Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Surah: Ar-Ra‘d   Ayah:

అర్-రఅద్

Ilan sa mga Layon ng Surah:
الرد على منكري الوحي والنبوة ببيان مظاهر عظمة الله.
అల్లాహ్ గొప్పతనపు వ్యక్తీకరణలను ప్రకటించటం ద్వారా దైవవాణి,దైవదౌత్యమును తిరస్కరించే వారికి ప్రతిస్పందించడం.

الٓمّٓرٰ ۫— تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ ؕ— وَالَّذِیْۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ الْحَقُّ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یُؤْمِنُوْنَ ۟
{అలిఫ్-లామ్-మీమ్-రా } సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.ఓ ప్రవక్తా ఈ సూరహ్ లో ఉన్న ఈ ఆయతులు ఎంతో మహోన్నతమైనవి. మరియు మీపై అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ ఎటువంటి సంశయం లేని సత్యము. మరియు అది అల్లాహ్ వద్ద నుండి కావటంలో ఎటువంటి సందేహం లేదు. కాని చాలా మంది ప్రజలు మొండితనము, గర్వము వలన దాన్ని విశ్వసించటం లేదు.
Ang mga Tafsir na Arabe:
اَللّٰهُ الَّذِیْ رَفَعَ السَّمٰوٰتِ بِغَیْرِ عَمَدٍ تَرَوْنَهَا ثُمَّ اسْتَوٰی عَلَی الْعَرْشِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ؕ— كُلٌّ یَّجْرِیْ لِاَجَلٍ مُّسَمًّی ؕ— یُدَبِّرُ الْاَمْرَ یُفَصِّلُ الْاٰیٰتِ لَعَلَّكُمْ بِلِقَآءِ رَبِّكُمْ تُوْقِنُوْنَ ۟
ఆకాశములను ఎటువంటి స్థంభాలు లేకుండా ఎత్తుగా సృష్ఠించినవాడు అల్లాహ్ యే. మీరు వాటిని చూస్తున్నారు. ఆ తరువాత ఆయన లేచి పరిశుధ్ధుడైన ఆయనకు తగిన విధంగా ఎటువంటి రూపము,ఎటువంటి వర్ణత లేకుండా సింహాసనమును అధిష్టించాడు.మరియు ఆయన సూర్య చంద్రులను తన సృష్టితాల ప్రయోజనము కొరకు లోబడి ఉండేటట్లు సృష్టించాడు. సూర్య చంద్రుల్లో ప్రతి ఒక్కరు అల్లాహ్ జ్ఞానపరంగా నిర్ణీత కాలములో పయనిస్తున్నాయి. పరిశుద్ధుడైన ఆయన వ్యవహారములను భూమ్యాకాశముల్లో తనకు తోచిన విధంగా నడిపిస్తున్నాడు. ప్రళయదినమున మీ ప్రభువును కలుసుకోవలసి ఉన్నదని మీరు నమ్ముతారని ఆశిస్తూ తన సామర్ధ్యమును నిరూపించే సూచనలను స్పష్టపరుస్తున్నాడు. అయితే మీరు దాని కొరకు పుణ్య కార్యము ద్వారా సిద్దమవ్వండి.
Ang mga Tafsir na Arabe:
وَهُوَ الَّذِیْ مَدَّ الْاَرْضَ وَجَعَلَ فِیْهَا رَوَاسِیَ وَاَنْهٰرًا ؕ— وَمِنْ كُلِّ الثَّمَرٰتِ جَعَلَ فِیْهَا زَوْجَیْنِ اثْنَیْنِ یُغْشِی الَّیْلَ النَّهَارَ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ ۟
పరిశుద్ధుడైన ఆయనే భూమిని విశాలంగా చేశాడు. మరియు ఆయన అది ప్రజలను తీసుకుని కంపించకుండా ఉండటానికి అందులో పర్వతములను స్థిరంగా సృష్టించాడు. అందులో ప్రజలు,వారి పశువులు,వారి పంటలు నీటిని త్రాగటానికి నీటి నదులను ప్రవహింపజేశాడు. మరియు అందులో అన్ని రకముల ఫలములను, జంతువుల్లో ఆడ మగ లాగా రెండు రకాలను సృష్టించాడు. రాత్రిని పగటిపై తొడిగించాడు. అది వెలగుగా ఉన్న తరువాత చీకటి మయమైనది. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో అల్లాహ్ తయారు చేయటంలో ఆలోచించే అందులో యోచించే జాతి వారి కొరకు సూచనలు,ఆధారాలు ఉన్నవి. వారే ఈ సూచనలు,ఆధారాల ద్వారా ప్రయోజనం చెందుతారు.
Ang mga Tafsir na Arabe:
وَفِی الْاَرْضِ قِطَعٌ مُّتَجٰوِرٰتٌ وَّجَنّٰتٌ مِّنْ اَعْنَابٍ وَّزَرْعٌ وَّنَخِیْلٌ صِنْوَانٌ وَّغَیْرُ صِنْوَانٍ یُّسْقٰی بِمَآءٍ وَّاحِدٍ ۫— وَنُفَضِّلُ بَعْضَهَا عَلٰی بَعْضٍ فِی الْاُكُلِ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّعْقِلُوْنَ ۟
మరియు భూమిలో వేరు వేరు రకాల నేలలు దగ్గర దగ్గరగా ఉన్నవి. మరియు అందులో ద్రాక్ష తోటలు ఉన్నవి మరియు అందులో పంటపొలాలు మరియు ఒకే కాండములో అనేక శాఖలు కలిగిన ఖర్జూరపు చెట్లు మరియు వేరు వేరు కాండముల్లో వేరు వేరు శాఖలు కలిగిన ఖర్జూరపు చెట్లు ఉన్నవి. ఈ తోటలకు మరియు ఈ పంటపొలాలకు ఒకే రకమైన నీరు సరఫరా చేయటం జరుగుతుంది.మరియు అవి దగ్గర దగ్గరగా ఉన్నప్పటికి వాటికి ఒకే రకమైన నీరు సరఫరా అయినప్పటికి మేము తినటములో ఇతర ప్రయోజనాల్లో వాటిలో కొన్నింటిని కొన్నింటిపై ప్రాధాన్యతను కలిగించాము. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో బుద్ధి కలిగిన వారికి ఋజువులు మరియు ఆధారాలు కలవు.ఎందుకంటే వారే వీటి ద్వారా గుణపాఠము నేర్చుకుంటారు.
Ang mga Tafsir na Arabe:
وَاِنْ تَعْجَبْ فَعَجَبٌ قَوْلُهُمْ ءَاِذَا كُنَّا تُرٰبًا ءَاِنَّا لَفِیْ خَلْقٍ جَدِیْدٍ ؕ۬— اُولٰٓىِٕكَ الَّذِیْنَ كَفَرُوْا بِرَبِّهِمْ ۚ— وَاُولٰٓىِٕكَ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ ۚ— وَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
మరియు ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఏదైన విషయం గురించి ఆశ్చర్యపడితే మరణాంతర జీవితమును వారి తిరస్కారము మరియు దాన్ని తిరస్కరిస్తూ వారు వాదిస్తూ "ఏమి మేము చనిపోయి మట్టిగా మారిపోయి మరియు కృశించిపోయిన మరియు అరిగిపోయిన ఎముకల మాదిరిగా అయిపోయిన తరువాత మేము మరల లేపబడుతామా మరియు జీవింపజేసి మరలించబడుతామా ?!"అని పలికిన మాటల నుండి ఇంకా ఎక్కువగా అశ్చర్యపోవలసి ఉన్నది. మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వీరందరే మృతులను మరల లేపటంపై తమ ప్రభువు సామర్ధ్యమును మరియు తమ ప్రభవును తిరస్కరించినవారు. మరియు ప్రళయదినాన వీరందరి మెడల్లో అగ్నితో చేయబడిన సంకెళ్ళు వేయబడుతాయి. మరియు వీరందరు నరకవాసులు. మరియు వారు అందులో శాస్వతంగా ఉంటారు.వారికి అంతం అన్నది ఉండదు మరియు వారి నుండి శిక్ష అంతమవ్వదు.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• إثبات قدرة الله سبحانه وتعالى والتعجب من خلقه للسماوات على غير أعمدة تحملها، وهذا مع عظيم خلقتها واتساعها.
ఆకాశములను ఎటువంటి స్థంబాలు లేకుండా వాటిని పైకి ఎత్తి అల్లాహ్ సృష్టించటం మహోన్నతుడైన మరియు పరిశుద్ధుడైన ఆయన సామర్ధ్యము నిరూపణ.మరియు ఇది కూడా వాటిని గొప్పగా సృష్టించబడటం,వాటి విశాలంగా ఉండటంతోపాటు.

• إثبات قدرة الله وكمال ربوبيته ببرهان الخلق، إذ ينبت النبات الضخم، ويخرجه من البذرة الصغيرة، ثم يسقيه من ماء واحد، ومع هذا تختلف أحجام وألوان ثمراته وطعمها.
అల్లాహ్ ఎప్పుడైతే భారీ మొక్కను చిన్న విత్తనము నుండి తీసి మొలకెత్తిస్తాడో ఆ తరువాత దానికి ఒకే నీటిని సరఫరా చేసినా కూడా దాని ఫలాల రూపాలు మరియు రంగులు మరియు వాటి రుచులు వేరుగా ఉండటం సృష్టి ఆధారాల ద్వారా అల్లాహ్ సామర్ధ్యము మరియు ఆయన దైవత్వ పరిపూర్ణత నిరూపణ.

• أن إخراج الله تعالى للأشجار الضخمة من البذور الصغيرة، بعد أن كانت معدومة، فيه رد على المشركين في إنكارهم للبعث؛ فإن إعادة جمع أجزاء الرفات المتفرقة والمتحللة في الأرض، وبعثها من جديد، بعد أن كانت موجودة، هو بمنزلة أسهل من إخراج المعدوم من البذرة.
మహోన్నతుడైన అల్లాహ్ భారీ వృక్షాలను చిన్న విత్తనముల నుండి వెలికి తీయటం అవి కూడా లేనివి తీయటం దీనిలో మరణాంతరము లేపబడటమును తిరస్కరించే ముష్రికులకు ఖండన (ప్రత్యుత్తరం) ఉన్నది.ఎందుకంటే భూమిలో విచ్ఛిన్నమై,విడివిడిగా క్షీణించిపోయిన అవశేషాలను,భాగాలను సమీకరించి మరలించటం మరియు వాటిని సరిక్రొత్తగా మరల జీవింపజేయటం అవి కూడా ముందు నుండే ఉండి కూడా అది విత్తనము నుండి లేని వాటిని వెలికి తీయటం కన్నా చాలా సులభమైన స్థానము కలది.

 
Salin ng mga Kahulugan Surah: Ar-Ra‘d
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Isara