Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಸ್ಸಾಫ್ಫಾತ್   ಶ್ಲೋಕ:
وَجَعَلْنَا ذُرِّیَّتَهٗ هُمُ الْبٰقِیْنَ ۟ؗۖ
మరియు మేము అతని కుటుంబం వారిని,విశ్వాసపరులైన అతనిని అనుసరించేవారిని ఒక్కరినే రక్షించాము. నిశ్ఛయంగా మేము అతని జాతిలో నుండి అవిశ్వాసపరులైన ఇతరులను ముంచివేశాము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَتَرَكْنَا عَلَیْهِ فِی الْاٰخِرِیْنَ ۟ؗۖ
మరియు మేము అతని కొరకు తరువాత వచ్చే సమాజముల్లో మంచి కీర్తిని మిగిల్చాము వారు దాని ద్వారా అతనిని పొగిడేవారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
سَلٰمٌ عَلٰی نُوْحٍ فِی الْعٰلَمِیْنَ ۟
నూహ్ కొరకు తరువాత వచ్చే సమాజములలో ఆయన గురించి చెడు పలకటం నుండి భద్రత మరియు శాంతి కలుగుగాక. అంతే కాదు ఆయన కొరకు కీర్తి మరియు మంచి ప్రస్తావన మిగిలి ఉంటుంది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِنَّا كَذٰلِكَ نَجْزِی الْمُحْسِنِیْنَ ۟
నిశ్ఛయంగా మేము నూహ్ అలైహిస్సలాంకు ప్రసాదించినటువంటి ఈ ప్రతిఫలం లాంటి దాన్ని ఒక్కడైన అల్లాహ్ కొరకు తమ ఆరాధన చేయటంలో, తమ విధేయత చూపటంలో మంచిగా చేసే వారికి ప్రసాదిస్తాము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِنَّهٗ مِنْ عِبَادِنَا الْمُؤْمِنِیْنَ ۟
నిశ్ఛయంగా నూహ్ అల్లాహ్ విధేయతలో ఆచరించే విశ్వాసపరులైన మా దాసుల్లోంచివారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ثُمَّ اَغْرَقْنَا الْاٰخَرِیْنَ ۟
ఆ తరువాత మిగిలిన వారిని మేము వారిపై పంపించిన తూఫాను ద్వారా ముంచివేశాము. వారిలో నుండి ఎవరూ మిగలలేదు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَاِنَّ مِنْ شِیْعَتِهٖ لَاِبْرٰهِیْمَ ۟ۘ
మరియు నిశ్చయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ తౌహీద్ వైపునకు పిలవటంలో ఆయనను ఏకీభవించిన అతని ధర్మం వారిలోంచి వారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِذْ جَآءَ رَبَّهٗ بِقَلْبٍ سَلِیْمٍ ۟
అయితే షిర్కు నుండి భద్రమైన హృదయముతో, అల్లాహ్ కొరకు ఆయన సృష్టితాల్లో హితోపదేశం చేసేవాడిగా తన ప్రభువు వద్దకు వచ్చినప్పటి వేళ మీరు గుర్తు చేసుకోండి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِذْ قَالَ لِاَبِیْهِ وَقَوْمِهٖ مَاذَا تَعْبُدُوْنَ ۟ۚ
ఆయన తన తండ్రితో,తన జాతి వారైన ముష్రికులతో వారిని మందలిస్తూ మీరు అల్లాహ్ ను వదిలి ఎవరిని ఆరాధిస్తున్నారు ? అని అడిగినప్పుడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اَىِٕفْكًا اٰلِهَةً دُوْنَ اللّٰهِ تُرِیْدُوْنَ ۟ؕ
ఏమీ మీరు అల్లాహ్ ను వదిలి అసత్య దైవాలను ఆరాధిస్తున్నారా ?.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَمَا ظَنُّكُمْ بِرَبِّ الْعٰلَمِیْنَ ۟
ఓ నా జాతివారా సర్వలోకాల ప్రభువు గురించి మీరు ఇతరులను ఆరాధిస్తూ ఆయనను కలిసినప్పుడు మీ ఆలోచనేమిటి ?. మరియు ఆయన మీకు ఏమి చేస్తారని మీరు అనుకుంటున్నారు ?!
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَنَظَرَ نَظْرَةً فِی النُّجُوْمِ ۟ۙ
అప్పుడు ఇబ్రాహీం తన జాతి వారితోపాటు బయలుదేరటం నుండి ముక్తి పొందటం కొరకు వ్యూహమును రచిస్తూ నక్షత్రముల వైపు ఒక చూపు చూశారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَقَالَ اِنِّیْ سَقِیْمٌ ۟
అప్పుడు ఆయన తన జాతి వారితో వారి జాతరకి బయలుదేరటం నుండి కారణం చూపుతూ ఇలా పలికారు : నిశ్ఛయంగా నేను అనారోగ్యంగా ఉన్నాను.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِیْنَ ۟
అప్పుడు వారు ఆయనను తమ వెనుక వదిలి వెళ్ళిపోయారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَرَاغَ اِلٰۤی اٰلِهَتِهِمْ فَقَالَ اَلَا تَاْكُلُوْنَ ۟ۚ
అప్పుడు ఆయన వారు అల్లాహ్ ను వదిలి ఆరాధించే వారి ఆరాధ్య దైవాల వద్దకు మెల్లగా వెళ్ళారు. అప్పుడు వారి ఆరాధ్య దైవాలను హేళన చేస్తూ ఇలా పలికారు : ఏమీ ముష్రికులు మీ కొరకు తయారు చేసినటువంటి ఆహారమును మీరు తినరా ?!
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
مَا لَكُمْ لَا تَنْطِقُوْنَ ۟
మీ విషయమేమిటి మీరు మాట్లాడటం లేదు మరియు మిమ్మల్ని అడిగిన వారికి సమాధానమివ్వటం లేదు ?. ఏమీ ఇలాంటివి అల్లాహ్ ను వదిలి ఆరాధన చేయబడుతున్నాయా ?!
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَرَاغَ عَلَیْهِمْ ضَرْبًا بِالْیَمِیْنِ ۟
అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వాటిని విరగ్గొట్టటం కొరకు తన కుడి చేత్తో కొడుతూ వారి వైపుకు వెళ్ళారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَاَقْبَلُوْۤا اِلَیْهِ یَزِفُّوْنَ ۟
అప్పుడు ఈ విగ్రహాల ఆరాధకులు ఆయన వద్దకు తొందరగా వచ్చారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ اَتَعْبُدُوْنَ مَا تَنْحِتُوْنَ ۟ۙ
అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని స్థిరంగా ఎదుర్కొన్నారు. మరియు వారితో ఇలా పలికారు : ఏమీ మీరు మీ చేతులతో చెక్కిన దేవతలను అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారా ?!
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَاللّٰهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُوْنَ ۟
పరిశుద్ధుడైన అల్లాహ్ మమ్మల్నీ సృష్టించాడు మరియు మీ ఆచరణనూ సృష్టించాడు. మరియు ఈ విగ్రహాలు మీ కర్మల్లోంచివే. కాబట్టి ఆయన తన ఒక్కడి ఆరాధన చేయబడటం కొరకు,తనతోపాటు ఇతరులను సాటికల్పించకుండా ఉండటం కొరకు యోగ్యుడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالُوا ابْنُوْا لَهٗ بُنْیَانًا فَاَلْقُوْهُ فِی الْجَحِیْمِ ۟
ఎప్పుడైతే వారు ఆయన్ను వాదనతో ఎదుర్కోవటం నుండి అశక్తులయ్యారో బలప్రయోగమునకు ఆశ్రయించారు. అప్పుడు వారు ఇబ్రాహీంను ఏమి చేయాలన్న విషయంలో పరస్పరం సంప్రదింపులు చేశారు. వారు ఇలా పలికారు : మీరు అతని కొరకు ఒక కట్టడమును నిర్మించండి. మరియు దాన్ని కట్టెలతో నింపివేసి దాన్ని నిప్పంటించండి. ఆ తరువాత అతన్ని అందులో విసిరివేయండి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَاَرَادُوْا بِهٖ كَیْدًا فَجَعَلْنٰهُمُ الْاَسْفَلِیْنَ ۟
అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం జాతివారు ఇబ్రాహీం అలైహిస్సలాంను హతమార్చి ఆయన నుండి విముక్తి పొందటానకి ఇబ్రాహీం అలైహిస్సలాంను కీడు చేయదలచారు. మేము ఆయనపై అగ్నిని చల్లగా,శాంతిదాయకంగా చేసినప్పుడు మేము వారిని నష్టపోయేవారిలోంచి చేశాము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَقَالَ اِنِّیْ ذَاهِبٌ اِلٰی رَبِّیْ سَیَهْدِیْنِ ۟
ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా పలికారు : నిశ్చయంగా నేను నా ప్రభువు వైపునకు ఆయన ఆరాధనను పూర్తిగా చేయటానికి నా జాతి వారి నగరమును వదిలి వలసపోయేవాడిని. తొందరలోనే నా ప్రభువు ఇహపరాల్లో నాకు మేలు దేనిలో ఉన్నదో దాన్ని నాకు సూచిస్తాడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
رَبِّ هَبْ لِیْ مِنَ الصّٰلِحِیْنَ ۟
ఓ నా ప్రభువా నాకు సహాయకునిగా,ప్రవాసంలో నా జాతివారి నుండి బదులుగా అయ్యే ఒక పుణ్య కుమారుడిని నాకు ప్రసాదించు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَبَشَّرْنٰهُ بِغُلٰمٍ حَلِیْمٍ ۟
అప్పుడు మేము అతని అర్ధనను స్వీకరించి అతనికి సంతోషమును కలిగించే శుభవార్తనిచ్చాము. ఎందుకంటే మేము అతనికి పెద్దరికమును చాటి సహనశీలుడయ్యే ఒక కుమారుడిని ప్రసాదించాము. మరియు ఈ పిల్లవాడు అతడే ఇస్మాయీల్ అలైహిస్సలాం.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْیَ قَالَ یٰبُنَیَّ اِنِّیْۤ اَرٰی فِی الْمَنَامِ اَنِّیْۤ اَذْبَحُكَ فَانْظُرْ مَاذَا تَرٰی ؕ— قَالَ یٰۤاَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ؗ— سَتَجِدُنِیْۤ اِنْ شَآءَ اللّٰهُ مِنَ الصّٰبِرِیْنَ ۟
ఇస్మాయీల్ అలైహిస్సలాం యవ్వనానికి చేరుకుని తన తండ్రి పరుగెత్తటమునకు తన పరుగెత్తటము చేరువైనప్పుడు అతని తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక కలను చూశారు. మరియు దైవప్రవక్తల కల దైవవాణి అవుతుంది. ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ కల అంశము గురించి తన కుమారుడికి సమాచారమిస్తూ ఇలా పలికారు : ఓ నా ప్రియ కుమారా నిశ్చయంగా నేను కలలో నిన్ను జుబహ్ చేస్తున్నట్లుగా చూశాను. అయితే నీవు ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చూడు. అప్పుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం తన తండ్రికి ఇలా పలుకుతూ సమాధానమిచ్చారు : ఓ నా తండ్రి నన్ను జుబహ్ చేసే విషయం గురించి మీకు అల్లాహ్ ఆదేశించిన దాన్ని చేసి తీరండి. తొందరలోనే మీరు నన్ను అల్లాహ్ ఆదేశమును స్వీకరించే వారిలోంచి,సహనం చూపే వారిలోంచి పొందుతారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• من مظاهر الإنعام على نوح: نجاة نوح ومن آمن معه، وجعل ذريته أصول البشر والأعراق والأجناس، وإبقاء الذكر الجميل والثناء الحسن.
నూహ్ అలైహిస్సలాం,ఆయనతోపాటు విశ్వసించిన వారి విముక్తి మరియు ఆయన సంతానమును మానవుల,వంశముల,జాతుల మూలాలుగా చేయటం మరియు మంచి చర్చను,మంచి కీర్తిని మగిల్చటం నూహ్ అలైహిస్సలాం పై అనుగ్రహాలను కలిగించే రూపాల్లోంచివి.

• أفعال الإنسان يخلقها الله ويفعلها العبد باختياره.
మానవుని కార్యాలు వాటిని అల్లాహ్ సృష్టిస్తాడు. మరియు వాటిని దాసుడు తన ఇష్టముతో చేస్తాడు.

• الذبيح بحسب دلالة هذه الآيات وترتيبها هو إسماعيل عليه السلام؛ لأنه هو المُبَشَّر به أولًا، وأما إسحاق عليه السلام فبُشِّر به بعد إسماعيل عليه السلام.
ఈ ఆయతుల సూచనను బట్టి,వాటి క్రమమును బట్టి ఇస్మాయీల్ అలైహిస్సలాం జబీహ్ (జుబహ్ చేయబడటానికి సిద్ధం చేయబడిన వారు) ఎందుకంటే మొదట శుభవార్త ఇవ్వబడినది ఆయనదే. అయితే ఇస్హాఖ్ అలైహిస్సలాం శుభవార్త ఇస్మాయీల్ అలైహిస్సలాం తరువాత ఇవ్వబడినది.

• قول إسماعيل: ﴿سَتَجِدُنِي إِن شَآءَ اْللهُ مِنَ اْلصَّابِرِينَ﴾ سبب لتوفيق الله له بالصبر؛ لأنه جعل الأمر لله.
ఇస్మాయీల్ అలైహిస్సలాం మాట : {سَتَجِدُنِيٓ إِن شَآءَ اْللهُ مِنَ اْلصَّابِرِينَ} "అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు!" ఆయనకు సహనము వహించే అల్లాహ్ అనుగ్రహమునకు కారణం. ఎందుకంటే ఆయన ఆదేశమును అల్లాహ్ కొరకు చేశారు.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ಅಸ್ಸಾಫ್ಫಾತ್
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ