Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: حشر   آیت:
وَالَّذِیْنَ جَآءُوْ مِنْ بَعْدِهِمْ یَقُوْلُوْنَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِاِخْوَانِنَا الَّذِیْنَ سَبَقُوْنَا بِالْاِیْمَانِ وَلَا تَجْعَلْ فِیْ قُلُوْبِنَا غِلًّا لِّلَّذِیْنَ اٰمَنُوْا رَبَّنَاۤ اِنَّكَ رَءُوْفٌ رَّحِیْمٌ ۟۠
మరియు వీరందరి తరువాత ఎవరైతే వచ్చి ప్రళయ దినము వరకు వారిని మంచితో అనుసరిస్తారో వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మమ్మల్ని మరియు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై మా కన్నా ముందు విశ్వాసము కనబరచిన వారైన ధర్మ విషయంలో మా సోదరులైన వారిని మన్నించు. విశ్వాసపరుల్లోంచి ఎవరి కొరకు కూడా మా హృదయములలో ద్వేషమును కాని పగను కాని కలిగించకు. ఓ మా ప్రభువా నిశ్ఛయంగా నీవు నీ దాసులపై దయ చూపేవాడివి, వారిపై కరుణించేవాడివి.
عربي تفسیرونه:
اَلَمْ تَرَ اِلَی الَّذِیْنَ نَافَقُوْا یَقُوْلُوْنَ لِاِخْوَانِهِمُ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ لَىِٕنْ اُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَلَا نُطِیْعُ فِیْكُمْ اَحَدًا اَبَدًا ۙ— وَّاِنْ قُوْتِلْتُمْ لَنَنْصُرَنَّكُمْ ؕ— وَاللّٰهُ یَشْهَدُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟
ఓ ప్రవక్తా అవిశ్వాసమును గోప్యంగా ఉంచి విశ్వాసమును బయటకు చూపే వారిని మీరు గమనించలేదా వారు అవిశ్వాసంలో తమ సోదరులైన మార్పు చేర్పులు చేయబడిన తౌరాత్ ను అనుసరించే యూదులతో ఇలా పలుకుతున్నారు : మీరు మీ ఇండ్లలోనే స్థిరంగా ఉండండి మేము మిమ్మల్ని నిస్సహాయులుగా వదిలివేయము. మరియు మేము మిమ్మల్ని అప్పజప్పము. ఒక వేళ ముస్లిములు మిమ్మల్ని వాటి నుండి వెళ్ళగొడితే మేము కూడా మీతో పాటు కలిసి బయటకు వస్తాము. మేము మీతో పాటు బయటకు రావటం నుండి మమ్మల్ని ఆపదలచిన వారి ఎవరి మాట వినము. మరియు ఒకవేళ వారు మీతో పోరాడితే మేము వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేస్తాము. మరియు నిశ్ఛయంగా యూదులు వెళ్ళగొట్టబడినప్పుడు వారితో పాటు బయలు దేరుతారని మరియు వారితో యుద్దం చేయబడినప్పుడు వారితో కలసి యుద్దం చేస్తారని చేసిన వాగ్దానములో కపటులు అబద్దం పలుకుతున్నారని అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడు.
عربي تفسیرونه:
لَىِٕنْ اُخْرِجُوْا لَا یَخْرُجُوْنَ مَعَهُمْ ۚ— وَلَىِٕنْ قُوْتِلُوْا لَا یَنْصُرُوْنَهُمْ ۚ— وَلَىِٕنْ نَّصَرُوْهُمْ لَیُوَلُّنَّ الْاَدْبَارَ ۫— ثُمَّ لَا یُنْصَرُوْنَ ۟
ఒక వేళ ముస్లిములు యూదులను వెళ్ళ గొడితే వారు వారితో పాటు బయలుదేరరు. ఒక వేళ వారు వారితో యుద్దం చేస్తే వారు వారికి సహాయము చేయరు మద్దతూ పలకరు. మరియు ఒక వేళ వారు వారికి ముస్లిములకు వ్యతిరేకముగా సహాయము చేసి మద్దతు పలికితే వారు వారి నుండి తప్పకుండా పారిపోతారు ఆ తరువాత కపటులు సహాయం చేయబడరు. అంతేకాదు అల్లాహ్ వారిని అవమానమునకు గురి చేస్తాడు మరియు వారికి పరాభవమునకు లోను చేస్తాడు.
عربي تفسیرونه:
لَاَنْتُمْ اَشَدُّ رَهْبَةً فِیْ صُدُوْرِهِمْ مِّنَ اللّٰهِ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَفْقَهُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా కపటుల మరియు యూదుల హృదయములలో అల్లాహ్ కన్నా మీ భయం ఎక్కువ. ఈ ప్రస్తావించబడిన - మీ నుండి వారి భయము యొక్క తీవ్రత మరియు అల్లాహ్ నుండి వారి భయపడటంలో బలహీనత - వారు బుద్దిలేని,అర్ధం చేసుకోలేని జనులు కావటం వలన. ఒక వేళ వారికి బుద్ది ఉంటే అల్లాహ్ భయము,భీతి ఎక్కువ హక్కు కలదని వారు తెలుసుకునేవారు. ఆయనే మిమ్మల్ని వారిపై ఆధిక్యతను కలిగించాడు.
عربي تفسیرونه:
لَا یُقَاتِلُوْنَكُمْ جَمِیْعًا اِلَّا فِیْ قُرًی مُّحَصَّنَةٍ اَوْ مِنْ وَّرَآءِ جُدُرٍ ؕ— بَاْسُهُمْ بَیْنَهُمْ شَدِیْدٌ ؕ— تَحْسَبُهُمْ جَمِیْعًا وَّقُلُوْبُهُمْ شَتّٰی ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَعْقِلُوْنَ ۟ۚ
ఓ విశ్వాసపరులారా యుదులు సమావేశమై మీతో యుద్దం చేయరు కాని కోటలుగల పురములలో ఉండిగానీ,గోడల చాటు నుండిగాని పోరాడుతారు. వారు తమ పిరికితనం వలన మిమ్మల్ని ఎదుర్కోలేరు. వారి మధ్య ఉన్నద్వేషముల వలన వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తీవ్రమైనవి. వారి మాట ఒకటే అని,వారి పంక్తి ఒకటే అని మీరు భావిస్తారు. వాస్తవానికి వారి హృదయములు వేరు వేరుగా ఉన్నవి,వ్యతిరేకమైనవి. ఈ విభేదము మరియు ద్వేషము వారికి బుద్ది లేకపోవటం వలన. ఒక వేళ వారికి బుద్ది ఉంటే సత్యమును గుర్తించి దాన్ని అనుసరించేవారు. అందులో విభేదించరు.
عربي تفسیرونه:
كَمَثَلِ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ قَرِیْبًا ذَاقُوْا وَبَالَ اَمْرِهِمْ ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۟ۚ
తమ అవిశ్వాసములో,తమపై కురిసిన శిక్షలో ఈ యూదులందరి ఉపమానము దగ్గరి కాలములో వారి కన్నా ముందు ఉన్న మక్కా ముష్రికుల ఉపమానము లాంటిది. వారు తమ అవిశ్వాసము యొక్క చెడ్డ పరిణామము రుచిని చవిచూశారు. బదర్ దినమున వారిలో నుండి హతమార్చబడేవారు హతమార్చబడ్డారు మరియు బందీ చేయబడేవారు బందీ చేయబడ్డారు. మరియు వారి కొరకు పరలోకములో బాధాకరమైన శిక్ష కలదు.
عربي تفسیرونه:
كَمَثَلِ الشَّیْطٰنِ اِذْ قَالَ لِلْاِنْسَانِ اكْفُرْ ۚ— فَلَمَّا كَفَرَ قَالَ اِنِّیْ بَرِیْٓءٌ مِّنْكَ اِنِّیْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِیْنَ ۟
కపటుల నుండి వారి వినటంలో వారి ఉపమానముషైతాను ఉపమానములాంటిది అతడు మనిషిని అవిశ్వాసము చూపమని అలంకరించినప్పుడు అవిశ్వాసమును చూపటమును తన కొరకు అతను అలంకరించటం వలన అతడు అవిశ్వసించినప్పుడు అతడు (షైతాను) ఇలా పలుకుతాడు నిశ్చయంగా నీవు అవిశ్వాసం చూపిన దానికి నీతో నాకు సంబంధము లేదు. నిశ్చయంగ నేను సృష్టిరాసుల ప్రభువైన అల్లాహ్ తో భయపడుతున్నాను.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• رابطة الإيمان لا تتأثر بتطاول الزمان وتغير المكان.
కాలం పొడుగవ్వటంతో,స్థల మార్పుతో విశ్వాస బంధం ప్రభావితం కాదు.

• صداقة المنافقين لليهود وغيرهم صداقة وهمية تتلاشى عند الشدائد.
యూదుల కొరకు, ఇతరుల కొరకు కపటుల నిజాయితీ ఊహప్రదమైన నిజాయితీ ఆపదల సమయంలో కనబడదు.

• اليهود جبناء لا يواجهون في القتال، ولو قاتلوا فإنهم يتحصنون بِقُرَاهم وأسلحتهم.
యూదులు పిరికివారు వారు యుద్దంలో తలబడరు. ఒక వేళ వారు తలబడినా తమ పురములతో,తమ ఆయుధములతో నిర్బంధంగా ఉంటారు.

 
د معناګانو ژباړه سورت: حشر
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول