Check out the new design

ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - មាតិកានៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់កសស   វាក្យខណ្ឌ:

అల్-ఖసస్

គោល​បំណងនៃជំពូក:
سنة الله في تمكين المؤمنين المستضعفين وإهلاك الطغاة المستكبرين.
నిస్సహాయ విశ్వాసులను శక్తివంతం చేసి ఆహంకారపూరిత నిరంకుశులను నాశనం చేసే అల్లాహ్ సంప్రదాయం.

طٰسٓمّٓ ۟
.(طسٓمٓ) తా - సీన్ - మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْمُبِیْنِ ۟
ఇవి స్పష్టమైన ఖుర్ఆన్ వచనాలు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
نَتْلُوْا عَلَیْكَ مِنْ نَّبَاِ مُوْسٰی وَفِرْعَوْنَ بِالْحَقِّ لِقَوْمٍ یُّؤْمِنُوْنَ ۟
మేము మూసా మరియు ఫిర్ఔన్ వృత్తాంతమును విశ్వాస జనుల కొరకు ఎటువంటి సందేహము లేని సత్యముతో మీపై చదివి వినిపిస్తున్నాము. ఎందుకంటే వారే అందులో ఉన్న దానితో ప్రయోజనం చెందుతారు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
اِنَّ فِرْعَوْنَ عَلَا فِی الْاَرْضِ وَجَعَلَ اَهْلَهَا شِیَعًا یَّسْتَضْعِفُ طَآىِٕفَةً مِّنْهُمْ یُذَبِّحُ اَبْنَآءَهُمْ وَیَسْتَحْیٖ نِسَآءَهُمْ ؕ— اِنَّهٗ كَانَ مِنَ الْمُفْسِدِیْنَ ۟
నిశ్ఛయంగా ఫిర్ఔన్ మిసర్ (ఈజిప్టు) భూమిలో అతిక్రమించాడు మరియు అందులో ఆదిపత్యమును చెలాయించాడు. మరియు అతడు దాని వాసులను వర్గాలుగా విభజించాడు. వారిలో నుండి ఒక వర్గమును వారి మగ సంతానమును హత మార్చి,వారి ఆడవారిని సేవ కొరకు వారిని మరింత అవమానానికి గురి చేయడానికి జీవించి ఉండేటట్లు చేసి బలహీనులుగా చేశాడు. వారు ఇస్రాయీలు సంతతివారు. నిశ్ఛయంగా అతడు హింస,నిరంకుశత్వము,అహంకారము ద్వారా భూమిలో ఉపద్రవాలను రేకెత్తే వారిలోంచి అయిపోయాడు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَنُرِیْدُ اَنْ نَّمُنَّ عَلَی الَّذِیْنَ اسْتُضْعِفُوْا فِی الْاَرْضِ وَنَجْعَلَهُمْ اَىِٕمَّةً وَّنَجْعَلَهُمُ الْوٰرِثِیْنَ ۟ۙ
మరియు మేము ఫిర్ఔన్ మిసర్ భూమిలో బలహీనులుగా చేసిన ఇస్రాయీలు సంతతి వారిపై వారి శతృవులను తుదిముట్టించి,వారి నుండి బలహీనతను తొలగించి,వారిని సత్యంలో అనుసరించబడే నాయకులుగా (ఇమాములుగా) చేసి ప్రాముఖ్యతను ఇవ్వదలిచాము. మరుయు మేము ఫిర్ఔన్ వినాశనము తరువాత శుభాలు కల షామ్ (సిరియా) ప్రాంతమునకు వారిని వారసులుగా చేయదలిచాము. ఏవిధంగా నైతే మహోన్నతుడైన అల్లాహ్ పలికాడో : وَأَوْرَثْنَا الْقَوْمَ الَّذِينَ كَانُوا يُسْتَضْعَفُونَ مَشَارِقَ الأَرْضِ وَمَغَارِبَهَا الَّتِي بَارَكْنَا فِيهَاۖ అత్యంత బలహీన వర్గంగా పరిగణించబడే జనులను మేము ఆ భూభాగంలోని తూర్పుపడమరలకు వారసులుగా చేశాము. అందులో మేము శుభాలను కలిగించాము.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
អំពី​អត្ថប្រយោជន៍​នៃវាក្យខណ្ឌទាំងនេះនៅលើទំព័រនេះ:
• الإيمان والعمل الصالح سببا النجاة من الفزع يوم القيامة.
విశ్వాసము,సత్కార్యములు రెండూ ప్రళయదిన భయాందోళనల నుండి విముక్తికి కారణాలు.

• الكفر والعصيان سبب في دخول النار.
అవిశ్వాసము,అవిధేయత నరకములో ప్రవేశమునకు కారణం.

• تحريم القتل والظلم والصيد في الحرم.
హరమ్ ప్రాంతములో (నిషిద్ధ ప్రాంతములో) హత్య చేయటం,హింసకు పాల్పడటం,వేటాడటం నిషిద్ధము.

• النصر والتمكين عاقبة المؤمنين.
విజయం,సాధికారత విశ్వాసుల పర్యవసానాలు.

 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អាល់កសស
មាតិកានៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - មាតិកានៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ