Check out the new design

ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ * - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ


ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ತ್ವಾಹಾ   ಶ್ಲೋಕ:
قَالُوْا یٰمُوْسٰۤی اِمَّاۤ اَنْ تُلْقِیَ وَاِمَّاۤ اَنْ نَّكُوْنَ اَوَّلَ مَنْ اَلْقٰی ۟
మంత్రజాలకులు మూసా అలైహిస్సలాంతో ఇలా పలికారు : ఓ మూసా ఈ రెండు విషయముల్లోంచి ఏదో ఒక దానిని ఎంచుకో : నీ వద్ద ఉన్న మంత్రజాలమును మొదట విసిరేవాడివి నీవైన అవ్వు లేదా మేము దాన్ని మొదట విసిరే వాళ్ళమవుతాము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ بَلْ اَلْقُوْا ۚ— فَاِذَا حِبَالُهُمْ وَعِصِیُّهُمْ یُخَیَّلُ اِلَیْهِ مِنْ سِحْرِهِمْ اَنَّهَا تَسْعٰی ۟
మూసా అలైహిస్సలాం ఇలా పలికారు : లేదు మీరే మొదట మీ వద్ద ఉన్నవి విసరండి. అప్పుడు వారు తమ వద్ద ఉన్న వాటిని విసిరారు. అప్పుడు వారు విసిరిన వారి త్రాళ్ళు,వారి చేతి కర్రలు వారి మంత్రజాలము వలన మూసా దృష్టిలో వేగముగా చలిస్తున్న పెద్ద సర్పాల మాదిరిగా అనిపించసాగాయి.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَاَوْجَسَ فِیْ نَفْسِهٖ خِیْفَةً مُّوْسٰی ۟
అప్పుడు వారు చేసిన దానితో మూసా మనస్సులో భయం కలిగింది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قُلْنَا لَا تَخَفْ اِنَّكَ اَنْتَ الْاَعْلٰی ۟
అల్లాహ్ మూసా అలైహిస్సలాంకు ధైర్యం చెబుతూ ఇలా పలికాడు : ఓ మూసా మీ దృష్టిలో అనిపించిన వాటితో భయపడకండి,మీరే వారిపై ఆధిక్యతతో,విజయముతో ప్రాబల్యం పొందుతారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَاَلْقِ مَا فِیْ یَمِیْنِكَ تَلْقَفْ مَا صَنَعُوْا ؕ— اِنَّمَا صَنَعُوْا كَیْدُ سٰحِرٍ ؕ— وَلَا یُفْلِحُ السَّاحِرُ حَیْثُ اَتٰی ۟
మరియు మీరు మీ కుడి చేతిలో ఉన్న చేతి కర్రను విసరండి,అది పాముగా మారి మంత్రజాలముతో వారు చేసిన వాటన్నింటిని మ్రింగివేస్తుంది. వారు చేసినది కేవలం మంత్ర కుతంత్రం మాత్రమే. మరియు మంత్రజాలకుడు ఎక్కడ ఉన్నా ఆశించిన దాని ద్వారా సఫలీకృతం కాజాలడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
فَاُلْقِیَ السَّحَرَةُ سُجَّدًا قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ هٰرُوْنَ وَمُوْسٰی ۟
అప్పుడు మూసా తన చేతి కర్రను విసిరితే అది పాముగా మారిపోయింది. మరియు మంత్రజాలకులు చేసిన దాన్ని మ్రింగివేసింది. ఎప్పుడైతే మంత్రజాలకులు మూసా వద్ద ఉన్నది మంత్రజాలము కాదని,అది అల్లాహ్ వద్ద నుండి మాత్రమే అని తెలుసుకున్నారో వారు అల్లాహ్ కొరకు సాష్టాంగపడిపోయారు. వారు ఇలా పలికారు : మేము మూసా,హారూను ప్రభువు,సృష్టితాలన్నింటి ప్రభువు ను విశ్వసించాము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالَ اٰمَنْتُمْ لَهٗ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ ؕ— اِنَّهٗ لَكَبِیْرُكُمُ الَّذِیْ عَلَّمَكُمُ السِّحْرَ ۚ— فَلَاُقَطِّعَنَّ اَیْدِیَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ وَّلَاُوصَلِّبَنَّكُمْ فِیْ جُذُوْعِ النَّخْلِ ؗ— وَلَتَعْلَمُنَّ اَیُّنَاۤ اَشَدُّ عَذَابًا وَّاَبْقٰی ۟
ఫిర్ఔన్ మంత్రజాలకుల విశ్వాసమును వ్యతిరేకిస్తూ,హెచ్చరిస్తూ ఇలా పలికాడు : ఏమీ మీరు మూసాను నేను దాని గురించి అనుమతి ఇవ్వకముందే విశ్వసిస్తారా ?!. ఓ మంత్రజాలకులారా నిశ్చయంగా మూసా మీకు మంత్రజాలమును నేర్పించిన మీ నాయకుడు. నేను తప్పకుండా మీలోని ప్రతి ఒక్కరి ఒక కాలును,ఒక చేతిని వాటి దిశల మధ్య వ్యతిరేకంగా నరికివేస్తాను. మరియు మీ శరీరాలను ఖర్జూరపు దూలాల పై మీరు చనిపోయేంతవరకు,ఇతరులకు గుణపాఠం అయ్యేంత వరకు శిలువ వేస్తాను. అప్పుడు మాలో నుండి ఎవరు శిక్షపరంగా బలవంతుడో,ఎల్లప్పుడు ఉంటాడో నేనా లేదా మూసా ప్రభువునా మీరు తెలుసుకుంటారు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
قَالُوْا لَنْ نُّؤْثِرَكَ عَلٰی مَا جَآءَنَا مِنَ الْبَیِّنٰتِ وَالَّذِیْ فَطَرَنَا فَاقْضِ مَاۤ اَنْتَ قَاضٍ ؕ— اِنَّمَا تَقْضِیْ هٰذِهِ الْحَیٰوةَ الدُّنْیَا ۟ؕ
మంత్రజాలకులు ఫిర్ఔన్ తో ఇలా పలికారు : ఓ ఫిర్ఔన్ మేము మా వద్దకు వచ్చిన స్పష్టమైన ఆయతులను అనుసరించటంపై నిన్ను ప్రాధాన్యత ఇవ్వమంటే ఇవ్వము. మరియు మమ్మల్ని సృష్టించిన అల్లాహ్ పై నిన్నూ ప్రాధాన్యతనివ్వము. నీవు మాతో చేయాలనుకున్నది చేయి.ఈ అంతమైపోయే జీవితంలో మాత్రమే నీకు మాపై అధికారము కలదు. మరియు తొందరలోనే నీ అధికారము తొలిగిపోతుంది.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِنَّاۤ اٰمَنَّا بِرَبِّنَا لِیَغْفِرَ لَنَا خَطٰیٰنَا وَمَاۤ اَكْرَهْتَنَا عَلَیْهِ مِنَ السِّحْرِ ؕ— وَاللّٰهُ خَیْرٌ وَّاَبْقٰی ۟
నిశ్చయంగా మేము మా ప్రభువుపై ఆయన గతించిన మా పాపములైన అవిశ్వాసము,ఇతరవాటిని మా నుండి తుడిచి వేస్తాడని,మా నుండి మంత్రజాల పాపము దేనినైతే నేర్చుకోవటం,ఉపయోగించటం,దాని ద్వారా మూసాను ఓడించటంపై నీవు మమ్మల్ని బలవంతం చేశావో దానిని తుడిచి వేస్తాడని ఆశిస్తూ విశ్వాసమును కనబరిచాము. మరియు అల్లాహ్ నీవు మాకు వాగ్ధానం చేసిన వాటి కన్న మేలైన వాటిని ప్రసాధించేవాడును,నీవు మాకు ఏ శిక్ష గురించి బెదిరస్తున్నావో దానికన్న నిర్విరామంగా శిక్షించేవాడును.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
اِنَّهٗ مَنْ یَّاْتِ رَبَّهٗ مُجْرِمًا فَاِنَّ لَهٗ جَهَنَّمَ ؕ— لَا یَمُوْتُ فِیْهَا وَلَا یَحْیٰی ۟
నిశ్ఛయంగా విషయము,జరిగేదేమిటంటే ప్రళయదినాన తన ప్రభువు వద్దకు ఆయనపై అవిశ్వాసమును కనబరచిన స్థితిలో వచ్చే వాడి కొరకు నరకాగ్ని ఉంటుంది. అతడు అందులో శాస్వతంగా ఎల్లవేళలా ఉండేటట్లుగా ప్రవేశిస్తాడు. దాని శిక్ష నుండి అతడు విశ్రాంతి పొందటానికి అందులో అతనికి మరణం సంభవించదు. మరియు అతడు మంచి జీవితమును జీవించలేడు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
وَمَنْ یَّاْتِهٖ مُؤْمِنًا قَدْ عَمِلَ الصّٰلِحٰتِ فَاُولٰٓىِٕكَ لَهُمُ الدَّرَجٰتُ الْعُلٰی ۟ۙ
మరియు ఎవరైతే ప్రళయదినాన తమ ప్రభువు వద్దకు ఆయనపై విశ్వాసమును కనబరచి వస్తాడో,సత్కర్మలు చేసి ఉంటాడో ఈ గొప్ప గుణాలతో వర్ణించబడిన వారందరి కొరకు ఎత్తైన అంతస్తులు,ఉన్నతమైన స్థానములు కలవు.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
جَنّٰتُ عَدْنٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ— وَذٰلِكَ جَزٰٓؤُا مَنْ تَزَكّٰی ۟۠
ఈ స్థానాలు అవి శాస్వత స్వర్గ వనాలు వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో శాస్వతంగా ఉంటారు. ఈ ప్రస్థావించబడిన ప్రతిఫలం అవిశ్వాసమునుండి,పాప కార్యముల నుండి పరిశుద్ధుడైన ప్రతీ వ్యక్తి ప్రతిఫలము.
ಅರಬ್ಬಿ ವ್ಯಾಖ್ಯಾನಗಳು:
ಈ ಪುಟದಲ್ಲಿರುವ ಶ್ಲೋಕಗಳ ಉಪಯೋಗಗಳು:
• لا يفوز ولا ينجو الساحر حيث أتى من الأرض أو حيث احتال، ولا يحصل مقصوده بالسحر خيرًا كان أو شرًّا.
మంత్రజాలకుడు తాను ఎక్కడికి వెళ్ళినా లేదా ఎక్కడ మోసం చేసినా గెలవలేడు,సాఫల్యం చెందడు. మంత్రజాలము ద్వారా తాను ఆశించినది మంచి అయినా గాని చెడు అయినా గాని పొందలేడు.

• الإيمان يصنع المعجزات؛ فقد كان إيمان السحرة أرسخ من الجبال، فهان عليهم عذاب الدنيا، ولم يبالوا بتهديد فرعون.
విశ్వాసము అద్భుతాలను చేస్తుంది. మంత్రజాలకుల విశ్వాసం పర్వతాల కన్నగట్టిది. అందుకనే వారిపై ఇహలోక శిక్ష సులభమయింది. వారు ఫిర్ఔన్ బెదిరింపును లెక్కచేయలేదు.

• دأب الطغاة التهديد بالعذاب الشديد لأهل الحق والإمعان في ذلك للإذلال والإهانة.
మితిమీరే వారి వ్యవహారం సత్యపరులకి కఠినమైన శిక్ష ఇవ్వటం గురించి బెదిరింపులు ఇవ్వటం,అవమానమునకు గురి చేయటం కొరకు,పరాభవమునకు లోను చేయటం కొరకు ఇందులో పట్టుబడటం.

 
ಅರ್ಥಗಳ ಅನುವಾದ ಅಧ್ಯಾಯ: ತ್ವಾಹಾ
ಅಧ್ಯಾಯಗಳ ವಿಷಯಸೂಚಿ ಪುಟ ಸಂಖ್ಯೆ
 
ಪವಿತ್ರ ಕುರ್‌ಆನ್ ಅರ್ಥಾನುವಾದ - ಅಲ್-ಮುಖ್ತಸರ್ ಫಿ ತಫ್ಸೀರಿಲ್ ಕುರ್‌ಆನಿಲ್ ಕರೀಮ್ - ತೆಲುಗು ಅನುವಾದ - ಅನುವಾದಗಳ ವಿಷಯಸೂಚಿ

ಪ್ರಕಾಶನ - ಕುರ್‌ಆನ್ ತಫ್ಸೀರ್ ಸ್ಟಡಿ ಸೆಂಟರ್

ಮುಚ್ಚಿ