Check out the new design

ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - មាតិកានៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់មុលក៍   វាក្យខណ្ឌ:

అల్-ముల్క్

គោល​បំណងនៃជំពូក:
إظهار كمال ملك الله وقدرته؛ بعثًا على خشيته، وتحذيرًا من عقابه.
అల్లాహ్ రాజ్యాధికారం మరియు ఆయన సామర్ధ్యము పరిఫూర్ణత ప్రకటన ఆయనతో భయపడటంపై ప్రేరేపించటానికి మరియు ఆయన శిక్ష నుండి హెచ్చరించటానికి.

تَبٰرَكَ الَّذِیْ بِیَدِهِ الْمُلْكُ ؗ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرُ ۟ۙ
ఒక్కడైన ఆయన చేతిలో రాజ్యాధికారము కలిగిన అల్లాహ్ మేలు ఎంతో అధికము మరియు ఎక్కువ. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదినూ అశక్తుడిని చేయదు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
١لَّذِیْ خَلَقَ الْمَوْتَ وَالْحَیٰوةَ لِیَبْلُوَكُمْ اَیُّكُمْ اَحْسَنُ عَمَلًا ؕ— وَهُوَ الْعَزِیْزُ الْغَفُوْرُ ۟ۙ
ఆయనే ఓ ప్రజలారా మీలో నుంచి ఆచరణ పరంగా మంచివారో పరీక్షించటం కొరకు మరణమును,జీవనమును సృష్టించాడు. ఆయనే ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన దాసుల్లోంచి పశ్ఛాత్తాపడే వారి పాపములను మన్నించేవాడును.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
الَّذِیْ خَلَقَ سَبْعَ سَمٰوٰتٍ طِبَاقًا ؕ— مَا تَرٰی فِیْ خَلْقِ الرَّحْمٰنِ مِنْ تَفٰوُتٍ ؕ— فَارْجِعِ الْبَصَرَ ۙ— هَلْ تَرٰی مِنْ فُطُوْرٍ ۟
ఆయనే సప్త ఆకాశములను సృష్టించాడు. ప్రతీ ఆకాశము దాని ముందు ఉన్న దాని పై ఉండి ఒక ఆకాశము ఇంకో ఆకాశమునకు అంటిపెట్టుకుని లేనట్లుగా ఉన్నది. ఓ సందర్శకుడా నీవు అల్లాహ్ సృష్టించిన దానిలో ఎటువంటి హెచ్చు తగ్గులను మరియు అస్తవ్యస్తతను చూడలేవు. కావున నీవు దృష్టిని సారించు ఏమీ నీవు ఏదైన పగులును లేదా బీటలను చూశావా ?! నీవు ఖచ్చితంగా దాన్ని చూడలేవు. నీవు మాత్రం ఒక నిర్మాణాత్మకమైన విస్తృతమైన సృష్టిని చూస్తావు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
ثُمَّ ارْجِعِ الْبَصَرَ كَرَّتَیْنِ یَنْقَلِبْ اِلَیْكَ الْبَصَرُ خَاسِئًا وَّهُوَ حَسِیْرٌ ۟
ఆ తరువాత నీవు పదే పదే దృష్టిని సారించు నీ చూపులు ఎటువంటి లోపమును గాని అస్తవ్యస్తతను చూడ లేక నిరాశులై నీ వైపునకు మరలుతాయి. మరియు అవి చూడలేక అలసిపోయి ఉంటాయి.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَلَقَدْ زَیَّنَّا السَّمَآءَ الدُّنْیَا بِمَصَابِیْحَ وَجَعَلْنٰهَا رُجُوْمًا لِّلشَّیٰطِیْنِ وَاَعْتَدْنَا لَهُمْ عَذَابَ السَّعِیْرِ ۟
మరియు మేము భూమికి అతి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలతో అలంకరించాము. మరియు మేము ఆ నక్షత్రాలను అగ్ని జ్వాలలుగా చేశాము. దొంగ చాటుగా వినే షైతానులు వాటి ద్వారా కొట్టబడుతారు. మరియు అవి వారిని దహించి వేస్తాయి. మరియు మేము పరలోకంలో వారి కొరకు భగభగ మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَلِلَّذِیْنَ كَفَرُوْا بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
మరియు తమ ప్రభువును తిరస్కరించే వారి కొరకు ప్రళయదినమున మండుతున్న అగ్ని శిక్ష కలదు. వారు దేనివైపునైతే మరలి వెళ్ళుతున్నారో ఆ మరలే స్థానము ఎంతో చెడ్డది.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
اِذَاۤ اُلْقُوْا فِیْهَا سَمِعُوْا لَهَا شَهِیْقًا وَّهِیَ تَفُوْرُ ۟ۙ
వారు నరకాగ్నిలో విసిరి వేయబడినప్పుడు వారు తీవ్రమైన భయంకరమైన గర్జనను వింటారు. మరియు అది కుండ ఉడికినట్లు ఉడకబెట్టబడుతుంటుంది.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
تَكَادُ تَمَیَّزُ مِنَ الْغَیْظِ ؕ— كُلَّمَاۤ اُلْقِیَ فِیْهَا فَوْجٌ سَاَلَهُمْ خَزَنَتُهَاۤ اَلَمْ یَاْتِكُمْ نَذِیْرٌ ۟
దాదాపు దాని కొంతభాగము దానిలో ప్రవేశించేవారిపై తీవ్రమైన కోపము వలన ప్రేలిపోయి వేరైపోయినట్లుగా ఉంటుంది. అవిశ్వాసపరులైన దాని వాసుల్లోంచి ఒక సమూహం అందులో విసిరివేయబడినప్పుడు దాని బాధ్యత వహించే దూతలు వారిని గద్దిస్తూ ఇలా ప్రశ్నిస్తారు : ఏమీ అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టే ఒక ప్రవక్త ఇహలోకంలో మీ వద్దకు రాలేదా ?.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
قَالُوْا بَلٰی قَدْ جَآءَنَا نَذِیْرٌ ۙ۬— فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ اللّٰهُ مِنْ شَیْءٍ ۖۚ— اِنْ اَنْتُمْ اِلَّا فِیْ ضَلٰلٍ كَبِیْرٍ ۟
మరియు అవిశ్వాసపరులు ఇలా సమాధానమిస్తారు : ఎందుకు రాలేదు. అల్లాహ్ శిక్ష నుండి మమ్మల్ని భయపెడుతూ ఒక ప్రవక్త మా వద్దకు వచ్చాడు. అప్పుడు మేము అతన్ని తిరస్కరించి అతనితో ఇలా పలికాము : అల్లాహ్ ఎటువంటి దైవ వాణిని అవతరింపజేయలేదు. ఓ ప్రవక్తల్లారా మీరు మాత్రం సత్యము నుండి ఘోర అపమార్గములో ఉన్నారు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَقَالُوْا لَوْ كُنَّا نَسْمَعُ اَوْ نَعْقِلُ مَا كُنَّا فِیْۤ اَصْحٰبِ السَّعِیْرِ ۟
మరియు అవిశ్వాసపరులు ఇలా పలుకుతారు : ఒక వేళ మేము ప్రయోజనం చెందే విధంగా విని ఉంటే లేదా అసత్యము నుండి సత్యమును వేరు చేసే వారి బుద్ది లాగా మేము అర్ధం చేసుకుని ఉంటే మేము నరక వాసులందరితో ఉండేవారము కాదు. అంతే కాదు మేము ప్రవక్తలను విశ్వసించి వారు తీసుకుని వచ్చిన దాన్ని దృవీకరించి ఉండేవారము. మరియు మేము స్వర్గ వాసుల్లోంచి అయి ఉండేవారము.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
فَاعْتَرَفُوْا بِذَنْۢبِهِمْ ۚ— فَسُحْقًا لِّاَصْحٰبِ السَّعِیْرِ ۟
అప్పుడు వారు స్వయంగా అవిశ్వసించిన దాన్ని,తిరస్కరించిన దాన్ని అంగీకరిస్తారు. అప్పుడు వారు నరకానికి అర్హులవుతారు. కావున నరక వాసుల కొరకు (దైవ కారుణ్యం) దూరమవుగాక.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
اِنَّ الَّذِیْنَ یَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَیْبِ لَهُمْ مَّغْفِرَةٌ وَّاَجْرٌ كَبِیْرٌ ۟
నిశ్చయంగా ఎవరైతే తమ ఏకాంతములో అల్లాహ్ తో భయపడుతారో వారి కొరకు వారి పాపముల మన్నింపు కలదు. మరియు వారి కొరకు గొప్ప ప్రతిఫలం కలదు. అది స్వర్గము.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
អំពី​អត្ថប្រយោជន៍​នៃវាក្យខណ្ឌទាំងនេះនៅលើទំព័រនេះ:
• في معرفة الحكمة من خلق الموت والحياة وجوب المبادرة للعمل الصالح قبل الموت.
మరణమును,జీవనమును సృష్టి విజ్ఞతను తెలుసుకోవటంలో మరణము కన్న ముందు సత్కర్మను చేయటం కొరకు త్వరపడటం తప్పనిసరి.

• حَنَقُ جهنم على الكفار وغيظها غيرةً لله سبحانه.
పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు స్వాభిమానముగా అవిశ్వాసపరులపై నరకము యొక్క క్రోదము మరియు దాని ఆగ్రహము.

• سبق الجن الإنس في ارتياد الفضاء وكل من تعدى حده منهم، فإنه سيناله الرصد بعقاب.
గాలిలో చక్కర్లు కొట్టడంలో జిన్నులు మానవుల కన్న ముందుకు సాగిపోయారు. వారిలో నుండి ఎవరైతే తన హద్దును అతిక్రమిస్తాడో నిశ్చయంగా అతనికి మాటు వేసిన శిక్ష చుట్టుకుంటుంది.

• طاعة الله وخشيته في الخلوات من أسباب المغفرة ودخول الجنة.
అల్లాహ్ పై విధేయత మరియు ఏకాంతముల్లో ఆయన పట్ల భీతి మన్నింపు మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాల్లోంచిది.

 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់មុលក៍
មាតិកានៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - មាតិកានៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ