٰهُ لَكُمْ وَلَا تَعْتَدُوْا ؕ— اِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْمُعْتَدِیْنَ ۟
ఓ విశ్వాసపరులారా తినే ఆహారములో నుంచి,త్రాగే పానియాల్లో నుంచి,స్తీలలో నుంచి కోరికలను తీర్చే ధర్మసమ్మతమైన వాటిని సన్యాసంగా లేదా ఆరాధనగా నిషేదించుకోకండి.అల్లాహ్ మీ పై నిషేదించిన వాటి హద్దులను అతిక్రమించకండి.నిశ్చయంగా అల్లాహ్ తన హద్దులను అతిక్రమించే వారిని ఇష్టపడడు.అంతే కాక వారిని ధ్వేషిస్తాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَكُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ حَلٰلًا طَیِّبًا ۪— وَّاتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ ۟
అల్లాహ్ మీవద్దకు తీసుకుని వచ్చిన తన ఆహారములో నుంచి పరిశుద్ధమైనవి,ధర్మసమ్మతమైనవిగా ఉన్నప్పుడు మీరు తినండి.అంతేకాని నిషేధించబడిన వాటిని తినకండి. ఉదాహరణకు బలవంతాన తీసుకోవబడినది,చెడ్డదైనది.అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కి భయపడుతూ ఉండండి.ఆయన పైనే మీరు విశ్వాసమును కనబరుస్తున్నారు.ఆయనపై మీ యొక్క విశ్వాసము ఆయనకు భయపడటంను మీపై తప్పనిసరి చేస్తుంది.
ئەرەپچە تەپسىرلەر:
لَا یُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِیْۤ اَیْمَانِكُمْ وَلٰكِنْ یُّؤَاخِذُكُمْ بِمَا عَقَّدْتُّمُ الْاَیْمَانَ ۚ— فَكَفَّارَتُهٗۤ اِطْعَامُ عَشَرَةِ مَسٰكِیْنَ مِنْ اَوْسَطِ مَا تُطْعِمُوْنَ اَهْلِیْكُمْ اَوْ كِسْوَتُهُمْ اَوْ تَحْرِیْرُ رَقَبَةٍ ؕ— فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ ثَلٰثَةِ اَیَّامٍ ؕ— ذٰلِكَ كَفَّارَةُ اَیْمَانِكُمْ اِذَا حَلَفْتُمْ ؕ— وَاحْفَظُوْۤا اَیْمَانَكُمْ ؕ— كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా మీ నోటా వెలువడే ప్రమాణాలకు అల్లాహ్ లెక్కతీసుకోడు. కావాలని ఉద్దేశ్యపూర్వకంగా మనస్పూర్తిగా మీరు చేసే ప్రమాణాలకు ,ప్రమాణాలను విరగ్గొట్టటం గురించి లెక్క తీసుకుంటాడు.ఉద్దేశ్యపూర్వకంగా మీరు చేసిన ప్రమాణపు పాపమును ,దానిని మీ నోటితో పలికి దానిని భంగపరచినప్పుడు మూడు వస్తువుల్లోంచి ఏదైన ఒక దానిని ఎంచుకుని పూర్తి చేస్తే పాపమును తుడిచి వేస్తుంది.అవి పది మంది నిరు పేదలకు మీ ప్రాంతములో తినే ఆహారములో నుంచి మధ్యరకపు భోజనం తినిపించడం,ప్రతి మనిషికి సగం సా (1.25 కిలోలు) లేదా వారికి అక్కడ వాడకంలో ఉన్న బట్టలను తొడిగించటం లేదా ఒక విశ్వాసపరుడైన బానిసను విముక్తి కలిగించటం.తన ప్రమాణ పరిహారమును చెల్లించే వ్యక్తి ఈ మూడింటిలోంచి ఏదీ పొందకపోతే మూడు రోజుల ఉపవాసములను పరిహారంగా ఉండాలి. ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ పై ప్రమాణం చేసి భంగపరచినప్పుడు తెలియపరచిన ఇదే మీ ప్రమాణాల పరిహారము.మీ ప్ఱమాణాలను కాపాడుకోండి అల్లాహ్ పై అబద్దపు ప్రమాణాలు చేయకుండా,అల్లాహ్ పై అధిక ప్రమాణాలు చేయకుండా,ఏ ప్రమాణంలో మేలున్నదో అటువంటి ప్రమాణాన్ని భంగపరచకుండా.మీరు మంచిని చేయండి.ప్రమాణాల పరిహారమును అల్లాహ్ మీకు తెలిపిన విదంగా చెల్లించండి.అల్లాహ్ హలాల్ హరామ్ గురించి తన స్పష్టమైన ఆదేశాలను మీ కొరకు వివరిస్తున్నాడు.బహుశా మీరు అల్లాహ్ మీకు తెలియని విషయాలను తెలియపరచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని.
ئەرەپچە تەپسىرلەر:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّمَا الْخَمْرُ وَالْمَیْسِرُ وَالْاَنْصَابُ وَالْاَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّیْطٰنِ فَاجْتَنِبُوْهُ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా మతిని పోగొట్టే మత్తు పదార్దం (ముస్కిర్),ఇరువైపుల నుండి ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉన్న జూదము,విగ్రహారాధకులు జంతువులను బలి ఇవ్వటానికి గౌరవంగా ఏర్పాటు చేసుకున్న లేదా ఆరాధన కోసం పాతిపెట్టుకున్న రాళ్ళు,తమ కోసం నిర్ధారించబడిన అగోచర విషయాలను వేటి ద్వారా నైతే అన్వేషిస్తారో ఆ బాణాలు ఇవన్ని షైతాను అలంకరించిన పాప కార్యాలు.అయితే మీరు గౌరవప్రదమైన జీవితము ద్వారా,పర లోకములో స్వర్గ వనాల అనుగ్రహాల ద్వారా సాఫల్యం పొందటం కొరకు వాటి నుండి దూరంగా ఉండండి.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• الأمر بتوخي الطيب من الأرزاق وترك الخبيث.
మంచి ఆహారమును ఆశించటం,చెడ్డవాటిని వదిలివేయటం గురించి ఆదేశం.

• عدم المؤاخذة على الحلف عن غير عزم للقلب، والمؤاخذة على ما كان عن عزم القلب ليفعلنّ أو لا يفعلنّ.
ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా చేసిన ప్రమాణాలపై లెక్క తీసుకోవటం జరగదు,ఉద్దేశ్యపూర్వకంగా ప్రమాణం చేస్తే దానిని చేసినా గాని చేయకపోయినా గాని లెక్క తీసుకొనబడుతుంది.

• بيان أن كفارة اليمين: إطعام عشرة مساكين، أو كسوتهم، أو عتق رقبة مؤمنة، فإذا لم يستطع المكفِّر عن يمينه الإتيان بواحد من الأمور السابقة، فليكفِّر عن يمينه بصيام ثلاثة أيام.
పది మంది నిరుపేదలకి భోజన ఏర్పాటు లేదా వారికి దుస్తుల ఏర్పాటు లేదా విశ్వాస పరుడైన బానిసను విముక్తి కలిగించటం ప్రమాణాల పరిహారము అని ప్రకటన.పరిహారము చెల్లించే వ్యక్తి తన ప్రమాణమునకు పరిహారంగా ముందు ప్రకటించబడిన విషయాల్లోంచి ఏ ఒక్కటి చేయలకపోతే మూడు రోజులు ఉపవాసమును తన ప్రమాణమునకు పరిహారంగా ఉండాలి.

• قوله تعالى: ﴿... إنَّمَا الْخَمْرُ ...﴾ هي آخر آية نزلت في الخمر، وهي نص في تحريمه.
అల్లాహ్ వాక్కు (ఇన్నమల్ కమ్రు.) ఈ ఆయతు మధ్యం విషయం లో అవతరింపబడిన చివరి ఆయతు.ఇది దాని పూర్తి నిషేదమునకు ఆధారం.

 
مەنالار تەرجىمىسى سۈرە: مائىدە
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش