Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Al-Mu’minūn   Ayah:

అల్-ము్మిన్

Ilan sa mga Layon ng Surah:
بيان فلاح المؤمنين وخسران الكافرين.
విశ్వాసపరుల సాఫల్యమును,అవిశ్వాసపరుల నష్టమును తెలపటం

قَدْ اَفْلَحَ الْمُؤْمِنُوْنَ ۟ۙ
నిశ్ఛయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారూ,ఆయన ధర్మము ప్రకారం ఆచరించే వారు తాము కోరిన వాటిని పొందటం ద్వారా,తాము భయపడే వాటి నుండి విముక్తిని పొందటం ద్వారా సాఫల్యం చెందారు.
Ang mga Tafsir na Arabe:
الَّذِیْنَ هُمْ فِیْ صَلَاتِهِمْ خٰشِعُوْنَ ۟ۙ
తమ నమాజులో అణకువను చూపుతారు, అందులో వారి అవయవములకు కదలికలు ఉండవు. మరియు వారి హృదయములు కార్య నిమగ్నత నుండి ఖాళీగా ఉంటాయి.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُوْنَ ۟ۙ
మరియు ఎవరైతే అసత్యము నుండి, వ్యర్ధ కార్యకలాపాల నుండి, పాపము ఉన్న మాటల నుండి,కార్యాల నుండి దూరంగా ఉంటారో వారు.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ هُمْ لِلزَّكٰوةِ فٰعِلُوْنَ ۟ۙ
మరియు ఎవరైతే అశుద్ధతల నుండి తమ మనస్సులను శుద్ధ పరచటానికి,తమ సంపదలను శుద్ధ పరచటానికి వాటి జకాత్ విధి దానమును చేస్తారో వారు.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ هُمْ لِفُرُوْجِهِمْ حٰفِظُوْنَ ۟ۙ
మరియు ఎవరైతే తమ మర్మావయవాలను వ్యభిచారము నుండి,స్వలింగ సంపర్కము నుండి,అశ్లీల కలాపాల నుండి వాటిని దూరంగా ఉంచి కాపాడుకుంటారో వారు. వారు స్వచ్ఛమైన వారు,పరిశుద్ధులు.
Ang mga Tafsir na Arabe:
اِلَّا عَلٰۤی اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَاِنَّهُمْ غَیْرُ مَلُوْمِیْنَ ۟ۚ
కాని తమ భార్యలతో లేదా తమ ఆదీనంలో ఉన్న బనిసలతో. ఎందుకంటే వారితో సంబోగము,మొదలగు వాటి ద్వారా ప్రయోజనం చెందటంలో వారు దూషించబడరు.
Ang mga Tafsir na Arabe:
فَمَنِ ابْتَغٰی وَرَآءَ ذٰلِكَ فَاُولٰٓىِٕكَ هُمُ الْعٰدُوْنَ ۟ۚ
అయితే ఎవరైతే బార్యలను లేదా తమ ఆదీనంలో ఉన్న బానిసలు కాకుండా వేరే వారితో ప్రయోజనం చెందటమును ఆశిస్తాడో అతడు తనకు ఏ ప్రయోజనం అయితే సమ్మతమో దాని నుండి తనకు సమ్మతం కాని దాని వైపునకు వెళ్లటం వలన అల్లాహ్ హద్దులను అతిక్రమించాడు.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ هُمْ لِاَمٰنٰتِهِمْ وَعَهْدِهِمْ رٰعُوْنَ ۟ۙ
మరియు అల్లాహ్ వారికి అప్పజెప్పినవి లేదా ఆయన దాసులు వారికి అప్పజెప్పిన పూచీలను, తమ వాగ్దానములను వృధా చేయకండా వాటిని పూర్తి చేసి పరిరక్షించేవారు వారే.
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ هُمْ عَلٰی صَلَوٰتِهِمْ یُحَافِظُوْنَ ۟ۘ
మరియు తమ నమాజులను వాటిని అను నిత్యం పాటించటంతో,వాటి వేళల్లో,వాటి షరతులతో,వాటి విధులతో,వాటి సున్నతులతో పాటిస్తూ పరిరక్షించేవారు వారే.
Ang mga Tafsir na Arabe:
اُولٰٓىِٕكَ هُمُ الْوٰرِثُوْنَ ۟ۙ
ఈ గుణములతో వర్ణించబడిన వీరందరే వారసులు.
Ang mga Tafsir na Arabe:
الَّذِیْنَ یَرِثُوْنَ الْفِرْدَوْسَ ؕ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
వారే ఎవరైతే ఉన్నతమైన స్వర్గమునకు వారసులవుతారో. వారు అందులో శాస్వతంగా ఉంటారు. అందులో వారి అనుగ్రహాలు అంతము కావు.
Ang mga Tafsir na Arabe:
وَلَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ مِنْ سُلٰلَةٍ مِّنْ طِیْنٍ ۟ۚ
మరియు నిశ్ఛయంగా మేము మానవ తండ్రి అయిన ఆదంను మట్టితో సృష్టించాము. దాని మట్టి భూమి మట్టిలో కలిపిన నీటి నుండి తీసిన ఒక సారం నుండి తీసుకోబడింది.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ جَعَلْنٰهُ نُطْفَةً فِیْ قَرَارٍ مَّكِیْنٍ ۪۟
ఆ తరువాత మేము జన్మించే వేళ వరకు గర్భములో స్థానమేర్పరచుకునే వీర్య బిందువుతో అతని సంతానమును పుట్టించాము.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظٰمًا فَكَسَوْنَا الْعِظٰمَ لَحْمًا ۗ— ثُمَّ اَنْشَاْنٰهُ خَلْقًا اٰخَرَ ؕ— فَتَبٰرَكَ اللّٰهُ اَحْسَنُ الْخٰلِقِیْنَ ۟ؕ
దాని తరువాత మేము గర్భంలో స్థిరంగా ఉన్న వీర్యపు బిందువును ఎర్రటి రక్తపు ముద్దగా సృష్టించాము. ఆ తరువాత మేము ఆ ఎర్రటి రక్తపు ముద్దను నమిలివేయబడిన ఒక మాంసపు ముక్క లాగా చేశాము. అప్పుడు మేము ఆ మాంసపు ముక్కను గట్టిపడిన ఎముకలుగా సృష్టించాము. ఆ తరువాత మేము ఆ ఎముకలకు మాంసమును తొడిగించాము. ఆ తరువాత మేము దానిలో ఆత్మను ఊది,దాన్ని మరో జీవితం వైపునకు తీసుకుని వెళ్ళి దాన్ని వేరొక సృష్టిగా సృష్టించాము. అందరికన్నా ఉత్తమ సృష్టి కర్త అయిన అల్లాహ్ శుభకరుడు.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَیِّتُوْنَ ۟ؕ
ఆ తరువాత నిశ్ఛయంగా మీరు ఓ ప్రజలారా ఆ దశల నుండి వెళ్ళిన తరువాత మీ ఆయుష్యులు మగిసినప్పుడు మీరు మరణిస్తారు.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ اِنَّكُمْ یَوْمَ الْقِیٰمَةِ تُبْعَثُوْنَ ۟
ఆ తరువాత నిశ్ఛయంగా మీరు మీ మరణం తరువాత ప్రళయదినమున మీ సమాదుల నుండి మీరు ముందు పంపించుకున్న కర్మల లెక్క తీసుకోబడటం కొరకు మరల లేపబడుతారు.
Ang mga Tafsir na Arabe:
وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآىِٕقَ ۖۗ— وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غٰفِلِیْنَ ۟
మరియు నిశ్ఛయంగా మేము ఓ ప్రజలారా మీపై సప్తాకాశాలను ఒక దానిపై ఒకటిగా సృష్టించాము. మరియు మేము మా సృష్టితాల విషయంలో నిర్లక్ష్యంగా లేము,మేము వాటిని మరిచేవారము కాము.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• للفلاح أسباب متنوعة يحسن معرفتها والحرص عليها.
సాఫల్యానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవటం,వాటిని పరిరక్షించటం మంచిది.

• التدرج في الخلق والشرع سُنَّة إلهية.
సృష్టిని,ధర్మాన్ని సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సంప్రదాయం.

• إحاطة علم الله بمخلوقاته.
అల్లాహ్ యొక్క జ్ఞానము తన సృష్టితాలను చుట్టుముట్టి ఉంటుంది.

وَاَنْزَلْنَا مِنَ السَّمَآءِ مَآءً بِقَدَرٍ فَاَسْكَنّٰهُ فِی الْاَرْضِ ۖۗ— وَاِنَّا عَلٰی ذَهَابٍ بِهٖ لَقٰدِرُوْنَ ۟ۚ
మరియు మేము ఆకాశము నుండి వర్షపు నీటిని నాశనం చేసేంత ఎక్కువా కాకుండా,సరిపోనంత తక్కువ కాకుండా అవసరానికి సరిపడే ప్రమాణంలో కురిపించాము. ఆ తరువాత దాన్ని మేము భూమిలో స్థిరపరచాము. ప్రజలు,జంతువులు దానితో ప్రయోజనం చెందుతాారు. మరియు నిశ్ఛయంగా మేము దాన్ని తీసుకునటంలో సామర్ధ్యం కలవారము. అప్పుడు మీరు ప్రయోజనం చెందలేరు.
Ang mga Tafsir na Arabe:
فَاَنْشَاْنَا لَكُمْ بِهٖ جَنّٰتٍ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ ۘ— لَكُمْ فِیْهَا فَوَاكِهُ كَثِیْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۟ۙ
అప్పుడు మేము ఆ నీటితో మీ కొరకు ఖర్జూరపు,ద్రాక్ష తోటలను ఉత్పత్తి చేశాము. వాటిలో మీ కొరకు రకరకాల రూపములు,రంగులు గల అంజూరము,దానిమ్మ,యాపిల్ లాంటి పండ్లు ఉన్నాయి. వాటిలో నుండి మీరు తింటారు.
Ang mga Tafsir na Arabe:
وَشَجَرَةً تَخْرُجُ مِنْ طُوْرِ سَیْنَآءَ تَنْۢبُتُ بِالدُّهْنِ وَصِبْغٍ لِّلْاٰكِلِیْنَ ۟
మరియు మేము దానితో మీ కొరకు సీనాయ్ పర్వతం ప్రాంతంలో వెలికి వచ్చే ఆలీవ్ వృక్షమును సృష్టించాము. అది తన ఫలముల నుండి వెలువడే నూనెను ఉత్పత్తి చేస్తుంది. దానితో నూనె తయారు చేయబడుతుంది. మరియు కూర వండబడుతుంది.
Ang mga Tafsir na Arabe:
وَاِنَّ لَكُمْ فِی الْاَنْعَامِ لَعِبْرَةً ؕ— نُسْقِیْكُمْ مِّمَّا فِیْ بُطُوْنِهَا وَلَكُمْ فِیْهَا مَنَافِعُ كَثِیْرَةٌ وَّمِنْهَا تَاْكُلُوْنَ ۟ۙ
మరియు ఓ ప్రజలారా నిశ్ఛయంగా మీ కొరకు జంతువుల్లో (ఒంటెలు,ఆవులు,గొర్రెలు) గుణపాఠము ఉన్నది. మరియు మీరు అల్లాహ్ సామర్ధ్యము,మీపై ఉన్న ఆయన దయ పై మీరు ఆధారము ఇస్తున్న ఆధారము ఉన్నది. మేము త్రాగే వారి కొరకు ఈ జంతువుల కడుపులలో ఉన్న స్వచ్ఛమైన,ఆమోద యోగ్యమైన (రుచికరమైన) పాలను మీకు త్రాపిస్తాము. మరియు మీ కొరకు వాటిలో మీరు ప్రయోజనం చెందే చాలా ప్రయోజనాలు కలవు. వాటిలో నుండి : ఉదాహరణకు సవారీ చేయటం,ఉన్ని,ఒంటె వెంట్రుకలు,జుట్టు,మరియు మీరు వాటి మాంసములో నుండి తింటారు.
Ang mga Tafsir na Arabe:
وَعَلَیْهَا وَعَلَی الْفُلْكِ تُحْمَلُوْنَ ۟۠
మరియు మీరు భూమిలో జంతువుల్లోంచి ఒంటెలపై,సముద్రంలో ఓడలపై సవారీ చేయబడుతారు.
Ang mga Tafsir na Arabe:
وَلَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰی قَوْمِهٖ فَقَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟
మరియు నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంను ఆయన జాతి వారి వద్దకు వారిని అల్లాహ్ వైపు పిలవటానికి పంపించాము. అప్పుడు ఆయన వారితో అన్నారు : ఓ నా జాతి వారా మీరు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించండి. పరిశుద్ధుడైన ఆయన తప్ప మీ కొరకు సత్య ఆరాధ్య దైవం లేడు. ఏమీ మీరు అల్లాహ్ తో ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భీతిని కలిగి ఉండరా ?.
Ang mga Tafsir na Arabe:
فَقَالَ الْمَلَؤُا الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ— یُرِیْدُ اَنْ یَّتَفَضَّلَ عَلَیْكُمْ ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَاَنْزَلَ مَلٰٓىِٕكَةً ۖۚ— مَّا سَمِعْنَا بِهٰذَا فِیْۤ اٰبَآىِٕنَا الْاَوَّلِیْنَ ۟ۚۖ
ఆయన జాతి వారిలో నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన పెద్దవారు,నాయకులు తమను అనుసరించే వారితో,సాధారణ ప్రజలతో ఇలా పలికారు : తాను ప్రవక్తనని వాదించే ఇతను మీలాంటి ఒక మనిషి మాత్రమే అతడు మీపై అధికారమును,నాయకత్వమును ఆశిస్తున్నాడు. ఒక వేళ అల్లాహ్ మా వద్దకు ఒక ప్రవక్తనే పంపించదలిస్తే అతన్ని దైవ దూతల్లోంచి పంపించేవాడు. అతడిని మనుషుల్లోంచి పంపించేవాడు కాదు. మాకన్న పూర్వం గతించిన పూర్వికుల వద్ద అతడు వాదిస్తున్నటువంటి దాన్ని మేము విన లేదు.
Ang mga Tafsir na Arabe:
اِنْ هُوَ اِلَّا رَجُلٌۢ بِهٖ جِنَّةٌ فَتَرَبَّصُوْا بِهٖ حَتّٰی حِیْنٍ ۟
ఇతడు కేవలం పిచ్చి పట్టిన ఒక మనిషి మాత్రమే.అతను చెబుతున్నది అతనికే తెలియదు. అయితే మీరు అతని విషయం ప్రజల కొరకు స్పష్టమయ్యే వరకు అతనితో పాటు నిరీక్షించండి.
Ang mga Tafsir na Arabe:
قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ ۟
నూహ్ అలైహిస్సలాం ఇలా విన్నపించుకున్నారు : ఓ నా ప్రభువా వారు నన్ను తిరస్కరించినందున నీవు నా తరుపున వారితో ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి.
Ang mga Tafsir na Arabe:
فَاَوْحَیْنَاۤ اِلَیْهِ اَنِ اصْنَعِ الْفُلْكَ بِاَعْیُنِنَا وَوَحْیِنَا فَاِذَا جَآءَ اَمْرُنَا وَفَارَ التَّنُّوْرُ ۙ— فَاسْلُكْ فِیْهَا مِنْ كُلٍّ زَوْجَیْنِ اثْنَیْنِ وَاَهْلَكَ اِلَّا مَنْ سَبَقَ عَلَیْهِ الْقَوْلُ مِنْهُمْ ۚ— وَلَا تُخَاطِبْنِیْ فِی الَّذِیْنَ ظَلَمُوْا ۚ— اِنَّهُمْ مُّغْرَقُوْنَ ۟
అప్పుడు మేము ఒక ఓడను మా పర్యవేక్షణలో,దాన్ని ఎలా తయారు చేయాలో మేము నీకు నేర్పంచిన విధంగా తయారు చేయమని వహీ ద్వారా తెలియపరచాము. అయితే వారి వినాశనముతో మా ఆదేశము వచ్చినప్పుడు,నీరు ఉడకబెడుతున్న ప్రదేశము నుండి బలంగా పొంగినప్పుడు అందులో (ఓడలో) ప్రాణం ఉన్న ప్రతి ఆడ,మగను సంతానము కొనసాగటానికి ప్రవేశింపజేయి. మరియు నీ ఇంటి వారిలోంచి నీ భార్య,నీకుమారుడు లాంటి వారు వినాశనం గురించి అల్లాహ్ మాట ముందే జరిగిపోయినదో వారు తప్ప ప్రవేశింపజేయి. మరియు నీవు వారి విషయంలో ఎవరైతే అవిశ్వాసముతో దుర్మార్గమునకు పాల్పడ్డారో వారి విముక్తిని,వారిని వినాశనమును వదిలివేయటమును ఆశిస్తూ నాతో మాట్లాడకు. నిశ్ఛయంగా వారు తుఫాను నీటిలో ముంచబడి ఖచ్చితంగా వినాశనమునకు గురి అవుతారు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• لطف الله بعباده ظاهر بإنزال المطر وتيسير الانتفاع به.
వర్షమును కురిపించటం,దాని ద్వారా ప్రయోజనం చెందటమును శులభతరం చేయటంతో అల్లాహ్ యొక్క దయ తన దాసులతో ఉన్నదని స్పష్టమవుతుంది.

• التنويه بمنزلة شجرة الزيتون.
ఆలివ్ చెట్టు యొక్క స్థానమును ప్రతీష్టించబడింది.

• اعتقاد المشركين ألوهية الحجر، وتكذيبهم بنبوة البشر، دليل على سخف عقولهم.
రాతి దైవత్వంపై ముష్రికుల నమ్మకం,మానవుని దైవ దౌత్యము పట్ల వారి తిరస్కారం వారి బుద్దిలేమితనమునకు నిదర్శనం.

• نصر الله لرسله ثابت عندما تكذبهم أممهم.
అల్లాహ్ యొక్క సహాయం తన ప్రవక్తల కొరకు వారి జాతుల వారు వారిని తిరస్కరించినప్పుడల్ల స్థిరంగా ఉంటుంది.

فَاِذَا اسْتَوَیْتَ اَنْتَ وَمَنْ مَّعَكَ عَلَی الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلّٰهِ الَّذِیْ نَجّٰىنَا مِنَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
నీవు, నీతోపాటు విముక్తి పొందిన విశ్వాసపరులు ఓడలో ఎక్కినప్పుడు ఇలా పలుకు : సర్వ స్తోత్రములు ఆ అల్లాహ్ కొరకే ఎవరైతే మమ్మల్ని అవిశ్వాస జాతి వారి నుండి రక్షించాడో మరియు వారిని తుదిముట్టించాడో.
Ang mga Tafsir na Arabe:
وَقُلْ رَّبِّ اَنْزِلْنِیْ مُنْزَلًا مُّبٰرَكًا وَّاَنْتَ خَیْرُ الْمُنْزِلِیْنَ ۟
మరియు నీవు ఇలా పలుకు : ఓ నా ప్రభువా నీవు నన్ను గౌరవ ప్రదంగా భూమిపై దించు. మరియు నీవు మంచిగా దించేవాడివి.
Ang mga Tafsir na Arabe:
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ وَّاِنْ كُنَّا لَمُبْتَلِیْنَ ۟
నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన నూహ్,ఆయనతో పాటు విశ్వాసపరులను విముక్తి కలిగించటంలో,అవిశ్వాసపరులను తుది ముట్టించటంలో మా ప్రవక్తలకు సహాయం చేయటంలో,వారిని తిరస్కరించిన వారిని తుదిముట్టించటంలో మా సామర్ధ్యంపై గొప్ప సూచనలు కలవు. నిశ్ఛయంగా మేము నూహ్ జాతిని వారి వద్దకు ఆయనను పంపించి అవిశ్వాసపరుడు నుండి విశ్వాసపరుడు,అవిధేయుడు నుండి విధేయుడు స్పష్టమవటం కొరకు పరీక్షిస్తాము.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ اَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قَرْنًا اٰخَرِیْنَ ۟ۚ
ఆ పిదప నూహ్ జాతివారిని తుదిముట్టించిన తరువాత మేము మరొక జాతి వారిని పుట్టించాము.
Ang mga Tafsir na Arabe:
فَاَرْسَلْنَا فِیْهِمْ رَسُوْلًا مِّنْهُمْ اَنِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟۠
అప్పుడు మేము వారిలోని వారి నుండే ఒక ప్రవక్తను పంపించాము. అతడు వారిని అల్లాహ్ వైపు పిలుస్తాడు. అయితే ఆయన వారితో ఇలా పలికాడు : మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి. పరిశుద్ధుడైన ఆయన తప్ప మీ కొరకు వాస్తవ ఆరాధ్య దైవం లేడు. అయితే, ఏమిటీ మీరు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ,ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ అల్లాహ్ తో భయపడరా ?.
Ang mga Tafsir na Arabe:
وَقَالَ الْمَلَاُ مِنْ قَوْمِهِ الَّذِیْنَ كَفَرُوْا وَكَذَّبُوْا بِلِقَآءِ الْاٰخِرَةِ وَاَتْرَفْنٰهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا ۙ— مَا هٰذَاۤ اِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۙ— یَاْكُلُ مِمَّا تَاْكُلُوْنَ مِنْهُ وَیَشْرَبُ مِمَّا تَشْرَبُوْنَ ۟ۙ
మరియు అతని జాతి వారిలో నుంచి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,పరలోకమును,అందులో ఉన్న పుణ్యమును,శిక్షను తిరస్కరించినటువంటి పెద్దవారు,నాయకులు మరియు మేము ఎవరికైతే ఇహలోక జీవితంలో పుష్కలంగా అనుగ్రహాలను కలిగించామో ఆ మితిమీరిన వారు తమను అనుసరించే వారితో,తమ సాధారణ ప్రజల్లో ఇలా పలికారు : ఇతడు మీరు తినేటటువంటి వాటిలో నుంచి తినే,మీరు త్రాగేటటువంటి వాటిలో నుంచి త్రాగే మీ లాంటి ఒక మనిషి మాత్రమే. అతనికి మీపై ఏ ప్రాముఖ్యత లేదు చివరికి అతను మీ వైపునకే ఒక ప్రవక్తగా పంపించబడ్డాడు.
Ang mga Tafsir na Arabe:
وَلَىِٕنْ اَطَعْتُمْ بَشَرًا مِّثْلَكُمْ ۙ— اِنَّكُمْ اِذًا لَّخٰسِرُوْنَ ۟ۙ
మరియు ఒక వేళ మీరు మీ లాంటి ఒక మనిషిని అనుసరిస్తే మీరు మీ ఆరాధ్య దైవాలను వదిలి వేయటం వలన అతని అనుసరణతో మీకు ప్రయోజనం లేక పోవటం వలన మరియు మీపై ఎటువంటి ప్రాముఖ్యత లేని వాడిని అనుసరించటం వలన నిశ్ఛయంగా అటువంటప్పుడు నష్టపోతారు.
Ang mga Tafsir na Arabe:
اَیَعِدُكُمْ اَنَّكُمْ اِذَا مِتُّمْ وَكُنْتُمْ تُرَابًا وَّعِظَامًا اَنَّكُمْ مُّخْرَجُوْنَ ۟
ఏమీ, తాను ప్రవక్తనని వాదించే ఇతను మీరు మరణించి మట్టిగా ఎముకలు క్రుసించి పోయినప్పుడు మీరు మీ సమాదుల నుండి జీవింపబడి వెలికి తీయబడుతారని మీతో వాగ్దానం చేస్తున్నాడా ?!. ఏమీ ఇది అర్ధం అయ్యే విషయమా ?!.
Ang mga Tafsir na Arabe:
هَیْهَاتَ هَیْهَاتَ لِمَا تُوْعَدُوْنَ ۟
మీరు మరణించి మీ పరిణామం మట్టిగా,క్రుసించిపోయిన ఎముకలుగా అయిన తరువాత జీవింపబడి మీ సమాదుల నుండి మీరు వెలికి తీయబడుతారని మీతో చేయబడతున్న వాగ్దానం చాలా దూరము (అసంభవం).
Ang mga Tafsir na Arabe:
اِنْ هِیَ اِلَّا حَیَاتُنَا الدُّنْیَا نَمُوْتُ وَنَحْیَا وَمَا نَحْنُ بِمَبْعُوْثِیْنَ ۟
జీవితం ఇహలోక జీవితం మాత్రమే. పరలోక జీవితం లేదు. మాలో నుండి జీవించి ఉన్న వారు మరణిస్తారు మరియు బ్రతకరు. మరియు వేరే వారు జన్మిస్తారు ,వారు జీవిస్తారు. మా మరణం తరువాత ప్రళయ దినం నాడు లెక్క కొరకు మేము వెలికి తీయబడము.
Ang mga Tafsir na Arabe:
اِنْ هُوَ اِلَّا رَجُلُ ١فْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا وَّمَا نَحْنُ لَهٗ بِمُؤْمِنِیْنَ ۟
మీ వైపునకు ప్రవక్తగా పంపించబడ్డాడని వాదన చేసే ఇతడు ఒక మనిషి మాత్రమే అతడు తన ఈ వాదనతో అల్లాహ్ పై అబద్దమును కల్పించుకున్నాడు. మరియు మేము అతనిపై విశ్వాసమును కనబరచము.
Ang mga Tafsir na Arabe:
قَالَ رَبِّ انْصُرْنِیْ بِمَا كَذَّبُوْنِ ۟
ప్రవక్త ఇలా విన్నపించుకున్నారు : ఓ నా ప్రభువా వారు నన్ను తిరస్కరించినందున నీవు నా తరుపున వారితో ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా వారికి వ్యతిరేకంగా నాకు సహాయం చేయి.
Ang mga Tafsir na Arabe:
قَالَ عَمَّا قَلِیْلٍ لَّیُصْبِحُنَّ نٰدِمِیْنَ ۟ۚ
అల్లాహ్ ఇలా పలుకుతూ ఆయనకు సమాధానమిచ్చాడు : కొంత కాలం తరువాత నీవు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వీరందరు తొందలోనే తమ నుండి జరిగిన తిరస్కారము పై పశ్ఛాత్తాప్పడేవారైపోతారు.
Ang mga Tafsir na Arabe:
فَاَخَذَتْهُمُ الصَّیْحَةُ بِالْحَقِّ فَجَعَلْنٰهُمْ غُثَآءً ۚ— فَبُعْدًا لِّلْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
అప్పుడు వారి మొండి తనము వలన వారు శిక్ష యొక్క అర్హులు కావటం వలన వారికి తీవ్ర వినాశనము గల శబ్దము పట్టుకుంది. అప్పుడు అది వారిని నీటి ప్రవాహంపై కొట్టుకుని వచ్చిన చెత్త మాదిరిగా వినాశనమైన వారిగా చేసేసింది.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ اَنْشَاْنَا مِنْ بَعْدِهِمْ قُرُوْنًا اٰخَرِیْنَ ۟ؕ
వారిని వినాశనము చేసిన తరువాత మేము లూత్ జాతి,షుఐబ్ జాతి,యూనుస్ జాతి వారి లాంటి ఇతర జాతులను,సమాజములను పుట్టించాము.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• وجوب حمد الله على النعم.
అనుగ్రహాలపై అల్లాహ్ స్థుతులను కొనియాడటం అనివార్యము.

• الترف في الدنيا من أسباب الغفلة أو الاستكبار عن الحق.
ఇహలోకంలో విలాసము నిర్లక్ష్యమునకు లేదా సత్యము నుండి అహంకారమునకు కారణాల్లోంచిది.

• عاقبة الكافر الندامة والخسران.
అవిశ్వాసపరుడిని పరిణామము అవమానము,నష్టము.

• الظلم سبب في البعد عن رحمة الله.
హింస (దుర్మార్గము) అల్లాహ్ కారుణ్యము నుండి దూరమవటంలో ఒక కారణము.

مَا تَسْبِقُ مِنْ اُمَّةٍ اَجَلَهَا وَمَا یَسْتَاْخِرُوْنَ ۟ؕ
ఈ తిరస్కార జాతుల్లోంచి ఏ జాతి కూడా దాని వినాశనం రావటం కొరకు నిర్ణయించబడిన సమయము కన్న ముందుకు పోజాలదు,దాని నుండి వెనుకకు పోజాలదు. దాని కొరకు ఏ కారకాలు ఉన్నా కూడా.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ اَرْسَلْنَا رُسُلَنَا تَتْرَا ؕ— كُلَّ مَا جَآءَ اُمَّةً رَّسُوْلُهَا كَذَّبُوْهُ فَاَتْبَعْنَا بَعْضَهُمْ بَعْضًا وَّجَعَلْنٰهُمْ اَحَادِیْثَ ۚ— فَبُعْدًا لِّقَوْمٍ لَّا یُؤْمِنُوْنَ ۟
ఆ తరువాత మేము మా ప్రవక్తలను ఒక ప్రవక్త తరువాత ఒక ప్రవక్తను క్రమం తప్పకుండా పంపించాము. ఎప్పుడైనా ఈ జాతుల్లోంచి ఏ ఒక జాతి వద్దకు దాని వైపు పంపించబడ్డ దాని ప్రవక్త వస్తే వారు అతడిని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని ఒకరి తరువాత ఒకరిని వినాశనముతో అనుసరించాము. వారి గురించి ప్రజల గాధలు తప్ప వారి కొరకు అస్తిత్వము మిగలలేదు. అయితే తమ ప్రభువు వద్ద నుండి తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని విశ్వసించని జాతి వారి కొరకు వినాశనము కలుగు గాక.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ اَرْسَلْنَا مُوْسٰی وَاَخَاهُ هٰرُوْنَ ۙ۬— بِاٰیٰتِنَا وَسُلْطٰنٍ مُّبِیْنٍ ۟ۙ
ఆ తరువాత మేము మూసాను,అతని సోదరుడు హారూన్ ను మా ఏడు మహిమలు (చేతి కర్ర,చేయి,మిడుతలు,నల్లులు,కప్పలు,రక్తము,తుఫాను,కరువుకాటకాలు,ఫలాల కొరత) ,స్పష్టమైన ఆధారమును ఇచ్చి పంపించాము.
Ang mga Tafsir na Arabe:
اِلٰی فِرْعَوْنَ وَمَلَاۡىِٕهٖ فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا عَالِیْنَ ۟ۚ
మేము వారిద్దరిని ఫిర్ఔన్,అతని జాతి వారిలోంచి పెద్దల వద్దకు పంపించాము అప్పుడు వారు అహంకారమును చూపారు. అప్పుడు వారు విశ్వసించటం కొరకు వారిద్దరి మాట వినలేదు. మరియు వారు ప్రజలపై ఆధిక్యతతో,దుర్మార్గంతో అహంకారమును చూపే జాతివారు అయిపోయారు.
Ang mga Tafsir na Arabe:
فَقَالُوْۤا اَنُؤْمِنُ لِبَشَرَیْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عٰبِدُوْنَ ۟ۚ
అప్పుడు వారు ఇలా పలికారు : ఏమీ మేము మా లాంటి ఇద్దరు మనుషులను విశ్వసించాలా ?!. వారిద్దరికి మాపై ఎటువంటి ప్రాముఖ్యత లేదుఇంకా వారి జాతి వారు (ఇస్రాయీల్ సంతతివారు) మాకు విధేయత చూపే వారు,అణకువ చూపేవారు.
Ang mga Tafsir na Arabe:
فَكَذَّبُوْهُمَا فَكَانُوْا مِنَ الْمُهْلَكِیْنَ ۟
అప్పుడు వారు అల్లాహ్ వద్ద నుండి వారు తీసుకుని వచ్చిన వాటి విషయంలో వారిద్దరిని తిరస్కరించారు. అప్పుడు వారు వారిని తిరస్కరించటం వలన ముంచబడి వినాశనమునకు గురైన వారిలో అయిపోయారు.
Ang mga Tafsir na Arabe:
وَلَقَدْ اٰتَیْنَا مُوْسَی الْكِتٰبَ لَعَلَّهُمْ یَهْتَدُوْنَ ۟
మరియు నిశ్ఛయంగా మేము మూసా అలైహిస్సలాంకు తౌరాతును ఆయన జాతివారు దాని ద్వారా సత్యము వైపునకు మార్గం పొందుతారని,దానిపై ఆచరిస్తారని ఆశిస్తూ ప్రసాదించాము.
Ang mga Tafsir na Arabe:
وَجَعَلْنَا ابْنَ مَرْیَمَ وَاُمَّهٗۤ اٰیَةً وَّاٰوَیْنٰهُمَاۤ اِلٰی رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَّمَعِیْنٍ ۟۠
మరియు మేము మర్యమ్ కుమారుడు ఈసా మరియు అతని తల్లి మర్యమ్ ను మా సామర్ధ్యమును సూచించే ఒక సూచనగా చేశాము. ఆమె తండ్రి లేకుండానే అతని గర్భం దాల్చింది. మరియు మేము వారిద్దరిని భూమి నుండి ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయమిచ్చాము. దానిపై స్థిరపడటానికి సమానంగా అనువైనదిగా ఉంది. అందులో ప్రవహించే తాజా నీరు ఉంది.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَیُّهَا الرُّسُلُ كُلُوْا مِنَ الطَّیِّبٰتِ وَاعْمَلُوْا صَالِحًا ؕ— اِنِّیْ بِمَا تَعْمَلُوْنَ عَلِیْمٌ ۟ؕ
ఓ దైవ ప్రవక్తల్లారా వేటిని తినటం మంచిదో వాటిలోంచి మేము మీ కొరకు సమ్మతము చేసిన వాటిని మీరు తినండి. మరియు మీరు ధర్మానికి అనుగుణంగా ఉన్న సత్కర్మలను చేయండి. నిశ్ఛయంగా మీరు చేస్తున్న కర్మల గురించి నాకు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ నాపై గోప్యంగా ఉండదు.
Ang mga Tafsir na Arabe:
وَاِنَّ هٰذِهٖۤ اُمَّتُكُمْ اُمَّةً وَّاحِدَةً وَّاَنَا رَبُّكُمْ فَاتَّقُوْنِ ۟
ఓ ప్రవక్తల్లారా నిశ్ఛయంగా మీ ధర్మం ఒకే ధర్మము అది ఇస్లాం. మరియు నేను మీ ప్రభువును నేను తప్ప మీకు ఇంకో ప్రభువు లేడు. అయితే మీరు నా ఆదేశాలను పాటించి,నేను వారించిన వాటికి దూరంగా ఉండి నా భయమును కలిగి ఉండండి.
Ang mga Tafsir na Arabe:
فَتَقَطَّعُوْۤا اَمْرَهُمْ بَیْنَهُمْ زُبُرًا ؕ— كُلُّ حِزْبٍۭ بِمَا لَدَیْهِمْ فَرِحُوْنَ ۟
వారి తరువాత వారిని అనుసరించిన వారు ధర్మంలో బేధాభిప్రాయాలను కల్పించుకున్నారు. అప్పుడు వారు తెగలుగా వర్గాలుగా అయిపోయారు. ప్రతీ వర్గము అల్లాహ్ వద్ద స్వీకరించబడే ధర్మము అని విశ్వసించిన దానితో సంతోషముగా ఉంది. ఇతరుల వద్ద ఉన్న దాని వైపున చూడటం లేదు.
Ang mga Tafsir na Arabe:
فَذَرْهُمْ فِیْ غَمْرَتِهِمْ حَتّٰی حِیْنٍ ۟
ఓ ప్రవక్తా మీరు వారిని వారిపై శిక్ష అవతరించే వరకు వారు ఉన్న అజ్ఞానం,గందరగోళంలోనే వదిలి వేయండి.
Ang mga Tafsir na Arabe:
اَیَحْسَبُوْنَ اَنَّمَا نُمِدُّهُمْ بِهٖ مِنْ مَّالٍ وَّبَنِیْنَ ۟ۙ
ఏమీ తమ వద్ద ఉన్నవాటితో సంతోషపడే ఈ వర్గాలవారందరు ఇహలోకంలో మేము వారికి ప్రసాదించిన సంపదలు,సంతానము అది తొందరగా ఇవ్వబడిన వారి కొరకు మేలైన హక్కు అని భావిస్తున్నారా ?!. వారు భావిస్తున్నట్లు విషయం కాదు. మేము కేవలం వారికి గడువు ఇవ్వడానికి,క్రమ క్రమంగా (శిక్షకు) దగ్గర చేయటానకి మాత్రమే దాన్ని వారికి ప్రసాదిస్తాము. కాని వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు.
Ang mga Tafsir na Arabe:
نُسَارِعُ لَهُمْ فِی الْخَیْرٰتِ ؕ— بَلْ لَّا یَشْعُرُوْنَ ۟
ఏమీ తమ వద్ద ఉన్నవాటితో సంతోషపడే ఈ వర్గాలవారందరు ఇహలోకంలో మేము వారికి ప్రసాదించిన సంపదలు,సంతానము అది తొందరగా ఇవ్వబడిన వారి కొరకు మేలైన హక్కు అని భావిస్తున్నారా ?!. వారు భావిస్తున్నట్లు విషయం కాదు. మేము కేవలం వారికి గడువు ఇవ్వడానికి,క్రమ క్రమంగా (శిక్షకు) దగ్గర చేయటానకి మాత్రమే దాన్ని వారికి ప్రసాదిస్తాము.కాని వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు.
Ang mga Tafsir na Arabe:
اِنَّ الَّذِیْنَ هُمْ مِّنْ خَشْیَةِ رَبِّهِمْ مُّشْفِقُوْنَ ۟ۙ
నిశ్ఛయంగా ఎవరైతే తమ విశ్వాసము,తమ సత్కర్మలతోపాటుతమ ప్రభువు పట్ల భయభీతులు కలిగి ఉంటారో,
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ هُمْ بِاٰیٰتِ رَبِّهِمْ یُؤْمِنُوْنَ ۟ۙ
మరియు ఎవరైతే ఆయన గ్రంధ ఆయతులపై విశ్వాసము కనబరుస్తారో,
Ang mga Tafsir na Arabe:
وَالَّذِیْنَ هُمْ بِرَبِّهِمْ لَا یُشْرِكُوْنَ ۟ۙ
మరియు ఎవరైతే తమ ప్రభువు యొక్క ఏకత్వమును చాటుతూ ఆయనతోపాటు ఎవరినీ సాటి కల్పించరో,
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• الاستكبار مانع من التوفيق للحق.
అహంకారము సత్యము అనుగ్రహము నుండి ఆటంకము కలిగిస్తుంది.

• إطابة المأكل له أثر في صلاح القلب وصلاح العمل.
ఆహారము పరిశుద్ధంగా ఉండటం (హలాల్ ఆహారము) హృదయము మంచిగా ఉండటానికి,ఆచరణ మంచిగా ఉండటానికి ప్రభావం చూపుతుంది.

• التوحيد ملة جميع الأنبياء ودعوتهم.
ఏకేశ్వరోపాసన (తౌహీద్) దైవ ప్రవక్తలందరి ధర్మము,వారి సందేశప్రచారము.

• الإنعام على الفاجر ليس إكرامًا له، وإنما هو استدراج.
పాపాత్ముడికి అనుగ్రహించబడటం అతని కొరకు గౌరవం కాదు. అది కేవలం క్రమ క్రమంగా దగ్గర చేయటం.

وَالَّذِیْنَ یُؤْتُوْنَ مَاۤ اٰتَوْا وَّقُلُوْبُهُمْ وَجِلَةٌ اَنَّهُمْ اِلٰی رَبِّهِمْ رٰجِعُوْنَ ۟ۙ
మరియు ఎవరైతే పుణ్య కార్యాల్లో శ్రమించి సత్కర్మల ద్వారా దగ్గరత్వాన్ని పొందుతారో వారు ప్రళయ దినాన ఆయన వైపునకు మరలినప్పుడు అల్లాహ్ వారి నుండి వారి ఖర్చు చేయటమును,వారి సత్కర్మలను స్వీకరించడని భయపడుతుంటారు.
Ang mga Tafsir na Arabe:
اُولٰٓىِٕكَ یُسٰرِعُوْنَ فِی الْخَیْرٰتِ وَهُمْ لَهَا سٰبِقُوْنَ ۟
ఈ గొప్ప గుణాలతో వర్ణించబడిన వారు సత్కర్మల వైపు త్వరపడుతారు. మరియు వారు వాటి వైపుకు ముందుకు సాగుతారు,దాని వలనే వారు ఇతరులకంటే ముందుకు సాగిపోతారు.
Ang mga Tafsir na Arabe:
وَلَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَا وَلَدَیْنَا كِتٰبٌ یَّنْطِقُ بِالْحَقِّ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
మరియు మేము ఏ ప్రాణిపై ఆచరణ భారం వేసినా అతని శక్తి మేరకు వేస్తాము. మరియు మా వద్ద ఒక పుస్తకమున్నది అందులో మేము ఆచరించే ప్రతీ వ్యక్తి యొక్క ఆచరణను పొందుపరచాము. అది ఎటువంటి సందేహము లేని సత్యం గురించి పలుకుతుంది. మరియు తమ పుణ్యములను తగ్గించి గాని వారి పాపములను అధికం చేసి హింసకు గురి చేయబడరు.
Ang mga Tafsir na Arabe:
بَلْ قُلُوْبُهُمْ فِیْ غَمْرَةٍ مِّنْ هٰذَا وَلَهُمْ اَعْمَالٌ مِّنْ دُوْنِ ذٰلِكَ هُمْ لَهَا عٰمِلُوْنَ ۟
అంతేకాదు అవిశ్వాసపరుల హృదయాలు సత్యం గురించి పలికే ఈ గ్రంధం నుండి, వారిపై అవతరింపబడిన గ్రంధం నుండి పరధ్యానంలో ఉన్నవి. మరియు వారి కొరకు వారు ఉన్న అవిశ్వాసమే కాకుండా ఇతర కార్యాలు ఉన్నవి వాటిని వారు చేస్తున్నారు.
Ang mga Tafsir na Arabe:
حَتّٰۤی اِذَاۤ اَخَذْنَا مُتْرَفِیْهِمْ بِالْعَذَابِ اِذَا هُمْ یَجْـَٔرُوْنَ ۟ؕ
చివరికి మేము ఇహలోకంలో వారిలో నుండి విలాసవంతులైన వారిని ప్రళయదినాన శిక్షించినప్పుడు వారు సహాయమును వేడుకుంటూ తమ స్వరములను పెంచుతారు.
Ang mga Tafsir na Arabe:
لَا تَجْـَٔرُوا الْیَوْمَ ۫— اِنَّكُمْ مِّنَّا لَا تُنْصَرُوْنَ ۟
అప్పుడు వారిని అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ పరుస్తూ ఇలా తెలపబడుతుంది : మీరు ఈ రోజు గోల చేయకండి, సహాయమును కోరకండి. ఎందుకంటే అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని ఆపే మీ కొరకు సహాయకుడెవడూ లేడు.
Ang mga Tafsir na Arabe:
قَدْ كَانَتْ اٰیٰتِیْ تُتْلٰی عَلَیْكُمْ فَكُنْتُمْ عَلٰۤی اَعْقَابِكُمْ تَنْكِصُوْنَ ۟ۙ
ఇహలోకంలో అల్లాహ్ యొక్క గ్రంధ ఆయతులు మీపై చదివి వినిపించబడేవి. అయితే మీరు వాటిని విన్నప్పుడల్లా వాటి పట్ల అయిష్టతతో ముఖము చాటేసి మరలిపోయేవారు.
Ang mga Tafsir na Arabe:
مُسْتَكْبِرِیْنَ ۖۚۗ— بِهٖ سٰمِرًا تَهْجُرُوْنَ ۟
మీరు హరమ్ వాసులని భావిస్తున్నారు కాబట్టి మీరు ప్రజలపై అహంకారమును ప్రదర్శిస్తూ మీరు ఇలా చేస్తున్నారు. వాస్తవానికి మీరు దానికి తగిన వారు కారు. ఎందుకంటే దానికి తగిన వారు దైవ భీతి కలిగిన వారు ఉంటారు. మరియు మీరు దాని చుట్టు చెడు మాటలను రాత్రి పూట మాట్లాడgతూ ఉన్నారు. మీరు దాని పవిత్రతను లెక్క చేయటం లేదు.
Ang mga Tafsir na Arabe:
اَفَلَمْ یَدَّبَّرُوا الْقَوْلَ اَمْ جَآءَهُمْ مَّا لَمْ یَاْتِ اٰبَآءَهُمُ الْاَوَّلِیْنَ ۟ؗ
ఏ ఈ ముష్రికులందరు అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ లో దాన్ని వారు విశ్వసించి అందులో ఉన్నవాటిని ఆచరించటానికి యోచన చేయరా ? లేదా వారి కన్నా ముందు వారి పూర్వికుల వద్దకు రానిది వారి వద్దకు వచ్చిందనా ? వారు దాని నుండు విముఖత చూపుతున్నారు మరియు దాన్ని తిరస్కరిస్తున్నారు.
Ang mga Tafsir na Arabe:
اَمْ لَمْ یَعْرِفُوْا رَسُوْلَهُمْ فَهُمْ لَهٗ مُنْكِرُوْنَ ۟ؗ
లేదా వారు తమ వద్దకు అల్లాహ్ ప్రవక్తగా పంపించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తించరా అందుకు ఆయన్ను తిరస్కరిస్తున్నారు. వాస్తవానికి వారు ఆయననూ గుర్తించారు మరియు ఆయన నీతిని,ఆయన నిజాయితీని గుర్తించారు.
Ang mga Tafsir na Arabe:
اَمْ یَقُوْلُوْنَ بِهٖ جِنَّةٌ ؕ— بَلْ جَآءَهُمْ بِالْحَقِّ وَاَكْثَرُهُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ ۟
అంతేకాదు వారు అతడు పిచ్చివాడు అని పలుకుతున్నారు. నిశ్ఛయంగా వారు తిరస్కరించారు . కాని అతను వారి వద్దకు సత్యమును అది అల్లాహ్ వద్ద నుండి కావటంలో ఎటువంటి సందేహము లేదు తీసుకుని వచ్చాడు. వారిలో చాలామంది సత్యాన్ని అసహ్యించుకుంటున్నారు. తమ వద్ద నుండి అసూయ వలన, తమ అసత్యం పట్ల పక్షపాతం వలన దాన్ని ద్వేషించుకుంటున్నారు.
Ang mga Tafsir na Arabe:
وَلَوِ اتَّبَعَ الْحَقُّ اَهْوَآءَهُمْ لَفَسَدَتِ السَّمٰوٰتُ وَالْاَرْضُ وَمَنْ فِیْهِنَّ ؕ— بَلْ اَتَیْنٰهُمْ بِذِكْرِهِمْ فَهُمْ عَنْ ذِكْرِهِمْ مُّعْرِضُوْنَ ۟ؕ
మరియు ఒక వేళ అల్లాహ్ వ్యవహారాలను నడిపించి,వారి మనుస్సుల కోరికలకు అనుగుణంగా వాటి పర్యాలోచన చేస్తే భూమ్యాకాశములు పాడైపోయేవి. మరియు వ్యవహారాల పరిణామాల గురించి, పర్యాలోచనలో సరైనది, చెడ్డదైనది గురించి వారి అజ్ఞానం వలన వాటిలో ఉన్నవారు పాడైపోతారు. అంతేకాదు మేము వారికి వారి గౌరవము,మర్యాద కలిగి ఉన్న ఖుర్ఆన్ ను ప్రసాదించాము. వారు దాని నుండి విముఖత చూపారు.
Ang mga Tafsir na Arabe:
اَمْ تَسْـَٔلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَیْرٌ ۖۗ— وَّهُوَ خَیْرُ الرّٰزِقِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు వీరి వద్దకు తీసుకుని వచ్చిన దానిపై వీరందరితో ఏదైన పరిహారం కోరుతున్నారా మరియు అది వారి ఆహ్వానమును తిరస్కరించేటట్లు చేసినదా ?. ఇది మీతో సంభవించలేదు. అయితే మీ ప్రభువు ప్రసాదించే పుణ్యము,దాని ప్రతిఫలం వీరందరి,ఇతరుల ప్రతిఫలం కన్నా మేలైనది. మరియు పరిశుద్ధుడైన ఆయన అందరికంటే మంచిగా ఆహారమును ప్రసాదించేవాడు.
Ang mga Tafsir na Arabe:
وَاِنَّكَ لَتَدْعُوْهُمْ اِلٰی صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۟
మరియు నిశ్ఛయంగా మీరు ఓ ప్రవక్తా వారందరిని,ఇతరులను ఎటువంటి వంకరతనం లేని సన్మార్గము వైపునకు పిలుస్తున్నారు. మరియు అది ఇస్లాం మార్గము.
Ang mga Tafsir na Arabe:
وَاِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ عَنِ الصِّرَاطِ لَنٰكِبُوْنَ ۟
మరియు నిశ్ఛయంగా ఎవరైతే పరలోకంపై,అందులో ఉన్న లెక్క తీసుకోవటం,శిక్ష,ప్రతిఫలం పై విశ్వాసమును కనబరచనివారు ఇస్లాం మార్గమునుండి నరకము వైపునకు తీసుకునిపోయే వంకర మార్గములైన ఇతర మార్గముల వైపునకు మగ్గు చూపుతున్నారు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• خوف المؤمن من عدم قبول عمله الصالح.
విశ్వాసపరుడికి తన సత్కర్మ స్వీకరించబడదన్న భయము కలిగి ఉండటం.

• سقوط التكليف بما لا يُسْتطاع رحمة بالعباد.
సాధ్యం కాని బాధలు తొలిగిపోవటం దాసులపట్ల కారుణ్యము.

• الترف مانع من موانع الاستقامة وسبب في الهلاك.
విలాసము నిలకడ నుండి (స్థిరత్వము) ఆటంకమును కలిగిస్తుంది. మరియు వినాశనమునకు కారణమవుతుంది.

• قصور عقول البشر عن إدراك كثير من المصالح.
అనేక ప్రయోజనాలను గుర్తించటం నుండి మానవుల బుద్ధులు విఫలమవుతాయి.

وَلَوْ رَحِمْنٰهُمْ وَكَشَفْنَا مَا بِهِمْ مِّنْ ضُرٍّ لَّلَجُّوْا فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟
మరియు మేము వారిపై కరుణించి వారిపై కల కరువును,ఆకలిని తొలగించినా వారు సత్యం నుండి తమ అపమార్గంలోనే కొనసాగేవారు మరియు సంశయించేవారు,తడబడేవారు.
Ang mga Tafsir na Arabe:
وَلَقَدْ اَخَذْنٰهُمْ بِالْعَذَابِ فَمَا اسْتَكَانُوْا لِرَبِّهِمْ وَمَا یَتَضَرَّعُوْنَ ۟
వాస్తవానికి మేము వారిని రకరకాల ఆపదలతో పరీక్షించాము. అయినా వారు తమ ప్రభువుకు విధేయులు కాలేదు,ఆయన ముందు వంగలేదు. మరియు ఆపదలు కలిగినప్పుడు తమ నుండి తొలగించమని ఆయనతో అణకువతో వేడుకోలేదు.
Ang mga Tafsir na Arabe:
حَتّٰۤی اِذَا فَتَحْنَا عَلَیْهِمْ بَابًا ذَا عَذَابٍ شَدِیْدٍ اِذَا هُمْ فِیْهِ مُبْلِسُوْنَ ۟۠
చివరికి మేము వారిపై కఠినమైన శిక్ష కల ఒక ద్వారమును తెరిచినప్పుడు వారు ప్రతీ ఉపశమనం మరియు మేలు నుండి నిరాశ చెందారు.
Ang mga Tafsir na Arabe:
وَهُوَ الَّذِیْۤ اَنْشَاَ لَكُمُ السَّمْعَ وَالْاَبْصَارَ وَالْاَفْـِٕدَةَ ؕ— قَلِیْلًا مَّا تَشْكُرُوْنَ ۟
మరియు ఓ మరణాంతరం లేపబడటమును తిరస్కరించేవారా పరిశుద్ధుడైన అల్లాహ్ ఆయనే మీ కొరకు మీరు వినటానికి చెవులను, మీరు చూడటానికి కళ్ళను, మీరు అర్ధం చేసుకోవటానికి హృదయములను సృష్టించాడు. అయినా కూడా మీరు ఈ అనుగ్రహాలపై ఆయనకు చాలా తక్కువ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
Ang mga Tafsir na Arabe:
وَهُوَ الَّذِیْ ذَرَاَكُمْ فِی الْاَرْضِ وَاِلَیْهِ تُحْشَرُوْنَ ۟
ఓ ప్రజలారా ఆయనే మిమ్మల్ని భూమిలో సృష్టించాడు. మరియు మీరు ప్రళయ దినాన లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ఆయన ఒక్కడి వైపే సమీకరించబడుతారు.
Ang mga Tafsir na Arabe:
وَهُوَ الَّذِیْ یُحْیٖ وَیُمِیْتُ وَلَهُ اخْتِلَافُ الَّیْلِ وَالنَّهَارِ ؕ— اَفَلَا تَعْقِلُوْنَ ۟
మరియు పరిశుద్ధుడైన ఆయన ఒక్కడే జీవింపజేసేవాడు. ఆయన తప్ప ఇంకెవరూ జీవింపజేసేవాడు లేడు. మరియు ఆయన ఒక్కడే మరణాన్ని ప్రసాదించేవాడు,ఆయన తప్ప ఇంకెవరూ మరణాన్ని ప్రసాదించేవాడు కాడు. రాత్రి పగళ్ళ మార్పు చీకటిపరంగా,వెలుగ పరంగా,పొడవవటం పరంగా,చిన్నదవటం పరంగా సామర్ధ్యం ఆయన ఒక్కడికే ఉన్నది. ఏమీ మీరు సృష్టించటంలో,పర్యాలోచనలో ఆయన సామర్ధ్యమును,ఆయన ఒక్కడే అన్న విషయమును అర్ధం చేసుకోరా ?!.
Ang mga Tafsir na Arabe:
بَلْ قَالُوْا مِثْلَ مَا قَالَ الْاَوَّلُوْنَ ۟
అంతేకాక వారు అవిశ్వాసంలో తమ తాతముత్తాతలు,తమ పూర్వికులు పలికినట్లే పలుకుతున్నారు.
Ang mga Tafsir na Arabe:
قَالُوْۤا ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ ۟
వారు దూరమయ్యే ,తిరస్కరించే తీరుతో ఇలా పలికారు : ఏమీ మేము మరణించి మట్టిగా,క్రుసించిపోయిన ఎముకలుగా అయపోయినప్పుడు లెక్క కొరకు జీవింపబడి మరల లేపబడుతామా ?!.
Ang mga Tafsir na Arabe:
لَقَدْ وُعِدْنَا نَحْنُ وَاٰبَآؤُنَا هٰذَا مِنْ قَبْلُ اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ ۟
మరియు నిశ్ఛయంగా ఇటువంటి వాగ్ధానం అది మరణాంతరం మరల లేపబడటం మాతో చేయబడినది మరియు మాకన్న ముందు దీని గురించి మా పూర్వికులు వాగ్దానం చేయబడ్డారు. మరియు మేము ఈ వాగ్దానం నెరవేరటం చూడలేదు. ఇవి మా పూర్వికుల అసత్యాలు,వారి అబద్దాలు మాత్రమే.
Ang mga Tafsir na Arabe:
قُلْ لِّمَنِ الْاَرْضُ وَمَنْ فِیْهَاۤ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో "ఒక వేళ మీకు జ్ఞానమే ఉంటే ఈ భూమి,దానిపై ఉన్నది ఎవరిది చెప్పండి ?" అని అడగండి.
Ang mga Tafsir na Arabe:
سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ اَفَلَا تَذَكَّرُوْنَ ۟
వారు తొందరలోనెే భూమి,దానిపై ఉన్నది అల్లాహ్ ది అని సమాధానమిస్తారు. అప్పుడు మీరు వారితో ఇలా పలకండి : భూమీ,దానిపై ఉన్నది ఎవరిదో అతడు మీ మరణం తరువాత మిమ్మల్ని జీవింపజేయటంపై సామర్ధ్యం కలవాడని మీరు హితోపదేశం స్వీకరించరా ?.
Ang mga Tafsir na Arabe:
قُلْ مَنْ رَّبُّ السَّمٰوٰتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِیْمِ ۟
మీరు వారిని అడగండి : సప్తాకాశముల ప్రభువు ఎవరు ?. మరియు ఆ మహోన్నత సింహాసనం దాని కన్న గొప్ప సృష్టి లేదు అటువంటి దాని ప్రభువు ఎవరు ?.
Ang mga Tafsir na Arabe:
سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ اَفَلَا تَتَّقُوْنَ ۟
వారు తొందరలోనే ఇలా అంటారు : సప్తాకాశములు,మహోన్నత సింహాసనం అల్లాహ్ ఆదీనంలో ఉన్నవి. అప్పుడు మీరు వారితో అడగండి : అతని శిక్ష నుండి మీరు జాగ్రత్తగా ఉండటానికి అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయబీతిని కలిగి ఉండరా ?.
Ang mga Tafsir na Arabe:
قُلْ مَنْ بِیَدِهٖ مَلَكُوْتُ كُلِّ شَیْءٍ وَّهُوَ یُجِیْرُ وَلَا یُجَارُ عَلَیْهِ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
వారితో ఇలా అడగండి : ప్రతీ వస్తువు యొక్క అధికారము ఎవరి చేతిలో ఉన్నది,అతని అధికారము నుండి ఏదీ వేరవదు. మరియు అతడు తన దాసుల్లోంచి తాను ఎవరిని తలచుకుంటే వారకి సహాయం చేస్తాడు. ఆయన ఎవరికైన చెడు చేయదలచుకుంటే అతని నుండి ఆపి అతని నుండి శిక్షను దూరం చేసేవాడూ ఎవడూ లేడు ఒక వేళ మీకు ఏదైన జ్ఞానం ఉంటే (చెప్పండి).
Ang mga Tafsir na Arabe:
سَیَقُوْلُوْنَ لِلّٰهِ ؕ— قُلْ فَاَنّٰی تُسْحَرُوْنَ ۟
వారు తొందరలోనే ప్రతీ వస్తువు యొక్క అధికారము పరిశుద్ధుడైన ఆయన చేతిలోనే ఉన్నది అని అంటారు. అయితే మీ బుద్ధులు ఎలా ఉన్నాయని మీరు దాన్ని అంగీకరించి కూడా ఆయనను వదిలి ఇతరులను ఆరాధిస్తున్నారు ?!.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• عدم اعتبار الكفار بالنعم أو النقم التي تقع عليهم دليل على فساد فطرهم.
అవిశ్వాసపరులు అనుగ్రహముల ద్వారా లేదా వారిపై వాటిల్లిన శిక్ష ద్వారా గుణపాఠం నేర్చుకోకపోవటం వారి చెడు స్వభావమునకు ఆధారం.

• كفران النعم صفة من صفات الكفار.
అనుగ్రహాల పట్ల కృతఘ్నతా వైఖరి అవిశ్వాసపరుల గుణాల్లోంచి ఒక గుణము.

• التمسك بالتقليد الأعمى يمنع من الوصول للحق.
అంధ అనుకరణకు కట్టుబడి ఉండటం సత్యమునకు చేరటం నుండి ఆపుతుంది.

• الإقرار بالربوبية ما لم يصحبه إقرار بالألوهية لا ينجي صاحبه.
తౌహీదె రుబూబియత్ యొక్క అంగీకారమునకు తోడుగా తౌహీదె ఉలూహియత్ యొక్క అంగీకారం లేనంత వరకు అంగీకరించే వ్యక్తిని రక్షించదు.

بَلْ اَتَیْنٰهُمْ بِالْحَقِّ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟
విషయం వారు వాదిస్తున్నట్లు కాదు. కాని మేము వారి వద్దకు ఎటువంటి సందేహం లేని సత్యాన్ని తీసుకుని వచ్చాము. అల్లాహ్ కొరకు భాగస్వామి,సంతానము ఉన్నదని వారు వాదిస్తున్న విషయంలో వారు అబద్దము పలుకుతున్నారు. వారి మాటల నుండి అల్లాహ్ ఎంతో మహోన్నతుడు.
Ang mga Tafsir na Arabe:
مَا اتَّخَذَ اللّٰهُ مِنْ وَّلَدٍ وَّمَا كَانَ مَعَهٗ مِنْ اِلٰهٍ اِذًا لَّذَهَبَ كُلُّ اِلٰهٍ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلٰی بَعْضٍ ؕ— سُبْحٰنَ اللّٰهِ عَمَّا یَصِفُوْنَ ۟ۙ
అవిశ్వాసపరులు అనుకుంటున్నట్లు అల్లాహ్ సంతానమును చేసుకోలేదు. మరియు ఆయనతో పాటు ఎటువంటి వాస్తవ ఆరాధ్య దైవం లేడు. ఒక వేళ ఆయనతో పాటు ఎవరైన వాస్తవ ఆరాధ్య దైవం ఉన్నాడే అనుకోండి ప్రతీ ఆరాధ్య దైవం తాను సృష్టించిన సృష్టితాల్లోంచి తన భాగమును తీసుకుని పోతాడు. వారిలోంచి కొందరు కొందరిపై ఆధిక్యతను చూపుతారు. అప్పుడు విశ్వ వ్యవస్త నాశనమవుతుంది. నిజానికి ఇవేమీ జరగలేదు. అయితే ఆయన సత్య ఆరాధ్య దైవం ఒక్కడే అని ఆయన ఏకైక అల్లాహ్ అని సూచించాడు. ఆయనకు తగని సంతానము,భాగస్వామి దేని గురించి అయితే ముష్రికులు వర్ణిస్తున్నారో వాటి నుండి ఆయన పరిశుద్ధుడు,పవిత్రుడు.
Ang mga Tafsir na Arabe:
عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَتَعٰلٰی عَمَّا یُشْرِكُوْنَ ۟۠
ఆయన తన సృష్టితాల నుండి గోచరంగా ఉన్న ప్రతీది తెలిసిన వాడు, ఏవైతే ఆయన చూసి ఇంద్రియాలతో గ్రహిస్తాడో వాటిని తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. పరిశుద్ధుడైన ఆయన తనకు భాగస్వామి ఉండటం నుండి మహోన్నతుడు.
Ang mga Tafsir na Arabe:
قُلْ رَّبِّ اِمَّا تُرِیَنِّیْ مَا یُوْعَدُوْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు ఇలా ప్రార్ధించండి : ఓ ప్రభువా నీవు ఈ ముష్రికులందరితో వాగ్దానం చేసిన శిక్షను ఒక వేళ నాకు చూపించదలచుకుంటే;
Ang mga Tafsir na Arabe:
رَبِّ فَلَا تَجْعَلْنِیْ فِی الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟
ఓ నా ప్రభువా ఒక వేళ నీవు వారిని నేను చూస్తున్నప్పుడే శిక్షిస్తే అప్పుడు నీవు నన్ను వారికి కలిగిన శిక్ష కలగటానికి వారిలో చేయకు.
Ang mga Tafsir na Arabe:
وَاِنَّا عَلٰۤی اَنْ نُّرِیَكَ مَا نَعِدُهُمْ لَقٰدِرُوْنَ ۟
మరియు నిశ్చయంగా మేము వారికి వాగ్దానం చేసిన శిక్షను మీరు చూసేటట్లుగా మిమ్మల్ని చేసే సామర్ధ్యం కలవారము. దాని నుండి,ఇతర వాటి నుండి మేము అశక్తులము కాము.
Ang mga Tafsir na Arabe:
اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ السَّیِّئَةَ ؕ— نَحْنُ اَعْلَمُ بِمَا یَصِفُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు మీతో చెడు చేసిన వారికి మంచితనముతో,అతనిని మన్నించి,అతని వలన కలిగిన బాధపై సహనం వహించి తొలగించండి. వారు కల్పిస్తున్న భాగస్వామ్యము,అసత్యము గురించి,నీకు తగనివి మంత్రజాలకుడు,పిచ్చివాడు అన్న గుణాలను నీకు వారు అపాదిస్తున్న వాటి గురించి మాకు బాగా తెలుసు.
Ang mga Tafsir na Arabe:
وَقُلْ رَّبِّ اَعُوْذُ بِكَ مِنْ هَمَزٰتِ الشَّیٰطِیْنِ ۟ۙ
మరియు మీరు ఇలా ప్రార్ధించండి : ఓ నా ప్రభువా నేను షైతానుల దుష్ప్రేరణల నుండి,వారి కలతల నుండి నీ రక్షణను కోరుతున్నాను.
Ang mga Tafsir na Arabe:
وَاَعُوْذُ بِكَ رَبِّ اَنْ یَّحْضُرُوْنِ ۟
ఓ నా ప్రభువా వారు నా వ్యవహారములలో నుండి ఏదైన దానిలో నా వద్దకు రావటం నుండి నేను నీ శరణమును కోరుతున్నాను.
Ang mga Tafsir na Arabe:
حَتّٰۤی اِذَا جَآءَ اَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُوْنِ ۟ۙ
చివరికి ఈ ముష్రికులందరిలోంచి ఎవరి వద్దకైన మరణం వచ్చి అతను తనపై వచ్చిన దాన్ని కళ్ళారా చూసినప్పుడు తన వయస్సులో నుండి తాను కోల్పోయిన దానిపై,అల్లాహ్ విషయంలో తాను చేసిన తప్పిదంపై పశ్ఛాత్తాప్పడుతూ ఇలా వేడుకుంటాడు : ఓ నా ప్రభువా నీవు నన్ను ఇహలోక జీవితంవైపు మరలించు.
Ang mga Tafsir na Arabe:
لَعَلِّیْۤ اَعْمَلُ صَالِحًا فِیْمَا تَرَكْتُ كَلَّا ؕ— اِنَّهَا كَلِمَةٌ هُوَ قَآىِٕلُهَا ؕ— وَمِنْ وَّرَآىِٕهِمْ بَرْزَخٌ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟
నేను దాని వైపునకు మరలినప్పుడు నేను సత్కార్యములు చేయటానికి. ఖచ్చితం అలా జరగదు. విషయం నీవు కోరినట్లుగా లేదు. ఇది కేవలం అతను చెప్పిన మాట మాత్రమే. ఒక వేళ అతను ఇహలోక జీవితం వైపునకు మరలించబడితే అతను తాను చేసిన వాగ్దానమును నెరవేర్చడు. చనిపోయిన వీరందరు ఇహలోకము, మరణాంతరం లేపబడి మరలించబడే పరలోకమున మధ్య ఒక అడ్డు తెరలో (బర్జఖ్ లో) ఉండిపోతారు. వారు తాము కోల్పోయిన దాన్ని పొందటానికి, తాము పాడు చేసుకున్న దాన్ని సరి చేసుకోవటానికి దాని నుండి ఇహలోకము వైపునకు మరలించబడరు.
Ang mga Tafsir na Arabe:
فَاِذَا نُفِخَ فِی الصُّوْرِ فَلَاۤ اَنْسَابَ بَیْنَهُمْ یَوْمَىِٕذٍ وَّلَا یَتَسَآءَلُوْنَ ۟
బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత ప్రళయం గురించి ప్రకటన ఇచ్చే రెండవ బాకాను కొమ్ములో (సూర్ లో) ఊదినప్పుడు వారు పరలోక భయాందోళనల్లో మునిగి ఉండటం వలన వారు తమ మధ్య గొప్పగా చెప్పుకునే వంశావళి ఉండదు. వారు తమ ముఖ్యమైన పనిలో మునిగి ఉండటం వలన వారు ఒకరినొకరు అడగరు.
Ang mga Tafsir na Arabe:
فَمَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟
అయితే ఎవరి సత్కర్మలు అయితే అతని దుష్కర్మలపై అధికమై అతని త్రాసు పళ్ళాలు బరువవుతాయో వారందరు తాము ఆశించిన దాన్ని పొంది,తాము భయపడే వాటితో విముక్తి పొంది సాఫల్యం పొందుతారు.
Ang mga Tafsir na Arabe:
وَمَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓىِٕكَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فِیْ جَهَنَّمَ خٰلِدُوْنَ ۟ۚ
మరియు ఎవరి దుష్కర్మలు అతని సత్కర్మల కన్న అధికమై అతని త్రాసు పళ్ళములు తేలికైపోతాయో వారందరు తమకు నష్టము చేసే కార్యాలను చేసి,తమకు లాభం కలిగించే కార్యాలైన విశ్వాసం, సత్కార్యం చేయటమును వదిలివేసి తమ స్వయమును వృధా చేసుకుంటారు. వారు నరకాగ్నిలో శాస్వతంగా ఉంటారు. దానిలో నుండి వారు బయటపడరు.
Ang mga Tafsir na Arabe:
تَلْفَحُ وُجُوْهَهُمُ النَّارُ وَهُمْ فِیْهَا كٰلِحُوْنَ ۟
నరకాగ్ని వారి ముఖములను మాడ్చివేస్తుంది. వారు అందులో ఎలా ఉంటారంటే విచార తీవ్రత వలన వారి ఎగువ పెదాలు మరియు దిగువ పెదాలు వారి పళ్ళ నుండి కుంచించుకుపోతాయి.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• الاستدلال باستقرار نظام الكون على وحدانية الله.
విశ్వ వ్యవస్థ స్థిరత్వము ద్వారా అల్లాహ్ ఏకత్వముపై ఆధార నిరూపణ.

• إحاطة علم الله بكل شيء.
ప్రతీ వస్తువును అల్లాహ్ జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది.

• معاملة المسيء بالإحسان أدب إسلامي رفيع له تأثيره البالغ في الخصم.
దుష్కర్మకు పాల్పడే వాడితో దాతృత్వంతో వ్యవహరించటం ఇస్లాం పధ్ధతి అది ప్రత్యర్ధిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.

• ضرورة الاستعاذة بالله من وساوس الشيطان وإغراءاته.
షైతాను యొక్క దుష్ప్రేరణల నుండి,అతని ప్రలోభాల నుండి అల్లాహ్ తో శరణు కోరటం ఎంతో అవసరం.

اَلَمْ تَكُنْ اٰیٰتِیْ تُتْلٰی عَلَیْكُمْ فَكُنْتُمْ بِهَا تُكَذِّبُوْنَ ۟
వారిని బెదిరిస్తూ వారితో ఇలా చెప్పబడుతుంది : ఇహలోకంలో ఖుర్ఆన్ ఆయతులు మీపై చదివి వినిపించబడలేదా. అయినా మీరు వాటిని ధిక్కరించేవారు ?!.
Ang mga Tafsir na Arabe:
قَالُوْا رَبَّنَا غَلَبَتْ عَلَیْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَآلِّیْنَ ۟
వారు ఇలా పలికారు : ఓ మా ప్రభువా నీ జ్ఞానంలో ముందే ఉన్నది మాపై మా దురదృష్టం క్రమ్ముకుని ఉన్నది. మరియు మేము సత్యము నుండి తప్పిపోయిన వారిగా ఉన్నాము.
Ang mga Tafsir na Arabe:
رَبَّنَاۤ اَخْرِجْنَا مِنْهَا فَاِنْ عُدْنَا فَاِنَّا ظٰلِمُوْنَ ۟
ఓ మా ప్రభువా మమ్మల్ని నరకాగ్ని నుండి బయటకి తీ, అయినప్పటికీ మేము, మేము చేసిన అవిశ్వాసము,మార్గ భ్రష్టత వైపునకు మరలితే అప్పుడు మేము నిశ్ఛయంగా మాపై హింసకు పాల్పడిన వారమవుతాము. నిశ్ఛయంగా మా సాకు అంతమైపోయింది.
Ang mga Tafsir na Arabe:
قَالَ اخْسَـُٔوْا فِیْهَا وَلَا تُكَلِّمُوْنِ ۟
అల్లాహ్ అంటాడు : మీరు నరకాగ్నిలో అవమానకరంగా,పరాభవమునకు లోనై జీవించండి. నాతో మీరు మాట్లాడకండి.
Ang mga Tafsir na Arabe:
اِنَّهٗ كَانَ فَرِیْقٌ مِّنْ عِبَادِیْ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَاَنْتَ خَیْرُ الرّٰحِمِیْنَ ۟ۚۖ
నిశ్ఛయంగా నా పై విశ్వాసం కనబరచిన ఒక వర్గము ఇలా పలుకుతూ ఉండేది : ఓ మా ప్రభువా మేము నీ పై విశ్వాసమును కనబరిచాము. అయితే నీవు మా పాపములను మన్నించు,మాపై నీ కారుణ్యముతో దయచూపు. మరియు నీవు కరుణించేవారిలో నుంచి ఉత్తమమైనవాడివి.
Ang mga Tafsir na Arabe:
فَاتَّخَذْتُمُوْهُمْ سِخْرِیًّا حَتّٰۤی اَنْسَوْكُمْ ذِكْرِیْ وَكُنْتُمْ مِّنْهُمْ تَضْحَكُوْنَ ۟
కాని మీరు తమ ప్రభువును వేడుకునే ఈ విశ్వాసపరులందరి హేళనచేయటానికి ఒక స్థలమును ఏర్పరచి మీరు వారిపై ఎగతాళి చేసేవారు,హేళన చేసేవారు. చివరికి వారి గురించి హేళనలో మునిగి ఉండటం మిమ్మల్ని అల్లాహ్ స్మరణను మరిపింపజేసింది. మరియు మీరు వారిపై ఎగతాళి చేస్తూ,హేళన చేస్తూ నవ్వేవారు.
Ang mga Tafsir na Arabe:
اِنِّیْ جَزَیْتُهُمُ الْیَوْمَ بِمَا صَبَرُوْۤا ۙ— اَنَّهُمْ هُمُ الْفَآىِٕزُوْنَ ۟
నిశ్ఛయంగా నేను ఈ విశ్వాసపరులందరికి అల్లాహ్ విధేయతలో ,మీ నుండి పొందిన బాధలపై వారి సహనం వలన ప్రళయదినాన స్వర్గము ద్వారా సాఫల్యమును ప్రతిఫలంగా ప్రసాదించాను.
Ang mga Tafsir na Arabe:
قٰلَ كَمْ لَبِثْتُمْ فِی الْاَرْضِ عَدَدَ سِنِیْنَ ۟
ఆయన ఇలా ప్రశ్నిస్తాడు : మీరు భూమిపై ఎన్ని సంవత్సరాలు గడిపారు ?, ఎంత సమయమును అందులో వృధా చేశారు ?.
Ang mga Tafsir na Arabe:
قَالُوْا لَبِثْنَا یَوْمًا اَوْ بَعْضَ یَوْمٍ فَسْـَٔلِ الْعَآدِّیْنَ ۟
అప్పుడు వారు తమ మాటల్లో ఇలా జవాబు ఇస్తారు : మేము ఒక రోజు లేదా ఒక రోజు యొక్క కొంత భాగము గడిపాము.అయితే నీవు దినములను,నెలలను లెక్క వేసే వారిని అడుగు.
Ang mga Tafsir na Arabe:
قٰلَ اِنْ لَّبِثْتُمْ اِلَّا قَلِیْلًا لَّوْ اَنَّكُمْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
(అల్లాహ్) ఇలా అంటాడు : మీరు ఇహలోకములో కొన్ని రోజులు మాత్రమే గడిపారు,అందులో విధేయత పై సహనం చాలా సులభముగా ఉండేది. ఒక వేళ మీరు గడిపిన పరిమాణం ఎంతో తెలుసుకుని ఉంటే బాగుండేది.
Ang mga Tafsir na Arabe:
اَفَحَسِبْتُمْ اَنَّمَا خَلَقْنٰكُمْ عَبَثًا وَّاَنَّكُمْ اِلَیْنَا لَا تُرْجَعُوْنَ ۟
అయితే ఓ ప్రజలారా ఏమీ మేము మిమ్మల్ని ఎటువంటి విజ్ఞత లేకుండా ఆటగా,ఎటువంటి ప్రతిఫలం గాని ఎటువంటి శిక్ష గాని లేని జంతువులవలే సృష్టించామని,మీరు ప్రళయ దినాన లెక్క కొరకు,ప్రతిఫలం కొరకు మా వైపు మరలించబడరని మీరు భావిస్తున్నారా ?
Ang mga Tafsir na Arabe:
فَتَعٰلَی اللّٰهُ الْمَلِكُ الْحَقُّ ۚ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— رَبُّ الْعَرْشِ الْكَرِیْمِ ۟
యజమాని,తన సృష్టితాల్లో తాను కోరిన విధంగా వ్యవహరించే వాడైన అల్లాహ్ పవితృడు. ఆయన సత్యము,ఆయన వాగ్దానము సత్యము,ఆయన మాట సత్యము. ఆయన తప్ప వేరే సత్య ఆరాధ్య దైవం లేడు. సృష్టితాల్లో గొప్పదైన సృష్టి అయిన ఉత్తమమైన అర్ష్ ప్రభువు. ఎవరైతే సృష్టితాల్లో గొప్పవాటి ప్రభువు అవుతాడో ఆయనే అన్నింటియొక్క ప్రభువు.
Ang mga Tafsir na Arabe:
وَمَنْ یَّدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ۙ— لَا بُرْهَانَ لَهٗ بِهٖ ۙ— فَاِنَّمَا حِسَابُهٗ عِنْدَ رَبِّهٖ ؕ— اِنَّهٗ لَا یُفْلِحُ الْكٰفِرُوْنَ ۟
మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు ఆరాధనకు హక్కుదారుడు అనటానికి ఎటువంటి ఆధారం లేని (ఇదే పరిస్థితి అల్లాహ్ కాకుండా ఇతర ప్రతీ ఆరాధ్య దైవ పరిస్థితి) వేరే ఆరాధ్య దైవముగా ఆరాధిస్తాడో అతని దుష్కర్మ యొక్క ప్రతిఫలం పరిశుద్ధుడైన తన ప్రభువు వద్ద ఉన్నది. ఆయనే అతనిపై శిక్షను కలిగించి అతనికి ప్రతిఫలమును ప్రసాధిస్తాడు. నిశ్చయంగా అవిశ్వాసపరులు తాము ఆశిస్తున్న వాటిని పొంది,తాము భయపడే వాటి నుండి విముక్తి పొంది సాఫల్యం చెందలేరు.
Ang mga Tafsir na Arabe:
وَقُلْ رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَاَنْتَ خَیْرُ الرّٰحِمِیْنَ ۟۠
ఓ ప్రవక్తా మీరు ఇలా వేడుకోండి : ఓ నా ప్రభువా నా పాపములను మన్నించు మరియు నీ కారుణ్యముతో నాపై దయ చూపు. మరియు నీవు ఒక పాపాత్ముడి పై దయ చూపి అతని పశ్ఛాత్తాపమును అంగీకరించిన ఉత్తమమైనవాడివి.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• الكافر حقير مهان عند الله.
అవిశ్వాసపరుడు అల్లాహ్ వద్ద తుచ్చమైన వాడు,పరాభవుడు.

• الاستهزاء بالصالحين ذنب عظيم يستحق صاحبه العذاب.
పుణ్యాత్ములను ఎగతాళి చేయటం ఎంత పెద్ద పాపమంటే దానికి పాల్పడే వాడు శిక్షకు అర్హుడవుతాడు.

• تضييع العمر لازم من لوازم الكفر.
జీవితాన్ని వృధా చేయటం అవిశ్వాసము యొక్క సరఫరాల్లోంచిది.

• الثناء على الله مظهر من مظاهر الأدب في الدعاء.
అల్లాహ్ ను స్థుతించటం దుఆ పధ్ధతి ప్రదర్శకాల్లోంచి ఒక ప్రదర్శకము.

• لما افتتح الله سبحانه السورة بذكر صفات فلاح المؤمنين ناسب أن تختم السورة بذكر خسارة الكافرين وعدم فلاحهم.
పరిశుద్ధుడైన అల్లాహ్ సూరాను విశ్వాసపరుల సాఫల్యము యొక్క లక్షణాలను ప్రస్తావించటం ద్వారా ప్రారంభించినప్పుడు అవిశ్వాసపరుల నష్టమును,వారి వైఫల్యమును ప్రస్తావించటం ద్వారా సూరాను ముగించటం సముచితము

 
Salin ng mga Kahulugan Surah: Al-Mu’minūn
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara