Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Al-Hashr   Ayah:
ذٰلِكَ بِاَنَّهُمْ شَآقُّوا اللّٰهَ وَرَسُوْلَهٗ ۚ— وَمَنْ یُّشَآقِّ اللّٰهَ فَاِنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟
అది ఏదైతే వారికి సంభవించినది సంభవించింది. ఎందుకంటే వారు తమ అవిశ్వాసం ద్వారా తమ ప్రమాణములను భంగ పరచటం ద్వారా అల్లాహ్ పట్ల శతృత్వమును చూపారు మరియు ఆయన ప్రవక్త పట్ల శతృత్వమును చూపారు. ఎవరైతే అల్లాహ్ పట్ల శతృత్వమును చూపుతారో నిశ్ఛయంగా అల్లాహ్ కఠినంగా శిక్షంచేవాడు. తొందరలోనే ఆయన కఠినమైన శిక్ష అతనికి కలుగుతుంది.
Ang mga Tafsir na Arabe:
مَا قَطَعْتُمْ مِّنْ لِّیْنَةٍ اَوْ تَرَكْتُمُوْهَا قَآىِٕمَةً عَلٰۤی اُصُوْلِهَا فَبِاِذْنِ اللّٰهِ وَلِیُخْزِیَ الْفٰسِقِیْنَ ۟
విశ్వాసపరుల సమాజం వారా బనూ నజీర్ యుద్దంలో మీరు ఏవైతే ఖర్జూరపు చెట్లను అల్లాహ్ శతృవులను ఆగ్రహమునకు గురి చేయటానికి మీరు నరికారో లేదా మీరు ప్రయోజనం చెందటానికి వాటిని వాటి బోదెలపై వదిలి వేశారో అది అల్లాహ్ ఆదేశముతోనే. అది వారు అనుకున్నట్లు భూమిలో ఉపద్రవాన్ని తలపెట్టటం కోసం కాదు. మరియు యూదుల్లోంచి ఆయన విధేయత నుండి వైదొలగిన వారికి అల్లాహ్ దాని ద్వారా అవమానపరచటానికి. వారు ప్రమాణమును భంగపరిచారు. మరియు వారు విశ్వాసపాత్రత మార్గమునకు భిన్నంగా ద్రోహ మార్గమును ఎంచుకున్నారు.
Ang mga Tafsir na Arabe:
وَمَاۤ اَفَآءَ اللّٰهُ عَلٰی رَسُوْلِهٖ مِنْهُمْ فَمَاۤ اَوْجَفْتُمْ عَلَیْهِ مِنْ خَیْلٍ وَّلَا رِكَابٍ وَّلٰكِنَّ اللّٰهَ یُسَلِّطُ رُسُلَهٗ عَلٰی مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
బనూ నజీర్ సంపదల్లోంచి అల్లాహ్ ఏదైతే తన ప్రవక్తకు అందజేశాడో దాన్ని పొందే విషయంలో మీరు సవారి చేసే గుఱ్రములను గాని ఒంటెలను గాని మీరు పరుగెత్తించలేదు. మరియు ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. కానీ అల్లాహ్ తాను తలచుకున్న వారిపై తన ప్రవక్తలకు ఆధిక్యతను ప్రసాదిస్తాడు. వాస్తవానికి ఆయన తన ప్రవక్తకు బనూ నజీర్ పై ఆధిక్యతను ప్రసాదించాడు. కాబట్టి ఆయన ఎటువంటి యుద్దం లేకుండానే వారి బస్తీలపై విజయం పొందారు. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సమర్ధుడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
Ang mga Tafsir na Arabe:
مَاۤ اَفَآءَ اللّٰهُ عَلٰی رَسُوْلِهٖ مِنْ اَهْلِ الْقُرٰی فَلِلّٰهِ وَلِلرَّسُوْلِ وَلِذِی الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنِ وَابْنِ السَّبِیْلِ ۙ— كَیْ لَا یَكُوْنَ دُوْلَةً بَیْنَ الْاَغْنِیَآءِ مِنْكُمْ ؕ— وَمَاۤ اٰتٰىكُمُ الرَّسُوْلُ فَخُذُوْهُ ۚ— وَمَا نَهٰىكُمْ عَنْهُ فَانْتَهُوْا ۚ— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟ۘ
అల్లాహ్ బస్తీ వాసుల సంపదల్లోంచి ఏదైతే తన ప్రవక్తకు ఎటువంటి యుద్దం లేకుండా అనుగ్రహించాడో అది అల్లాహ్ కు చెందినది. ఆయన దాన్ని తాను తలచిన వారికి ఇస్తాడు. మరియు ప్రవక్తకు అధికారం కలదు. మరియు ఆయన బంధువులైన హాషిమ్ సంతతి మరియు ముత్తలిబ్ సంతతి కొరకు అధికారము కలదు అది వారు సదఖా నుండి ఆపబడిన దానికి బదులుగా. మరియు అనాధులకి,పేదవారికి మరియు తన ఖర్చులను కోల్పోయిన బాటసారికి అధికారం కలదు. సంపద పేదవారికి కాకుండా ధనికుల్లోనే ప్రత్యేకించి తిరగకుండా ఉండటానికి. ఓ విశ్వాసపరులారా ఫై సంపదలలోంచి మీకు ప్రవక్త ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి మరియు ఆయన మీకు ఆపిన దాని నుండి మీరు ఆగిపోండి. మరియు మీరు అల్లాహ్ ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడుతూ ఉండండి. నిశ్ఛయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించే వాడు కాబట్టి మీరు ఆయన శిక్ష నుండి జాగ్రత్తపడండి.
Ang mga Tafsir na Arabe:
لِلْفُقَرَآءِ الْمُهٰجِرِیْنَ الَّذِیْنَ اُخْرِجُوْا مِنْ دِیَارِهِمْ وَاَمْوَالِهِمْ یَبْتَغُوْنَ فَضْلًا مِّنَ اللّٰهِ وَرِضْوَانًا وَّیَنْصُرُوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الصّٰدِقُوْنَ ۟ۚ
మరియు ఈ సంపద నుండి తమ సంపదలను,తమ సంతానమును వదిలివేయటంపై బలవంతం చేయబడి అల్లాహ్ మార్గములో హిజ్రత్ చేసిన పేదల కొరకు మరలించబడుతుంది. వారు అల్లాహ్ వారిపై ఆహారోపాధి ద్వారా ఇహలోకంలో మరియు మన్నత ద్వారా పరలోకంలో అనుగ్రహిస్తాడని ఆశిస్తుంటారు. మరియు వారు అల్లాహ్ మార్గములో ధర్మ పోరాటము ద్వారా అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు సహాయపడతారు. ఈ లక్షణాలతో వర్ణించబడిన వారందరు వాస్తవానికి విశ్వాసములో పతిష్టమైనవారు.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ تَبَوَّءُو الدَّارَ وَالْاِیْمَانَ مِنْ قَبْلِهِمْ یُحِبُّوْنَ مَنْ هَاجَرَ اِلَیْهِمْ وَلَا یَجِدُوْنَ فِیْ صُدُوْرِهِمْ حَاجَةً مِّمَّاۤ اُوْتُوْا وَیُؤْثِرُوْنَ عَلٰۤی اَنْفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۫ؕ— وَمَنْ یُّوْقَ شُحَّ نَفْسِهٖ فَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟ۚ
మరియు ముహాజిర్ ల కన్నా ముందు నుండే మదీనాలో చోటు చేసుకున్న అన్సారులు, వారు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును ఎంచుకున్నారు. వారు మక్కా నుండి తమ వద్దకు వలస వచ్చిన వారిని ఇష్టపడుతారు. మరియు వారు ఫై నుండి తమకు ఇవ్వకుండా అల్లాహ్ మార్గములో హిజ్రత్ చేసిన వారికి ఏదైన ఇవ్వబడితే తమ హృదయములలో ఎటువంటి కోపమును గాని ఎటువంటి అసూయను గాని పొందరు. మరియు వారు ప్రాపంచిక భాగములలో ముహాజిర్ లను తమ కన్నా ముందు ఉంచుతారు. ఒక వేళ వారికి పేదరికము, అవసరం కలిగినా సరే. మరియు అల్లాహ్ ఎవరినైతే సంపదపై అత్యాశ నుండి రక్షిస్తాడో అతడు దాన్ని ఆయన మార్గములో ఖర్చు చేస్తాడు. కావున వారందరే తాము ఆశించిన దాన్ని పొంది,తాము భయపడే వాటి నుండి విముక్తి పొంది సాఫల్యం చెందుతారు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• فعل ما يُظنُّ أنه مفسدة لتحقيق مصلحة عظمى لا يدخل في باب الفساد في الأرض.
చెడును కలిగించేది అనుకున్న దాన్ని పెద్ద ప్రయోజనము పొందటానికి చేయటం భూమిలో చెడును కలిగించే విషయంలో రాదు.

• من محاسن الإسلام مراعاة ذي الحاجة للمال، فَصَرَفَ الفيء لهم دون الأغنياء المكتفين بما عندهم.
సంపద విషయంలో అవసరం కలవారి గురించి ఆలోచించటం ఇస్లాం యొక్క గొప్ప విషయాల్లోంచి. కాబట్టి ఫై సంపదను ధనవంతులకు కాకుండా వారి వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందుతూ వారికొరకు ఖర్చు చేయటం.

• الإيثار منقبة عظيمة من مناقب الإسلام ظهرت في الأنصار أحسن ظهور.
త్యాగం చేయటం ఇస్లాం మంచి విషయాల్లోంచి ఒక మంచి విషయం అది అన్సారులలో చాలా మంచిగా బహిర్గతమయినది.

 
Salin ng mga Kahulugan Surah: Al-Hashr
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara