Check out the new design

د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. * - د ژباړو فهرست (لړلیک)


د معناګانو ژباړه سورت: دخان   آیت:

అద్-దుఖ్ఖాన్

د سورت د مقصدونو څخه:
تهديد المشركين ببيان ما ينتظرهم من العقوبة العاجلة والآجلة.
బహుదైవారాధకులను వారి కొరకు వేచి ఉన్న తక్షణ,ఆలశ్య శిక్ష ప్రకటన ద్వారా బెదిరించడం

حٰمٓ ۟ۚۛ
హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
عربي تفسیرونه:
وَالْكِتٰبِ الْمُبِیْنِ ۟ۙۛ
అల్లాహ్ సత్యం వైపునకు మార్గదర్శకం యొక్క మార్గమును స్పష్ట పరిచే ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు.
عربي تفسیرونه:
اِنَّاۤ اَنْزَلْنٰهُ فِیْ لَیْلَةٍ مُّبٰرَكَةٍ اِنَّا كُنَّا مُنْذِرِیْنَ ۟
నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను ఘనమైన రాత్రిలో అవతరింపజేశాము. మరియు అది అధిక శుభాలు కల రాత్రి. నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ ద్వారా భయపెడుతున్నాము.
عربي تفسیرونه:
فِیْهَا یُفْرَقُ كُلُّ اَمْرٍ حَكِیْمٍ ۟ۙ
ఈ రాత్రిలో ఆహారములకు,ఆయుషులకు మరియు ఇతర విషయాలకు సంబంధించినది అల్లాహ్ ఆ సంవత్సరంలో సంభవింపజేసే ప్రతీ ధృడమైన విషయము నిర్ణయించబడుతుంది.
عربي تفسیرونه:
اَمْرًا مِّنْ عِنْدِنَا ؕ— اِنَّا كُنَّا مُرْسِلِیْنَ ۟ۚ
ప్రతీ ధృడమైన విషయము మా వద్ద నుండే నిర్ణయించబడుతుంది. నిశ్ఛయంగా మేమే ప్రవక్తలను పంపించేవారము.
عربي تفسیرونه:
رَحْمَةً مِّنْ رَّبِّكَ ؕ— اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟ۙ
నీ ప్రభువు వద్ద నుండి కారుణ్యముగా మేము ప్రవక్తలను పంపిస్తాము -ఓ ప్రవక్తా - ఎవరి వద్దకు వారు పంపించబడ్డారో వారి కొరకు. పరిశుద్ధుడైన ఆయనే తన దాసుల మాటలను వినేవాడును, వారి కర్మలను,వారి సంకల్పాలను తెలుసుకునేవాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
عربي تفسیرونه:
رَبِّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ۘ— اِنْ كُنْتُمْ مُّوْقِنِیْنَ ۟
ఆకాశముల ప్రభువు,భూమి యొక్క ప్రభువు,ఆ రెండిటి మధ్య ఉన్న వాటికి ప్రభువు ఒక వేళ మీరు దీన్ని నమ్మే వారే అయితే నా ప్రవక్తను విశ్వసించండి.
عربي تفسیرونه:
لَاۤ اِلٰهَ اِلَّا هُوَ یُحْیٖ وَیُمِیْتُ ؕ— رَبُّكُمْ وَرَبُّ اٰبَآىِٕكُمُ الْاَوَّلِیْنَ ۟
ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. ఆయనే జీవనమును కలిగించేవాడు మరియు మరణమును కలిగించేవాడు. ఆయన తప్ప వేరే జీవింపజేసేవాడు లేడు,మరణింపజేసేవాడు లేడు. మీకూ ప్రభువు మరియు మీ పూర్వికులైన మీ తాతముత్తాతలకు ప్రభువు.
عربي تفسیرونه:
بَلْ هُمْ فِیْ شَكٍّ یَّلْعَبُوْنَ ۟
ఈ ముష్రికులందరు దీన్ని విశ్వసించేవారు కారు. అంతేకాక దాని నుండి సందేహంలో పడి ఉన్నారు,వారు ఉన్న అసత్యము వలన దాని నుండి నిర్లక్ష్యం వహిస్తున్నారు.
عربي تفسیرونه:
فَارْتَقِبْ یَوْمَ تَاْتِی السَّمَآءُ بِدُخَانٍ مُّبِیْنٍ ۟ۙ
ఓ ప్రవక్త నీ జాతి వారిపై దగ్గరలో వచ్చే శిక్ష గురించి నిరీక్షించు. ఆ రోజు ఆకాశము స్పష్టమైన పొగను తీసుకుని వస్తుంది, వారు దాన్ని నొప్పి తీవ్రత నుండి తమ కళ్ళతో చూస్తారు.
عربي تفسیرونه:
یَّغْشَی النَّاسَ ؕ— هٰذَا عَذَابٌ اَلِیْمٌ ۟
అది నీ జాతి వారందరిపై వస్తుంది. మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీకు సంభవించిన ఈ శిక్ష ఒక బాధాకరమైన శిక్ష.
عربي تفسیرونه:
رَبَّنَا اكْشِفْ عَنَّا الْعَذَابَ اِنَّا مُؤْمِنُوْنَ ۟
అప్పుడు వారు తమ ప్రభువుతో కడు దీనంగా వేడుకుంటూ ఇలా అడుగుతారు : ఓ మా ప్రభువా నీవు మా పై పంపించిన శిక్షను మా నుండి తొలగించు. ఒక వేళ నీవు దాన్ని మా నుండి తొలగిస్తే నిశ్చయంగా మేము నీపై,నీ ప్రవక్తపై విశ్వాసమును కనబరుస్తాము.
عربي تفسیرونه:
اَنّٰی لَهُمُ الذِّكْرٰی وَقَدْ جَآءَهُمْ رَسُوْلٌ مُّبِیْنٌ ۟ۙ
హితబోధన స్వీకరించటం మరియు తమ ప్రభువు వైపునకు పశ్ఛాత్తాపముతో మరలటం వారి కొరకు ఎలా సాధ్యం ?. వాస్తవానికి వారి వద్దకు ఒక ప్రవక్త వచ్చి దైవదౌత్యమును స్పష్టపరిచాడు. మరియు వారు అతని నిజయితీని,నీతిని గుర్తించారు.
عربي تفسیرونه:
ثُمَّ تَوَلَّوْا عَنْهُ وَقَالُوْا مُعَلَّمٌ مَّجْنُوْنٌ ۟ۘ
ఆ తరువాత వారు అతన్ని విశ్వసించటం నుండి విముఖత చూపారు. మరియు ఇలా పలికారు : అతడు నేర్చుకున్న వాడు అతడికి ఇతరులు నేర్పించారు మరియు అతడు ఏ ప్రవక్తా కాదు. మరియు వారు అతని గురించి ఇలా పలికారు : అతడు ఒక పిచ్చివాడు.
عربي تفسیرونه:
اِنَّا كَاشِفُوا الْعَذَابِ قَلِیْلًا اِنَّكُمْ عَآىِٕدُوْنَ ۟ۘ
నిశ్చయంగా మేము మీ నుండి కొంచం శిక్షను తొలగించినప్పుడు నిశ్చయంగా మీరు మీ అవిశ్వాసం వైపునకు మరియు మీ తిరస్కారము వైపునకు మరలిపోయేవారు.
عربي تفسیرونه:
یَوْمَ نَبْطِشُ الْبَطْشَةَ الْكُبْرٰی ۚ— اِنَّا مُنْتَقِمُوْنَ ۟
మరియు - ఓ ప్రవక్త - వారి కొరకు (ఆ రోజు గురించి) నిరీక్షించండి. మేము బదర్ దినమున మీ జాతిలో నుండి అవిశ్వాసపరులను పెద్ద పట్టు పట్టుకుంటాము. నిశ్చయంగా మేము అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసం వలన మరియు ఆయన ప్రవక్త పట్ల వారి తిరస్కారము వలన వారితో ప్రతీకారం తీర్చుకుంటాము.
عربي تفسیرونه:
وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُوْلٌ كَرِیْمٌ ۟ۙ
మరియు నిశ్ఛయంగా మేము మీ కన్న ముందు ఫిర్ఔన్ జాతివారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు ఒక ప్రవక్త అల్లాహ్ వద్ద నుండి ఒక గౌరవనీయుడైన ప్రవక్త వారిని అల్లాహ్ ఏకత్వం (తౌహీద్) వైపునకు మరియు ఆయన ఆరాధన వైపునకు పిలుస్తూ వచ్చాడు. మరియు ఆయనే మూసా అలైహిస్సలాం.
عربي تفسیرونه:
اَنْ اَدُّوْۤا اِلَیَّ عِبَادَ اللّٰهِ ؕ— اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ
మూసా ఫిర్ఔన్ తో,అతని జాతి వారితో ఇలా పలికారు : మీరు బనీ ఇస్రాయీల్ ను నాకు వదిలేయండి (నాకు అప్పజెప్పండి). వారు అల్లాహ్ దాసులు. మీరు వారిని బానిసలుగా చేసుకునే హక్కు మీకు లేదు. నిశ్చయంగా నేను మీ కొరకు అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ఒక ప్రవక్తను. ఆయన నాకు మీకు చేరవేయమని ఆదేశించిన వాటిలో నీతిమంతుడిని. అందులో నుండి నేను ఏమీ తగ్గించను మరియు అధికం చేయను.
عربي تفسیرونه:
په دې مخ کې د ایتونو د فایدو څخه:
• نزول القرآن في ليلة القدر التي هي كثيرة الخيرات دلالة على عظم قدره.
అనేక శుభాలు కల ఘనమైన రాత్రిలో ఖుర్ఆన్ అవతరణ జరగటం ఆయన గొప్ప సామర్ధ్యం పై ఒక సూచన.

• بعثة الرسل ونزول القرآن من مظاهر رحمة الله بعباده.
ప్రవక్తలను పంపించటం మరియు ఖుర్ఆన్ అవతరణ తన దాసులపై అల్లాహ్ కారుణ్య ప్రదర్శనాల్లోంచిది.

• رسالات الأنبياء تحرير للمستضعفين من قبضة المتكبرين.
ప్రవక్తల సందేశాలు అహంకారుల పట్టు నుండి బలహీనులకు విముక్తిని కలిగించటం.

 
د معناګانو ژباړه سورت: دخان
د سورتونو فهرست (لړلیک) د مخ نمبر
 
د قرآن کریم د معناګانو ژباړه - تېلګوي ژبې ته د المختصر في تفسیر القرآن الکریم ژباړه. - د ژباړو فهرست (لړلیک)

د مرکز تفسیر للدراسات القرآنیة لخوا خپور شوی.

بندول