Check out the new design

ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - មាតិកានៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាហ្សហ្សុខរ៉ហ្វ   វាក្យខណ្ឌ:

అజ్-జుఖ్రుఫ్

គោល​បំណងនៃជំពូក:
التحذير من الافتتان بزخرف الحياة الدنيا؛ لئلا يكون وسيلة للشرك.
ప్రాపంచిక జీవితం యొక్క అలంకరణ పట్ల మోహానికి వ్యతిరేకంగా హెచ్చరిక అది బహుదైవారాధనకు ఒక సాధనంగా ఉండకుండా.

حٰمٓ ۟ۚۛ
హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَالْكِتٰبِ الْمُبِیْنِ ۟ۙۛ
అల్లాహ్ సత్యం వైపునకు మార్గదర్శకం యొక్క మార్గమును స్పష్ట పరిచే ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
اِنَّا جَعَلْنٰهُ قُرْءٰنًا عَرَبِیًّا لَّعَلَّكُمْ تَعْقِلُوْنَ ۟ۚ
నిశ్చయంగా దాన్ని అరబీ భాష ఖుర్ఆన్ గా చేశాము; ఓ మీ భాషలో అవతరింపబడిన వారా మీరు దాని అర్ధములను గ్రహిస్తారని,వాటిని అర్ధంచేసుకుని ఇతర సమాజములకు వాటిని చేరవేస్తారని ఆశిస్తూ.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَاِنَّهٗ فِیْۤ اُمِّ الْكِتٰبِ لَدَیْنَا لَعَلِیٌّ حَكِیْمٌ ۟ؕ
మరియు నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ ఉన్నతమైన,గొప్పదైన,విజ్ఞత కలిగిన లౌహె మహ్ఫూజ్ లో ఉన్నది. దాని ఆయతులు దాని ఆదేశములలో,వారింపులలో నిర్దుష్టమైనవిగా చేయబడ్డాయి.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
اَفَنَضْرِبُ عَنْكُمُ الذِّكْرَ صَفْحًا اَنْ كُنْتُمْ قَوْمًا مُّسْرِفِیْنَ ۟
ఏమి మీరు అధికంగా షిర్కు మరియు పాప కార్యములు చేయటం వలన మేము విముఖత చూపుతూ మీపై ఖుర్ఆన్ ను అవతరింపజేయటమును వదిలేయాలా ?. మేము అలా చేయము. కాని మీతో ఉన్న కారుణ్యము దినికి విరుద్ధంగా నిర్ణయిస్తుంది.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَكَمْ اَرْسَلْنَا مِنْ نَّبِیٍّ فِی الْاَوَّلِیْنَ ۟
మరియు పూర్వ సమాజములలో మేము ఎంతో మంది ప్రవక్తలను పంపించాము.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَمَا یَاْتِیْهِمْ مِّنْ نَّبِیٍّ اِلَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟
ఆ పూర్వ సమాజాల వద్దకు అల్లాహ్ వద్ద నుండి ఏ ప్రవక్త వచ్చినా వారు వారి పట్ల పరిహాసమాడేవారు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
فَاَهْلَكْنَاۤ اَشَدَّ مِنْهُمْ بَطْشًا وَّمَضٰی مَثَلُ الْاَوَّلِیْنَ ۟
అప్పుడు మేము ఆ పూర్వ సమాజములలో నుండి బలీష్టులైన వారిని నాశనం చేశాము. వారిలో నుండి బలహీనులు నాశనం చేయటం నుండి మమ్మల్ని అశక్తులని చేయలేరు. మరియు పూర్వ సమాజాల వినాశన విధము ఖుర్ఆన్ లో గడిచినది. ఉదాహరణకి : ఆద్,సమూద్,లూత్ జాతి మరియు మద్యన్ వారు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَلَىِٕنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَالْاَرْضَ لَیَقُوْلُنَّ خَلَقَهُنَّ الْعَزِیْزُ الْعَلِیْمُ ۟ۙ
ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఈ తిరస్కారులైన ముష్రికులందరిని ఆకాశములను సృష్టించినది ఎవరు మరియు భూమిని సృష్టించినది ఎవరు ? అని అడిగితే వారు తప్పకుండా మీ ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా పలుకుతారు : ఎవరూ ఓడించని సర్వాధిక్యుడు మరియు ప్రతీది బాగా తెలిసినవాడు వాటిని సృష్టించినాడు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ مَهْدًا وَّجَعَلَ لَكُمْ فِیْهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُوْنَ ۟ۚ
అల్లాహ్ యే మీ కొరకు భూమిని ఏర్పాటు చేసి దాన్ని మీ కొరకు పరుపుగా చేశాడు మీరు దానిపై మీ కాళ్శతో నడుస్తున్నారు. మరియు ఆయన అందులో మీ కొరకు దాని పర్వతాల్లో,దాని లోయల్లో మార్గములను చేశాడు; మీరు వాటి ద్వారా మీ ప్రయాణముల్లో మార్గము పొందుతారని ఆశిస్తూ.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
អំពី​អត្ថប្រយោជន៍​នៃវាក្យខណ្ឌទាំងនេះនៅលើទំព័រនេះ:
• سمي الوحي روحًا لأهمية الوحي في هداية الناس، فهو بمنزلة الروح للجسد.
ప్రజల సన్మార్గములో దైవవాణి ప్రాముఖ్యత వలన దైవవాణికి రూహ్ (ఆత్మ) అని నామకరణం చేయబడింది. కాబట్టి అది మానవ శరీరము కొరకు ఆత్మ స్థానములో ఉన్నది.

• الهداية المسندة إلى الرسول صلى الله عليه وسلم هي هداية الإرشاد لا هداية التوفيق.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు సంబంధం కలిగిన సన్మార్గము (హిదాయత్) సన్మార్గమును చూపటం అది. సన్మార్గముపై నడిచే భాగ్యం కలిగించటం కాదు.

• ما عند المشركين من توحيد الربوبية لا ينفعهم يوم القيامة.
ముష్రికుల వద్ద ఉన్న తౌహీదె రుబూబియత్ ప్రళయదినమున వారికి ప్రయోజనం కలిగించదు.

 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាហ្សហ្សុខរ៉ហ្វ
មាតិកានៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - មាតិកានៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ