Check out the new design

قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى


مەنالار تەرجىمىسى سۈرە: سەبەئ   ئايەت:

సబా

سۈرىنىڭ مەقسەتلىرىدىن:
بيان أحوال الناس مع النعم، وسنة الله في تغييرها.
కృపలతో ప్రజల స్థితిగతుల ప్రకటన మరియు వాటిని మార్చడంలో అల్లాహ్ సంప్రదాయము.

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ وَلَهُ الْحَمْدُ فِی الْاٰخِرَةِ ؕ— وَهُوَ الْحَكِیْمُ الْخَبِیْرُ ۟
సర్వస్తోత్రాలన్నీ అల్లాహ్ కొరకే ఆకాశముల్లో ఉన్నవన్నీ, భూమిలో ఉన్నవన్నీ సృష్టిపరంగా,అధికారపరంగా పర్యాలోచనపరంగా ఆయనకే చెందుతాయి. పరలోకములో పొగడ్తలు పరిశుద్ధుడైన ఆయన కొరకే. మరియు ఆయన తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు. తన దాసుల స్థితులను గురించి తెలుసుకునే వాడు. వాటిలో నుండి ఏది ఆయనపై గోప్యంగా ఉండదు.
ئەرەپچە تەپسىرلەر:
یَعْلَمُ مَا یَلِجُ فِی الْاَرْضِ وَمَا یَخْرُجُ مِنْهَا وَمَا یَنْزِلُ مِنَ السَّمَآءِ وَمَا یَعْرُجُ فِیْهَا ؕ— وَهُوَ الرَّحِیْمُ الْغَفُوْرُ ۟
భూమిలో ప్రవేశించే నీరు,మొక్కల గురించి ఆయనకు తెలుసు. మరియు దాని నుండి వెలుపలకి వచ్చే మొక్కలు,ఇతరవాటి గురించి ఆయనకు తెలుసు. మరియు ఆకాశము నుండి దిగే వర్షము,దైవదూతలు,ఆహారము గురించి ఆయనకు తెలుసు. మరియు ఆకాశము వైపునకు ఎక్కే దైవదూతలు,తన దాసుల కర్మలు,వారి ఆత్మల గురించి ఆయనకు తెలుసు. మరియు ఆయన విశ్వాసపరులైన తన దాసులపై అపారంగా కరుణించేవాడు, తన వద్ద పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును.
ئەرەپچە تەپسىرلەر:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لَا تَاْتِیْنَا السَّاعَةُ ؕ— قُلْ بَلٰی وَرَبِّیْ لَتَاْتِیَنَّكُمْ ۙ— عٰلِمِ الْغَیْبِ ۚ— لَا یَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِی السَّمٰوٰتِ وَلَا فِی الْاَرْضِ وَلَاۤ اَصْغَرُ مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْبَرُ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِیْنٍ ۟ۙ
అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారు ఇలా అంటారు : ప్రళయం మా వద్దకు ఎన్నటికీ రాదు. ఓ ప్రవక్తా వారితో అనండి : ఎందుకు రాదు అల్లాహ్ సాక్షిగా మీరు తిరస్కరిస్తున్న ప్రళయం మీ వద్ధకు తప్పకుండా వస్తుంది. దాని యొక్క సమయం గురించి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అగోచరమైన ప్రళయము,ఇతర వాటి గురించి పరిశుద్ధుడైన ఆయనకు తెలుసు. ఆకాశముల్లో గాని భూమిలో గాని చిన్న చీమ బరువంతది కూడా పరిశుద్ధుడై ఆయన జ్ఞానము నుండి అదృశ్యం కాదు. ఈ ప్రస్తావించబడిన దాని నుండి చిన్నది గాని పెద్దది గాని ఆయన నుండి అదృశ్యం కాదు కానీ అది ఒక స్పష్టమైన పుస్తకములో వ్రాయబడి ఉన్నది. అది లౌహె మహ్ఫూజ్ అందులో ప్రళయం వరకు జరిగేవన్ని వ్రాయబడి ఉన్నాయి.
ئەرەپچە تەپسىرلەر:
لِّیَجْزِیَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِیْمٌ ۟
అల్లాహ్ లౌహె మహ్ఫూజ్ లో నిరూపితం చేసిన దాన్ని అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,సత్కార్యములు చేసిన వారికి ప్రతిఫలమును ప్రసాదించటానికి నిరూపించాడు. ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరి కొరకు అల్లాహ్ వద్ద నుండి వారి పాపములకు మన్నింపు ఉన్నది. ఆయన వాటి వలన వారిని శిక్షించడు. మరియు వారి కొరకు గౌరవప్రధమైన ఆహారోపాధి కలదు. అది ప్రళయదినమున ఆయన స్వర్గము.
ئەرەپچە تەپسىرلەر:
وَالَّذِیْنَ سَعَوْ فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ مِّنْ رِّجْزٍ اَلِیْمٌ ۟
మరియు ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన ఆయతులను (సూచనలను) విఫలం చేయటానికి ప్రయత్నిస్తారో వారు వాటిని మంత్రజాలము అన్నారు. మరియు మా ప్రవక్తలను జ్యోతిష్యుడు,మంత్రజాలకుడు,కవి అన్నారు. ఈ గుణాలతో వర్ణించబడిన వారందరి కొరకు ప్రళయదినాన ఎంతో చెడ్డదైన,తీవ్రమైన శిక్ష కలదు.
ئەرەپچە تەپسىرلەر:
وَیَرَی الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ الَّذِیْۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ هُوَ الْحَقَّ ۙ— وَیَهْدِیْۤ اِلٰی صِرَاطِ الْعَزِیْزِ الْحَمِیْدِ ۟
మరియు అనుచరుల్లోంచి విద్వాంసులు, గ్రంధవహుల పండితుల్లోంచి విశ్వసించిన వారు మీ వైపునకు అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ఎటువంటి సందేహం లేని సత్యమని సాక్ష్యం పలుకుతారు. మరియు అది ఎవరూ ఓడించలేని ఆధిక్యుడి మార్గం వైపునకు మార్గదర్శకతం వహిస్తుంది. ఆయన ఇహపరాల్లో స్థుతింపదగినవాడు.
ئەرەپچە تەپسىرلەر:
وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا هَلْ نَدُلُّكُمْ عَلٰی رَجُلٍ یُّنَبِّئُكُمْ اِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ ۙ— اِنَّكُمْ لَفِیْ خَلْقٍ جَدِیْدٍ ۟ۚ
మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసం కనబరచిన వారు తమలోని కొంతమందితో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాని గురించి ఆశ్ఛర్యపోతు,హేళన చేస్తూ ఇలా పలికారు : మీరు మరణించి ముక్కలు ముక్కలగా చేయబడినప్పుడు మీరు మీ మరణం తరువాత జీవింపజేయబడి లేపబడుతారని మీకు తెలియపరిచే ఒక వ్యక్తి ని మేము మీకు చూపించమా ?.
ئەرەپچە تەپسىرلەر:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• سعة علم الله سبحانه المحيط بكل شيء.
పరిశుద్ధుడైన అల్లాహ్ యొక్క జ్ఞానము విస్తరణ అన్ని వస్తువులకు చుట్టుముట్టి ఉన్నది.

• فضل أهل العلم.
జ్ఞానము కలవారి యొక్క ప్రాముఖ్యత.

• إنكار المشركين لبعث الأجساد تَنَكُّر لقدرة الله الذي خلقهم.
శరీరములు మరలా లేపబడటమును ముష్రికుల యొక్క తిరస్కారము వారిని సృష్టించిన అల్లాహ్ యొక్క సామర్ధ్యమును తిరస్కరించటం.

 
مەنالار تەرجىمىسى سۈرە: سەبەئ
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان تەتقىقاتى تەپسىر مەركىزى چىقارغان.

تاقاش