Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: ബഖറഃ   ആയത്ത്:
وَقَالُوْا كُوْنُوْا هُوْدًا اَوْ نَصٰرٰی تَهْتَدُوْا ؕ— قُلْ بَلْ مِلَّةَ اِبْرٰهٖمَ حَنِیْفًا ؕ— وَمَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ ۟
ఈ జాతి వారితో (ముస్లిములతో) యూదులుమీరు యూదులుగా మారిపోండి సన్మార్గములో ప్రవేశిస్తారని పలికారు మరియు క్రైస్తవులు:మీరు క్రైస్తవులుగా మారిపోండి సన్మార్గములో ప్రవేశిస్తారని.పలికారు కానీ ఓ ప్రవక్తా మీరు వారికి ఇలా తెలియజేయండి : మేము అసత్య ధర్మాలను వదిలి సత్య ధర్మమును,ఏక దైవ సిధ్దాంత ధర్మమయిన ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మాన్నే అనుసరిస్తాము, అతను అల్లాహ్ తోపాటు సాటి కల్పించే వారిలోంచికాడు.
അറബി തഫ്സീറുകൾ:
قُوْلُوْۤا اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ اِلَیْنَا وَمَاۤ اُنْزِلَ اِلٰۤی اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَمَاۤ اُوْتِیَ مُوْسٰی وَعِیْسٰی وَمَاۤ اُوْتِیَ النَّبِیُّوْنَ مِنْ رَّبِّهِمْ ۚ— لَا نُفَرِّقُ بَیْنَ اَحَدٍ مِّنْهُمْ ؗ— وَنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ ۟
ఓ విశ్వాసులారా యూదులు,క్రైస్తవుల్లోంచి ఈ విధంగా అసత్య వాదనలు చేసే వారితో ఇలా పలకండి : మేము అల్లాహ్ నూ,మరియు మా వైపునకు అవతరింపబడిన ఖుర్ఆన్ నూ విశ్వవసించాము.మరియు ఇబ్రాహీం,ఆయన కుమారులు ఇస్మాయీల్,ఇస్హాఖ్,యాఖూబుల పై అవతరింపబడిన వాటినీ విశ్వవసించాము మరియు,యాఖూబ్ సంతతి నుంచి వచ్చిన ప్రవక్తల పై అవతరింపబడిన వాటినీ విశ్వవసించాము,అల్లాహ్ మూసాకు ప్రసాధించిన తౌరాత్ నూ విశ్వసించాము మరియు అల్లాహ్ ఈసాకు ప్రసాధించిన ఇంజీల్ నూ విశ్వసించాము.అల్లాహ్ దైవ ప్రవక్తలందరికి ప్రసాధించిన గ్రంధాలను విశ్వసించాము,అయితే వారిలో (ప్రక్తలలో) కొందరిని విశ్వసించి మరికొందరిని విశ్వసించకుండా,వారిలో ఏవిధమైన బేధభావము చూపకుండా అందరినీ విశ్వసిస్తున్నాము.మరియు మేము పరిశుద్ధుడు,ఒక్కడే అయిన ఆయననే అనుసరిస్తాము,మరియు ఆయనకే అణుకువను చూపుతాము.
അറബി തഫ്സീറുകൾ:
فَاِنْ اٰمَنُوْا بِمِثْلِ مَاۤ اٰمَنْتُمْ بِهٖ فَقَدِ اهْتَدَوْا ۚ— وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا هُمْ فِیْ شِقَاقٍ ۚ— فَسَیَكْفِیْكَهُمُ اللّٰهُ ۚ— وَهُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟ؕ
ఒకవేళ యూదులు,క్రైస్తవులు,మరియు సత్య తిరస్కారుల్లోంచి ఇతరులు మీరు విశ్వసించినట్లు విశ్వసిస్తే వారు అల్లాహ్ ప్రశన్నతను పొందే సన్మార్గమును పొందిన వారవుతారు.ఒకవేళ వారు విశ్వాసము నుంచి విముఖత చూపినా,దైవ ప్రవక్తలందరిని లేదా వారిలో నుంచి కొంత మందిని తిరస్కరించినా,వారు విభేధాలలో,మరియు విరోధంలో ఉన్నట్లే.అయితే ఓప్రవక్తా!మీరు బాధపడకండి,మిమ్మల్ని వారి బాధలనుండి రక్షించడానికి అల్లాహ్ చాలు.ఆయన (అల్లాహ్)వారి కీడు మీపైరాకుండా ఆపుతాడు,వారికి వ్యతిరేకంగా మీకు సహాయపడుతాడు,ఆయన వారి మాటలను వింటున్నాడు.వారి ఉద్దేశాలు,వారి కార్యాలు ఏమిటో ఆయనకు బాగా తెలుసు.
അറബി തഫ്സീറുകൾ:
صِبْغَةَ اللّٰهِ ۚ— وَمَنْ اَحْسَنُ مِنَ اللّٰهِ صِبْغَةً ؗ— وَّنَحْنُ لَهٗ عٰبِدُوْنَ ۟
మీరు బాహ్యంగా,అంతరంగా అల్లాహ్ యొక్క ఆ ధర్మం పై కట్టుబడి ఉండండి దేని పైనైతే అతడు మిమ్మల్ని పుట్టించాడొ,అల్లాహ్ ధర్మముకన్నా ఏ ధర్మమూ గొప్పది కాదు,అది స్వభావానికి అనుకూలంగా ఉన్నది,ప్రయోజనాలను చేకూరుతుంది,నష్టాలను (చెడులను) ఆపుతుంది,మీరు ఇలా పలకండి:మేము ఒకే అల్లాహ్ కొరకు ఆరాధిస్తున్నాము,ఆయనతో పాటు వేరేవారెవరూ సాటి లేరు.
അറബി തഫ്സീറുകൾ:
قُلْ اَتُحَآجُّوْنَنَا فِی اللّٰهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ ۚ— وَلَنَاۤ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْ ۚ— وَنَحْنُ لَهٗ مُخْلِصُوْنَ ۟ۙ
ఓ ప్రవక్త మీరు తెలపండి-:ఓ గ్రంధవహులారా మీరు అల్లాహ్,ఆయన ధర్మం పై మా కన్న ఎక్కువ హక్కు దారులు అన్న విషయంలో మాతో వాదిస్తున్నార,మీ యొక్క ధర్మము పురాతనమైనదని,మీ గ్రంధము ముందుదని.అయితే ఇది మీకు ఏమాత్రం లాభం చేకూర్చదు.అల్లాహ్ మనందరి ప్రభువు,మీరు అతనిని ప్రత్యేకించుకోకండి,మా కొరకు మా ఆ ఆచరణలు వాటి గురించి మీరు ప్రశ్నించబడరు,మీ కొరకు మీ ఆ ఆచరణలు వాటి గురించి మేము ప్రశ్నించబడము,ప్రతి ఒక్కరు తమ ఆచరణ పరంగా ఫ్రతిఫలము పొందుతారు,మేము ఆరాధనను,విధేయతను అల్లాహ్ కొరకే ప్రత్యేకిస్తున్నాము,ఆయనతో ఏ వస్తువును సాటి కల్పించము.
അറബി തഫ്സീറുകൾ:
اَمْ تَقُوْلُوْنَ اِنَّ اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطَ كَانُوْا هُوْدًا اَوْ نَصٰرٰی ؕ— قُلْ ءَاَنْتُمْ اَعْلَمُ اَمِ اللّٰهُ ؕ— وَمَنْ اَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهَادَةً عِنْدَهٗ مِنَ اللّٰهِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟
ఓ గ్రంధవహులార : నిశ్చయంగ ఇబ్రాహీము,ఇస్మాయీలు,ఇస్హాఖు,యాఖూబు,యాఖూబు సంతతి నుంచి వచ్చినప్రవక్తలు యూద ధర్మము లేదా క్రైస్తవ ధర్మము పై ఉండే వారని మీరు అంటున్నారా? ఓ ప్రవక్తా వారికే సమాధానమిస్తూ ఇలా చెప్పండి : మీకు బాగా తెలుసా లేదా అల్లాహ్ కు (బాగా తెలుసా)?! అయితే ఒకవేళ వారు (గ్రంధవహులు) వారి ధర్మం పై ఉన్నారు అని వాధిస్తే వారు ఆబద్ధము పలికారు;ఎందుకంటే వారిని ప్రవక్తగా చేసి పంపడము మరియు వారు మరణించడము తౌరాత్,ఇంజీలు అవతరణ ముందు జరిగింది!.దీన్ని బట్టి వారు అల్లాహ్,ఆయన ప్రవక్త పై ఆబద్ధము పలుకుతున్నారన్న విషయము అర్ధమవుతుంది.మరియు వారు నిశ్చయంగా తమ పై అవతరింపబడిన వాస్తవాన్ని దాచిపెట్టారు,తన వద్ద నిరూపించబడిన సాక్ష్యాన్నిదాచేవాడికన్నాపెద్ద దుర్మార్గుడు ఇంకొకడుండడు, దానిని అతడు అల్లాహ్ తో నేర్చుకున్నాడు,గ్రంధవహులు చేసినట్లుగా,అల్లాహ్ మీ ఆచరణల పట్ల అశ్రద్ధవహించడు,వాటి పరంగానే అతడు మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
അറബി തഫ്സീറുകൾ:
تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْ ۚ— لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْ ۚ— وَلَا تُسْـَٔلُوْنَ عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟۠
ఈ జాతి వారు మీకన్న పూర్వం గతించినవారు,వారు తమ ఆచరణలను చేర వేసుకున్నారు,వారు చేసుకున్న ఆచరణలు వారి కొరకే,మీరు చేసుకున్న ఆచరణలు మీ కొరకే,వారి ఆచరణల గురించి మీరు ప్రశ్నించబడరు,మీ ఆచరణల గురించి వారు ప్రశ్నించబడరు,ఒకరు చేసిన పాపముకు బదులుగా ఇంకొకరు శిక్షించబడరు,ఇతరుల కర్మల ద్వారా లబ్ది పొందటం జరగదు,కాని ప్రతి ఒక్కరికి వారు ముందు పంపించుకున్న (చేసుకున్న) కర్మలకు ప్రతిఫలమును ప్రసాదించడం జరుగుతుంది.
അറബി തഫ്സീറുകൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• أن دعوى أهل الكتاب أنهم على الحق لا تنفعهم وهم يكفرون بما أنزل الله على نبيه محمد صلى الله عليه وسلم.
అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అవతరింప జేసిన దానిని తిరస్కరిస్తూ తాము సన్మార్గం పై ఉన్నామని గ్రంధవహుల వాదన వారికి ఏమాత్రం లాభం చేకూర్చదు.

• سُمِّي الدين صبغة لظهور أعماله وسَمْته على المسلم كما يظهر أثر الصبغ في الثوب.
ధర్మమునకు దాని ఆచరణలు బహిర్గతమవటం వలన రంగు పేరు ఇవ్వబడినది,ఒక బట్ట పై రంగు గుర్తు ఏ విధంగా బహిర్గతం అవుతుందో ఆ విధంగా ఒక ముస్లిం పై దాని (ధర్మం) గుర్తు బహిర్గతమవుతుంది.

• أن الله تعالى قد رَكَزَ في فطرةِ خلقه جميعًا الإقرارَ بربوبيته وألوهيته، وإنما يضلهم عنها الشيطان وأعوانه.
నిశ్చయంగా అల్లాహ్ తన సృష్టిరాశులందరి స్వభావంలో తన రుబూబియత్ (సృష్టికర్త,పాలకుడు,సంరక్షకుడు) ,తన ఉలూహియత్ (ఏక దైవోపాసవ) ను స్వీకరించడమును పొందుపరచాడు, షైతాను,అతని సహాయకులు వారిని మార్గ భ్రష్టతకు లోను చేస్తారు.

 
പരിഭാഷ അദ്ധ്യായം: ബഖറഃ
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർക്കസ് തഫ്സീർ പ്രസിദ്ധീകരിച്ചത്.

അവസാനിപ്പിക്കുക