Check out the new design

വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) * - വിവർത്തനങ്ങളുടെ സൂചിക


പരിഭാഷ അദ്ധ്യായം: യൂസുഫ്   ആയത്ത്:
فَلَمَّا ذَهَبُوْا بِهٖ وَاَجْمَعُوْۤا اَنْ یَّجْعَلُوْهُ فِیْ غَیٰبَتِ الْجُبِّ ۚ— وَاَوْحَیْنَاۤ اِلَیْهِ لَتُنَبِّئَنَّهُمْ بِاَمْرِهِمْ هٰذَا وَهُمْ لَا یَشْعُرُوْنَ ۟
అప్పుడు యాఖూబ్ ఆయనను వారితోపాటు పంపించారు.వారు ఎప్పుడైతే అతన్ని తీసుకుని దూరంగా వెళ్ళి అతన్ని లోతైన బావిలో పడవేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారో అప్పుడు మేము ఆ పరిస్థితిలో యూసుఫ్ కి దివ్య సందేశము ద్వారా తెలియపరిచాము : నీవు తప్పకుండా వారి ఈ చర్య గురించి వారికి తెలియపరుస్తావు.వారు నీవు తెలిపరిచే స్థితిలో నిన్ను గ్రహించలేరు.
അറബി തഫ്സീറുകൾ:
وَجَآءُوْۤ اَبَاهُمْ عِشَآءً یَّبْكُوْنَ ۟ؕ
మరియు యూసుఫ్ సోదరులు ఇషా సమయంలో తమ కుట్రవలన ఏడుస్తున్నట్లు నటించటంను బహిర్గతం చేస్తూ తమ తండ్రి వద్దకు వచ్చారు.
അറബി തഫ്സീറുകൾ:
قَالُوْا یٰۤاَبَانَاۤ اِنَّا ذَهَبْنَا نَسْتَبِقُ وَتَرَكْنَا یُوْسُفَ عِنْدَ مَتَاعِنَا فَاَكَلَهُ الذِّئْبُ ۚ— وَمَاۤ اَنْتَ بِمُؤْمِنٍ لَّنَا وَلَوْ كُنَّا صٰدِقِیْنَ ۟
వారందరూ ఇలా పలికారు : ఓ మా ప్రియ తండ్రి నిశ్చయంగా మేము పరుగు పందాలలో,బల్లెములు విసరటంలో మునిగి ఉన్నాము.మరియు మేము యూసుఫ్ ను మా బట్టల వద్ద,మా సామాను వద్ద వాటిని అతడు సంరక్షించటానికి విడిచిపెట్టాము.ఒకవేళ మేము మీకు చెప్పిన దానిలో వాస్తవముగా సత్యవంతులైనా మీరు మమ్మల్ని సత్యవంతులుగా గుర్తించరు.
അറബി തഫ്സീറുകൾ:
وَجَآءُوْ عَلٰی قَمِیْصِهٖ بِدَمٍ كَذِبٍ ؕ— قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ اَنْفُسُكُمْ اَمْرًا ؕ— فَصَبْرٌ جَمِیْلٌ ؕ— وَاللّٰهُ الْمُسْتَعَانُ عَلٰی مَا تَصِفُوْنَ ۟
వారు తమ మాటను ఒక వంక ద్వారా దృవీకరించారు.వారు యూసుఫ్ చొక్కాను అతని రక్తం కాకుండా ఇతర రక్తంతో అద్ది అది అతనిని తోడేలు తిన్న గుర్తులు అని అపోహకు లోను చేస్తూ తీసుకుని వచ్చారు. అప్పుడు యాఖూబు అతని చొక్కా చిరగబడలేదన్న సూచనతో వారి అబద్దముును గుర్తించారు. అప్పుడు ఆయన వారితో ఇలా పలికారు : మీరు చెప్పినట్లు విషయం లేదు.కాని మీ మనస్సులు చెడు విషయమును అలంకరించుకున్నాయి దాన్నే మీరు చేశారు.నా వ్యవహారము మంచిగా సహనం పాటించటం మాత్రమే,అందులో ఎటువంటి ఆందోళన లేదు. మీరు తెలియపరుస్తున్న యూసుఫ్ విషయంలో అల్లాహ్ తో సహాయమును కోరబడుతుంది.
അറബി തഫ്സീറുകൾ:
وَجَآءَتْ سَیَّارَةٌ فَاَرْسَلُوْا وَارِدَهُمْ فَاَدْلٰی دَلْوَهٗ ؕ— قَالَ یٰبُشْرٰی هٰذَا غُلٰمٌ ؕ— وَاَسَرُّوْهُ بِضَاعَةً ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِمَا یَعْمَلُوْنَ ۟
మరియు అటు ప్రయాణిస్తున్న ఒక బృందం వచ్చింది.వారి కొరకు నీటిని త్రాపించే వ్యక్తిని వారు పంపించారు. అప్పుడు అతను తన బొక్కెనను బావిలో వేశాడు. అప్పుడు యూసుఫ్ త్రాడుతో వ్రేలాడసాగారు.వారు పంపించిన వ్యక్తి అతన్ని చూసినప్పుడు సంతోషముతో ఇలా పలికాడు : ఇదిగో శుభవార్త ఇతను ఒక పిల్లవాడు. మరియు అక్కడ వచ్చిన వ్యక్తి అతని సహచరులు అతన్ని మీగతా బృందము నుండి అతన్ని తాము కొన్న వర్తకసామగ్రిగా భావిస్తూ దాచివేశారు.యూసుఫ్ తో వారు చేస్తున్న అసభ్యత,అమ్మకం గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.వారు చేస్తున్న కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు.
അറബി തഫ്സീറുകൾ:
وَشَرَوْهُ بِثَمَنٍ بَخْسٍ دَرَاهِمَ مَعْدُوْدَةٍ ۚ— وَكَانُوْا فِیْهِ مِنَ الزَّاهِدِیْنَ ۟۠
ఆ వచ్చిన వ్యక్తి మరియు అతని సహచరులు అతన్ని (యూసుఫ్) మిసర్ లో స్వల్ప ధరకు అమ్మి వేశారు.అతి సులభంగా లెక్కించదగిన కొన్ని దిర్హమ్ లు.మరియు వారు అతన్ని తొందరగా వదిలించుకునే విషయంలో వారి తపన వలన వారు అతనికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.వాస్తవానికి అతని స్థితి అతను బానిస కాదన్న విషయం వారికి తెలుసు.మరియు వారు అతని ఇంటి వారి వలన భయపడ్డారు.ఇది అతనిపై అల్లాహ్ కారుణ్యం పూర్తవటం లోనిది.చివరికి అతను వారితో ఎక్కువ సమయం ఉండలేదు.
അറബി തഫ്സീറുകൾ:
وَقَالَ الَّذِی اشْتَرٰىهُ مِنْ مِّصْرَ لِامْرَاَتِهٖۤ اَكْرِمِیْ مَثْوٰىهُ عَسٰۤی اَنْ یَّنْفَعَنَاۤ اَوْ نَتَّخِذَهٗ وَلَدًا ؕ— وَكَذٰلِكَ مَكَّنَّا لِیُوْسُفَ فِی الْاَرْضِ ؗ— وَلِنُعَلِّمَهٗ مِنْ تَاْوِیْلِ الْاَحَادِیْثِ ؕ— وَاللّٰهُ غَالِبٌ عَلٰۤی اَمْرِهٖ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟
మరియు మిసర్లో అతన్ని కొన్న వ్యక్తి తన భార్యతో ఇలా అన్నాడు : నీవు అతినికి మంచి చేయి మరియు మాతోపాటు అతని స్థానములో అతన్ని గౌరవించు.బహుశా అతను ఉండటంలో మాకు అతనిలో అవసరమైన వాటిలోంచి కొన్నింటి ద్వారా మనకు ప్రయోజనం చేకూరుస్తాడు లేదా మేము అతన్ని కొడుకుగా చేసుకుందాం. ఇలాగే మేము యూసుఫ్ ను హత్య నుండి రక్షించాము మరియు అతన్ని బావి నుండి వెలికి తీశాము,మిసర్ వాసి మనస్సును అతనిపై కనికరించేటట్లు చేశాము,అతనికి మిసర్ లో నివాసమును కలిగించాము అతనికి కలల తాత్పర్యమును నేర్పించటం కొరకు. మరియు అల్లాహ్ తన ఆదేశముపై ఆధిక్యత కలవాడు.ఆయన ఆదేశం నెరవేరుతుంది.పరిశుద్ధుడైన ఆయనకు బలవంతం చేసేవాడు ఎవడూ లేడు.కాని ఆయన ప్రజలపై ఆదిక్యత కలవాడు.వారు అవిశ్వాసపరులు.వారు దాన్ని తెలుసుకోవటం లేదు.
അറബി തഫ്സീറുകൾ:
وَلَمَّا بَلَغَ اَشُدَّهٗۤ اٰتَیْنٰهُ حُكْمًا وَّعِلْمًا ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟
మరియు యూసుఫ్ యవ్వన వయస్సుకు చేరుకున్నప్పుడు అతనికి మేము వివేకమును,జ్ఞానమును ప్రసాధించాము.మేము అతనికి ప్రసాధించిన ప్రతిఫలం లాంటిదే అల్లాహ్ కొరకు తమ ఆరాధనల్లో మంచిగా ఉండేవారికి (సజ్జనులను) మేము ఫ్రతిఫలమును ప్రసాధిస్తాము.
അറബി തഫ്സീറുകൾ:
ഈ പേജിലെ ആയത്തുകളിൽ നിന്നുള്ള പാഠങ്ങൾ:
• بيان خطورة الحسد الذي جرّ إخوة يوسف إلى الكيد به والمؤامرة على قتله.
యూసుఫ్ సోదరులను ఆయన గురించి కుట్రలు పన్నటం వైపునకు మరియు ఆయన్ను హతమార్చటం కొరకు చర్చలు జరపటంపై లాగిన అసూయ యొక్క అపాయపు ప్రకటన.

• مشروعية العمل بالقرينة في الأحكام.
ఆదేశాల విషయంలో సందర్భోచితంగా పనిచేసే చట్టబద్ధత.

• من تدبير الله ليوسف عليه السلام ولطفه به أن قذف في قلب عزيز مصر معاني الأبوة بعد أن حجب الشيطان عن إخوته معاني الأخوة.
షైతాను యూసుఫ్ సోదరుల నుండి సోదరత్వ అర్ధమును (భావమును) ఆపి వేసిన తరువాత మిసర్ రాజు (అజీజు) హృదయంలో పిత్రత్వ అర్ధమును (భావమును) అల్లాహ్ వేయటం యూసుఫ్ అలైహిస్సలాం కొరకు అల్లాహ్ పర్యాలోచన మరియు ఆయనపట్ల అతని కనికరము.

 
പരിഭാഷ അദ്ധ്യായം: യൂസുഫ്
സൂറത്തുകളുടെ സൂചിക പേജ് നമ്പർ
 
വിശുദ്ധ ഖുർആൻ പരിഭാഷ - ഖുർആൻ സംക്ഷിപ്ത വിശദീകരണം - പരിഭാഷ (തെലുങ്ക്) - വിവർത്തനങ്ങളുടെ സൂചിക

മർക്കസ് തഫ്സീർ പ്രസിദ്ധീകരിച്ചത്.

അവസാനിപ്പിക്കുക