Check out the new design

Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm * - Indise ng mga Salin


Salin ng mga Kahulugan Sūrah: Yūsuf   Ayah:
قَالُوْۤا اَضْغَاثُ اَحْلَامٍ ۚ— وَمَا نَحْنُ بِتَاْوِیْلِ الْاَحْلَامِ بِعٰلِمِیْنَ ۟
వారందరు ఇలా పలికారు : నీ కల పీడకలల మిశ్రమం.విషయం అది అయితే అటువంటప్పుడు దానికి ఎటువంటి తాత్పర్యం లేదు.మరియు మేము మిశ్రమ పీడకలల తాత్పర్యము తెలియని వారము.
Ang mga Tafsir na Arabe:
وَقَالَ الَّذِیْ نَجَا مِنْهُمَا وَادَّكَرَ بَعْدَ اُمَّةٍ اَنَا اُنَبِّئُكُمْ بِتَاْوِیْلِهٖ فَاَرْسِلُوْنِ ۟
ఇద్దరు ఖైదీలైన యువకుల్లోంచి విముక్తి పొందిన వాడు సారాయి త్రాపించేవాడు అతనికి కలల తాత్పర్య జ్ఞానం లేదు అతడు కొంత కాలం తరువాత యూసుఫ్ అలైహిస్సలాంను గుర్తు చేసుకుని దాని (కల) తాత్పర్యం ఎవరికి తెలుసు అన్న ప్రశ్న తరువాత ఇలా పలికాడు : రాజు చూసిన కల యొక్క తాత్పర్యం గురించి నేను మీకు తెలియపరుస్తాను. ఓ రాజా నీ కల తాత్పర్యం తెలియపరచటానికి నీవు నన్ను యూసుఫ్ వద్దకు పంపించు.
Ang mga Tafsir na Arabe:
یُوْسُفُ اَیُّهَا الصِّدِّیْقُ اَفْتِنَا فِیْ سَبْعِ بَقَرٰتٍ سِمَانٍ یَّاْكُلُهُنَّ سَبْعٌ عِجَافٌ وَّسَبْعِ سُنْۢبُلٰتٍ خُضْرٍ وَّاُخَرَ یٰبِسٰتٍ ۙ— لَّعَلِّیْۤ اَرْجِعُ اِلَی النَّاسِ لَعَلَّهُمْ یَعْلَمُوْنَ ۟
మరియు విముక్తి పొందిన వాడు యూసుప్ అలైహిస్సలాం వద్దకు చేరినప్పుడు అతడు ఆయనతో ఇలా పలికాడు : ఓ సత్యవంతుడైన యూసుఫ్ ఏడు లావుగా బలిసిన ఆవులను ఏడు బక్కచిక్కిన ఆవులు తిని వేయటమును చూసిన మరియు ఏడు పచ్చటి వెన్నులను ఏడు ఎండిన వెన్నులను చూసిన వాడి కలయొక్క తాత్పర్యమును గురించి మాకు తెలియపరచు. బహుశా నేను రాజు వద్దకు,అతని వద్ద ఉన్న వారి వద్దకు మరలుతాను బహుశా వారు రాజు కల యొక్క తాత్పర్యమును తెలుసుకుంటారు. మరియు వారు నీ గొప్పతనమును,నీ స్థానమును తెలుసుకుంటారు.
Ang mga Tafsir na Arabe:
قَالَ تَزْرَعُوْنَ سَبْعَ سِنِیْنَ دَاَبًا ۚ— فَمَا حَصَدْتُّمْ فَذَرُوْهُ فِیْ سُنْۢبُلِهٖۤ اِلَّا قَلِیْلًا مِّمَّا تَاْكُلُوْنَ ۟
యూసుఫ్ అలైహిస్సలాం ఈ కల యొక్క తాత్పర్యం చెబుతూ ఇలా పలికారు : మీరు వరుసగా ఏడు సంవత్సరములు శ్రమతో సేద్యం చేస్తారు. అయితే ఈ ఏడు సంవత్సరాల్లో నుంచి ప్రతీ సంవత్సరం మీరు కోసిన పంటలో నుండి మీరు తినటానికి అవసరమగు ధాన్యములో నుంచి కొంచెం తప్ప మిగతాది పురుగు పట్టకుండా నిరోధించటానికి వాటి వెన్నుల్లోనే వదిలివేయండి.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ یَاْتِیْ مِنْ بَعْدِ ذٰلِكَ سَبْعٌ شِدَادٌ یَّاْكُلْنَ مَا قَدَّمْتُمْ لَهُنَّ اِلَّا قَلِیْلًا مِّمَّا تُحْصِنُوْنَ ۟
ఆ పిదప మీరు సేద్యం చేసిన ఏడు సారవంతమైన సంవత్సరముల తరువాత ఏడు కరువు సంవత్సరములు వస్తాయి. సారవంతమైన సంవత్సరముల్లో కోసిన పంటలోంచి మీరు విత్తనముల కొరకు భద్రపరచుకున్న వాటిలోంచి కొంచెం వాటిలో (కరువు సంవత్సరముల్లో) ప్రజలు తింటారు.
Ang mga Tafsir na Arabe:
ثُمَّ یَاْتِیْ مِنْ بَعْدِ ذٰلِكَ عَامٌ فِیْهِ یُغَاثُ النَّاسُ وَفِیْهِ یَعْصِرُوْنَ ۟۠
ఈ కరువు సంవత్సరముల తరువాత ఒక సంవత్సరము వస్తుంది.అందులో వర్షాలు కురుస్తాయి.మరియు పంటలు పండుతాయి.మరియు ప్రజలు అందులో రసం పిండటానికి అవసరమగు ద్రాక్షా,జైతూను,చెరకు లాంటి వాటిని పిండుతారు.
Ang mga Tafsir na Arabe:
وَقَالَ الْمَلِكُ ائْتُوْنِیْ بِهٖ ۚ— فَلَمَّا جَآءَهُ الرَّسُوْلُ قَالَ ارْجِعْ اِلٰی رَبِّكَ فَسْـَٔلْهُ مَا بَالُ النِّسْوَةِ الّٰتِیْ قَطَّعْنَ اَیْدِیَهُنَّ ؕ— اِنَّ رَبِّیْ بِكَیْدِهِنَّ عَلِیْمٌ ۟
మరియు తన కల తాత్పర్యమును యూసుఫ్ అలైహిస్సలాం తెలియపరచిన సమాచారము చేరగానే రాజు తన సేవకులను ఆదేశిస్తూ ఇలా పలికాడు : అతడిని మీరు చెరసాల నుండి బయటకు తీయండి. మరియు అతడిని మీరు నా వద్దకు తీసుకుని రండి. యూసుఫ్ అలైహిస్సలాం వద్దకు రాజదూత వచ్చినప్పుడు ఆయన అతనితో ఇలా పలికారు : నీ స్వామి అయిన రాజు వద్దకు వెళ్ళి తమ చేతులను గాయపరచుకున్న స్త్రీల సంఘటనను గురించి అతనితో అడుగు. చెరసాల నుండు బయటకు రాక ముందే తన నిర్దోషత్వం బహిర్గతమవ్వటానికి. నిశ్చయంగా వారు మోహముతో నా పట్ల వ్యవహరించిన తీరును నా ప్రభువు బాగా తెలిసినవాడు. వాటిలోంచి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు.
Ang mga Tafsir na Arabe:
قَالَ مَا خَطْبُكُنَّ اِذْ رَاوَدْتُّنَّ یُوْسُفَ عَنْ نَّفْسِهٖ ؕ— قُلْنَ حَاشَ لِلّٰهِ مَا عَلِمْنَا عَلَیْهِ مِنْ سُوْٓءٍ ؕ— قَالَتِ امْرَاَتُ الْعَزِیْزِ الْـٰٔنَ حَصْحَصَ الْحَقُّ ؗ— اَنَا رَاوَدْتُّهٗ عَنْ نَّفْسِهٖ وَاِنَّهٗ لَمِنَ الصّٰدِقِیْنَ ۟
స్త్రీలను ఉద్దేశించి రాజు ఇలా పలికాడు మీ విషయం ఏమిటి మీరు యూసుఫ్ ను ఆయన మీతో అశ్లీలంగా ప్రవర్తించటానికి ఏదో వంకతో పిలిచారు. స్త్రీలు రాజుకు సమాధానమిస్తూ ఇలా పలికారు యూసుఫ్ పై నింద మోపటం నుండి అల్లాహ్ రక్షించుగాక. అల్లాహ్ సాక్షిగా మేము ఆయనలో ఎటువంటి చెడును గుర్తించలేదు. అప్పుడు అజీజ్ భార్య తాను చేసిన దాన్ని అంగీకరిస్తూ ఇలా పలికింది ఇప్పుడు సత్యం బహిర్గతమయ్యింది. నేను అతనిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాను మరియు అతను నన్ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించలేదు. నేను అతనిపై వేసిన నింద ఏదైతే ఉన్నదో దాని నుండి అతను నిజాయితీ పరుడని వాదిస్తున్న విషయంలో అతను నిజాయితీపరుడు.
Ang mga Tafsir na Arabe:
ذٰلِكَ لِیَعْلَمَ اَنِّیْ لَمْ اَخُنْهُ بِالْغَیْبِ وَاَنَّ اللّٰهَ لَا یَهْدِیْ كَیْدَ الْخَآىِٕنِیْنَ ۟
అజీజు భార్య ఇలా పలికినది : నేను అతన్ని మోహింపజేశాను అని,మరియు అతను సత్యవంతుడని,నేను అతన్ని పరోక్షంగా నిందించలేదని నేనే అంగీకరించినప్పుడు యూసుఫ్ తెలుసుకోవాలని. జరిగిన దాన్ని బట్టి అల్లాహ్ అబద్దము పలికే వాడిని,కుట్రలు పన్నే వాడిని అనుగ్రహించడని నాకు స్పష్టమైనది.
Ang mga Tafsir na Arabe:
Ilan sa mga Pakinabang ng mga Ayah sa Pahinang Ito:
• من كمال أدب يوسف أنه أشار لحَدَث النسوة ولم يشر إلى حَدَث امرأة العزيز.
అజీజు భార్య తప్పిదము వైపు చూపకుండా స్త్రీలందరి తప్పిదము వైపునకు చూపటం ఇది యూసుఫ్ అలైహిస్సలాం గుణము పరిపూర్ణతలోనిది.

• كمال علم يوسف عليه السلام في حسن تعبير الرؤى.
కలల తాత్పర్యం మంచిగా చెప్పటంలో యూసుఫ్ అలైహిస్సలాం జ్ఞానము యొక్క పరిపూర్ణత.

• مشروعية تبرئة النفس مما نُسب إليها ظلمًا، وطلب تقصّي الحقائق لإثبات الحق.
తనకు అన్యాయంగా అపాదించబడిన దాని నుండి తన నిర్దోషత్వమును నిరూపించుకోవటము మరియు సత్యాన్ని నిరూపించటానికి నిజనిజాలను నిర్ధారణను అభ్యర్ధించడం యొక్క చట్టబద్ధత.

• فضيلة الصدق وقول الحق ولو كان على النفس.
నిజాయితీ,సత్యమును పలకటం యోక్క ప్రాముఖ్యత ఒక వేళ అది మనస్సుకు విరుధ్ధంగా ఉన్నా కూడా.

 
Salin ng mga Kahulugan Sūrah: Yūsuf
Indise ng mga Surah Numero ng Pahina
 
Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Telugu ng Al-Mukhtasar fī Tafsīr Al-Qur’an Al-Karīm - Indise ng mga Salin

Inilabas ng Markaz Tafsīr Lid-Dirāsāt Al-Qur’ānīyah (Sentro ng Tafsīr Para sa mga Pag-aaral Pang-Qur’an).

Pagsasara