Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Maryam   Ayah:
وَاَنْذِرْهُمْ یَوْمَ الْحَسْرَةِ اِذْ قُضِیَ الْاَمْرُ ۘ— وَهُمْ فِیْ غَفْلَةٍ وَّهُمْ لَا یُؤْمِنُوْنَ ۟
ఓ ప్రవక్తా పాపాత్ముడు తాను చేసిన పాపముపై ,పుణ్యాత్ముడు విధేయ కార్యము అధికంగా చేయకపోవటంపై పశ్చాత్తాప్పడే వేళ అయిన పశ్చాత్తాప్పడే దినము నుండి ప్రజలను హెచ్చరించండి. అప్పుడు దాసుల కర్మపుస్తకాలు చుట్టి వేయబడి వారి లెక్క తీసుకోవటం పూర్తవుతుంది. ప్రతి ఒక్కడు తాను ముందుకు పంపించినది అయిపోయింది. మరియు వారు తమ ప్రాపంచిక జీవితంలో ఉండి దాని ద్వారా ఆకర్షితులయ్యారు.పరలోక జీవితం నుండి పరధ్యానంలో ఉన్నారు. మరియు వారు ప్రళయదినమును విశ్వసించలేదు.
Ang mga Tafsir na Arabe:
اِنَّا نَحْنُ نَرِثُ الْاَرْضَ وَمَنْ عَلَیْهَا وَاِلَیْنَا یُرْجَعُوْنَ ۟۠
నిశ్చయంగా సృష్టితాలన్ని అంతమైపోయిన తరువాత మేమే భూమికి వారసులుగా ఉండిపోయేవారము,వారి అంతమైపోవటం వలన,వారి తరువాత మేము ఉండిపోవటం వలన దానిపై ఉన్న వాటన్నింటికి మేము వారసులమవుతాము. మరియు మేము వారిపై అధికారము కలవారమవుతాము,మేము కోరుకున్న విధంగా వారి మధ్య వ్యవహరిస్తాము. ప్రళయదినాన మా ఒక్కరి వైపే లెక్కతీసుకొనబడటానికి,ప్రతిఫలం ఇవ్వబడటానికి వారు మరలించబడుతారు.
Ang mga Tafsir na Arabe:
وَاذْكُرْ فِی الْكِتٰبِ اِبْرٰهِیْمَ ؕ۬— اِنَّهٗ كَانَ صِدِّیْقًا نَّبِیًّا ۟
ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో ఇబ్రాహీమ్ అలైహిస్సలాం వృత్తాంతమును మీరు గుర్తు చేసుకోండి.నిశ్చయంగా ఆయన అత్యంత నిజాయితీ పరుడు,అల్లాహ్ ఆయతులను దృవీకరించేవాడు,అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ఒక ప్రవక్త.
Ang mga Tafsir na Arabe:
اِذْ قَالَ لِاَبِیْهِ یٰۤاَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا یَسْمَعُ وَلَا یُبْصِرُ وَلَا یُغْنِیْ عَنْكَ شَیْـًٔا ۟
ఆయన తన తండ్రి ఆజర్ తో ఇలా పలికినప్పుడు : ఓ నా తండ్రి మీరు అల్లాహ్ ను వదిలి విగ్రహమును ఒక వేళ మీరు దాన్ని మొరపెట్టుకుంటే అది మీ దుఆను వినలేదు,ఒక వేళ మీరు దాన్ని ఆరాధిస్తే అది మీ ఆరాధనను చూడలేదు,మీ నుండి ఎటువండి కీడును తొలగించలేదు,మీ కొరకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు అటువంటి దాన్ని మీరు ఎలా ఆరాధిస్తున్నారు ?!.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَبَتِ اِنِّیْ قَدْ جَآءَنِیْ مِنَ الْعِلْمِ مَا لَمْ یَاْتِكَ فَاتَّبِعْنِیْۤ اَهْدِكَ صِرَاطًا سَوِیًّا ۟
ఓ నా తండ్రి నీ వద్దకు రాని జ్ఞానము నా వద్దకు దైవ వాణి ద్వారా వచ్చినది. కావున నీవు నన్ను అనుసరించు. నేను నీకు సన్మార్గమును చూపుతాను.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَبَتِ لَا تَعْبُدِ الشَّیْطٰنَ ؕ— اِنَّ الشَّیْطٰنَ كَانَ لِلرَّحْمٰنِ عَصِیًّا ۟
ఓ నా తండ్రి మీరు షైతానును నీ విధేయత ద్వారా అతన్ని ఆరాధించకు.నిశ్చయంగా షైతాను రహ్మాను కొరకు అవిధేయపరుడు ఎప్పుడైతే ఆయన ఆదంనకు సాష్టాంగపడమని ఆదేశించాడో అప్పుడు సాష్టాంగపడలేదు.
Ang mga Tafsir na Arabe:
یٰۤاَبَتِ اِنِّیْۤ اَخَافُ اَنْ یَّمَسَّكَ عَذَابٌ مِّنَ الرَّحْمٰنِ فَتَكُوْنَ لِلشَّیْطٰنِ وَلِیًّا ۟
ఓ నా తండ్రి ఒక వేళ మీరు మీ అవిశ్వాస స్థితిలోనే మరణిస్తే మీకు కరుణామయుడి వద్ద నుండి శిక్ష చుట్టుకుంటుందని నేను భయపడుతున్నాను. అప్పుడు మీరు షైతానుకు విధేయత చూపటం వలన శిక్షలో అతనికి మీరు తోడుగా ఉంటారు.
Ang mga Tafsir na Arabe:
قَالَ اَرَاغِبٌ اَنْتَ عَنْ اٰلِهَتِیْ یٰۤاِبْرٰهِیْمُ ۚ— لَىِٕنْ لَّمْ تَنْتَهِ لَاَرْجُمَنَّكَ وَاهْجُرْنِیْ مَلِیًّا ۟
ఆజరు తన కుమారుడగు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తో ఓ ఇబ్రాహీమ్ నీవు నేను ఆరాధించే విగ్రహాలపట్ల విముఖత చూపుతున్నావా ?!. ఒక వేళ నీవు నా విగ్రహాలను దూషించటమును మానకపోతే నేను నిన్ను తప్పకుండా రాళ్ళతో కొడతాను. నీవు చాలా కాలం వరకు నా నుండి వేరైపో. నీవు నాతో మాట్లాడకు,నాతో పాటు సమావేశమవకు అని పలికాడు.
Ang mga Tafsir na Arabe:
قَالَ سَلٰمٌ عَلَیْكَ ۚ— سَاَسْتَغْفِرُ لَكَ رَبِّیْ ؕ— اِنَّهٗ كَانَ بِیْ حَفِیًّا ۟
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన తండ్రితో ఇలా పలికారు : నా తరపు నుండి మీపై సలాం. మీరు నా నుండి ధ్వేషించేది మీకు కలగదు. తొందరలోనే నేను మీ కొరకు నా ప్రభువుతో మన్నింపును,సన్మార్గమును కోరుతాను. నిశ్చయంగా ఆయన నాపై అధికంగా దయకలవాడు.
Ang mga Tafsir na Arabe:
وَاَعْتَزِلُكُمْ وَمَا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ وَاَدْعُوْا رَبِّیْ ۖؗ— عَسٰۤی اَلَّاۤ اَكُوْنَ بِدُعَآءِ رَبِّیْ شَقِیًّا ۟
మరియు నేను మీ నుండి వేరైపోతాను. మరియు మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ ఆరాధ్య దైవాల నుండి వేరైపోతాను. మరియు నేను ఒక్కడైన నా ప్రభువుని వేడుకుంటాను,ఆయనతోపాటు దేనినీ సాటి కల్పించను. బహుశా నేను అతడిని వేడుకున్నప్పుడు అతడు నన్ను ఆపడు. ఒక వేళ ఆపితే నేను అతడిని వేడుకోవటం ద్వారా దౌర్భాగ్యుడినైపోతాను.
Ang mga Tafsir na Arabe:
فَلَمَّا اعْتَزَلَهُمْ وَمَا یَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ۙ— وَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ وَیَعْقُوْبَ ؕ— وَكُلًّا جَعَلْنَا نَبِیًّا ۟
ఎప్పుడైతే ఆయన వారిని విడిచిపెట్టారో,అల్లాహ్ ను వదిలి వారు పూజించే విగ్రహాలను వదిలేశారో తన ఇంటి వారిని కోల్పోవటం మూలంగా ఆయనకు మేము పరిహారమిచ్చాము. అప్పుడు మేము ఆయనకు ఆయన కుమారుడగు ఇస్ హాఖ్ ను ప్రసాధించాము. మరియు మేము ఆయనకు ఆయన మనవడగు యాఖూబ్ ను ప్రసాధించాము. వారిద్దరిలో నుండి ప్రతి ఒక్కరిని మేము ప్రవక్తలుగా చేశాము.
Ang mga Tafsir na Arabe:
وَوَهَبْنَا لَهُمْ مِّنْ رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِیًّا ۟۠
మరియు మేము వారికి దైవ దౌత్యంతోపాటు మా కారుణ్యము నుండి చాలా మేలును ప్రసాధించాము. మరియు మేము వారి కొరకు దాసుల నాలుకలపై నిరంతరం మంచి కీర్తిని కలుగచేశాము.
Ang mga Tafsir na Arabe:
وَاذْكُرْ فِی الْكِتٰبِ مُوْسٰۤی ؗ— اِنَّهٗ كَانَ مُخْلَصًا وَّكَانَ رَسُوْلًا نَّبِیًّا ۟
మరియు ఓ ప్రవక్తా మీరు మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో మూసా అలైహిస్సలాం వృత్తాంతమును గుర్తు చేసుకోండి. నిశ్చయంగా ఆయన ఎంచుకోబడినవాడు,ఎన్నుకోబడినవాడు. మరియు అతడు ఒక ప్రవక్త,సందేశహరుడు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• لما كان اعتزال إبراهيم لقومه مشتركًا فيه مع سارة، ناسب أن يذكر هبتهما المشتركة وحفيدهما، ثم جاء ذكر إسماعيل مستقلًّا مع أن الله وهبه إياه قبل إسحاق.
ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారి నుండి విడి పోయినప్పుడు సారా కూడా ఆ విషయంలో భాగస్వామి అయ్యారు,అటువంటప్పుడు వారిద్దరికి కలిపి అనుగ్రహించబడినది మరియు వారిద్దరి మనవడు గురించి ప్రస్తావించడం సముచితం అవుతుంది, తరువాత ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్రస్తావన ప్రత్యేకంగా వచ్చినది దానికి తోడు అల్లాహ్ అతనికి ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఇస్హాఖ్ కంటే ముందు అనుగ్రహించాడు.

• التأدب واللطف والرفق في محاورة الوالدين واختيار أفضل الأسماء في مناداتهما.
తల్లిదండ్రులతో సంభాషించటంలో మర్యాద,దయ,మృదుత్వముండటం మరియు వారిని పిలిచేటప్పుడు ఉత్తమమైన పేర్లను ఎంచుకోవటం.

• المعاصي تمنع العبد من رحمة الله، وتغلق عليه أبوابها، كما أن الطاعة أكبر الأسباب لنيل رحمته.
పాప కార్యాలు దాసుడిని అల్లాహ్ కారుణ్యం నుండి ఆపివేస్తాయి. అతనిపై దాని ద్వారములను మూసివేస్తాయి. ఎలాగైతే విధేయత ఆయన కారుణ్యమును పొందటానికి పెద్ద కారకమో అలా.

• وعد الله كل محسن أن ينشر له ثناءً صادقًا بحسب إحسانه، وإبراهيم عليه السلام وذريته من أئمة المحسنين.
అల్లాహ్ ప్రతి పుణ్యాత్మునికి అతని పుణ్యమును బట్టి అతని కొరకు సత్యపూరితమైన ప్రశంసను విస్తరింపజేస్తానని వాగ్ధానం చేశాడు. మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు అతని సంతానము పుణ్యాత్ములైన నాయకుల్లోంచి వారు.

 
Salin ng mga Kahulugan Surah: Maryam
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara